మెట్టుపాలయం కోయంబత్తూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెట్టుపాలయం కోయంబత్తూరు
Mettupalayam
Coordinates: 11°18′00″N 76°57′00″E / 11.3000°N 76.9500°E / 11.3000; 76.9500
Population (2001)
 • Total66,313

మెట్టుపాలయం తమిళం: மேட்டுப்பாளையம் అనేది భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కోయంబత్తూరు జిల్లాలో ఒక పట్టణం మరియు పురపాలక సంఘం.

భౌగోళిక స్థితి[మార్చు]

మెట్టుపాలయం 11°18′00″N 76°57′00″E / 11.3000°N 76.9500°E / 11.3000; 76.9500[1] వద్ద ఉంది. ఇది సముద్రమట్టానికి 2269 మీటర్‌ల (882 అడుగులు) సగటు ఎత్తులో ఉంది. మెట్టుపాలయం నీలగిరి పర్వతాల దిగువన ఉన్న భవాని నది ఒడ్డున ఉంది.

జనాభా[మార్చు]

ఊటీ కొండల నుంచి మెట్టుపాలయం పట్టణం

As of 2001 భారత జనాభా లెక్కల ప్రకారం[2], మెట్టుపాలయంలో జనాభా 66,313. మొత్తం జనాభాలో పురుషులు 50% ఉండగా, స్త్రీలు మిగిలిన 50% ఉన్నారు. మెట్టుపాలయంలో సగటు అక్షరాస్యత రేటు 73%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషులలో అక్షరాస్యత 79% ఉండగా, మరియు స్త్రీలలో అక్షరాస్యత 68% వద్ద ఉంది. మెట్టుపాలయంలో జనాభాలో 10% మంది 6 ఏళ్ల కంటే తక్కువ వయస్సులో ఉన్నారు. పట్టణంలో అధిక సంఖ్యాక ప్రజలు తమిళంతోపాటు కన్నడ భాష కూడా మాట్లాడతారు. తమిళ పదాల కలయిక వలన ఇక్కడ మాట్లాడే కన్నడ భాష కర్ణాటకలో మాట్లాడే కన్నడ భాషకు చాలా భిన్నంగా ఉంటుంది.

రవాణా మౌలిక సదుపాయాలు[మార్చు]

మెట్టుపాలయం నీలగిరి ప్యాసింజర్ (NMR)కి రైల్వే జంక్షన్, ఈ సబ్ లైన్ ప్యాసింజర్ రైళ్లు బ్రాడ్ గేజ్ రైల్వేకి మారడానికి అవకాశం కల్పిస్తుంది. నీలగిరి ఎక్స్‌ప్రెస్ (బ్లూ మౌంటైన్ ఎక్స్‌ప్రెస్) మెట్టుపాలయంను రాష్ట్ర రాజధాని చెన్నైతో కోయంబత్తూర్ మీదగా కలుపుతుంది. ఇది దీని ఊటీ రైలు "నీలగిరి ప్యాసింజర్" ద్వారా ప్రసిద్ధి చెందింది, ఇది ఆసియాలో ఉన్న ఏకైక రాక్ మరియు పినియన్ రైల్వేగా గుర్తింపు పొందింది.

మెట్టుపాలయం నీలగిరి పర్వతాలలోకి వెళ్ళే రెండు ఘాట్ రోడ్డులకి ఆరంభ స్థానం. తద్వారా ఇక్కడ పర్వత ప్రాంతాల్లో లభించే తాజా పళ్ళు, కూరగాయల వ్యాపారం వృద్ధి చెందింది, అలాగే పర్వతాల్లో మాత్రమే దొరికే మరియు మైదానాలలో పెరిగే ఉత్పత్తులకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నుంచి తాజా ఉత్పత్తులు కోయంబత్తూరు జిల్లాలోని చాలా ప్రాంతాలకు సరఫరా చేయబడతాయి.

కోయంబత్తూరు (దక్షిణ భారత మాంచెస్టర్) రోడ్డు మార్గంలో కోయంబత్తూరుకు 38 కి.మీ దూరంలో ఉంది. దీనికి అతి సమీపంలోని విమానాశ్రయం కోయంబత్తూరులో ఉంది, ముంబై, అహ్మదాబాద్, బెంగుళూరు, కాలికట్, చెన్నై, కొచ్చిన్, హైదరాబాద్, జమ్మూ, పూణే, న్యూఢిల్లీ, కౌలాలంపూర్,షార్జా,అబుదాబి,కొలంబో,దుబాయ్,కువైట్,మస్కట్,దోహ,మస్కట్, మరియు దోహ నగరాల నుంచి ఇక్కడకు రోజువారీ (విమాన సమయ వేళలు) విమానాలు నడుపుతున్నారు.

ప్రసిద్ధ ప్రదేశాలు[మార్చు]

కోటగిరి రోడ్డు మెట్టుపాలయం స్థానికులకి అద్బుతమైన నడిచే చోటు, ఇక్కడ లేళ్ళని, ఏనుగులని చూడవచ్చు. ఫారెస్ట్ కాలేజ్ కూడా కోటగిరి రోడ్డులో ఉంది.

వన భద్రకాళీ అమ్మాన్ కోవిల్, ఇడుగంపాలయం అంజినేయార్ టెంపుల్, సుబ్రమణియ స్వామి టెంపుల్, సౌత్ తిరుపతి(KG గ్రూప్ వారిచే నిర్వహించబడే ప్రైవేట్ యాజమాన్య గుడి), కురుంతమలై బాల తండాయుడపని మురుగన్ కోవిల్, కుమరన్ కుండ్రు మురుగన్ కోవిల్,అన్నడసంపాలయంలో శ్రీ మాదేశ్వర టెంపుల్,కరమాదై రంగనాధర్ కోవిల్ మొదలైనవి మెట్టుపాలయం దగ్గర ఉన్న అనేక ప్రముఖ గుడులు.

కరమాదై రంగానదార్ గుడి ప్రతి సమత్సరం అది నిర్వహించే కార్ పండగకోసం ప్రాచుర్యమైనది, ఇక్కడ వేలమంది జనం పవిత్రమైన రంగానదార్ కారుని దర్శించి ఆయన ఆశీస్సులు పొందుతారు. ఈ కార్ పండగ దాని "తేర్ మిఠాయి" కోసం కూడా చాలా ప్రాచుర్యమైనది, ఇది రకరకాల ఆకారాలు, పరిమాణాలలో లభిస్తుంది. మాతేశ్వరార్ గుడి కుట్టైయుర్ వద్ద నెలకొనిఉంది(మెట్టుపాలయం నుండి కరమడై వెళ్ళే దారిలో), ఇది ప్రముఖ శివ మందిరం.

చాలామంది ప్రజలకి వ్యవసాయం ప్రధాన వృత్తి.వ్యవసాయానికి అవసరమైన సారవంత భూములుగల అనేక గ్రామాలు మెట్టుపాలయం చుట్టూ ఉన్నాయి.

బ్లాక్ థండర్ పట్టణానికి 3 కి.మీ దూరంలో ఉన్న నీటి థీమ్ పార్క్, ఇది చాలామంది పర్యాటకులని ఆకర్షిస్తుంది.ఇది అనేక ఆకర్షణీయమైన రైడ్స్ కలిగి ఉంది: ది లేజీ రివర్, వేవ్ పూల్, థ్రిల్లేరియం, సర్ఫ్ హిల్, కేనాన్ బాల్, ఆక్వా బౌల్, సైడ్ విండర్ మొదలైనవి అందులో కొన్ని. అన్నడసంపాలయంలోని శ్రీ మాదేశ్వర గుడి కూడా ఆ ప్రాంతంలో ఉన్న అతి అరుదైన ప్రముఖ శివుని గుడి, ఇది మెట్టుపాలయంకి 8 కి.మీ దూరంలో ఉంది.

అడవులతో నిండిఉన్న పర్వత ప్రాంతపు అద్భుత దృశ్యాన్ని చూడడానికి మెట్టుపాలయం నుండి ఊటీ వరకు రైలు ప్రయాణం సూచించబడుతుంది. ఈ నారో గేజ్ పర్వత రైలు మెట్టుపాలయం మైదానాల నుంచి మొదలయి 46 కి.మీ అటవీ ప్రాంతాన్ని, టీ తోటలని, 16 సొరంగాలు మరియు 250 కంటే ఎక్కువ వంతెనలను చుట్టివుంది. నడక కంటే కొంచెం వేగంగా కదులుతూ ఈ ప్రయాణం నాలుగున్నర నుండి ఐదు గంటలపాటు సాగుతుంది, కానీ పర్వతాల, మైదానాల అద్భుత దృశ్యాలతో ఇది సమయాన్ని తెలియనియ్యదు. మెట్టుపాలయంకి రైలు ప్రయాణం ప్రయాణికులకి వినోదాన్ని పంచే అనుభూతులలో ఒకటి. ఈ ఆవిరి ఇంజన్ రైలు బ్రిటీషు కాలంలో నిర్మించబడింది.

మెట్టుపాలయంలో రవాణా వ్యాపారం కూడా ప్రాచుర్యంలో ఉంది.

ప్రపంచ మార్కెట్ కి మెట్టుపాలయం మార్కెట్ నుంచి బంగాళాదుంపలు ఎగుమతి చేయబడతాయి.

రాజకీయాలు[మార్చు]

మెట్టుపాలయం శాసనసభ నియోజక వర్గం నీలగిరి (లోక్‌సభ నియోజకవర్గం)లో భాగంగా ఉంది.[3]

వీటిని కూడా చూడండి[మార్చు]

  • ఊటీలో పర్వతప్రాంత రైలు

సూచనలు[మార్చు]

  1. ఫాలింగ్ రైన్ జెనోమిక్స్, Inc - మెట్టుపాలయం, ఇండియా
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. మూలం నుండి 2004-06-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-11-01. Cite web requires |website= (help)
  3. "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Retrieved 2008-10-10.

మెట్టుపాలయం - కూనోర్ & ఊటిలో రిసార్టులు మరియు హొటళ్ళ యొక్క సమాచారం