మూగవాని పిల్లనగ్రోవి
మూగవాని పిల్లనగ్రోవి | |
కృతికర్త: | డా.కేశవరెడ్డి |
---|---|
ముఖచిత్ర కళాకారుడు: | కాళ్ళ |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రచురణ: | రీతిక పబ్లికేషన్స్(1995), హైదరాబాద్ బుక్ ట్రస్ట్(2008) |
విడుదల: | 1995 |
ఆంగ్ల ప్రచురణ: | 2013 |
మూగవాని పిల్లనగ్రోవి ప్రముఖ రచయిత కేశవరెడ్డి రచించిన నవల.
రచన నేపథ్యం
[మార్చు]మూగవాని పిల్లనగ్రోవి నవల డాక్టర్ కేశవరెడ్డి 1993లో రచించారు. నవలను 1993లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ధారావాహికగా ప్రచురించారు. 1995లో రీతిక పబ్లికేషన్స్ ద్వారా తొలిప్రచురణ జరిగింది. 2008 నవంబరులో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు పునర్ముద్రించారు. ఆ ప్రతికి కాళ్ళ ముఖచిత్రాన్ని చిత్రించారు.[1]
ఇతివృత్తం
[మార్చు]మూగవాని పిల్లనగ్రోవి నవల బక్కిరెడ్డి అనే రైతు వీరగాథ. తన పొలాన్ని కాపాడుకుని సేద్యం చేయడం కొనసాగిద్దామనే ప్రయత్నం చేసిన సన్నకారు రైతు బక్కిరెడ్డి ఆ ప్రయత్నంలో విఫలుడవుతాడు. భూమిని, సేద్యాన్ని కోల్పోలేక చివరికి ఉన్మాదిగా మారి మరణిస్తాడు. మరణించిన బక్కిరెడ్డి కథ మొదట జాలిగాథగా ఉన్నా, పంచభూతాలు అతని మమతను, మరణాన్ని వీరత్వంగా గుర్తించి ఆ భూమిని అతను కాక వేరెవరూ దున్నకూడదన్న వరం బక్కిరెడ్డికి ఇస్తాయి. ఆ ప్రాంతం బక్కిరెడ్డి పేరిట చిన్న తోపులా మిగిలిపోతుంది. జానపద సంప్రదాయంలోని కథల పద్ధతిలోనే ఈ నవల కూడా వీరగాథగా రూపాంతరం చెందడంతో ముగుస్తుంది.[1]
ప్రాచుర్యం
[మార్చు]మూగవాని పిల్లనగ్రోవి నవల ప్రాచుర్యం పొందింది. నవలను మూగవాని పిల్లనగ్రోవి అనే పేరుతోనే స్వయంగా డా.కేశవరెడ్డి స్వయంగా ఆంగ్లంలోకి అనువదించారు. ఆంగ్లంలో బలాడ్ ఆఫ్ ఒంటిల్లు అనే ఉపశీర్షికను ఉంచారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ ఆంగ్లానువాదాన్ని ప్రచురించారు.[2] [3]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 మూగవాని పిల్లనగ్రోవి:డా.కేశవరెడ్డి:హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పబ్లికేషన్స్:2008
- ↑ "మీట్ మిస్టర్ ఆక్స్‌ఫర్డ్ రెడ్డీ:మోహన్:ఆంధ్రజ్యోతి:డిసెంబరు 9, 2013". Archived from the original on 2014-01-22. Retrieved 2014-03-19.
- ↑ నువ్వొకటి రాస్తావు! నేనొకటి చదువుతాను!!:సాక్షి:ఫిబ్రవరి 28, 2014