మెట్లోత్సవం
స్వరూపం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
తిరుమల మార్గములోని ఏడుకొండలను సాంప్రదాయ పద్ధతిలో కర్ణాటక హరిదాసులు సూచించిన విధముగా మెట్ల మీదగా ఎక్కటాన్ని మెట్లోత్సవము అంటారు. వేలాది మంది భజన బృంద సభ్యులు, భక్తులు హరిదాసుల వేషం ధరించి భజనలు పాడుతూ హరిదాసుల చిత్రాలను తిరుపతిలో ప్రధాన వీధుల గుండా ఊరేగించటం, భజనలు మరియు ప్రశ్నోత్తర పోటీలు మొట్లోత్సవము యొక్క కొన్ని ప్రధాన అంశాలు.[1]
మొట్లోత్సవం ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు జరిగే ఉత్సవం. మొదటి రోజు ఊరేగింపు తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయం నుండి ప్రారంభమై త్యాగరాజ మండపం చేరుతుంది. త్యాగరాజ మండపం వద్ద హరిదాస సంధ్య సంకీర్తన అనే సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు[2].
మొట్లోత్సవ ఆచారాన్ని ప్రసిద్ధ కన్నడ హరిదాసులైన పురందర దాసు, కనక దాసు మరియు విజయ దాసులు ప్రారంభించారు.[3]