ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి
| ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి | |
| జననం | 1957 Guntur |
| మరణం | 23 January 2022 Hyderabad |
ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి పూర్తి పేరు ములుగు రామలింగేశ్వర వరప్రసాద్. ఈయన జ్యోతిష్కుడు, పంచాంగకర్త. జ్యోతిష్యుడుగా విశేష సేవలందింస్తూ ములుగు సిద్ధాంతి గా పేరు పొందాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన ఆయన హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. రాశిఫలాలతో పాటు, ఆయన చెప్పే జ్యోతిష్యాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం విశ్వసిస్తుంటారు. అంతేకాకుండా శ్రీకాళహస్తి ఆస్థాన జ్యోతిష పండితుడిగా, శ్రీ శైవ పీఠాధిపతిగా ములుగు సిద్ధాంతి ప్రసిద్ధి. ఆయనకు శ్రీశైలంలో ఆశ్రమం కూడా ఉంది.[1]
ఆయన జనవరి 23, 2022న గుండెపోటుతో హైదరాబాదులో మరణించాడు.[2]
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన 1957లో గుంటూరులో జన్మించారు. వీరి కుటుంబం తారతరాలు గా జ్యోతిష విద్యలో రాణించిన వారు. ప్రస్తుతం ఆ వారసత్వాన్ని వారి కుమార్తె శ్రీమతి ములుగు శివజ్యోతి గారు కొసాగిస్తున్నారు. ఆనతి కాలం లోనే తండ్రికి తగ్గ తనయ గా అందరి మన్ననలు అందుకుంటూ వున్నారు. [3]
సిద్ధాంతి గారికి ఒక భార్య, ఒక కుమారుడు, ఒక కూతురు వున్నారు. దృరదృష్ట వశాత్తు కుమారుడు అతి పిన్న వయస్సులోనే కాలం చేశారు. అది వారి కుటుంబానికి ఒక పెద్ద దెబ్బ.
ప్రారంభంలో ఆయన ఎంఆర్ ప్రసాద్ పేరుతో మిమిక్రీ కళాకారుడిగా గుర్తింపు పొందాడు. సినీ నటులు ఏవీఎస్, బ్రహ్మానందం తదితర కళాకారులతో ప్రదర్శనలు ఇచ్చాడు. 1980 - 1995 లో ఆయన మిమిక్రీ కాస్సెట్స్ ఒక సంచలనం. శ్రీదేవి పెళ్లి, శ్రీదేవి విడాకులు, ఆనందో బ్రహ్మ, చీఫ్ మినిస్టర్ చిరంజీవి - ఈ క్యాసెట్స్ తెలియాని, వినని వారు వుండరు అంటే అతిశయోక్తి కాదు.
రాను రాను M R ప్రసాద్ గారు ములుగు సిద్ధాంతి గా జ్యోతిష శాస్త్ర సేవ లో స్థిర పడ్డారు. ఆ రంగం లోనూ ఉన్నత శిఖరాలను అందుకున్నారు.
శ్రీ శైవ పీఠం
[మార్చు]ములుగు సిద్ధాంతి గారి తాత ములుగు నాగ లింగయ్య గారు 1889లో గుంటూరులో “శైవ పీఠం” స్థాపించారని చెబుతారు. తరువాత దీనిని సిద్ధాంతి గారి తండ్రి ములుగు విశ్వనాథం గారు నిర్వహించారు. వారి తరువాత సిద్ధాంతి గారు పీఠాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. ములుగు సిద్ధాంతి గారి మరణం తరువాత, వారి ఏకైక కుమార్తె శ్రీమతి ములుగు (గొడవర్తి) శివజ్యోతి గారు ప్రస్తుతం ఆ పీఠం నిర్వహణ బాధ్యతలను చేపట్టారు.
జ్యోతిష రంగం లో
[మార్చు]సిద్ధాంతి గారు జ్యోతిష్య విద్య ను సామాన్యులకు అందుబాటులోకి తేవడానికి ఎంతో కృషి చేశారు. MNM International Astrology Research Institute ను శ్రీశైలం లో స్థాపించారు.
ములుగు సిద్ధాంతి గారు జ్యోతిషశాస్త్రంలోని ప్రతి అంశంపై ప్రావీణ్యం సంపాదించారు. ఆయన పద్ధతులు - లెక్కలు పరిపూర్ణంగా ఉన్నాయి మరియు చాలా అంచనాలు నిజమయ్యాయి. ములుగు జ్యోతిషశాస్త్రం ఒక బ్రాండ్‌గా మారింది. ములుగు కుటుంబం "సుభాతిథి" (1997 నుండి) అనే బ్రాండ్ పేరుతో పంచాంగాలు మరియు క్యాలెండర్లను ప్రచురిస్తోంది, ఇవి తెలుగు ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందాయి. తన జ్యోతిష్య సేవలను అందించడానికి 2000లో ఆయన శ్రీ శివజ్యోతి జ్యోతిశాలయంను స్థాపించారు. గత 14 సంవత్సరాలుగా ఆయన అంచనాలు వార్త, సాక్షి, ఆంధ్ర జ్యోతి మొదలైన తెలుగు వార్తాపత్రికలలో ప్రచురించబడ్డాయి. అలాగే సామాన్య ప్రజల ప్రయోజనం కోసం ఆయన MAA TV ద్వారా రాశిఫలాలు అనే కార్యక్రమాన్ని కూడా చేశారు. NRIల కోసం (న్యూయార్క్, లండన్, సిడ్నీ, లాస్-ఏంజిల్స్, చికాగో మరియు అట్లాంటా) వారి సమయ మండలాల ప్రకారం ప్రాంతీయ క్యాలెండర్లను తయారు చేశారు.
మూలాలు
[మార్చు]- ↑ "ప్రముఖ పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూత". ap7am.com (in ఇంగ్లీష్). Retrieved 2022-01-23.
- ↑ "TS news : ప్రముఖ జ్యోతిషపండితుడు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూత". EENADU. Retrieved 2022-01-23.
- ↑ "Mulugu Siddhanti - Mulugu Rama Lingeswara Varaprasad" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-03-25. Retrieved 2025-02-21.