మెథిసిల్లిన్-రెసిస్టంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Methicillin-resistant Staphylococcus aureus
MRSA7820.jpg
SEM micrograph of MRSA.
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
Species:
Binomial name
Staphylococcus aureus
Rosenbach 1884

మెథిసిల్లిన్-రెసిస్టంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్ (MRSA) అనేది ఒక బ్యాక్టీరియా. ఇది మానవుల్లో చికిత్సకు అతి కష్టమైన అనేక అంటురోగాలకు కారణమవుతుంది. దీనిని మల్టీడ్రగ్-రెసిస్టంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్ లేదా ఆక్సాసిల్లిన్-రెసిస్టంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్ (ORSA) అని కూడా పిలుస్తారు.

నిర్వచనం పరంగా, MRSA అంటే, ఏదైనా స్టెఫిలోకాకస్ ఆరియస్ బ్యాక్టీరియా జాతి పెన్సిలిన్‌లు, మెథిసిల్లిన్, డైక్లోక్సాసిల్లిన్, నాఫ్సిల్లిన్, ఆక్సాసిల్లిన్ తదితర) మరియు సెఫాలోస్పోరిన్‌లు సహా బీటా-లాక్టమ్ యాంటీబయాటిక్స్ పట్ల అధిక నిరోధకశక్తిని కలిగి ఉండటం.

MRSA అనేది ప్రత్యేకించి ఆసుపత్రుల్లో చాలా క్లిష్టమైనది. ఒంటిపైన గాయాలు ఉన్న రోగులు, పలు రకాల శస్త్ర సంబంధిత పరికరాలు మరియు బలహీనమైన వ్యాధినిరోధక వ్యవస్థలు అక్కడ ఉంటాయి. సాధారణ జనాల్లో కంటే అక్కడ అంటురోగం ప్రబలే అవకాశాలు అధికం.

వ్యాధి సంకేతాలు మరియు లక్షణాలు[మార్చు]

A ruptured MRSA abscess
అరిగిన MRSA విద్రధి

S. ఆరియస్ సర్వసాధారణంగా పూర్వ ముక్కుపుటాల (నాసికా రంధ్రాలు)లో ప్రవేశించినప్పటికీ, శ్వాస మార్గం, బాహ్య గాయాలు, సిరల్లోకి ఎక్కించే మందపాటి ప్లాస్టిక్ గొట్టాలు మరియు మూత్ర నాళాలు కూడా అంటురోగానికి సంభావ్య ప్రదేశాలు. ఆరోగ్యవంతమైన వ్యక్తులు MRSA సంకేతాలు లేకుండా కొద్ది వారాల నుంచి పలు ఏళ్ల వరకు గడపవచ్చు. ప్రమాదస్థాయికి చేరుకున్న వ్యాధి నిరోధక వ్యవస్థలు కలిగిన రోగులు అప్రధాన అంటురోగ లక్షణాలకు గురయ్యే అవకాశం ఎక్కువ.

MRSAని రోగుల నాసికా రంధ్రాలను పత్తి గుడ్డతో శుభ్రపరచడం మరియు లోపల గుర్తించిన బ్యాక్టీరియాను తొలగించడం ద్వారా గుర్తించవచ్చు. అంటురోగాలకు గురైన రోగులు, ఆసుపత్రుల్లో చేరిన స్క్రీనింగ్ రోగులతో స్పర్శ కలిగి ఉన్న వారికి అదనపు పరిశుభ్రతా చర్యలు చేపట్టాలి. అమెరికా సంయుక్తరాష్ట్రాలు[1], డెన్మార్క్, ఫిన్లాండ్ మరియు నెదర్లాండ్స్‌ దేశాల ఆసుపత్రుల్లో MRSA వ్యాప్తిని ఇలా చేయడం ద్వారా సమర్థవంతంగా నియంత్రించినట్లు గుర్తించారు.[2]

MRSA ప్రాథమిక లక్షణాలు కన్పించిన 24-48 గంటల్లోనే విజృంభిస్తుంది. 72 గంటల తర్వాత, MRSA మానవ కణజాలాల్లోకి ప్రవేశిస్తుంది. చివరకు చికిత్సకు లొంగని విధంగా తయారవుతుంది. MRSAని ప్రాథమికంగా మొటిమలను పోలి ఉండే చిన్న ఎరుపు రంగు బొప్పిలు, సాలెపురుగు గాట్లు లేదా సెగగడ్డల ద్వారా గుర్తించవచ్చు. ఒక్కో సందర్భంలో ఇవి జ్వరంతో పాటు రావొచ్చు మరియు సందర్భానుసారం దద్దుర్లు కూడా ఏర్పడవచ్చు. కొద్ది రోజుల్లోనే ఈ బొప్పిలు పెద్దవిగానూ, మరింత బాధాకరంగానూ మరియు చివరకు పైకి లోతుగా కనిపిస్తూ, చీముతో కూడిన సెగగడ్డలుగా మారుతాయి.[3] దాదాపు 75 శాతం కమ్యూనిటీ-అసోసియేటెడ్ (CA-) MRSA అంటురోగాలు చర్మం మరియు మృదువైన కణజాలంపై ఏర్పడవచ్చు. వీటిని ఎట్టకేలకు సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు. అయితే కొన్ని CA-MRSA జాతులు వైరస్ వల్ల కలిగే వ్యాధి తీవ్రతకు కారణమవుతాయి. ఇవి సంప్రదాయక హెల్త్‌కేర్-అసోసియేటెడ్ (HA-) MRSA అంటువ్యాధుల కంటే అత్యంత శరవేగంగా వ్యాపించడం మరియు తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తాయి. శరీరంలోని ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తాయి. తద్వారా విస్తృతమైన అంటువ్యాధి (విషపూరితం), టాక్సిక్ షాక్ సిండ్రోమ్, కణ నాశనం ("మాంస-భక్షణ") మరియు నిమోనియాకు అవకాశం కల్పిస్తుంది. CA-MRSA జాతుల యొక్క PVL మరియు PSM వంటి విష పదార్థాలే దీనికి కారణంగా భావించవచ్చు. అయితే NIHలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీసెస్ (NIAID) చేపట్టిన ఒక అధ్యయనంలో PVL దీనికి కారకం కాదని గుర్తించబడింది. కొందరు ఆరోగ్యవంతమైన వ్యక్తుల్లో చికిత్స చేయగల CA-MRSA చర్మ రోగాలు ఎందుకు వ్యాపిస్తున్నాయి మరియు ఇదే జాతి కారణంగానే గాయపడిన మరికొందరు తీవ్రమైన అంటురోగాల బారిన పడటం లేదా మరణిస్తుండటానికి కారణాలు తెలియడం లేదు.[4]

CA-MRSA యొక్క సర్వసాధారణ రుజువులు నెక్రొటైజింగ్ ఫాసిట్స్ లేదా ప్యొమ్యోసిటిస్ (ఇది సర్వసాధారణంగా పోషణకు సంబంధించిన వాటిలో కనబడుతుంది), నెక్రొటైజింగ్ నిమోనియా, సూక్ష్మక్రిమి సంపర్కము వలన కలిగిన గుండె లోపలి పొర యొక్క శోధం (ఇది హృదయ కవాటాలను నాశనం చేస్తుంది) లేదా ఎముక లేదా కీళ్ల అంటువ్యాధి రావడం వంటివి.[5] CA-MRSA తరచూ చీము ఏర్పడటం ద్వారా కూడా గుర్తించబడుతుంది. తద్వారా దీనిని గాటుపెట్టి రసిని పిండటం చేయాలి. MRSA ఒక సమూహంగా వ్యాపించడానికి ముందు చీముపుండ్లను అంటుకునేవిగా పరిగణించరు. ఎందుకంటే, అంటువ్యాధికి చర్మ ఆరోగ్యం దెబ్బతినడం మరియు సాధారణ చర్మ సముదాయం నుంచి బ్యాక్టీరియాలు (స్టెఫిలోకోకి) బయటకు రావాలని భావించబడుతోంది. అయితే హాస్పిటల్-అసోసియేటెడ్ MRSA నుంచి కొత్తగా విజృంభిస్తున్న CA-MRSA వ్యాపించే గుణం (అదే విధంగా, అయితే చాలా ముఖ్యమైన తేడాలతో) కలిగి ఉంది. ఆధార కణజాలపు శోధాన్ని కలిగించడంలో ఇతర MRSA రూపాల కంటే CA-MRSA తక్కువగా కారణమవుతుంది.

ప్రమాద కారకాలు[మార్చు]

ప్రమాదం పొంచి ఉన్న వ్యక్తులు:

 • బలహీనమైన వ్యాధినిరోధక వ్యవస్థలు (HIV/AIDS, కేన్సర్ రోగులు, అవయవ మార్పిడి చేసుకున్న వారు, తీవ్రమైన ఉబ్బసం (ఆస్మా) తదితర అనారోగ్య పరిస్థితులు ఉన్న వారు) కలిగి ఉన్నవారు.
 • మధుమేహం
 • సిరద్వారా మత్తుమందు ఎక్కించుకునే వారు
 • క్వినోలోన్ రోగక్రిమి నాశకాలను[6] ఉపయోగించడం
 • చిన్న పిల్లలు
 • వృద్ధులు
 • సత్రాల్లో నివసించే కాలేజి విద్యార్థులు
 • సుదీర్ఘకాలం పాటు ఏదైనా హెల్త్ కేర్ కేంద్రంలో ఉంటున్న లేదా పనిచేస్తున్న వారు
 • MRSA ఉండే తీరప్రాంత జలాలు అంటే ఫ్లోరిడా మరియు అమెరికా సంయుక్తరాష్ట్రాల పశ్చిమ తీరంలోని కొన్ని బీచ్‌లలో గడిపే వారు.[7][8]
 • ఇరుకుగా ఉండే ప్రదేశాల్లో ఇతరులతో కలిసి గడిపేవారు. అంటే జైలు సహచరులు, ప్రాథమిక శిక్షణ[9] లోని సైనికులు మరియు బట్టలు మార్చుకునే గదులు లేదా జిమ్‌లలో ఎక్కువ సేపు గడిపే వారు.

ఆసుపత్రి రోగులు[మార్చు]

పలు MRSA అంటురోగాలు ఆసుపత్రులు మరియు హెల్త్‌కేర్ కేంద్రాల ద్వారా సంక్రమిస్తుంటాయి. నర్సింగ్ హోమ్‌లు లేదా దీర్ఘకాలం పాటు పనిచేస్తున్న ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో సంభావ్య రేటు అధికం. MRSA అంటురోగ రేట్లు ఆసుపత్రుల్లో క్వినోలోన్స్ (ఒక రకమైన విషక్రిమి వినాశకాలు) ద్వారా చికిత్స పొందుతున్న రోగుల్లో అధికంగా ఉంటాయి. ఆరోగ్య సంరక్షకుడు నుంచి రోగికి అంటురోగ బదిలీ అనేది సహజం. ప్రత్యేకించి, వైద్యులు ఒక రోగికి చికిత్స చేసిన తర్వాత మరొకరి వద్దకు వెళ్లేటప్పుడు సరిగా చేతులు శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఈ బదిలీ అనేది ఎక్కువవుతోంది.[6][10]

జైలు ఖైదీలు[మార్చు]

ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉంటూ, సరైన ఆరోగ్య సూత్రాలు పాటించకుండా నిర్విరామంగా కొత్త ఖైదీలు చేరడం వల్ల జైళ్ల వంటి ఇరుకైన ప్రదేశాల్లో తొలుత U.S.లో తర్వాత కెనడాల్లో పలు సవాళ్లు ఎదురైనట్లు తెలిసింది. ప్రాథమిక నివేదికలను రాష్ట్ర జైళ్లలోని CDC రూపొందించింది. చర్మ మరియు సున్నితమైన కణజాల అంటురోగాలకు సంబంధించిన తదుపరి నివేదికలను 2001లో లాస్‌ఏంజిల్స్ కౌంటీ కారాగార వ్యవస్థ ద్వారా CDC తయారు చేసింది. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. పాన్ మరియు సహచరుల బృందం శాన్‌ఫ్రాన్సిస్కో కౌంటీ జైలులో MRSA చర్మ అంటురోగం యొక్క మారుతున్న సాంక్రమిక రోగ విజ్ఞానంపై నివేదిక రూపొందించారు. 2002లో ఆ జైలులోని >70% S.ఆరియస్ అంటురోగానికి MRSA కారణమని వారు గుర్తించారు. లోవీ మరియు సహచరులు న్యూయార్క్ రాష్ట్ర జైళ్లలో బాహుళ్య MRSA చర్మరోగాలపై నివేదికను సమర్పించారు. మేరీల్యాండ్‌ జైళ్ల ఖైదీలపై రూపొందించిన రెండు నివేదికలు MRSA యొక్క బాహుళ్య సముదాయాన్ని ప్రదర్శించాయి.

2000 మరియు 2008 మధ్యకాలంలో జైళ్లలో సంభవించిన MRSA విజృంభణలపై వార్తాపత్రికల్లో వందలాది కథనాలు వచ్చాయి. ఉదాహరణకు, ఫిబ్రవరి, 2008లో U.S. రాష్ట్రం ఓక్లహోమాలోని తుల్సా కౌంటీ జైలు నెలకు సగటున పన్నెండు స్టెఫిలోకాకస్ కేసులకు చికిత్స చేయడం ప్రారంభించింది.[11] 2004-05లో చికాగోలోని కుక్ కౌంటీ జైలుకు సంబంధించిన చర్మ మరియు కణజాల అంటురోగాలపై ఒక నివేదిక రూపొందించబడింది. ప్రబలిన గాయాల్లో ఈ అంటురోగాలకు MRSA సర్వసాధారణ కారణమని అది పేర్కొంది. అంతేకాక ప్రమాదకర అంశాలు మెథిసిల్లిన్-ససెప్టబుల్ S.ఆరియస్ కలిగించే అంటురోగాల కంటే MRSA అంటురోగాలతో బలమైన సంబంధం కలిగి ఉంటాయని తెలిపింది. నిర్బంధంలో ఉన్న లేదా ఇటీవల జైళ్లలో చేరిన వారిలో MRSA అంటురోగాలపై రూపొందించిన పలు నివేదికలకు ప్రతిగా, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ప్రిసన్స్ ఈ తరహా అంటురోగాల నిర్వహణ మరియు నియంత్రణకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలకు సంబంధించి కొన్ని అధ్యయనాలు కొన్ని ఆధార మూలాలను విడుదల చేశాయి.

ప్రత్యక్ష ఆహారోత్పత్తి జంతువులతో స్పర్శను కలిగి ఉన్న వ్యక్తులు[మార్చు]

MRSA కేసులు నాలుగు కాళ్ల జంతువుల్లో పెరిగాయి. CC398 అనేది MRSA యొక్క కొత్త జాతి. ఇది జంతువుల్లో ఎక్కువగా విస్తరిస్తోంది. అధికంగా సంతానోత్పత్తి చేసే జంతువుల (ప్రాథమికంగా పందులు, పిల్లులు, కోళ్లు కూడా)లో దీనిని ఎక్కువగా గుర్తించారు. అంటురోగం వీటి ద్వారా మానవులకు సోకే అవకాశం చాలా ఎక్కువ. మానవులకు ప్రమాదకరమైనప్పటికీ, CC398 లక్షణాలు ఆహారోత్పత్తి జంతువుల్లో తరచూ కన్పించడం లేదు.[12]

అథ్లెట్లు[మార్చు]

అమెరికా సంయుక్తరాష్ట్రాల్లో, లాకర్ ‌గదులు మరియు జిమ్‌లలో అంతేకాక ఆరోగ్యవంతుల్లోనూ MRSA సమూహ విజృంభణలు మరియు చర్మ స్పర్శ ద్వారా అంటురోగాలు ప్రబలడం పెరిగాయి. కృత్రిమ పచ్చికతో కూడిన మట్టిగడ్డ వల్ల ఏర్పడిన చర్మ గాయాలను MRSAతో ముడిపెట్టిన ఒక అధ్యయనాన్ని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించారు. టెక్సాస్ రాష్ట్ర ఆరోగ్య శాఖ చేపట్టిన మూడు అధ్యయనాలు ఫుట్‌బాల్ క్రీడాకారుల్లో అంటువ్యాధి రేటు జాతీయ సగటు కంటే 16 రెట్లు అధికమని గుర్తించాయి. అక్టోబరు, 2006లో ఒక హైస్కూల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు MRSA-వ్యాప్త పచ్చికతో కూడిన మట్టిగడ్డ గాయాలతో తాత్కాలికంగా కుప్పకూలిపోయాడు. అతని గాయం తిరిగి జనవరి, 2007లో విజృంభించడంతో దెబ్బతిన్న కణజాలాన్ని తొలగించడానికి మూడు శస్త్రచికిత్సలు. చేశారు. దీనికి అతను మూడు వారాల పాటు ఆసుపత్రిలో గడిపాడు.[13] MRSAని దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల వ్యవస్థల్లోనూ గుర్తించారు.[14]

పిల్లలు[మార్చు]

ఆసుపత్రి నర్సరీలు సహా పిల్లల వైద్య సంరక్షణ కేంద్రాల్లో,[15] కూడా MRSA ఒక సమస్యగా పరిణమిస్తోంది. 2007 అధ్యయనం U.S. ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లోని 4.6% మంది రోగులు MRSAతో గాయపడటం జరిగిందని గుర్తించింది.[16]

వ్యాధి నిర్ధారణ[మార్చు]

ముల్లెర్ హింటన్ అగర్ MRSA నిరోధినిని ఒక్షాసిల్లిన్ డిస్క్ కు చూపెడుతూ.

రోగ నిర్ధారణ చేసే డయాగ్నోస్టిక్ మైక్రోబయాలజీ లేబొరేటరీలు మరియు ఉప ప్రమాణ లేబొరేటరీలు MRSA విజృంభణలను గుర్తించడానికి అత్యంత కీలకమైనవి. MRSA గుర్తింపు మరియు వర్గీకరణ కోసం కొత్త టెక్నిక్‌లను అభివృద్ధి చేశారు. అయినా సరే, ఈ బ్యాక్టీరియా రక్తం, మూత్రం, ఉమ్మి లేదా ఇతర శరీర ద్రవ మాధ్యమాల ద్వారా వ్యాపించి, విజృంభిస్తుంది. తగినంత మంది వైద్య సిబ్బంది దీని నిర్ధారణ పరీక్షలు తొలుత చేయాల్సి వస్తుంది. కాబట్టి MRSA వ్యాప్తి నిర్ధారణకు తక్షణ మరియు సులువైన పద్ధతి లేదు. అందువల్ల ప్రాథమిక చికిత్స అనేది చికిత్స చేసే వైద్యుడి యొక్క 'దృఢ సందేహం'పై తరచూ ఆధారపడుతుంది. ఒకవేళ చికిత్స విషయంలో జాప్యం నెలకొంటే ఈ రకమైన అంటువ్యాధి వల్ల ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చు. రియల్ టైమ్ PCR మరియు క్వాంటిటేటివ్ PCR వంటి టెక్నిక్‌లను MRSA జాతుల తక్షణ శోధన మరియు గుర్తింపు కోసం క్లినికల్ లేబొరేటరీల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.[17][18]

మరో సాధారణ లేబొరేటరీ పరీక్షగా తక్షణ స్థావర పాలు సంయోజన పరీక్షను చెప్పుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా PBP2a ప్రొటీన్ గుర్తించబడుతుంది. PBP2a అనేది ఒక చర పెన్సులిన్ బైండింగ్ ప్రొటీన్. ఇది ఆక్సాసిల్లిన్‌ను నిరోధించే విధంగా S. ఆరియస్‌కు సామర్థ్యం కల్పిస్తుంది.[19]

జాతులు[మార్చు]

MRSAని సాధారణంగా "గోల్డెన్ స్టాఫ్‌"గా పిలిచే UKలో MRSA యొక్క సర్వసాధారణ జాతులు EMRSA15 మరియు EMRSA16.[20] EMRSA16 సాంక్రమిక రోగ విజ్ఞానపరంగా వివరించబడింది. ఇది కెట్టరింగ్, ఇంగ్లాండ్‌లో పుట్టింది. ఈ జాతి యొక్క సంపూర్ణ విశ్వజన్యురాశికి సంబంధించిన క్రమం ప్రచురించబడింది.[21] EMRSA16 చూడటానికి అమెరికా సంయుక్తరాష్ట్రాల్లో వ్యాపించిన ST36:USA200 జాతితో సారూప్యతను కలిగి ఉంటుంది. అంతేకాక ఇది SCCmec టైప్ II, ఎంటరోటాక్సిన్ A (పేగులలో పుట్టే విషపదార్ధం) మరియు టాక్సిక్ షాక్ సిండ్రోమ్ టాక్సిన్ 1 జీన్స్‌ను కలిగించే ప్రయత్నం చేస్తుంది.[22] కొత్త అంతర్జాతీయ వర్గీకరణ విధానం కింద ఈ జాతిని ప్రస్తుతం MRSA252 అని పిలుస్తున్నారు. ఎందుకు ఈ జాతి అత్యంత విజయవంతమవుతుందనే విషయం పూర్తిగా కచ్చితంగా చెప్పలేం. అయితే అంతకుముందు జాతులు నిలదొక్కుకోలేక పోయాయి. ఇందుకు ఒక వివరణ రోగక్రిమి నాశక గ్రహణశీలత యొక్క లక్షణాల క్రమం. EMRSA15 మరియు EMRSA16 జాతులు రెండూ ఎరిత్రోమైసిన్ మరియు సిప్రోఫ్లోక్సాసిన్‌ పరంగా నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. స్టెఫిలోకాకస్ ఆరియస్ బ్యాక్టీరియా కణాలలో అంతర్గతంగా,[23] జీవించగలదు. కచ్చితంగా చెప్పాలంటే, రోగక్రిమినాశకాల్లో అవి కణాంతర్గతంగా ప్రవేశించగలవు. S. ఆరియస్ జాతులుగా భావిస్తున్న ఇవి కణాంతర్గ స్థావరాన్ని దోపిడి చేయగలవు.

కమ్యూనిటీ-ఎక్వైర్డ్ MRSA (CA-MRSA) తీవ్రమైనదైనప్పటికీ, అది హాస్పిటల్-ఎక్వైర్డ్ MRSA (HA-MRSA) కంటే అతి సులువుగా చికిత్స చేయబడుతుంది. CA-MRSA కచ్చితంగా డి నోవోను సమూహంలో సృష్టించదు. అయితే ఆసుపత్రి వాతావరణం నుంచి వ్యాప్తి చెందే MRSA మరియు ఒకప్పుడు సమూహంలో సులువుగా చికిత్స చేయబడిన జాతులకు మధ్య మిశ్రమజాతిగా పనిచేస్తుంది. అత్యధిక మిశ్రమజాతులు తమ తీవ్రతను మరింత పెంచే కారకాన్ని పొందుతాయి. ఫలితంగా చిన్న చిన్న గాయాలు లోతైన కణజాల గాయాలుగా మారుతాయి. అదే విధంగా ప్రమాదకర నిమోనియా కేసులు కూడా పెరుగుతాయి.[24]

అమెరికా సంయుక్తరాష్ట్రాల్లో, పలు CA-MRSA కేసులకు CC8 జాతి కారణంగా గుర్తించబడిందిST8:USA300, ఇది SCCమెక్ టైప్ IV, పాంటన్-వేలంటైన్ ల్యూకోసిడిన్, PSM-ఆల్ఫా, మరియు ఎంటరోటాక్సిన్‌లు Q మరియు K,[22] మరియు ST1:USA400లను సృష్టిస్తుంది.[25] MRSA యొక్క ఇతర కమ్యూనిటీ-ఎక్వైర్డ్ జాతులు ST8:USA500 మరియు ST59:USA1000. ప్రపంచంలోన పలు దేశాల్లో, విభిన్న జన్యుపరమైన ప్రబల నేపథ్యాలు కలిగిన MRSA జాతులు CA-MRSA జాతుల్లో ఆధిక్యతను ప్రదర్శించేవిగా గుర్తించడం జరిగింది. U. S జాబితాలో USA300 సులువుగా అగ్రస్థానాన్ని ఆక్రమించింది. అంతేకాక 2004లో కెనడాలో తొలిసారిగా దర్శనమిచ్చిన తర్వాత ఇది అక్కడ సర్వసాధారణమైపోయింది. ఉదాహరణకు, ఆస్ట్రేలియాలో ST93 జాతులు సహజం. అదే ఐరోపా‌ భూఖండంలో ST80 జాతులు ఆధిక్యతను కలిగి ఉన్నాయి (ట్రిస్టన్ మరియు సహచరుల బృందం చేపట్టిన ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీసెస్, 2006 అధ్యయనం). తైవాన్‌లో పలు నాన్-బీటా-లాక్టమ్ యాంటీబయాటిక్స్‌‌కు నిరోధించే కొన్ని ST59 జాతులు జన సమూహంలో చర్మ మరియు సున్నితమైన కణజాల అంటురోగాలకు సాధారణ కారణాలుగా ఉన్నాయి. అత్యధిక U. S., భూఖండం మాదిరిగా కాక, అలస్కా మారుమూల ప్రాంతంలో 1996 మరియు 2000 సంవత్సరాల్లోని విజృంభణలు మరియు 2004-06 మధ్యకాలంలోని పర్యవేక్షణ (డేవిడ్ మరియు ఇతరుల బృందం చేపట్టిన ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీసెస్ 2008) ఆధారంగా MRSA జాతులపై చేపట్టిన అధ్యయనంలో USA300 జాతులు అరుదుగా గుర్తించబడ్డాయి.

నివారణ[మార్చు]

స్క్రీనింగ్ ప్రోగ్రామ్‌లు[మార్చు]

నాసికా మాధ్యమాల ద్వారా ఆసుపత్రిలో చేరిన రోగులకు స్క్రీనింగ్ చేయడం ద్వారా MRSA వాహక రోగులు వాహకేతరులతో సహజీవనం ఏర్పడకుండా మరియు గాయాల ఉపరితల భాగాలు బహిర్గతం కాకుండా నివారించవచ్చు. వినియోగిత పరీక్ష (సత్వర కణ పద్ధతి లేదా సంప్రదాయక మాధ్యమం) క్రియాశీలక స్క్రీనింగ్ అమలు కంటే అంత ముఖ్యమైనది కాదు.[26] అమెరికా సంయుక్తరాష్ట్రాలు మరియు కెనడాల్లోని వ్యాధి నియంత్రణ మరియు నివారణ కేంద్రాలు 2006 అక్టోబరు 19న అదనపు పరిశోధన అవసరాన్ని సూచిస్తూ, మార్గదర్శకాలను జారీ చేశాయి. అలాంటి స్క్రీనింగ్‌ పద్ధతిని సిఫారసు చేయడానికి నిరాకరించాయి.[27][28]

కొన్ని UK ఆసుపత్రుల్లో MRSA స్క్రీనింగ్ అనేది ప్రతి రోగి[29]కి చేస్తారు. అలాగే చిన్న శస్త్రచికిత్సలు మినహా NHS శస్త్రచికిత్స రోగులందరికీ MRSA పరీక్షలు ముందుగా నిర్వహిస్తారు.[30]

1300 మంది ఆరోగ్యవంతమైన US పిల్లల్లో 2.4% మంది ముక్కుల్లో MRSA ఉంది.[31]

ఉపరితల పరిశుభ్రత[మార్చు]

దస్త్రం:400ER 1.jpg
పెన్న్స్యల్వనియా ఆసుపత్రి పరీక్షా గదిలో NAV-CO2 ప్రక్షాళన

MRSA వ్యాప్తిని అరికట్టడానికి మధ్యం సమర్థవంతమైన ఉపరితల పారిశుధ్య పదార్థంగా నిరూపితమైంది. పారిశుధ్య ప్రభావం ఎక్కువసేపు పనిచేయాలంటే క్వాటర్‌నరీ అమ్మోనియాన్ని మద్యంతో కలిపి ఉపయోగించాలి.[32] ఆసుపత్రిలో అంటుకున్న అంటువ్యాధుల నివారణకు సాధారణ మరియు అంతిమ శుభ్రత చేయాలి. నాన్-ఫ్లేమబుల్ ఆల్కహాల్ వేపర్ ఇన్ కార్బన్ డయాక్సైడ్ సిస్టమ్స్ (NAV-CO2) అనేది వైద్యసంబంధ పరిసరాల్లో ఉపయోగించే లోహాలు లేదా ప్లాస్టిక్స్‌ పదార్థాల్ని నాశనం చేయడం మరియు బ్యాక్టీరియా నాశక నిరోధకతను కలిగిచడం చేయదు.

ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో, MRSA ఎక్కువగా ఉపరితలాలు మరియు దుస్తులపై ఉంటుంది. అవి వైద్య సేవకులు ఉపయోగించే గోప్య తెరలు (ప్రైవసీ కర్టెన్లు) లేదా దుస్తులు వంటివి. పొడిచి చేసే వ్యాధి నిర్ణయ పద్థతుల ద్వారా రోగులు స్వస్థత పొందుతున్న ప్రాంతాల్లో MRSAని తొలగించడానికి సంపూర్ణ ఉపరితల పరిశుభ్రత అవసరం. ఆసుపత్రిలో చేర్చుకునే MRSA రోగులకు పరీక్షలు చేయడం, MRSA-పాజిటివ్ రోగులను వేరు చేయడం, MRSA-పాజిటివ్ రోగులను స్వతంత్ర పరచడం మరియు రోగుల గదులు మరియు వారు ఆక్రమించిన ఇతర అన్ని వైద్య చికిత్స సంబంధిత ప్రాంతాలను అంతిమంగా శుభ్రపరచడం వంటివి ఆసుపత్రి కారకమైన MRSAని నివారించడానికి అత్యుత్తమ పద్ధతులు.

చేతుల పరిశుభ్రత[మార్చు]

ఆగస్టు, 2004 ఆఖర్లో, MRSA ఆటకట్టించడానికి విజయవంతమైన ప్రయోగాత్మక పథకం చేపట్టిన తర్వాత UK నేషనల్ హెల్త్ సర్వీస్ తన మీ చేతులు శుభ్రపరుచుకోండి అనే ఉద్యమాన్ని వెల్లడించింది. వార్డుల్లోని రోగుల బెడ్ల సమీపంలో మద్యం-ద్వారా చేతులు శుభ్రపరుచుకునే సదుపాయాలను కల్పించాలి. ఇలా చేయడం వల్ల, సిబ్బంది తమ చేతులను యథావిధిగా శుభ్రం చేసుకుంటారు. ఒకవేళ ఈ గాయాల సంక్రమణ 1% కంటే ఎక్కువ కాకుంటే, ఈ ప్రణాళిక స్వచ్ఛందంగా పలు రెట్లు మూల్యం చెల్లించుకుంటుంది.[ఉల్లేఖన అవసరం]

ఇతర బ్యాక్టీరియా మాదిరిగా, MRSA కొన్ని అంటురోగ క్రిములను చంపే మందులు మరియు క్రిమినాశకాల పరంగా అత్యంత నిరోధకతను కలిగి ఉంటుంది. మద్యంతో చేతులు శుభ్రపరుచుకోవడాలు ఒకింత సమర్థవంతమైనప్పటికీ, అత్యంత సమర్థవంతమైన పద్ధతిగా ప్రవాహ నీటిలో మరియు క్రిములను నాశనం చేయగల క్లోరెక్సిడైన్ వంటి ఒక యాంటీ-మైక్రోబయల్ క్లీన్సర్ (సూక్ష్మజీవులను చంపే పదార్థం)తో చేతులు కడుక్కోవడం ఉత్తమం.[33]

అంటువ్యాధి నియంత్రణ మరియు సాంక్రమిక రోగవిజ్ఞానం యొక్క నిపుణుల సంఘం సర్వేపై దృష్టి సారించిన జూన్, 2008 నివేదిక[ఉల్లేఖన అవసరం], పేలవమైన ఆరోగ్య అలవాట్లు MRSA వ్యాప్తిని అరికట్టడంలో ప్రధాన అడ్డంకులుగా పరిణమిస్తున్నాయని తీర్మానించింది.

సుగంధ తైల వ్యాప్తి[మార్చు]

సుగంధ తైలం యొక్క వ్యాప్తి ద్వారా MRSA నిరోధంపై నిర్వహించిన శరీరమునకు బయట గాజులో జరుపు ప్రక్రియ అధ్యయనంలో పరిశీలించిన 91 సుగంధ తైలాల్లో 72 రకాలు MRSA చారలు గల (ATCC 700699 జాతి) సోయ అగరు ప్లేట్లలో ఆటంక సమూహాలను ప్రదర్శించాయి. అయితే లెమన్‌గ్రాస్ తైలం (నిమ్మ వాసన వెదజల్లే ఒక తైలం) (సింబోపోగోన్ ప్లెక్సూసస్ ), లెమన్ మిర్టిల్ తైలం (బాకోషియా సిట్రోడోరా ), మౌంటెన్ సేవరీ తైలం (సటురెజా మోంటనా ), దాల్చినచెక్క తైలం (సిన్నామోమం వెరమ్ ) మరియు మెలిస్సా తైలం (మెలిస్సా అఫిసినలిస్ ) సుగంధ తైలాలు అత్యంత సమర్థవంతమైనవి. వీటిలో లెమన్‌గ్రాస్ సుగంధ తైలం అత్యంత సమర్థవంతమైనది. ఇది మొత్తం MRSA సమూహం యొక్క వృద్ధిని అడ్డుకుంటుంది.[34]

తేయాకు మొక్క తైలం కూడా పరీక్షించిన అన్ని MRSA జాతులను హతమారుస్తుంది.[35]

సమూహవిచ్ఛిత్తి[మార్చు]

గాయాల నుంచి చీముల తొలగింపు లేదా MRSA నివారణకు ఇతర చికిత్స తర్వాత, రోగులు తమ ఇళ్ల వద్ద క్లోరెక్సిడైన్ (హిబిక్లెన్స్) లేదా హెక్సాక్లోరోఫీన్ (ఫిసోహెక్స్) క్రిమినాశక సబ్బుతో తల నుంచి పాదాల వరకు స్నానం చేయాలి. తర్వాత ముపిరోసిన్ (బాక్ట్రోబన్) 2% ఆయింట్‌మెంట్‌ను ముక్కురంధ్రం లోపల రోజుకు రెండుసార్లు పూయాలి. పత్తిగుడ్డను ఉపయోగించి, ఇలా వారం రోజుల పాటు చేయాలి. కుటుంబసభ్యులు ఇదే విధమైన సమూహవిచ్ఛిత్తి (డీకాలనైజేషన్) పద్ధతిని అనుసరిస్తే మంచిది.

క్లిండామైసిన్, డాక్సీసైక్లిన్ లేదా ట్రైమెథోప్రిమ్/సల్ఫేమ్‌థోక్సాజోల్ వంటి రోగక్రిమినాశకాలను వైద్యులు సూచించవచ్చు. అయితే, రోగక్రిమినాశకాలను ఎక్కువగా వాడటం వల్ల వాస్తవానికి పునరావృత MRSA చర్మరోగాలను నివారించవచ్చని చెప్పడానికి పెద్దగా ఆధారాలు లేవు.[36]

ఆసుపత్రి దుస్తుల సముచిత విసర్జన[మార్చు]

వినియోగ కాగితపు ఆసుపత్రి దుస్తులు MRSA ఆసుపత్రి అంటురోగాలతో సంబంధం కలిగి ఉంటాయి. సముచిత విసర్జన ద్వారా దీనిని దూరం చేయవచ్చు.[37]

వేరుపరచడం[మార్చు]

ప్రస్తుత US సూచన MRSA వ్యాప్తికి ఆస్కారం ఉన్న సాధారణ కార్యక్షేత్రం (వైద్య కేంద్రాలు మినహా)లో పనిచేసే సిబ్బంది మామూలుగా పనికి వెళ్లకుండా మినహాయించబడాల్సిన అవసరం లేదు.[38] అందువల్ల, వైద్యుడు ఆదేశిస్తే తప్ప, చీము కారే గాయాలున్న వారిని మరియు చక్కటి ఆరోగ్య సూత్రాలు పాటించని వారిని మాత్రమే పని నుంచి మినహాయించాలి.[38] క్రియాశీల అంటురోగాలున్న సిబ్బందిని విధుల నుంచి మినహాయించాలి. ఎందుకంటే, వారి అంటురోగాలు నయం కాకుంటే చర్మం-చర్మం స్పర్శ బహుశా ఏర్పడవచ్చు. ఆరోగ్య సేవలు అందించే సిబ్బంది తప్పక వ్యాధి నియంత్రణ మరియు వైద్య సేవకుల్లో అంటువ్యాధి నియంత్రణ మార్గదర్శకాల కేంద్రాలను అనుసరించాలి.[39]

స్టాఫ్ లేదా MRSA వ్యాప్తిని నివారించడానికి చక్కటి ఆరోగ్య పద్ధతులను అనుసరించే విధంగా సిబ్బందిని ప్రోత్సహించేలా యజమానులు తగిన సదుపాయాలు మరియు సరఫరాలను అందుబాటులో ఉంచాలి. కార్యక్షేత్రంలో ఉపరితల పరిశుభ్రతను పాటించాలి. అలాగే కలుషితమైన పరికరాలను పర్యావరణ సంరక్షణ సంస్థ (EPA) నమోదిత క్రిమినాశకాలతో శుభ్రపరచాలి.[38]

రోగక్రిమినాశక వినియోగాన్ని నిరోధించడం[మార్చు]

గ్లైకోపెప్టైడ్స్, సెఫాలోస్పోరిన్‌లు మరియు ప్రత్యేకించి, క్వినోలోన్స్ MRSA సమూహం ఏర్పడటానికి అత్యధిక ప్రమాదకరమైనవి. MRSA సమూహాన్ని ప్రోత్సహించే రోగక్రిమినాశకాలను ప్రత్యేకించి, ఫ్లోరోక్వినోలోన్స్‌ వినియోగాన్ని తగ్గించమని ప్రస్తుత మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.[6][10]

ప్రజారోగ్య పరిగణనలు[మార్చు]

గణితశాస్త్ర నమూనాలు స్క్రీనింగ్ మరియు వేరుపరిచే చర్యలు చేపట్టిన తర్వాత తలెత్తే అంటువ్యాధి నియంత్రణ వైఫల్యం UKలో సంభవించిన విధంగా ఏళ్ల తరబడి సమర్థవంతంగా ఉంటుందని పేర్కొన్నాయి. 1990ల మధ్యకాలం వరకు అన్ని UK ఆసుపత్రులు అమలు చేసిన "శోధన మరియు నాశనం" పద్ధతిలో MRSA రోగులంతా తక్షణం వేరుచేయబడుతారు. అలాగే మొత్తం వైద్య సిబ్బందికి MRSA నిర్ధారణ పరీక్షలు చేస్తారు. తద్వారా నిరూపితమైన నిర్మూలన థెరపీని పూర్తి చేసేంతవరకు వారిని విధుల నుంచి దూరం చేస్తారు. నియంత్రణ వైఫల్యం తలెత్తడానికి కారణం సమూహ రోగులను తిరిగి సమాజంలోకి పంపడం మరియు వారిని తిరిగి చేర్చుకోవడం. ఇలా సమాజంలోకి తిరిగి పంపబడిన రోగుల సంఖ్య ఒక నిర్దిష్ట స్థాయికి చేరిన తర్వాత "శోధన మరియు నాశనం" పద్ధతి నిష్ఫలంగా మారుతుంది.[40] MRSAకి తలొంచని కొన్ని దేశాల్లో నెదర్లాండ్స్ ఒకటి. ఈ డచ్ దేశపు వ్యూహం యొక్క విజయంలో ముఖ్యమైన అంశంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌యైన రోగులను సమాజంలోకి తిరిగి పంపకుండా వారి రవాణాను నిర్మూలించడానికి చేసిన ప్రయత్నంగా చెప్పవచ్చు.[41]

వ్యాధి నియంత్రణ మరియు నివారణ కేంద్రాలు (CDC) అమెరికా సంయుక్తరాష్ట్రాల్లో యేటా సుమారు 1.7 మిలియన్ల మంది ఆసుపత్రి వాతావరణంలో అంటురోగాలకు గురవుతుండగా, వారిలో 99,000 మంది మరణిస్తున్నారని అంచనా వేశాయి. ఆసుపత్రిలో చేరే 100 మందిలో 4.5 శాతం మంది అక్కడి వాతావరణం ద్వారా అంటువ్యాధులకు గురవుతున్నట్లు అంచనా వేయబడింది. దీనికి సంబంధించిన ప్రత్యక్ష వ్యయాలు (2004 ధరల ప్రకారం) ఒక్కో కేసుకు (వ్యాధినిరోధక శక్తి ఉన్న రోగుల్లో రక్తప్రసరణ, మూత్ర నాళాలు లేదా శ్వాసక్రియ సంబంధిత అంటువ్యాధులకు) $10,500 (2006 రేట్ల ప్రకారం £5300, €8000) నుంచి అవయవాల మార్పిడి చేసుకున్న రోగుల్లోని రక్తప్రసరణలో ఉన్న రోగక్రిమినాశక-నిరోధక అంటువ్యాధులకు ఒక్కో కేసుకు $111,000 (£57,000, €85,000) వరకు ఖర్చవుతుంది. ఈ అంచనా లెక్కలతో ఆసుపత్రి వాతావరణం ద్వారా సంక్రమించిన అంటువ్యాధుల యొక్క మొత్తం ప్రత్యక్ష ఖర్చులు (వ్యయాలు) $17 బిలియన్లకు పైనే ఉంటాయని సంప్రదాయక అంచనాలు పేర్కొన్నాయి. ఇలాంటి అంటువ్యాధులను తగ్గించడం ద్వారా హెల్త్‌కేర్ సంరక్షణను పెంచడానికి చేసే ప్రయత్నాలు మరింత మెరుగవుతాయి. (BMJ 2007)[ఉల్లేఖన అవసరం]

ఈ సమస్య ఏ ఒక్క దేశానికీ ప్రత్యేకమైనది కాదు. బ్రిటీష్ నేషనల్ ఆడిట్ కార్యాలయం ఐరోపా‌లో ఆసుపత్రి వాతావరణం ద్వారా సంక్రమించే అంటువ్యాధులు అన్ని ఆసుపత్రుల్లో చేరే రోగుల సంఖ్యలో 4% నుంచి 10% వరకు ఉండొచ్చని అంచనా వేసింది. 2005 ప్రారంభం నాటికి, యునైటెడ్ కింగ్‌డమ్‌లో MRSA బ్యాక్టీరియా ద్వారా సంభవించిన మరణాలు యేటా 3,000 వరకు ఉంటాయని అంచనా వేయడం జరిగింది.[42] మొత్తం UK ఆసుపత్రి అంటురోగాల్లో సగానికి పైగా కేసులకు స్టెఫిలోకాకస్ బ్యాక్టీరియా కారణం. ఆసుపత్రుల్లో MRSA అంటురోగాల అంశం UKలో అతిపెద్ద రాజకీయ వివాదంగా పరిణమించింది. అది 2005లో జరిగిన యునైటెడ్ కింగ్‌డమ్ సార్వత్రిక ఎన్నికలల్లో ఆరోగ్య విధానం తీరుపై చర్చలకు ఆస్కారం కల్పించింది.

2008 జనవరి 6న, MRSA అంటువ్యాధులకు సంబంధించి 2007లో హాంకాంగ్‌లో నమోదైన 64 చైనాయేతర కేసుల్లో సగానికి పైగా ఫిలిపినో గృహ నౌకరీలకు సంబంధించినవిగా ప్రకటించబడింది. హాంకాంగ్ యూనివర్శిటీకి చెందిన మైక్రోబయాలజీ ప్రొఫెసర్ హో పాక్-ల్యూంగ్ రోగక్రిమినాశకాల అత్యధిక వినియోగానికి కారణాన్ని గుర్తించాడు. 2007లో 8,000 హాస్పిటల్-ఎక్వైర్డ్ MRSA కేసులతో (155 నమోదిత కేసులు- చైనా నుంచి 91, ఫిలిప్పీన్స్ నుంచి 33, అమెరికా మరియు ఇండియా నుంచి చెరో 5 కేసులు మరియు నేపాల్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఇంగ్లాండ్ దేశాల నుంచి తలా రెండు కేసులు) పోల్చితే హాంకాంగ్‌లో 166 కమ్యూనిటీ కేసులు నమోదయ్యాయి.[43]

ప్రపంచవ్యాప్తంగా, S. ఆరియస్ రకం బ్యాక్టీరియా బారిన సుమారు 2 బిలియన్ల మంది పడినట్లు అంచనా వేశారు. వీరిలో 53 మిలియన్ల మంది (మొత్తంలో 2.7% మంది) MRSA బారిన పడినట్లు భావించబడింది.[44] అమెరికా సంయుక్తరాష్ట్రాల్లో, 95 మిలియన్ల మంది తమ ముక్కుల్లో S. ఆరియస్ బ్యాక్టీరియాను కలిగి ఉండగా, వీరిలో 2.5 మిలియన్ల మంది (మొత్తంలో 2.6% మంది) MRSA బ్యాక్టీరియా బారిన పడ్డారు.[45] మూడు U.S. కమ్యూనిటీల్లో చేపట్టిన జనాభా సమీక్ష 2001-2002 మధ్యకాలంలో CA-MRSA బారినపడిన వారు 18–25.7/100,000 అని వెల్లడించింది. అలాగే వేరుచేయబడిన CA-MRSA వారిలో ఎక్కువ మంది వైద్యచికిత్స సంబంధిత అంటురోగాలతో సంబంధం ఉన్నవారే. వీరిలో 23% మంది రోగులు ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది.[46]

MRSA అంటురోగాలు మరింత విజృంభించడానికి ఒక సంభావ్య కారణం పందుల అధిక సంతానోత్పత్తిలో రోగక్రిమినాశకాలను వినియోగించడమేనని తెలిసింది. 2008లో కెనడాలో నిర్వహించిన ఒక అధ్యయనం పరీక్షించిన పంది మాంసపు ముక్కలు మరియు మెత్తగా చేసిన పంది మాంసంలో 10% MRSAని కలిగి ఉన్నట్లు గుర్తించింది. అదే ఏడాది U.S. చేపట్టిన మరో అధ్యయనం, పరీక్షించిన పెంపక పందుల్లో 70% వాటిలో మరియు పరీక్షించిన పందుల ఉత్పత్తి సిబ్బందిలో 45% మందిలో MRSA బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించింది.[47] పందుల ఉత్పత్తి కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో MRSA అంటువ్యాధులు విజృంభిస్తున్నాయనే అవాంతర విషయ నివేదికలు కూడా ఉన్నాయి.[48]

అత్యధిక పడకగదుల సదుపాయం, అత్యధిక తాత్కాలిక నర్సింగ్ సిబ్బంది స్థాయిలు లేదా తక్కువ పరిశుభ్రత ఉన్న ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో చెప్పుకోదగ్గ విధంగా MRSA రేట్లు అత్యధికంగా ఉండవు. ఉదాహరణకు, సాధారణ పట్టికరూప ఆధారం ఈ మార్పులకు సంబంధించిన స్పష్టమైన సమాచారాన్ని పొందడానికి సాయపడుతుంది. 2001-2004 మధ్యకాలానికి భిన్నంగా, 2006-2007 మధ్యకాలంలో MRSA రేట్లు 85% కంటే తక్కువగా నిండిన ఆసుపత్రుల్లో కంటే 90% పైగా రోగులతో నిండిన ఆసుపత్రుల్లో కాస్త ఎక్కువగా ఉంటాయి. ఒక భావంలో, ఈ సంబంధాల యొక్క అదృశ్యత అయోమయంగా మారింది. ఆసుపత్రుల్లో MRSA బ్యాక్టీరియా వ్యాప్తికి IV గొట్టం మరియు వంగే స్వభావం కలిగిన పలచని గొట్టాలే కారణమని రిపోర్టర్లు ఆరోపిస్తున్నారు. (హాస్పిటల్ ఆర్గనైజేషన్ అండ్ స్పెషాలిటీ మిక్స్, 2008)[ఉల్లేఖన అవసరం]

చికిత్స[మార్చు]

CA-MRSA మరియు HA-MRSA రెండూ సెఫాలెక్సిన్ వంటి సంప్రదాయక స్టెఫిలోకాకల్ బీటా-లాక్టమ్ యాంటీబయాటిక్స్ నిరోధకతను కలిగి ఉంటాయి. CA-MRSA సుల్ఫా మత్తుపదార్థాలు (కో-ట్రైమోక్సాజోల్/ట్రైమిథోప్రిమ్-సుల్ఫామిథోక్సాజోల్ వంటి), టెట్రాసైక్లిన్స్ (డాక్సీసైక్లిన్, మినోసైక్లిన్ మరియు క్లిండామైసిన్ వంటి) సహా సూక్ష్మజీవులను హతమార్చే అత్యధిక గ్రహణశీలత వర్ణపటాన్ని కలిగి ఉంటుంది. అయితే CA-MRSA చికిత్సకు సరైన మందు మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు.[5]. ఇలాంటి రోగక్రిమినాశకాల పట్ల HA-MRSA నిరోధకతను కలిగి ఉంటుంది. ఇది తరచూ వాన్‌కామిసిన్‌కు మాత్రమే సున్నితత్వాన్ని ప్రదర్శిస్తుంది. లైన్‌జోలిడ్ (ఇది కొత్త ఆక్సాజోలిడినోనెస్ తరగతికి చెందింది) మరియు డాప్టోమైసిన్ వంటి కొత్త మందులు CA-MRSA మరియు HA-MRSA బ్యాక్టీరియాలను సమర్థవంతంగా హతమార్చుతాయి.

వాన్‌కోమైసిన్ మరియు టైకోప్లానిన్ మందులను MRSA అంటురోగాల చికిత్సకు ఉపయోగిస్తారు.[49] టైకోప్లానిన్ అనేది వాన్‌కోమైసిన్ యొక్క వ్యవస్థీకృత సాపేక్ష మందు. ఇది సారూప్య క్రియాశీల వర్ణపటాన్ని మరియు సుదీర్ఘ అర్థాయువును కలిగి ఉంటుంది.[50] ఎందుకంటే, వాన్‌కోమైసిన్ మరియు టైకప్లానిన్‌లను నోటి ద్వారా పీల్చుకోవడం చాలా తక్కువగా ఉంటుంది. దైహిక అంటురోగాలను నియంత్రించడానికి వీటిని తప్పక సిరల ద్వారా పంపిణీ చేయాలి.[51] వాన్‌కోమైసిన్‌తో MRSA అంటురోగ చికిత్స అనేది క్లిష్టమైనది. ఎందుకంటే, దానిని శరీరంలోకి పంపణీ చేసే మార్గం అంత సులువైనది కాదు. అంతేకాక, MRSAని ఎదుర్కోవడంలో వాన్‌కోమైసిన్ సమర్థత, MSSA ఆటకట్టించడంలో యాంటీ-స్టెఫిలోకాకల్ బీటా-లాక్టమ్ యాంటీబయాటిక్స్ కంటే తక్కువగా ఉంటుంది.[52][53]

కొత్తగా కనిపెట్టిన పలు MRSA జాతులు వాన్‌కోమైసిన్ మరియు టైకోప్లానిన్ మందుల పట్ల కూడా రోగక్రిమినాశక-నిరోధకతను ప్రదర్శిస్తున్నట్లు గుర్తించడం జరిగింది. కొత్తగా ఆవిర్భవించిన MRSA బ్యాక్టీరియాను వాన్‌కోమైసిన్ ఇంటర్మీడియట్-రెసిస్టంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్‌ (VISA)గా పిలుస్తున్నారు.[54][55] వాన్‌కోమైసిన్ వంటి గ్లైకోపెప్టైడ్స్‌కు కూడా లొంగని అంటువ్యాధుల చికిత్సకు లైన్‌జోలిడ్, క్వినుప్రిస్టిన్/డాల్ఫోప్రిస్టిన్ (సినర్సిడ్), డాప్టోమైసిన్ మరియు టైజిసైక్లిన్ మందులను వాడుతున్నారు.[56]

చరిత్ర[మార్చు]

మూస:World

రంగులో కన్పిస్తున్న MRSA యొక్క SEM

మెథిసిల్లిన్-రెసిస్టంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్ 1961లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో గుర్తించబడింది. ఈ బ్యాక్టీరియా 1981లో అమెరికా సంయుక్తరాష్ట్రాల్లో సిరల ద్వారా మాదకద్రవ్యాలను వాడే వారిలో తొలిసారిగా దర్శనమిచ్చింది. MRSA మీడియాలో తరచూ "సూపర్‌బగ్‌"గా పేర్కొనబడుతుంటుంది. అమెరికా సంయుక్తరాష్ట్రాల్లో MRSA అంటువ్యాధులు చెప్పుకోదగ్గ విధంగా పెరుగుతున్నాయి. వ్యాధి నియంత్రణ మరియు నివారణ (CDC) ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీసెస్‌లో ప్రచురించిన 2007 నివేదిక, ఆసుపత్రుల్లోని MRSA అంటువ్యాధులు దేశవ్యాప్తంగా రెండింతలయ్యాయి. 1999లో సుమారు 127,000 కేసులుండగా అది 2005లో 278,000కి పెరిగాయి. అదే సమయంలో వార్షిక మరణాలు 11,000 నుంచి 17,000 పైగా పెరిగాయని అంచనా వేసింది.[57] జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ యొక్క 17 అక్టోబరు 2007 నాటి ఇష్యూలో ప్రచురించబడిన CDC నేతృత్వంలోని మరో అధ్యయనం, 2005లో అమెరికా సంయుక్తరాష్ట్రాల్లో సుమారు 94,360 తీవ్రమైన అంటురోగాలకు మరియు 18,650 ఆసుపత్రి బస-సంబంధిత మరణాలకు MRSA కారణమై ఉంటుందని అంచనా వేసింది.[58][59] ఈ అంచనాలు U.S.లో AIDS కంటే యేటా అత్యధిక మరణాలకు MRSA అంటురోగాలు కారణమని పేర్కొన్నాయి.[60]

2005 యునైటెడ్ కింగ్‌డమ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో "ఈ వ్యాధి గురించి నిర్విరామంగా ప్రజల్లో ప్రచారం జరగడంతో రిపోర్టు స్థాయిలు పెరగడం వల్ల కేసులు బహుశా ఎక్కువై ఉండొచ్చని"[61] బ్రిటీష్ వర్గాలు వివరించినప్పటికీ, 2005లో ఇంగ్లాండ్‌ మరియు వేల్స్‌లో 1,629 MRSA-సంబంధిత మరణాలు సంభవించాయని, అక్కడి MRSA-సంబంధిత మృత్యు రేటు 2005లో అమెరికా సంయుక్తరాష్ట్రాల్లోని రేటులో సగం ఉందని జాతీయ గణాంకాల కార్యాలయం వెల్లడించింది. 2006లో UKలో 1652 మరణాలకు MRSA కారణమై ఉండొచ్చని భావించారు. మరణాల సంఖ్య 1993లో 51గా ఉంది.[62]

MRSA-బారిన పడిన రోగుల్లో పరిశీలనాత్మక మరణాల సంఖ్య పెరుగుదలకు ఆయా రోగుల్లో చాపకింద నీరులా విస్తరించిన రోగవ్యాప్తి కారణమనే వాదన ఉంది. అయితే, బ్లాట్ మరియు అతని సహచరులు చేపట్టిన ఒక అధ్యయనం సహా వివిధ అధ్యయనాలు మెథిసిల్లిన్-ససెప్టబుల్ స్టెఫిలకాకస్ ఆరియస్ (MSSA) బ్యాక్టీరియా కంటే రక్తంలోని MRSA బ్యాక్టీరియా అత్యధిక మరణాలు సంభవించడానికి కారణమవుతుందని పేర్కొన్నాయి.[63]

మరోవైపు అనియంత్రితంగా ఈ అంటువ్యాధి జాతీయస్థాయిలో పెరుగుతోందని మరియు MRSAకి సంబంధించిన రోగవ్యాప్తి మరియు మరణాల సంఖ్య స్థాయిని పరిగణించడం కష్టమని గణాంకాలు సూచించాయి. 2004-5లో శాన్‌ఫ్రాన్సిస్కోలోని MRSA అంటురోగాల పరిస్థితిపై చేపట్టిన జనాభా-ఆధారిత అధ్యయనం ఏడాది కాలంలో 300 మంది స్థానికుల్లో ఒక్కరు అలాంటి అంటువ్యాధితో బాధపడినట్లు మరియు ఇది ఆరోగ్య సంరక్షణ కేంద్రాల వెలుపల సంభవించే ఈ రకమైన అంటువ్యాధుల్లో 85% కంటే ఎక్కువని వివరించింది.[64] S. ఆరియస్ అంటురోగం బారిన పడిన అమెరికా సంయుక్తరాష్ట్రాల్లోని రోగులు సగటున ఆసుపత్రిలో బస సమయానికి మూడు రెట్లు ఎక్కువ (14.3 vs. 4.5 రోజులు)గా ఉంటున్నారు. తద్వారా మొత్తం ఖర్చు మూడు రెట్లు ($48,824 vs $14,141). అంతేకాక ఆసుపత్రి లోపల మరణ (11.2% vs 2.3%) ప్రమాదం ఈ అంటువ్యాధి లేని రోగుల కంటే ఐదు రెట్లు అధికమని 2004లో చేపట్టిన ఒక అధ్యయనం వెల్లడించింది.[65] 31 అధ్యయనాల యొక్క సంక్షిప్త విశ్లేషణలో, కాస్‌గ్రూవ్ మరియు ఇతరుల బృందం ఈ విధంగా తీర్మానించింది, MSSA బ్యాక్టీరియాతో పోల్చితే, రక్తంలోని MRSA బ్యాక్టీరియా మరణాలు పెరగడంతో సంబంధం కలిగి ఉంటుందని స్పష్టం చేసింది (అసమానత నిష్పత్తి = 1.93; 95% CI = 1.93±0.39).[66] అదనంగా, వైల్లీ మరియు ఇతరుల బృందం MRSA బారిన పడిన రోగుల్లో మరణ రేటు 30 రోజుల్లో 34% ఉంటుందని, ఈ రేటు MSSA-బారిన పడిన రోగుల్లో గుర్తించిన 27% మరణ రేటుతో సారూప్యత ఉన్నట్లు స్పష్టం చేసింది.[67]

విలక్షణత క్లిష్టమైనదే అయినప్పటికీ, MRSAని కొన్నిసార్లు కమ్యూనిటీ-ఎక్వైర్డ్ MRSA (CA-MRSA) లేదా హెల్త్‌కేర్-అసోసియేటెడ్ MRSA (HA-MRSA)గా ఉప-వర్గీకరిస్తుంటారు. కొందరు పరిశోధకులు CA-MRSAని దాని బారిన పడిన రోగుల యొక్క లక్షణాలను బట్టి నిర్వచించారు. మరికొందరు దానిని బ్యాక్టీరియా యొక్క జన్యుపరమైన లక్షణాలను బట్టి నిర్వచించారు.

CA-MRSA తొలి నమోదిత కేసులు 1990ల మధ్యకాలంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా సంయుక్తరాష్ట్రాలు, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, ఫిన్లాండ్, కెనడా మరియు సామోవా దేశాల్లో దర్శనమిచ్చాయి. హెల్త్‌కేర్ కేంద్రాలకు వెళ్లని వ్యక్తులకు అంటుకోవడం ద్వారా అవి గుర్తింపు పొందాయి.[5]

1997లో మిన్నెసోటా మరియు నార్త్ డకోటా ప్రాంతాల పిల్లలకు సంబంధించిన నాలుగు కేసులు నమోదయ్యాయి.[5] తర్వాత కొన్నేళ్ల పాటు CA-MRSA అంటువ్యాధులు పురాతన మరియు ఉత్తమమైన రీతిలో అధ్యయనం చేయబడిన హెల్త్‌కేర్-అసోసియేటెడ్ జాతులతో విరుద్ధతను ప్రదర్శించే MRSA జాతుల ద్వారా సోకుతాయనే విషయం విస్పష్టమైంది.[68]

పరిశోధన[మార్చు]

వైద్యచికిత్సకు సంబంధించిన[మార్చు]

MRSA అంటువ్యాధి యొక్క నిర్జీవ కణజాలాన్ని శుభ్రం చేయడానికి అమలు చేసే ఈగ గుడ్డు థెరపీ విజయవంతమైనట్లు పేర్కొనబడింది. మధుమేహ రోగులపై జరిపిన అధ్యయనాలు నిర్దిష్ట చికిత్సల ద్వారా సాధించే వారి కంటే ప్రత్యేకించి, లఘు చికిత్సా కాలాలనే వెల్లడించింది.[69][70][71]

MRSA నివారణకు అనేక యాంటీబయాటిక్స్‌ను II దశ మరియు III దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉపయోగిస్తారు. ఉదాహరణకు,

 • III దశ : సెఫ్టోబైప్రోల్, సెఫ్టారోలైన్, డాల్బావాన్సిన్, టెలావాన్సిన్, ఆరోగ్రాబ్, టోర్‌జోలిడ్, ఐక్లాప్రిమ్...
 • II దశ: నిమోనోక్సాసిన్[72].

వైద్య చికిత్సకు పూర్వం[మార్చు]

పూర్తి భిన్నమైన మరియు హామీయుత పద్ధతిగా పరాన్నజీవి థెరపీ (ఉదాహరణకు, జార్జియాలోని ఎలియావా ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించింది[73])ని చెప్పుకోవచ్చు. ఇందులో పరీక్షించిన 95% స్టెఫిలోకాకస్ తొలగింపుల పట్ల ఎలుకలు విరుద్ధ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.[74]

2006 మే 18న నేచర్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్లాటెన్‌సిమీసిన్ అనే ఒక కొత్త రోగక్రిమినాశకాన్ని గుర్తించింది. MRSAని నివారించడంలో ఇది విజయవంతమైనట్లు ప్రదర్శించబడింది.[75][76]

సముద్రంలో నివసించే స్పంజిలు (ఒక రకం సముద్రపు జంతువులు) ఉత్పత్తి చేసే సంకలిత పదార్థాలు రోగక్రిమినాశకాల పరంగా MRSA మరింత అనుకూలంగా మారేలా చేస్తాయి.[77]

Δ9-టెట్రాహైడ్రోకన్నాబినోల్ (THC), కన్నాబిడియోల్ (CBD), కన్నాబినోల్ (CBN), కన్నాబిక్రోమిన్ (CBC) మరియు కన్నాబిజరోల్ (CBG) సహా కన్నాబినోయిడ్స్ (కన్నాబిస్ సతివా కాంపొనెంట్లు) ఒక రకం MRSA జాతుల పట్ల విరుద్ధమైన రీతిలో క్రియాశీలతను చూపుతున్నాయి. [78]

సూచికలు[మార్చు]

 1. పిట్ట్స్బర్గ్ :వెటరన్స్ అఫ్ఫైర్స్ హాస్పిటల్ లో అధ్యయనం "Science Daily" ([dead link]). Cite web requires |website= (help)
 2. McCaughey B. "Unnecessary Deaths: The Human and Financial Costs of Hospital Infections" (PDF) (2nd. సంపాదకులు.). మూలం (PDF) నుండి 2007-07-11 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-08-05. Cite web requires |website= (help)
 3. "Symptoms". Mayo Clinic. Cite web requires |website= (help)
 4. "MRSA Toxin Acquitted: Study Clears Suspected Key to Severe Bacterial Illness". NIH news release. National Institute of Health. 2006-11-06. మూలం నుండి 2008-05-17 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-07.
 5. 5.0 5.1 5.2 5.3 Raygada JL and Levine DP (March 30, 2009). "Managing CA-MRSA Infections: Current and Emerging Options". Infections in Medicine. 26 (2).
 6. 6.0 6.1 6.2 Tacconelli, E.; De Angelis, G.; Cataldo, MA.; Pozzi, E.; Cauda, R. (2008). "Does antibiotic exposure increase the risk of methicillin-resistant Staphylococcus aureus (MRSA) isolation? A systematic review and meta-analysis". J Antimicrob Chemother. 61 (1): 26–38. doi:10.1093/jac/dkm416. PMID 17986491. Unknown parameter |month= ignored (help)
 7. Reuters. "Study: Beachgoers More Likely to Catch MRSA". FoxNews.com. Cite news requires |newspaper= (help)
 8. Marilynn Marchione. "Dangerous staph germs found at West Coast beaches". AP. Cite news requires |newspaper= (help)
 9. Zinderman, C.; Conner, B.; Malakooti, M.; LaMar, J.; Armstrong, A.; Bohnker, A. (2004). "Community-Acquired Methicillin-Resistant Staphylococcus aureus Among Military Recruits". Emerging Infectious Diseases. Unknown parameter |month= ignored (help)
 10. 10.0 10.1 Muto, CA.; Jernigan, JA.; Ostrowsky, BE.; Richet, HM.; Jarvis, WR.; Boyce, JM.; Farr, BM. (2003). "SHEA guideline for preventing nosocomial transmission of multidrug-resistant strains of Staphylococcus aureus and enterococcus". Infect Control Hosp Epidemiol. 24 (5): 362–86. doi:10.1086/502213. PMID 12785411. Unknown parameter |month= ignored (help)
 11. "స్టాఫ్ (MRSA) ఇన్ఫెక్షన్ యిరాడికేటడ్ ఫర్ 14 మంత్స్". మూలం నుండి 2009-02-24 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-07. Cite web requires |website= (help)
 12. "Joint scientific report of ECDC, EFSA and EMEA on meticillin resistant Staphylococcus aureus (MRSA) in livestock, companion animals and food" (PDF). 2009-06-16. మూలం (PDF) నుండి 2012-05-03 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-09-19. Cite web requires |website= (help)
 13. Epstein, Victor (21 December 2007). "Texas Football Succumbs to Virulent Staph Infection From Turf". Bloomberg. Retrieved 10 June 2010. Cite web requires |website= (help)
 14. "SVSD410". మూలం ([dead link]) నుండి 2011-07-28 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-07. Cite web requires |website= (help)
 15. MRSA: ది ప్రాబ్లం రీచెస్ పీడియాట్రిక్స్ — పిల్లల వ్యాధుల కు సంభందించిన పత్రాలు.
 16. Association for Professionals in Infection Control & Epidemiology (June 25, 2007). "National Prevalence Study of Methicillin-Resistant Staphylococcus aureus (MRSA) in U.S. Healthcare Facilities". Retrieved 2007-07-14. Cite web requires |website= (help)
 17. Francois P and Schrenzel J (2008). "Rapid Diagnosis and Typing of Staphylococcus aureus". Staphylococcus: Molecular Genetics. Caister Academic Press. ISBN 9781904455295.
 18. Mackay I M (editor). (2007). Real-Time PCR in Microbiology: From Diagnosis to Characterization. Caister Academic Press. ISBN 9781904455189.
 19. Seiken, Denka. "MRSA latex test for PBP2". Cite web requires |website= (help)
 20. Johnson AP, Aucken HM, Cavendish S; et al. (2001). "Dominance of EMRSA-15 and -16 among MRSA causing nosocomial bacteraemia in the UK: analysis of isolates from the European Antimicrobial Resistance Surveillance System (EARSS)". J Antimicrob Chemother. 48 (1): 143–4. doi:10.1093/jac/48.1.143. PMID 11418528. Explicit use of et al. in: |author= (help)CS1 maint: multiple names: authors list (link)
 21. Holden MTG, Feil EJ, Lindsay JA; et al. (2004). "Complete genomes of two clinical Staphylococcus aureus strains: Evidence for the rapid evolution of virulence and drug resistance". Proc Natl Acad Sci USA. 101 (26): 9786–91. doi:10.1073/pnas.0402521101. PMC 470752. PMID 15213324. Unknown parameter |issues= ignored (help); Explicit use of et al. in: |author= (help)CS1 maint: multiple names: authors list (link)
 22. 22.0 22.1 Diep B, Carleton H, Chang R, Sensabaugh G, Perdreau-Remington F (2006). "Roles of 34 virulence genes in the evolution of hospital- and community-associated strains of methicillin-resistant Staphylococcus aureus". J Infect Dis. 193 (11): 1495–503. doi:10.1086/503777. PMID 16652276.CS1 maint: multiple names: authors list (link)
 23. von Eiff C, Becker K, Metze D; et al. (2001). "Intracellular persistence of Staphylococcus aureus small-colony variants within keratinocytes: a cause for antibiotic treatment failure in a patient with Darier's disease". Clin Infect Dis. 32 (11): 1643–7. doi:10.1086/320519. PMID 11340539. Explicit use of et al. in: |author= (help)CS1 maint: multiple names: authors list (link)
 24. "Community-Associated meticillin-resistant Staphylococcusaureus: an emerging threat" (PDF). The Lancet. Cite web requires |website= (help)
 25. R వాంగ్ et al. "ఐడిన్టిఫికేషన్ అఫ్ నోవల్ సైటోలిటిక్ పెప్టైడ్స్ యాస్ కీ విరులెన్స్ డిటర్మినంట్స్ అఫ్ కమ్యునిటీ - అస్సోసియేటెడ్ MRSA". నేచర్ మెడిసిన్ DOI: 10.1038/nm1656 (2007).
 26. Tacconelli E, De Angelis G, de Waure C; et al. (2009). "Rapid screening tests for meticillin-resistant Staphylococcus aureus at hospital admission: systematic review and meta-analysis". Lancet Infect Dis. 9 (9): 546–554. doi:10.1016/S1473-3099(09)70150-1. Explicit use of et al. in: |author= (help)CS1 maint: multiple names: authors list (link)
 27. "టు కాట్చ్ ఏ డేడ్లి జెర్మ్," న్యూ యార్క్ టైమ్స్ ఒపీనియన్
 28. CDC గైడ్ లైన్ " మానేజ్మెంట్ అఫ్ మల్టిడ్రగ్ - రెసిస్టన్ట్ ఒర్గానిజమ్స్ ఇన్ హెల్త్ కేర్ సెట్టింగ్స్, 2006"
 29. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2009-04-02 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-07. Cite web requires |website= (help)
 30. "MRSA test for surgical patients". BBC News. 2009-03-31. Retrieved 2010-04-05.
 31. Fritz SA, Garbutt J, Elward A; et al. (2008). "Prevalence of and risk factors for community-acquired methicillin-resistant and methicillin-sensitive Staphylococcus aureus colonization in children seen in a practice-based research network". Pediatrics. 121 (6): 1090–1098. doi:10.1542/peds.2007-2104. PMID 18519477. Explicit use of et al. in: |author= (help)CS1 maint: multiple names: authors list (link)
 32. Angela L. Hollingsworth. "AOAC Use Dilution Test Health Care" (PDF). మూలం (PDF) నుండి 2008-05-28 న ఆర్కైవు చేసారు. Retrieved 2003-09-26. Cite web requires |website= (help)
 33. doi:10.1128/AAC.00430-07
  This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand
 34. మితిసిల్లిన్-రెసిస్టెంట్ యొక్క నిషేధముస్టాఫిలోకోకస్ ఆరస్ (MRSA) బై ఎస్సెన్షియాల్ ఆయిల్స్; స్యు చావో, గారి యంగ్, క్రైగ్ ఓబ్రేగ్, మరియు కరెన్ నాకొక; ఫ్లేవర్ మరియు ఫ్రాగ్నంస్ జోర్నల్, 2008; 23 : 444-449
 35. ససప్టబిలిటీ అఫ్ మితిసిల్లిన్-రెసిస్టెంట్ స్టాఫిలోకోకస్ ఆరస్ టు ద ఎస్సెన్షియాల్ ఆయిల్ అఫ్ మేలాల్యుకా ఆల్టర్నిఫోలియా
 36. Buckingham, SC (December 2008). "Prevention of Recurrent MRSA Skin Infections: What You Need to Know". Consultant. 48 (13). మూలం నుండి 2010-02-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-07.
 37. "Simple techniques slash hospital infections: meeting". Reuters. 2009-03-21.
 38. 38.0 38.1 38.2 "NIOSH MRSA and the Workplace". United States National Institute for Occupational Safety and Health. Retrieved 2007-10-29. Cite web requires |website= (help)
 39. CDC (1998). "Guidelines for Infection Control in Health Care Personnel, 1998". Centers for Disease Control and Prevention. Retrieved December 18, 2007. Cite web requires |website= (help)
 40. Cooper BS, Medley GF, Stone SP; et al. (2004). "Methicillin-resistant Staphylococcus aureus in hospitals and the community: stealth dynamics and control catastrophes". Proceedings of the National Academy of Sciences. 101 (27): 10223–8. doi:10.1073/pnas.0401324101. PMC 454191. PMID 15220470. Unknown parameter |unused_data= ignored (help); Explicit use of et al. in: |author= (help)CS1 maint: multiple names: authors list (link)
 41. Bootsma MC, Diekmann O, Bonten MJ (2006). "Controlling methicillin-resistant Staphylococcus aureus: quantifying the effects of interventions and rapid diagnostic testing". Proc Natl Acad Sci USA. 103 (14): 5620–5. doi:10.1073/pnas.0510077103. PMC 1459403. PMID 16565219.CS1 maint: multiple names: authors list (link)
 42. Johnson AP, Pearson A, Duckworth G (2005). "Surveillance and epidemiology of MRSA bacteraemia in the UK". J Antimicrob Chemother. 56 (3): 455–62. doi:10.1093/jac/dki266. PMID 16046464.CS1 maint: multiple names: authors list (link)
 43. "Inquirer.net, కేసెస్ అఫ్ RP మైడ్స్ విత్ 'సుపెర్బగ్' ఇన్ఫెక్షన్ గ్రోయింగ్ ఇన్ HK". మూలం నుండి 2008-01-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-07. Cite web requires |website= (help)
 44. "MRSA Infections". Keep Kids Healthy. మూలం నుండి 2007-02-23 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-07. Cite web requires |website= (help)
 45. Graham P, Lin S, Larson E (2006). "A U.S. population-based survey of Staphylococcus aureus colonization". Ann Intern Med. 144 (5): 318–25. PMID 16520472.CS1 maint: multiple names: authors list (link)
 46. Jernigan JA, Arnold K, Heilpern K, Kainer M, Woods C, Hughes JM (2006-05-12). "Methicillin-resistant Staphylococcus aureus as community pathogen". Symposium on Community-Associated Methicillin-resistant Staphylococcus aureus (Atlanta, Georgia, USA). Cited in Emerg Infect Dis. Centers for Disease Control and Prevention. Retrieved 2007-01-27.CS1 maint: multiple names: authors list (link)
 47. ఫస్ట్ స్టడీ ఫైండ్స్ MRSA ఇన్ U.S. పిగ్స్ అండ్ ఫార్మర్స్ , seattlepi.com , 4 జూన్ 2008
 48. అవర్ పిగ్స్, అవర్ ఫుడ్, అవర్ హెల్త్, ది న్యూ యార్క్ టైమ్స్ , 12 మార్చ్ 2009
 49. Schentag JJ, Hyatt JM, Carr JR, Paladino JA, Birmingham MC, Zimmer GS, Cumbo TJ (1998). "Genesis of methicillin-resistant Staphylococcus aureus (MRSA), how treatment of MRSA infections has selected for vancomycin-resistant Enterococcus faecium, and the importance of antibiotic management and infection control". Clin. Infect. Dis. 26 (5): 1204–14. doi:10.1086/520287. PMID 9597254.CS1 maint: multiple names: authors list (link)
 50. Rybak MJ, Lerner SA, Levine DP, Albrecht LM, McNeil PL, Thompson GA, Kenny MT, Yuh L (1991). "Teicoplanin pharmacokinetics in intravenous drug abusers being treated for bacterial endocarditis". Antimicrob. Agents Chemother. 35 (4): 696–700. PMC 245081. PMID 1829880.CS1 maint: multiple names: authors list (link)
 51. Janknegt R (1997). "The treatment of staphylococcal infections with special reference to pharmacokinetic, pharmacodynamic, and pharmacoeconomic considerations". Pharmacy world & science : PWS. 19 (3): 133–41. doi:10.1023/A:1008609718457. PMID 9259029.
 52. Chang FY, Peacock JE Jr, Musher DM; et al. (2003). "Staphylococcus aureus bacteremia: recurrence and the impact of antibiotic treatment in a prospective multicenter study". Medicine (Baltimore). 82 (5): 333–9. doi:10.1097/01.md.0000091184.93122.09. PMID 14530782. Explicit use of et al. in: |author= (help)CS1 maint: multiple names: authors list (link)
 53. Siegman-Igra Y, Reich P, Orni-Wasserlauf R, Schwartz D, Giladi M. (2005). "The role of vancomycin in the persistence or recurrence of Staphylococcus aureus bacteraemia". Scand J Infect Dis. 37 (8): 572–8. doi:10.1080/00365540510038488. PMID 16138425.CS1 maint: multiple names: authors list (link)
 54. Sieradzki K, Tomasz A (1997). "Inhibition of cell wall turnover and autolysis by vancomycin in a highly vancomycin-resistant mutant of Staphylococcus aureus". J. Bacteriol. 179 (8): 2557–66. PMC 179004. PMID 9098053.
 55. Schito GC (2006). "The importance of the development of antibiotic resistance in Staphylococcus aureus". Clin Microbiol Infect. 12 Suppl 1: 3–8. doi:10.1111/j.1469-0691.2006.01343.x. PMID 16445718.
 56. Mongkolrattanothai K, Boyle S, Kahana MD, Daum RS (2003). "Severe Staphylococcus aureus infections caused by clonally related community-associated methicillin-susceptible and methicillin-resistant isolates". Clin. Infect. Dis. 37 (8): 1050–8. doi:10.1086/378277. PMID 14523769.CS1 maint: multiple names: authors list (link)
 57. Klein E, Smith DL, Laxminarayan R (2007). "Hospitalizations and Deaths Caused by Methicillin-Resistant Staphylococcus aureus, United States, 1999–2005". Emerg Infect Dis. 13 (12): 1840–6. PMC 2876761. PMID 18258033.CS1 maint: multiple names: authors list (link)
 58. క్లీవెంస్ et al. (2007), "ఇన్వేసీవ్ మితిసిల్లిన్-రెసిస్టెంట్ స్టాఫిలోకోకస్ ఆరస్ ఇన్ఫెక్షన్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ". జమ . 2007-10-31న సంగ్రహింపబడినది.
 59. వ్యాధి నివారణ మరియు అరికట్టడానికి సిబిరాలు(అక్టోబర్ 17, 2007), "MRSA: మితిసిల్లిన్-రెసిస్టెంట్ స్టాఫిలోకోకస్ ఆరస్ ఇన్ హెల్త్ కేర్ సెట్టింగ్స్
 60. స్టెయిన్ R (అక్టోబర్ 17, 2007), "డ్రగ్-రెసిస్టెంట్ స్టాఫ్ జెర్మ్స్ టోల్ ఈస్ హైయార్ దాన్ థోట్." వాషింగ్టన్ పోస్ట్ 2007-10-19న సంగ్రహింపబడినది.
 61. UK ఆఫీస్ ఫర్ నేషనల్ స్టేటస్టిక్స్ ఆన్ లైన్ (ఫెబ్రవరి 22, 2007), "MRSA డేత్స్ కంటిన్యు టు రైస్ ఇన్ 2005"
 62. హాస్పిటల్స్ స్ట్రక్ బై న్యూ కిల్లెర్ బగ్ మాంచెస్టర్ ఫ్రీ న్యూస్ పేపర్ 'మెట్రో' చే కథనం, మే 7, 2008
 63. Blot S, Vandewoude K, Hoste E, Colardyn F (2002). "Outcome and attributable mortality in critically Ill patients with bacteremia involving methicillin-susceptible and methicillin-resistant Staphylococcus aureus". Arch Intern Med. 162 (19): 2229–35. doi:10.1001/archinte.162.19.2229. PMID 12390067.CS1 maint: multiple names: authors list (link)
 64. Liu et al.,2004-2005 సాన్ ఫ్రాన్సిస్కో లో మితిసిల్లిన్-రెసిస్టెంట్ స్టాఫిలోకోకస్ ఆరస్ వ్యాధి సంభవము మరియు మోలికులర్ ఎపిడమియోలజి పై జనాభా లెక్కల అధ్యయనం. Clin Infect Dis. 2008 జు 1;46(11):1637-46)
 65. Noskin GA, Rubin RJ, Schentag JJ, Kluytmans J, Hedblom EC, Smulders M, Lapetina E, Gemmen E (2005). "The Burden of Staphylococcus aureus Infections on Hospitals in the United States: An Analysis of the 2000 and 2001 Nationwide Inpatient Sample Database". Arch Intern Med. 165 (15): 1756–1761. doi:10.1001/archinte.165.15.1756. PMID 16087824.CS1 maint: multiple names: authors list (link)
 66. Hardy KJ, Hawkey PM, Gao F, Oppenheim BA (2004). "Methicillin resistant Staphylococcus aureus in the critically ill". British Journal of Anaesthesia. 92 (1): 121–30. doi:10.1093/bja/aeh008. PMID 14665563.CS1 maint: multiple names: authors list (link)
 67. Wyllie D, Crook D, Peto T (2006). "Mortality after Staphylococcus aureus bacteraemia in two hospitals in Oxfordshire, 1997–2003: cohort study". BMJ. 333 (7562): 281. doi:10.1136/bmj.38834.421713.2F. PMC 1526943. PMID 16798756.CS1 maint: multiple names: authors list (link)
 68. Okuma K, Iwakawa K, Turnidge J; et al. (2002). "Dissemination of new methicillin-resistant Staphylococcus aureus clones in the community". J Clin Microbiol. 40 (11): 4289–94. doi:10.1128/JCM.40.11.4289-4294.2002. PMC 139674. PMID 12409412. Explicit use of et al. in: |author= (help)CS1 maint: multiple names: authors list (link)
 69. Bowling FL, Salgami EV, Boulton AJ (2007). "Larval therapy: a novel treatment in eliminating methicillin-resistant Staphylococcus aureus from diabetic foot ulcers". Diabetes Care. 30 (2): 370–1. doi:10.2337/dc06-2348. PMID 17259512.CS1 maint: multiple names: authors list (link)
 70. "Maggots help cure MRSA patients". BBC News. 2007-05-02. Cite news requires |newspaper= (help)
 71. "Maggots rid patients of MRSA". EurekAlert!/AAAS. 2007-05-03. Cite news requires |newspaper= (help)
 72. http://clinicaltrials.gov/ct2/show/NCT00685698
 73. "'Red Army' virus to combat MRSA". BBC News. 2007-08-13. Cite news requires |newspaper= (help)
 74. Matsuzaki S, Yasuda M, Nishikawa H, Kuroda M, Ujihara T, Shuin T, Shen Y, Jin Z, Fujimoto S, Nasimuzzaman MD, Wakiguchi H, Sugihara S, Sugiura T, Koda S, Muraoka A, Imai S (2003). "Experimental protection of mice against lethal Staphylococcus aureus infection by novel bacteriophage phi MR11". J. Infect. Dis. 187 (4): 613–24. doi:10.1086/374001. PMID 12599078.CS1 maint: multiple names: authors list (link)
 75. Bayston R, Ashraf W, Smith T (2007). "Triclosan resistance in methicillin-resistant Staphylococcus aureus expressed as small colony variants: a novel mode of evasion of susceptibility to antiseptics". J. Antimicrob. Chemother. 59 (5): 848–53. doi:10.1093/jac/dkm031. PMID 17337510.CS1 maint: multiple names: authors list (link)
 76. Wang J; Soisson, SM; Young, K; Shoop, W; Kodali, S; Galgoci, A; Painter, R; Parthasarathy, G; Tang, YS (2006). "Platensimycin is a selective FabF inhibitor with potent antibiotic properties". Nature. 441 (441): 358–361. doi:10.1038/nature04784. PMID 16710421. Unknown parameter |month= ignored (help)
 77. "స్పొంగేస్ రహస్య ఆయుధం యన్టీబయోటిక్స్ యొక్క శక్తీ ని పునః నిల్వ చేస్తాయి". మూలం నుండి 2009-04-21 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-07. Cite web requires |website= (help)
 78. Appendino G, Gibbons S, Giana A, Pagani A, Grassi G, Stavri M, Smith E, Rahman M (2008). "Antibacterial Cannabinoids from Cannabis sativa: A Structure-Activity Study". J. Nat. Prod. 71 (8): 1427–30. doi:10.1021/np8002673. PMID 18681481.CS1 maint: multiple names: authors list (link)

బాహ్య లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
 • MRSA పిక్చర్స్ – స్టాఫ్ అంటురోగము యొక్క చిత్రాలు, MRSA, మరియు అంటురోగముల వలన కలిగిన చర్మ వ్యాధులు.

మూస:Gram-positive bacterial diseases