Jump to content

ముళ్ళవెదురు

వికీపీడియా నుండి
ముళ్ళవెదురు

ముళ్ళవెదురు ఇది గడ్డి జాతికి చెందిన ఒక చెట్టు. దీని శాస్త్రీయ నామం Bambusa arundinacea.

ఇవి కూడా చూడండి

[మార్చు]

వెదురు వెదురు అనేక రకాలు. వాటి పరిమాణాన్ని బట్టి, రంగును బట్టి అనేక రాకాలుంటాయి. చిట్టి వెదురు, పెద్ద వెదురు బొంగులు ఇలా అనేక రకాలుంటాయి. 'వేలు' లావు నుండి సుమారు పది అంగుళాల కైవారం కలిగిన వెదురు కూడా వుంటాయి. సన్న వెదురలను సన్నని కర్రలు గాను కొంచెం లావు పాటి వెదురలను 'దుడ్డు కర్ర' లకు గాను వాడు తుంటారు. పెద్ద వెదురలను పూరిళ్ల వాసాలకు అడ్డ కర్రలకు వాడు తారు. పల్లెల్లో పందిళ్లు వేయడానికి వీటి అవసరం చాల ఎక్కువ. వెదురు నుండి తీసిన సన్నని బద్దలనుండి అనేక రకముల బుట్టలు, తట్టలు, గంపలు, గిడుగులు, మొదలగు వాటిని తయారు చేస్తారు. వీటి నుండి అందమైన అలంకార వస్తువులను కూడా తయారు చేస్తారు. వెదుర బద్దలనుంది తడికెలు తయారు చేస్తారు. ఈ తడికెలను 'దడి'కి వుపయోగిస్తారు. ఈ విధంగా 'వెదురు' వలన అనేక ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా పల్లె వాసులకు ఇది ఎంతో ఉపయోగం. ముఖ్యమైన విషయం ఏమంటే అన్ని చెట్లకంటే 'వెదురు' అతి వేగంగా పెరిగే చెట్టు. ఒక రోజులోనె అది పెరిగిన ఎత్తును మానవుడు గ్రహించ గలిగె అంత పరిమాణం పెరుగుతుంది. వెదురు ఒక్కటిగా వుండదు. వందలాది వెదుర్లు కలిసి ఒక పొద లాగ పెరుగుతాయి. అలాంటి పొదను 'వెదురు గూమి' అంటారు. వెదురుకు ప్రతి గణుపు వద్ద చిన్న కొమ్మలు వుంటాయి. వాటికి ముళ్లు వుంటాయి. వీటిని కొట్టి పొలాలకు, పాదులకు కంచెలుగా వాడుతారు. వెదురు బద్దలతో తడికెలు, తట్టలు, బుట్టలు మొదలగు వాటిని అల్లే వారిని ''మేదర వాళ్లు'' అంటారు.