మూస చర్చ:సహకారం స్థితి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఏక పక్ష సవరణలు[మార్చు]

వాడుకరి:Chaduvari గారు, సహాయం కావాలి మూసకు ప్రత్యేకత వుంది, దానికోసం సత్వర స్పందనలు కావాలి. మిగతా వాటిలాగా కాదు. అది తెలిపి, మీరు గతంలో ఏకపక్ష సవరణను రద్దు చేశాను. అయినా మరల మీరు ఏకరీతి అని చెప్పి మరల అదే సవరణ చేస్తున్నారు. నేను మరల దానిని రద్దు చేయవలసివచ్చింద. మీరు ఇలా మరల మరలా చేయడం వికీలో ఘర్షణ వాతావరణం పెంచడమే అవుతుంది. మీరు చేయాలనుకున్నది చర్చించి సముదాయం నిర్ణయం మేరకు చేయండి. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 08:11, 29 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ కోప్పడకండి. దయచేసి కింది పరిశీలనలను గమనించండి:
  1. ఈ దిద్దుబాటులో నేను చేసిన సవరణను మార్చేసి మీరు అనుకున్న విధంగా పెట్టారు. కానీ చర్చించలేదు. అది ఏకపక్షమని నేను అనలేదు.
  2. ఇప్పుడు నేను ఈ మూస లోని కొన్ని వర్గాలను మార్చాను. వాటిని చూపించే పద్ధతిని కూడా మార్చాను. వాటితో పాటు అన్నీ ఒకేలా ఉండేందుకు ఈ వర్గాన్ని చూపించే విధానాన్ని కూడా మార్చాను
  3. ఒకవేళ మీరు చెప్పే విధంగా దీని లాగానే ఇతర వర్గాలను కూడా మారిస్తే ఈ మూస ఎలా తయారౌతుందో ఊహించారా? ఒక వర్గంలో 1200 పైచిలుకు పేజీలున్నాయి. 1200 లైన్ల పొడవున ఈ మూస సాగితే దీన్ని ప్రతిక్షేపించిన పేజీల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించారా? మరో వర్గంలో 450 పేజీలున్నై.
  4. "సహాయం కావాలి మూసకు ప్రత్యేకత వుంది" అని మీరంటున్నారు. ఈ "సహకారం స్థితి" అనే మూసకు సంబంధించినంత వరకూ ఇందులో ఉన్న వర్గాలన్నీ సమానమే. దీనికి ప్రత్యేకతేమీ లేదు. ఒక మూసకు ప్రాచుర్యం కలిగించాలనుకుంటే ఇతర విధాలుగా ప్రయత్నించాలి గానీ, ఇలా చెయ్యకూడదు అని నా ఉద్దేశం.
ఈ కారణాల వల్ల అలా చేసాను తప్ప మీతో ఘర్షించే ఉద్దేశం నాకు లేదని నొక్కి చెబుతున్నాను. మీ ఆరోపణ నిరాధారమైనది. నా ఉద్దేశాన్ని సదుద్దేశంగా భావించకపోవడం విచారకరం. నేను చేసినదానిలో పొరపాటేమీ లేనప్పటికీ, మీవంటి అనుభవజ్ఞులకు కోపం తెప్పించరాదని భావిస్తూ ఈ చర్చ నుండి తప్పుకుంటున్నాను.
వికీ విధానాలు మార్గదర్శకాల్లో ఎక్కడో ఒక మాట ఉంది (ఎక్కడో గుర్తు లేదు). దిద్దుబాట్ల విషయంలో భేదాభిప్రాయాలు వచ్చినపుడు ..వదిలెయ్యండి. మీరు చేయడానికి వికీలో ఇంకా బోలెడు పనులున్నాయి, బోలెడు పేజీలున్నాయి వాటిపై పనిచెయ్యండి అని సలహా ఇస్తుంది. నేను ప్రస్తుతం ఆ సలహాను పాటించి ఈ చర్చ నుండి తప్పుకుంటున్నాను. దీనిపై మిగతా సభ్యులు ఏమంటే అది జరుగుతుంది. ఇక ఈ మూస ఈ రూపంలో ఉండగా నేను పట్టించుకోను. __చదువరి (చర్చరచనలు) 08:56, 29 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, ఈ మూస తొలిరూపంలో ఏ విధంగా ప్రదర్శితమైందో మీకు తెలిసికూడా దానిని మార్చటం ఏకపక్ష సవరణక్రిందకే వస్తుందని నా అభిప్రాయం. రచ్చబండలో తొలిగా ఈ మూస వాడడం జరిగింది, తరువాతనే ఇతర మూసలు వాడారు. అందువలన దీనికి ప్రత్యేకత వుందని నా అభిప్రాయం. అదీకాక, ఈ మూస వాడేవారు త్వరితంగా సమాధానం కోసం ఎదురుచూడవచ్చని ఈ మూస వాడుకలో తెలపడం జరిగింది. అందువలన ఈ మూసలోని అంశాలను విస్తరితరూపంలోనే చూపడం మంచిది. --అర్జున (చర్చ) 09:51, 17 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]