మెదక్ జిల్లా కథా రచయితలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలుగు కథ
తెలుగు కథా సాహిత్యం
కథ
తెలుగు కథా రచయితలు
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు
మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు
వేలూరి శివరామశాస్త్రి కథలు
కాంతం కథలు
చలం కథలు
మా గోఖలే కథలు
నగ్నముని విలోమ కథలు
అమరావతి కథలు
అత్తగారి కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
మా పసలపూడి కథలు
దర్గామిట్ట కథలు
కొ.కు. కథలు
మిట్టూరోడి కథలు
ఇల్లేరమ్మ కథలు
ఛాయాదేవి కథలు
మధురాంతకం రాజారాం కథలు
కా.రా. కథలు
బలివాడ కాంతారావు కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
రా.వి. శాస్త్రి కథలు
ముళ్ళపూడి వెంకటరమణ కథలు
కేతు విశ్వనాధరెడ్డి కథలు
ఇంకా ... ...
తెలుగు సాహిత్యం
పైడిమర్రి సుబ్బారావు

మెతుకు సీమగా ప్రసిధ్థి చెందిన మెదక్ జిల్లా తెలుగు కథకు సీమగా కూడా ఉంది. ఎంతో మంది తెలుగు కథా రచయితలు మెదక్ జిల్లాలో జన్మించారు.

కథ ప్రాశస్త్యం[మార్చు]

మానవ సమాజ చరిత్రలో కథ ప్రక్రియకు ఎంతో ప్రాధాన్యత ఉంది. రాతి యుగపు మనిషి సంజ్ఞలతో అభివృద్ధికి బాటలు వేస్తే అనంతర కాలంలో మనిషికి సంఘజీవనం ప్రాణావసరమయ్యింది. ఆ సమయంలోనే భాష ఆవిర్భవించింది. మనిషి నుండి మనిషికి సమాచారం చేరవేయడానికి చిన్న చిన్న పదాలతోకూడిన కథలు ఊపిరి పోసుకున్నాయి. దేశాలవారీగా ప్రాంతాలవారీగా భాష రూపాంతరం చెందుతూ ప్రాంతీయ జీవన స్థితిగతుల నేపథ్యంలో అప్పటి ఆలోచనాపరులు మౌఖిక కథల ప్రచారప్రయాణం ప్రారంభించారు. తదనంతర కాలంలో భాష లిపిరూపం సంతరించుకోవడంతో కథాప్రయాణం వేగం పుంజుకుంది. నాటి రాజుల కాలం నుంచి ఈ ప్రాంతంలో కథ ప్రచారంలో ఉన్నప్పటికి ముద్రణా రంగం అందుబాటులోకి వచ్చిన తరువాత సామాన్య ప్రజానీకానికి సైతం చేరువ అయ్యింది. మన జీవితంలో కథ ఒక భాగమయ్యింది.

మెదక్ జిల్లాలో తెలుగు కథా ప్రక్రియ[మార్చు]

ఆంధ్రదేశంలోని ప్రతీ జిల్లాలో లాగానే మెదక్ జిల్లాలో కూడా తెలుగు కథకులు ఉద్భవించారు. 1945లోనే అతని ‘భరం’ మొదలగు 50 కథలు మెదక్ జిల్లా నుండి వెలు వడ్డాయి. జాతీయవాది పైడిమర్రి వెంకటసుబ్బారావు రాసిన ‘నౌకరి’ మరికొన్ని కథలతో, ఉషస్సు, కథా సంపుటి వెలువడింది. నాటక రచయిత, ప్రయోక్త కస్తూరి ఆనందాచార్య (సంగారెడ్డి) కలంనుంచి ‘చర్విత చర్వణం’తోపాటు మరెన్నో కథలు వెలువడ్డాయి. సిద్ధిపేటలో హరిపురం వెంకట్రామయ్య ‘సంచారి’ పేరుతో హాస్య, వ్యంగ్య కథలు రాసి వినిపించి శ్రోతలను ఉర్రూతలూగించారు.[1] ఇంతవరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎంతో మంది కథకులు ఈ జిల్లాలో లబ్ధప్రతిష్ఠులుగా పేరుపొందారు. వర్తమాన కాలంలో ఎంతో మంది కథారచయితలుగా రాణిస్తున్నారు.

మెదక్ జిల్లాలో జన్మించిన తెలుగు కథా రచయితల జాబితా[2][మార్చు]

రచయిత పేరు ప్రస్తుత నివాసం కలం పేరు పుట్టిన సంవత్సరం/తేది పుట్టిన ఊరు
వెల్దుర్తి మాణిక్యరావు -- -- 1914 వెల్దుర్తి
వెంకటసుబ్బారావు -- -- --
కస్తూరి ఆనందాచార్య -- -- -- సంగారెడ్డి
చొప్పదండి సుధాకర్ మెదక్ చంద్రుడు 1963 ఆగస్టు 10 అల్లీపురం, సిధ్ధిపేట తాలూకా
దోర్బల బాలశేఖరశర్మ హైదరాబాద్ గడీల ఛత్రపతి, దోర్బల శర్మ వగైరా.. 1962 జూన్ 20 రామాయంపేట
ఎగుమామిడి అయోధ్యారెడ్డి హైదరాబాద్ 1955 ఫిబ్రవరి 11 మిట్టపల్లి, సిధ్ధిపేట మండలం
ఎన్నవెళ్లి రాజమౌళి మెదక్ 1953 డిసెంబరు 25 తడకపల్లి

మొదటి మెదక్ జిల్లా తెలుగు కథకుడు[మార్చు]

వెల్దుర్తి మాణిక్యరావు మెదక్ జిల్లా మొదటి తెలుగు కథా రచయితగా పేర్కొనవచ్చు. ఈయన పత్రికా రచయిత, కవి కూడా. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామంలో 1914లో జన్మించిన వెల్దుర్తి నాటి అణా గ్రంథమాలకు పర్యాయపదమైనారు.[3] అణా గ్రంథమాల అనే నాణానికి కె.సి. గుప్త ఒక వైపైతే, వెల్దుర్తి మరొకవైపు. గుప్త ప్రచురణ కర్త అయితే వెల్దుర్తి సంపాదకుడు. ప్రతి పుస్తకం ఒక అణాకే (ఆరు పైసలకే) పాఠకులకు అందివ్వాలన్నది వీరి లక్ష్యం. స్వాతంత్ర్యానికి ముందు వెల్దుర్తి వ్రాసిన "ఎయిర్‌మేల్" అనే కథ అప్పట్లో సంచలనం సృష్టించింది.[1]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 దక్షిణ తెలంగాణ కథానికలకు పట్టుగొమ్మ[permanent dead link]
  2. కథానిలయం జాలగూడులో రచయితల వివరాలు
  3. "నమస్తే తెలంగాణ పత్రికలోని వ్యాసం". Archived from the original on 2016-03-05. Retrieved 2013-12-25.