ముల్లంగి వేపుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముల్లంగి వేపుడు ముల్లంగి దుంపలతో చేసుకునే రుచికరమైన కూర.[1]

కావలసిన పదార్థాలు[మార్చు]

  • ముల్లంగి దుంపలు... ఐదు
  • కారం పొడి... మూడు టీ స్పూన్లు
  • ఉప్పు... సరిపడా
  • నూనె... తాలింపుకు సరిపడా
  • ధనియాల పొడి... ఒక టీ స్పూన్
  • జీలకర్ర పొడి... ఒక టీ స్పూన్
ముల్లంగి.

తయారీ విధానం[మార్చు]

  • ముందుగా ముల్లంగి దుంపలను పొట్టు తీసి సన్నగా తరుక్కోవాలి.
  • తర్వాత ముల్లంగి ముక్కల్ని ఉప్పు నీటిలో కడిగి శుభ్రం చేసుకోవాలి.
  • బాణలిలో నూనె పోసి నూనె వేడయ్యాక, ముల్లంగి ముక్కలు వేసి తక్కువ మంటలో బాగా వేయించాలి.
  • తరువాత ఈ ముక్కలకు తగినంత ఉప్పు కలిపి వేయించాలి.
  • ముక్కలు బాగా ఉడికి మెత్తబడ్డాక నూనె ఎక్కువగా ఉంటే వంపి కారం, జీలకర్రపొడి, ధనియాలపొడి వేసి కాసేపు వేయించి దించాలి.
  • అంతే ముల్లంగి వేపుడు రెడీ. దీనిని పొడి పొడిగా ఉండే అన్నానికి సైడ్‌డిష్‌గా నంచుకుంటే రుచికరంగా ఉంటుంది.

మూలాలు[మార్చు]

  1. "Mullangi Vepudu | Radish Fry Recipe | How to make Radish fry in Telugu". hyderabadiruchulu.com. Archived from the original on 2020-09-17.

బాహ్య లంకెలు[మార్చు]