మృగయా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మృగయా
మృగయా సినిమా పోస్టర్
దర్శకత్వంమృణాళ్ సేన్
రచన
  • మోహిత్ చటోపాధ్యాయ్
  • అరుణ్ కౌల్
దీనిపై ఆధారితంభగవతి చరణ్ పాణిగ్రాహి రాసిన "షికార్" కథ
నిర్మాతకె. రాజేశ్వరరావు
తారాగణం
ఛాయాగ్రహణంకెకె మహాజన్
కూర్పుగంగాధర్ నాస్కర్,
రాజు నాయక్,
దినకర్ శెట్టి
సంగీతంసలీల్ చౌదరి
విడుదల తేదీ
6 జూన్ 1976
దేశంభారతదేశం
భాషలుబెంగాలీ, హిందీ

మృగయా, 1976 జూన్ 6న విడుదలైన భారతీయ సినిమా. కె. రాజేశ్వరరావు నిర్మాణంలో మృణాళ్ సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాల ద్వారా మిధున్ చక్రవర్తి, మమతా శంకర్ ఇద్దరూ సినీరంగంలోకి ప్రవేశించారు. భగవతి చరణ్ పాణిగ్రాహి రాసిన "షికార్" అని ఒడియా కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. బ్రిటిష్ వలస ప్రభుత్వం, స్థానిక గ్రామస్తుల మధ్య సంబంధాలతోపాటు 1920లలో భారత భూస్వాముల దోపిడీని గురించిన తీసిన సినిమా ఇది. గేమ్ వేటలో నైపుణ్యం ఉన్న బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్, నిపుణుడైన స్థానిక గిరిజన విలుకాడిల మధ్య స్నేహాన్ని కూడా ఈ సినిమా వర్ణిస్తుంది.

ఈ సినిమాకు సలీల్ చౌదరి సంగీతాన్నీ, కెకె మహాజన్ సినిమాటోగ్రఫీని అందించారు. 24వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమాకు జాతీయ ఉత్తమ సినిమా, జాతీయ ఉత్తమ నటుడు విభాగాల్లో అవార్డులు వచ్చాయి. 1977లో జరిగిన 10వ మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్ ప్రైజ్‌కి నామినేట్ అయి ఉత్తమ సినిమాగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డును కూడా గెలుచుకుంది.

నటవర్గం[మార్చు]

  • మిథున్ చక్రవర్తి (గినువా)
  • మమతా శంకర్ (డుంగ్రి)
  • రాబర్ట్ రైట్ (బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్‌)
  • అసిత్ బందోపాధ్యాయ్
  • శేఖర్ ఛటర్జీ
  • సాధు మెహర్ డోరా
  • జ్ఞానేష్ ముఖర్జీ
  • అనూప్ కుమార్
  • సజల్ రాయ్ చౌదరి (మనీలెండర్‌)
  • సమిత్ భంజ (షోల్పు)
  • టామ్ ఆల్టర్

థీమ్‌లు, ప్రభావాలు[మార్చు]

ఒడియాకు చెందిన కథా రచయిత భగవతి చరణ్ పాణిగ్రాహి రాసిన షికార్ అనే కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.[1] 1930లలో భారత స్వాతంత్ర్యోద్యమ సమయంలో,[2] ఒక గ్రామంలో కఠినమైన జీవితాన్ని గడిపే గిరిజన ప్రజల జీవితాలను ఈ కథ వివరిస్తుంది. 1930లలో అసలు కథ జరిగినప్పటికీ, 1850లో జరిగిన సంతాల్ తిరుగుబాటు తరహాలో తిరుగుబాటు నేపథ్యంలో ఈ సినిమా స్క్రిప్ట్ సెట్ చేయబడింది.[3]

నిర్మాణం[మార్చు]

మమతా శంకర్ (చిత్రంలో) ఈ సినిమాతో సినిమారంగంలోకి ప్రవేశించింది.[2]

అప్పటివరకు రాజకీయ సినిమాలు చేస్తున్న మృణాల్ సేన్, ఒక గ్రామ నేపథ్య కథను సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నాడు.[4] 1974లో తీసిన కోరస్ సినిమా సరిగా ఆడకపోవడంతో భారీ నష్టాలను వచ్చి, అప్పులు చెల్లించలేకపోయాడు. మృగయా సినిమాను కె. రాజేశ్వరరావు నిర్మించాడు. మృణాల్ సేన్ మొట్టమొదటి కలర్ సినిమా ఇది.[5] ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో తన బోధన సెషన్‌లో ఒక విద్యార్థిగా ఉన్న మిథున్ చక్రవర్తిని చూసి, సినిమాకు ఎంపికచేశాడు.[6] ఉదయ్ శంకర్ కుమార్తె మమతా శంకర్ ను హీరోయిన్ గా తీసుకున్నాడు.[2][7] ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మద్రాసులో జరిగాయి.[5]

స్పందన[మార్చు]

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. విమర్శకులు, ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి. "కథతో చరిత్ర" కలపడం అనే ఆలోచనను ప్రేక్షకులు ఇష్టపడలేదు.[5] గిరిజనుడిగా మిథున్ నటనకు, మమతా శంకర్ నటనకు ప్రశంసలు వచ్చాయి.[8] సాధు మెహర్, సమిత్ భంజా, సజల్ రాయ్ చౌదరి వంటి నటీనటుల నటనకు మంచి ఆదరణ లభించింది.[3]

అవార్డులు[మార్చు]

అవార్డు వేడుక విభాగం గ్రహీతలు ఫలితం
భారత జాతీయ చలనచిత్ర అవార్డులు 24వ భారత జాతీయ చలనచిత్ర అవార్డులు (1976) జాతీయ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ కె. రాజేశ్వరరావు (నిర్మాత)
మృణాళ్ సేన్ (దర్శకుడు)
గెలుపు[2]
జాతీయ ఉత్తమ నటుడు మిధున్ చక్రవర్తి గెలుపు[2]
ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు 24వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు (1976) ఉత్తమ చిత్రంగా క్రిటిక్స్ అవార్డు కె. రాజేశ్వరరావు గెలుపు[3]
మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 10 వ మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (1977) గోల్డెన్ సెయింట్ జార్జ్ మృణాల్ సేన్ ప్రతిపాదించబడింది[9]

మూలాలు[మార్చు]

  1. Gulazāra & Chatterjee 2003, p. 362.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 Lokapally, Vijay (16 May 2013). "Mrigayaa (1976)". The Hindu. Retrieved 13 August 2021.
  3. 3.0 3.1 3.2 Kohli, Suresh (13 December 2012). "Mrigayaa (1976)". The Hindu. Retrieved 13 August 2021.
  4. Indian Horizons 1977, p. 24.
  5. 5.0 5.1 5.2 Mukhopadhyay 2014, p. 102.
  6. Ayaz, Shaikh (25 May 2013). "The Poor Man's Pop Star". Open (Indian magazine). Retrieved 13 August 2021.
  7. "A full life". The Hindu. 14 July 2002. Archived from the original on 3 May 2005. Retrieved 13 August 2021.
  8. Mukhopadhyay 2014, p. 103.
  9. "10th Moscow International Film Festival (1977)". MIFF. Archived from the original on 16 జనవరి 2013. Retrieved 13 ఆగస్టు 2021.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మృగయా&oldid=3997983" నుండి వెలికితీశారు