మెకిన్సే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
McKinsey & Company
రకంIncorporated Partnership
స్థాపితం1926
ప్రధానకార్యాలయంNew York, New York
కీలక వ్యక్తులుDominic Barton, Worldwide Managing Director
పరిశ్రమManagement consulting
ఉత్పత్తులుManagement consulting services
ఆదాయంUS$ 6.0 billion (est. 2008)[1]
ఉద్యోగులు~17,000 (~9,000 consultants)[2]
వెబ్‌సైటుwww.mckinsey.com

మెకిన్సే & కంపెనీ ఒక ప్రపంచవ్యాప్త నిర్వహణ సలహా సంస్థ. ఈ సంస్థ సీనియర్ యాజమాన్యముకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తుంది. మెకిన్సే సంస్థ ప్రపంచంలో ప్రముఖ వ్యాపారాలు, ప్రభుత్వాలు మరియు సంస్థలకు సలహాదారుగా వ్యవహరిస్తుంది. యాజమాన్య సలహాదార పరిశ్రమలో ప్రతిష్ఠాత్మక సంస్థలలో మేటిగా మరియు గౌరవనీయమైన సంస్థలలో ఒకటిగా ఈ సంస్థ గుర్తింపు పొందింది.[3] వాల్ట్.కాం వారి ఉత్తమ సలహాదార సంస్థల జాబితాలో[4] వరుసగా 6 సార్లు ఈ సంస్థ నం.1 స్థానంలో నిలిచింది. 1996 నుంచి క్రొత్త MBA పట్టభద్రులకు ఉద్యోగం ఇచ్చే ఉత్తమ సంస్థగా ఉంటుంది.[5]

సంస్థ[మార్చు]

మెకిన్సే & కో., లాంఛనంగా ఒక కార్పరేషన్ గా స్థాపించబడినప్పటికి, అనేక ముఖ్య అంశాలలో ఒక భాగస్వామ్య సంస్థగానే వ్యవహరిస్తుంది. ఈ సంస్థ యొక్క ఉన్నత స్థాయి వాటాదారులు ("డైరెక్టర్లు"గా పిలవబడతారు- వీరు కంపెని డైరెక్టర్లు కానప్పటికీ) సంస్థ యొక్క నిర్వాహణా అధికారిని (మేనేజింగ్ డైరెక్టర్) మూడు సంవత్సరాల కాలానికి ఎన్నుకుంటారు. ప్రతి మేనేజింగ్ డైరెక్టర్ అత్యధికంగా మూడుసార్లు పదవిలో కొనసాగవచ్చు. వ్యూహాత్మక స్థాయిలో, విధానాలను వృద్ధి చేయటానికి మరియు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి పలు కమిటీలు ఉన్నాయి. మెకిన్సే "పైకి లేదా బయటకి," అనే విధాన్ని పాటిస్తుంది. దీని ప్రకారం, సలహాదారులు తమ వృత్తిలో ఒక నిర్ణీత కాలవ్యవధిలో పైకి ఎదగాలి లేదా సంస్థను వదిలి వెళ్లిపోవాలి.

మెకిన్సేకి 52 దేశాలలో 96 కార్యాలయాలలో సుమారు 9,000 మంది సలహాదారులు ఉన్నారు. సంస్థ యొక్క 2008 సంవత్సరపు ఆదాయం $6.౦ బిలియన్లు అని ఫోర్బ్స్ అంచనా వేసింది.[6]

మెకిన్సే విధానం యొక్క వివాదాస్పద అంశం, సంస్థ పాటించే నాన్-ఎక్స్క్లూసివ్ విధానం. సంస్థలోని వివిధ సలహాదారుల బృందాలు ఆ పరిశ్రమలోని ప్రత్యక్ష పోటీదారుల తరపున పని చేయవలసి వచ్చినప్పుడు వారి మధ్య పరస్పర విరుద్దమైన ఉద్ద్యేశాలు ఉత్పన్నమవచ్చు. ఇది సంస్థకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే, భవిష్యత్తులో ఖాతాదారులకు పని చేయడానికి వీలు ఉంటుంది; అంతేకాక, ఒక పోటీదార సంస్థ మెకిన్సేని ఆశ్రయించినట్లు తెలియగానే, ఇతర కంపెనీలు కూడా మెకిన్సేనే ఆశ్రయిస్థాయి. ఈ విధానం వలన, మెకిన్సే తమ ఖాతాదారుల జాబితాను గోప్యంగా ఉంచుకోగలదు. అయితే, దీని వలన, సంస్థ లోపల ఖాతాదారుల గోప్యతపై అత్యధిక ప్రాముఖ్యత ఉంటుంది. సలహాదారులు పరస్పరం తమ పని గురించిన వివరాలను ఇతర సంఘాల సభ్యులతో చర్చించడాన్ని సంస్థ నిషేధించింది. మెకిన్సేలో పనిచేస్తున్నప్పుడు, సలహాదారులు పోటీదారులతో నేరుగా పని చేయడాన్ని సంస్థ నిషేధించింది. ఒక సంస్థ తరపున పనిచేసి, తరువాత ఆ సంస్థ యొక్క పోటీ సంస్థ తరపున పని చేయడానికి 2 లేదా ఎక్కువ సంవత్సరాల సమయం ఆగితే కానీ తరువాత పోటీదారు తరుపున పని చేయటంపై నిషేధం విధించింది; కొన్ని సందర్భాలలో, సలహాదారులు పోటీ సంస్థల తరపున పని చేయడాన్ని శాశ్వతంగా నిషేధిస్తుంది.

చరిత్ర[మార్చు]

మెకిన్సే & కంపెనీని చికాగోలో 1926లో స్థాపించిన వారు జేమ్స్ ఓ. ("మాక్") మెకిన్సే. ఈయన యునివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ అఫ్ బిజినెస్‌లో ఒక అకౌంటింగ్ ప్రొఫెసర్. బడ్జెటింగ్‌ను ఒక నిర్వాహణా సాధనముగా వాడడాన్ని ఇతనే ప్రవేశపెట్టాడు. మార్షల్ ఫీల్డ్స్ 1935లో సంస్థ ఖాతాదారుగా అయింది. మెకిన్సేని ఆ సంస్థను వదిలి పెట్టి తమ సంస్థ యొక్క CEOగా పని చేయడానికి ఒప్పించింది ఆ సంస్థ; అయితే, అతను 1937లో నిమోనియా సోకి చనిపోయాడు.

మెకిన్సీ సంస్థను వదిలి వెళ్ళిన తరువాత 1933లో సంస్థలో చేరిన మార్విన్ బోవేర్, సంస్థ ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి కారకులయ్యారు. ఈయనే సంస్థ యొక్క పలు మార్గదర్శకాలను రూపొందించారు. మెకిన్సే మరణించినప్పుడు సంస్థ యొక్క చికాగో, న్యూ యార్క్ శాఖలు విడిపోయాయి. 1939లో, న్యూ యార్క్ భాగస్వాముల సహాయంతో బోవర్ న్యూ యార్క్ శాఖను పునరుద్దరణ చేసి, సంస్థ పేరుని మెకిన్సే & కంపెనీగా మార్చాడు. మెకిన్సీలో తొలి భాగస్వామ్యులలో ఒకరైన టి. కియర్నీ, చికాగో శాఖను అట్టి పెట్టుకొని, ఆ శాఖకు తన పేరు పెట్టారు. ఆ విధంగా A.T. కియర్నీ అనే పోటీ యాజమాన్య సలహాదార సంస్థ స్థాపించబడింది.

నియామకం[మార్చు]

పరిశ్రమలో అప్పట్లో నెలకొన్న నియామక పద్ధతికి భిన్నంగా మార్విన్ బోవెర్ నియమాకాలు చేపట్టాడు. అనుభవం కలిగిన మేనేజర్లను కాకుండా, ప్రముఖ బిజినెస్ స్కూల్‌ల నుంచి అప్పుడే చదువు పూర్తి చేసిన పట్టభద్రులను ఉద్యోగంలో నియమించాడు.[7]

US మరియు విదేశాలలో ఉన్న ఉన్నత స్థాయి ప్రముఖ బిజినెస్ స్కూల్‌ల నుంచి విద్యార్థులను నియమించే ప్రముఖ సంస్థలలో ఒకటిగా ఈ రోజు మెకిన్సే సంస్థ పేరొందింది. అంతే కాక, విజ్ఞానం, వైద్యం, ఇంజనీరింగ్ మరియు చట్టం వంటి రంగాలలో ఉన్నత విద్యలు చదివిన వారిని కూడా సంస్థ నియమిస్తుంది. రోడ్స్ స్కాలర్‌లలో పలువురుని సంస్థ నియమించగలుగుతుంది.[8]

పోటీదారులు[మార్చు]

వ్యూహాత్మక సేవలను అందించే ప్రముఖ ఫార్చూన్ 500 సంస్థలు నాలుగు ఉన్నాయి: మెకిన్సే & కంపెనీ (మెకిన్సే), ది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG), బెయిన్ & కంపెనీ (బెయిన్), మరియు బూజ్ & కంపెనీ (బూజ్).[9]. ఇతర పోటీదారులు: డియోలిట్ కన్సల్టింగ్, A.T. కియర్నీ, రోలాండ్ బెర్జేర్ స్ట్రాటెజి కన్సల్టన్ట్స్ మరియు మానిటర్ గ్రూప్ వంటి చిన్న సంస్థలు.

ప్రచురణ[మార్చు]

మెకిన్సే పలు ప్రచురణలను ప్రచురిస్తుంది. వాటిలో కొన్ని: మెకిన్సే క్వాటర్లీ, [10] మెకిన్సే ఆన్ బిజినెస్ టెక్నాలజీ, మెకిన్సే ఆన్ పేమెంట్స్, మెకిన్సే ఆన్ కార్పోరేటే అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, అండ్ మెకిన్సే ఆన్ ఫైనాన్స్ . మెకిన్సే వారు రచించిన పలు వ్యాపార పుస్తకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని వాల్యువేషన్: మెషరింగ్ అండ్ మేనేజింగ్ ది వాల్యూ అఫ్ కంపెనీస్, ది ఆల్కెమీ అఫ్ గ్రోత్, క్రియేటివ్ డిస్ట్రక్షన్, ది వార్ ఫర్ టేలంట్, మరియు అత్యంత గుర్తింపు పొందిన ఇన్ సెర్చ్ అఫ్ ఎక్సెలెన్స్ .

పరిజ్ఞాన నిర్వాహాణా వ్యవస్థ[మార్చు]

తమ సంస్థలో ఉన్న సలహాదారులకు సహాయపడే విధముగా మెకిన్సే తమ నాలెడ్జ్ మేనేజ్మెంట్ సిస్టంలో గణనీయంగా పెట్టుబడి పెడుతుంది. ఈ వ్యవస్థ సాధారణ పరిశోధకులు, పరిశ్రమ (మరియు పని) -వారిగా నిపుణులు, గ్రంథాలయకర్తలు, పత్రికలూ మరియు డేటాబేస్లు కలిగి ఉంటుంది. మెకిన్సే సంస్థ మెకిన్సే నాలెడ్జ్ సెంటర్ (McKC) అనే కేంద్రాన్ని నడుపుతూ ఉంది. ఈ కేంద్రం విశేషమైన పరిజ్ఞానం మరియు వ్యాపార సమాచారాలను త్వరగా అందిస్తుంది.[11] అంతే కాక, ఖాతాదారులతో అనుభవాలనుంచి నేర్చుకున్న అంశాలను అంతర్గత "ఆచరణా పురోగతి" పత్రాల ద్వారా అందిస్తుంది. గతంలో సలహాదారుల పొందిన అనుభవాలను బట్టి సలహాదారులు నేర్చుకున్న అంశాలను వ్యక్తిగతంగా సలహాదారులను కలిసి తెలుసుకోవచ్చు. (కాని పోటీదారుల విషయాలు తెలుపబడవు)

ఈ వ్యవస్థను మాజీ భాగస్వామి అయిన అనిల్ కుమార్ రూపొందించారు.[12]

ప్రముఖ ప్రస్తుత మరియు మాజీ ఉద్యోగులు[మార్చు]

ఇతర ఏ సంస్థల కంటే కూడా అధిక సంఖ్యలో CEOలను మెకిన్సే తయారు చేసింది. అందుకని ఫార్చూన్ పత్రిక ఈ సంస్థను "అత్యుత్తమ CEO తయారి సంస్థ" అని పేర్కుంది.[13] ఫార్చూన్ 500 సంస్థలలో, 70 కంటే మంది ఎక్కువ ప్రస్తుత మరియు మాజీ CEOలు మాజీ మెకిన్సే ఉద్యోగులే. ప్రముఖ మాజీ మెకిన్సే ఉద్యోగులు: లూయిస్ వి. గేర్స్ట్నేర్, జు. - మాజీ IBM అధినేత మరియు CEO మరియు ది కార్లైల్ గ్రూప ప్రస్తుత అధినేత, జేమ్స్ మక్నేర్నీ - బోయింగ్ యొక్క అధినేత మరియు CEO, హెల్ముట్ పాన్కే - BMW AG యొక్క మాజీ అధినేత and CEO of BMW AG, క్రిస్టోఫేర్ ఏ. సింక్లైర్ - పెప్సికో యొక్క మాజీ అధినేత మరియు CEO, జేమ్స్ ఫై. గోర్మన్ - మోర్గాన్ స్టాన్లీ యొక్క అధ్యక్షుడు మరియు CEO, పేటర్ వుఫ్లి - UBS AG యోక్క్ మాజీ CEO, స్టీఫెన్ గ్రీన్ - HSBC యొక్క అధినేత, జోనాథన్ ష్వార్ట్స్, సన్ మైక్రోసిస్టమ్స్ యొక్క CEO, జెఫ్రీ స్కిల్లింగ్, ఎన్రాన్ యొక్క మాజీ (ప్రస్తుతం జెయిల్ లో ఉన్నాడు) CEO, మరియాస్ క్లోప్పేర్స్ - BHP బిల్లిటన్ యొక్క CEO, బాబి జిండాల్, ప్రస్తుత లూసియానా గవర్నర్, విట్టోరియో కోలో, వోడాఫోన్ యొక్క CEO. మాజీ ఉద్యోగులలో మరొకరు చెల్సీ క్లింటన్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ మరియు ప్రస్తుత సెక్రటరి ఆఫ్ స్టేట్ హిల్లరీ రోధం క్లింటన్ కూతురు.

విమర్శ[మార్చు]

ఒక మాజీ ఉద్యోగి కథనం ప్రకారం, సంస్థ ఖాతాదారుల విషయాలను చర్చించదు. తమ గురించి జాగ్రత్తగా రూపొందించుకున్న తక్కువ-స్థాయి బాహ్య రూపాన్ని సంస్థ కాపాడుతుంది. దీని వలన బహిరంగ పర్యవేక్షణ, సంస్థ ఖాతాదారుల వివరాలు, సంస్థ యొక్క విజయాలు, లాభము వంటి అంశాలను తెలుసుకోవడం కష్టసాధ్యమవుతుంది.[14] ఈ గోప్యత వలన మెకిన్సే యొక్క ధరల గురించి కూడా బయటకు తెలియరాదు.[ఉల్లేఖన అవసరం]

మాజీ ఉద్యోగులు కూడా ఖాతాదారుల గురించి గోప్యంగా ఉంటారు. కనుక, మెకిన్సే ఉద్యోగులు చేస్తున్న పొరపాట్లను పూర్తి స్థాయిలో తెలుసుకోవడం విలేకర్లు, రచయితలకు కష్టమవుతుంది. ఉదాహరణకు, ఎన్రాన్ సంస్థ కుప్పకూలడానికి ముందు మెకిన్సే సంస్థ యొక్క పెద్ద ఖాతాదారు సంస్థ. మెకిన్సే మాజీ ఉద్యోగియే ఎన్రాన్ కు అధినేతగా ఉన్నాడు.[15] ముఖ్యంగా, "అన్ని స్థాయిలలోనూ మంచి నైపుణ్యం కలిగిన వారిని తీసుకోవడం వలనే పోటీసంస్థలను సమర్ధవంతంగా ఎదుర్కోగలం అనేది సంస్థ యొక్క గట్టి విశ్వాసం". ఈ విధానము మెకిన్సీ సలహా మేరకు ఎన్రాన్ లో అమలు చేయబడింది. దీని వలన సంస్థ లోపల పలు శక్తి కేంద్రాలు ఏర్పడ్డాయి. "వీరు తమకు న్యాయంగా లభించవలసిన విజయాలకంటే ఎక్కువ ఘనతను చాటుకున్నారు. కాని వైఫల్యానికి బాధ్యతను మాత్రం తీసుకోలేదు. నిర్వాహణలో నియమపాలన కరువయింది."[16] 24 ఏళ్ళు జెయిల్ శిక్ష పడిన ఎన్రాన్ CEO జెఫ్ స్కిల్లింగ్, ఒక మాజీ మెకిన్సీ భాగస్వామి మరియు "విశ్వాసమైన మాజీ ఉద్యోగి". మెకిన్సీతో సంబంధం ఉన్న కష్టాలలో ఉన్న మరో సంస్థ, స్విస్స్ఎయిర్. మెకిన్సీ ది హంటర్ స్ట్రెటజిని వాడమని సూచించిన తరువాత సంస్థ దివాలా పాలయింది.[17] బ్రిటిష్ రైల్వే కంపెనీ అయిన రెయిల్ట్రాక్ కూడా కుప్పకూలింది. అవస్థాపన సదుపాయాల పై ఖర్చు తగ్గించి నగదును వాటాదారులకు తిరిగి చెల్లించమని మెకిన్సీ ఇచ్చిన సలహా తరువాతే ఆ సంస్థ కుప్పకూలిందని ఆరోపణ ఉంది. తరువాత ఆ రెయిల్ సంస్థలో పలు ప్రాణాంతకమైన ప్రమాదాలు జరిగాయి.[18][19] దివాలా తీసిన ఇతర ఖాతాదారులు, కేమార్ట్ మరియు గ్లోబల్ క్రాసింగ్.[ఉల్లేఖన అవసరం]

ఇటీవల కాలములో మెకిన్సే యొక్క ప్రతిష్ఠ పలు మార్లు దెబ్బతిన్నది:

  • తప్పుదారి పట్టించే విశ్లేషణలు, సెల్లులర్ ఫోన్ మార్కెట్ ఒక చిన్న విశేషమైన మార్కెట్ గానే ఉంటుందని 1980లో AT&T సంస్థకు సలహా ఇచ్చింది.[20]
  • హరికేన్ కట్రినా వ్యాజ్యాలలో మెకిన్సే కూడా ఒక ప్రతివాదిగా చేర్చబడింది. 1980 మొదలుకొని బీమాపరిశ్రమలో భారీ మార్పులు జరగడానికి మెకిన్సేనే "రూపకర్త" అని లూసియానా అటర్నీ జెనెరల్ చార్ల్స్ ఫోటి తాను వేసిన దావాలో ఆరోపించారు. "తిరస్కరించు, ఆలస్యం చేయి మరియు సమర్ధించు" అనే యుక్తిని వాడి వారికి రావలసిన సొమ్ముకు తక్కువ అంచనాలు వేసి 'ప్రీమియం లీకేజీ' ని ఆపమని బీమాసంస్థలకు మెకిన్సీ సలహాలు ఇచ్చిందని ఆ దావాలో ఆరోపించబడింది.[21]
  • మెకిన్సీ ఇంటి బీమామరియు వాహన బీమాసంస్థలకు సలహా ఇచ్చిన తరువాత, ఆ సంస్థల పై పలు దావాలు వేయబడ్డాయి. వాస్తవమైన నష్టానికంటే చాలా తక్కువగా చెల్లింపులు చేయమని మెకిన్సీ ఇచ్చిన సలహాను బీమాసంస్థలు పాటించాయి.[22] ఫిబ్రవరి 2007లో ఒక CNN వ్యాసంలో వివాదాస్పదమైన కార్ బీమాపద్ధతులను మెకిన్సీ రూపొందించిందని, వాటిని 1990ల-మధ్య కాలములో స్టేట్ ఫర్మ్ మరియు ఆల్ స్టేట్ వంటి బీమాసంస్థలు వాడి సాఫ్ట్ టిష్యూ గాయాలకు డబ్బు చెల్లించకుండా తప్పించుకున్నాయని చెప్పబడింది. ఈ రకమైన గాయాలను సర్జరీ తప్ప X-రే లేదా ఇతర సాధారణ పరీక్షా విధాన ద్వారా నిర్దారించడం కష్టమని ఆ వ్యాసంలో పెర్కొబడింది.[23]
  • న్యూ యార్క్ లో ఉన్న గలియోన్ గ్రూప్ అనే హెడ్జ్ ఫండ్ కు లోపలి సమాచారం ఇవ్వడానికి USD$1.8 మిలియను తీసుకున్నట్లు జనవరి 2009లో అనిల్ కుమార్ అనే సీనియర్ మెకిన్సే సలహాదారుడు నేరాన్ని అంగీకరించాడు. గ్రూప్ యొక్క మాజీ అధినేత అయిన రాజ్ రాజరత్నంతో జరిపిన ఈ లావాదేవీల నుంచి అయన మొత్తం మీద $2.6 మిలియనులు సంపాదించాడు.[24]
  • ఇతర పుస్తకాలు మరియు వ్యాసాలలో, ది ఎకనామిస్ట్కు చెందిన విలేకర్లు జాన్ మిక్లేత్వైట్ మరియు అడ్రియాన్ వుల్డ్రిడ్జ్ రచించిన ది విట్చ్ డాక్టర్స్ అనే రచనలో మెకిన్సే సలహాదారుల తప్పిదాల వలన జరిగిన ఘోరాలు గురించి వ్రాయబడింది.[page needed] అలాగే, సలహాదారుల పరిశ్రమలో మెకిన్సే పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి జేమ్స్ ఓ'షీ మరియు చార్లెస్ మడిగాన్, Dangerous Company: The Consulting Powerhouses and the Businesses They Save and Ruinలో వ్రాశారు.[page needed]
  • పబ్లిక్ స్కూల్ డిస్ట్రిక్ట్ ల గురించిన సంప్రదింపులపై ఉపాధ్యాయులు మరియు తల్లితండ్రుల ఆవేదన. ఇటీవల మినియాపోలిస్ పబ్లిక్ స్కూల్స్ కు మెకిన్సే కొన్ని సూచనలు ఇచ్చింది. ఉపాధ్యాయుల ఆరోగ్య సంరక్షణ వంటి "అధిక ఖర్చు"తో కూడిన వ్యయాలని తగ్గించాలని, ప్రమాణం ప్రకారం జరిగే పరీక్షలలో అతి తక్కువ స్కోర్ చేసిన పాఠశాలలో 25% పాఠశాలలును ప్రైవేట్ చార్టర్-స్కూల్ స్థాయికి (ప్రజా నిధులు అందుకుంటున్న పాఠశాలలను స్వతంత్ర చార్టర్ సంఘాలు లేదా లాభము ఆర్జించే సంస్థలు నడిపే పధకంలో ఉన్నపటికీ ఈ పాఠశాలలు స్థానిక పాఠశాల మండలి పరిధిలోకి రావు) మార్చేయాలని డిస్ట్రిక్ట్ కు మెకిన్సీ సలహా ఇచ్చింది. సియాటిల్ లోని ఉపాధ్యాయులు మెకిన్సీ చేపట్టిన సియాటిల్ పబ్లిక్ స్కూల్ ల గురించిన అధ్యయనానికి వ్యతిరేకంగా ఒక తీర్మానం చేశారు. ప్రైవేటీకరణకు మద్దతు పలకడం, హై-స్టేక్స్ పరీక్షలు, మరియు నో చైల్డ్ లెఫ్ట్ బిహైండ్ యాక్ట్ కు సంబంధించిన ఇతర యుక్తులకు వ్యతిరేకంగా ఈ విధంగా చేశారు.[25]

క్యాబినెట్ కార్యాలయాన్ని పునరుద్దరించడం గురించి మెకిన్సీ సంస్థను సంప్రదించినందుకు మాజీ బ్రిటిష్ ప్రధాన మంత్రి టోనీ బ్లైర్ పై ఫైనాన్షియల్ టైమ్స్లో విమర్శలు వచ్చాయి. "లోపల వచ్చి, నష్టాన్ని తెలియచేయడానికి పవర్పాయింట్ ను వాడేవారే" మెకిన్సీ ఉద్యోగులు అని ఒక ఉన్నత స్థాయి అధికారి విమర్శించారు.[26]

సూచనలు[మార్చు]

  1. "McKinsey & Company on Forbes' America's Largest Private Companies list". Retrieved 2009-11-16. Cite web requires |website= (help)
  2. "McKinsey & Company Swiss Office - Key Facts". మూలం నుండి 2010-07-23 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-02. Cite web requires |website= (help)
  3. హుఎయ్, జాన్. "హౌ మెకిన్సే డస్ it," ఫార్చూన్, నవంబర్ 1, 1993
  4. వాల్ట్.కాం, "మేనేజ్మెంట్ స్ట్రాటజీ కన్సల్టింగ్ ఫర్మ్స్ రాంకింగ్స్: టాప్ 50 కన్సల్టింగ్ ఫర్మ్స్, 2009"
  5. ఫిషేర్, అన్నే. "క్రొత్త MBA లకు, కాలిఫోర్నియా జీవన శైలి ఎక్కువ డబ్బును తీసేసుకుంటుంది" ఫార్చూన్, మే 3, 2007
  6. "అమెరికా యొక్క అతి పెద్ద ప్రైవేట్ కంపనీలు" ఫార్చూన్, అక్టోబర్ 28, 2009
  7. ఎడెర్షీం, ఎలిజబెత్ హాస్, మెకిన్సేస్ మార్విన్ బోవెర్: విషన్, లీడర్షిప్ అండ్ ది క్రియేషన్ అఫ్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ , 2004, జాన్ విలీ & సన్స్. [1]
  8. స్చేపెర్, థామస్ జే. రోడ్స్ స్కాలర్స్, ఆక్స్ఫోర్డ్, అండ్ ది క్రియేషన్ అఫ్ యాన్ అమెరికన్ ఎలైట్ , పేజి 300, 2004, బెర్గాన్ బుక్స్. [2]
  9. సెల్లింగ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ టు ది ... - గూగుల్ బుక్స్
  10. మెకిన్సే క్వార్టర్లీ
  11. హోం | నాలడ్జ్ నెట్వర్క్
  12. Sharma, Amol; Lublin, Joann S. (October 21, 2009). "A Star Partner's Galleon Arrest Shakes Up Ranks at McKinsey". The Wall Street Journal.
  13. జోన్స్, డెల్. "సం ఫిర్మ్స్ ఫేర్టైల్ సాయిల్ గ్రౌస్ క్రాప్ అఫ్ ఫ్యూచర్ CEOస్ " USA టుడే, జన 1, 2008
  14. రూటర్స్ న్యూస్ అవుట్లేట్
  15. హ్వంగ్, సుయిన్ మరియు రాచెల్ ఏమ్మా సిల్వేర్మన్ "ఎన్రాన్ తో మెకిన్సే యొక్క దగ్గర సంబంధం, సంస్థ యొక్క బాధ్యత గురించి ప్రశ్నలు లేపుతున్నాయి" ది వాల్ స్ట్రీట్ జర్నల్, జనవరి 17, 2002 [3] Archived 2010-05-09 at the Wayback Machine.
  16. గ్లాడ్వెల్, మాల్కం."ది టాలెంట్ మిత్," ది న్యూ యార్కర్, జూలై 22, 2002
  17. బైర్న్, జాన్ ఎ., "ఇన్సైడ్ మెకిన్సే: కుప్ప కూలిన సంస్థలలో ఎన్రాన్ మాత్రమే కాదు. అనుకోకుండా, ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సలహాదారు సంస్థకు రోజులు బాగా లేవు." బిసినస్ వీక్, July 8, 2002 [4]
  18. హిర్స్ట్, క్లాయ్టన్, "ది మైట్ అఫ్ ది మెకిన్సే మాబ్," ది ఇన్డిపెన్డెంట్, జనవరి 20, 2002[permanent dead link]
  19. బారీ, గైల్స్, "ద ల్యాండ్ దట్ టైంటేబిల్స్ ఫర్గాట్," ప్రాపెర్టి వీక్, మే 25, 2001[permanent dead link]
  20. జోల్ గారూ, జోల్, "అవర్ సేల్స్, అవర్సేల్వ్స్," "వాషింగ్టన్ పోస్ట్," 2/24/08
  21. "ఫోటీ భీమ సంస్థల పై దావా వేశాడు, దావాలు నిర్ణయించబడ్డాయని ఆరోపణ | న్యూ ఆర్లియన్స్, లూసియానా వార్తలు | స్థానిక వార్తలు | న్యూ ఆర్లియన్స్, లూసియానా వార్తలు | wwltv.com". మూలం నుండి 2009-07-13 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-11-14. Cite web requires |website= (help)
  22. ఇంటి భీమా సంస్థల రహస్య యుక్తులు అగ్ని ప్రమాద బాధితులను మోసగించి లాభాలను పెంచుతుంది - బ్లూంబెర్గ్
  23. చిన్నపాటి దెబ్బలకు వాహన భీమా సంస్థలు ఇబ్బంది పెట్టుతున్నాయి - CNN.com
  24. మాజీ-మెకిన్సే డైరెక్టర్ కుమార్ గలియాన్ కు ఇచ్చిన సమాచారం కొరకు $1.75m తీసుకున్నాడు
  25. "ప్రైవేట్ సంస్థ కు విఫలమైన గ్రేడ్ లభ్యం"
  26. "న్యూమాన్, కాథీ, "మెకిన్సే నివేదిక పై బ్లైర్ కు కష్టకాలం," ఫైనాన్షియల్ టైమ్స్, నవంబర్ 25, 2005". మూలం నుండి 2009-04-22 న ఆర్కైవు చేసారు. Retrieved 2020-01-09. Cite web requires |website= (help)

బాహ్య లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మెకిన్సే&oldid=2815763" నుండి వెలికితీశారు