మూన్ వాటర్ పిక్చర్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూన్ వాటర్ పిక్చర్స్
రకం
సినిమా నిర్మాణం, పంపిణీ
పరిశ్రమసినిమారంగం
స్థాపించబడింది2008
ప్రధాన కార్యాలయం,
ప్రధాన వ్యక్తులు
మహి. వి. రాఘవ్
ఉత్పత్తులుసినిమా నిర్మాణం, పంపిణీ
యజమానిమహి. వి. రాఘవ్
రాకేష్ మహాంకాళీ
పవన్ కుమార్ రెడ్డి

మూన్ వాటర్ పిక్చర్స్,[1] తెలుగు సినీ నిర్మాణ, పంపిణీ సంస్థ. మహి. వి. రాఘవ్, రాకేశ్ మహాంకాళీ, పవన్ కుమార్ రెడ్డి 2008లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ మూడు సినిమాలను నిర్మించి పంపిణీ చేయగా, అవన్నీ బాక్సాఫీస్ వద్ద అత్యంత విజయవంతమయ్యాయి, విమర్శకుల నుండి మంచి స్పందనలను కూడా పొందాయి.

ఈ సంస్థ మొదటిసారిగా విలేజ్ లో వినాయకుడు సినిమా నిర్మించింది. ఈ సంస్థ నుండి వచ్చిన పాఠశాల సినిమా కొత్తతరం తెలుగు చిత్రాలలో ఒకటిగా పరిగణించబడడమేకాకుండా, విమర్శకులచే ప్రశంసలు కూడా పొందింది. 'ఫేస్‌బుక్' సామాజిక మాధ్యమం ద్వారా నటీనటులు, సాంకేతికవర్గాన్ని ఎంపికచేసి, తెలుగు సినీ పరిశ్రమలో కొత్త వరవడిని తీసుకువచ్చింది.[2] ఫేస్‌బుక్‌లో నిర్వహించిన ఈ పోటీలో 10,000 మంది దరఖాస్తుదారులతో ప్రారంభించిన ఏడు రోజుల్లోనే 15 వేలకు పైగా ఫాలోవర్స్ ను పొందగలిగింది.[3]

నిర్మించిన సినిమాలు[మార్చు]

క్రమసంఖ్య సంవత్సరం సినిమా పేరు నటులు దర్శకుడు భాష ఇతర వివరాలు
1 2009 విలేజ్ లో వినాయకుడు కృష్ణుడు, శరణ్య మోహన్, రావు రమేష్, యండమూరి వీరేంద్రనాథ్ సాయి కిరణ్ ఆడవి తెలుగు విలేజ్ లో వినాయకుడు కథను నిర్మాత మహి. వి. రాఘవ్ రాశాడు
2 2011 కుదిరితే కప్పు కాఫీ వరుణ్ సందేశ్, సుమ భట్టాచార్య, భీమనేని శ్రీనివాసరావు, సుకుమారి, తనికెళ్ళ భరణి రమణ సాల్వ తెలుగు శివ ప్రొడక్షన్స్ పతాకంపై శివ మేకతో కలిసి సంయుక్త నిర్మాణం
3 2014 పాఠశాల నందు, శశాంక్, సిరిషా, అను ప్రియా మహి. వి. రాఘవ్ తెలుగు మహి. వి. రాఘవ్ ఈ చిత్రం ద్వారా తెలుగులో దర్శకుడిగా

అవార్డులు[మార్చు]

క్రమసంఖ్య అవార్డు సంవత్సరం విభాగం సినిమా పేరు ఫలితం
1 1 వ ఐఫా ఉత్సవం 2015 ఉత్తమ దర్శకుడిగా ఐఫా ఉత్సవం అవార్డు పాఠశాల Nominated
2 2015 ఉత్తమ చిత్రంగా ఐఫా ఉత్సవం అవార్డు పాఠశాల Nominated

మూలాలు[మార్చు]

  1. "Moonwater pictures Paathshala". Retrieved 21 January 2021.
  2. "Paathshala Facebook contest office". Retrieved 21 January 2021.
  3. "Paathshala storms online box office". greatandhra. Retrieved 21 January 2021.

ఇతర లంకెలు[మార్చు]