మెరాజ్ ఫాతిమా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెరాజ్ ఫాతిమా
జననంమార్చి 19, 1965
ప్రసిద్ధికవయిత్రి

మెరాజ్ ఫాతిమా వర్థమాన తెలుగు కవయిత్రి. కవి సంగమం రచయితలలో ఒకరు.

ఆమె గురించి[మార్చు]

వివిధ పత్రికల్లో ప్రచురితమైన తన కవితల ద్వారా సాహితీలోకానికి పరిచయమై, ఈ మధ్యకాలంలో అంతర్జాల సాహిత్యంలో తనదైన స్థానాన్ని నిలుపుకుంటోంది మెరాజ్ ఫాతిమా. ఆమె కవిత్వంలో ఒక స్త్రీ సహజమైన భావనలు, అణచివేతకు గురౌతున్న సందర్భాలు, వివిధ స్థాయిల్లో వారి అలోచనలు, బాల్య, యౌవన, కౌమార, వార్థక్యాలు, తదనంతర జీవన సహజ పరిణామాలు, ఊహలు, మానసిక సంఘర్షణలు, అనురాగాలు, అనుభవాలు, ఆప్యాయతల లేమి, ప్రేమ ఇలా వివిధ భావాల ధోరణి చక్కగా అక్షరీకరించబడి ఉంటుంది. ఆమె రచించిన అంతర్వేదన కవితా పుస్తకం ప్రముఖుల మన్ననలు పొందింది.

అంతర్వేదన పుస్తకం గురించి[మార్చు]

అంతర్వేదన

అంతర్వేదన కవితా సంకలనాన్ని రెండు భాగాలు చేయటంలోనే ఆమెలోని సాహితీ కృషీవలత్వం కనబడుతోంది. స్త్రీ సహజ సమస్యలే కాక, సామాజిక స్పృహ కలిగిన కోణాన్ని కూడ ఆమె స్పృశించింది. లోక రీతులు, సమాజ స్థితిగతులు, అన్యాయం, దోపిడి, వివిధ వ్యవస్థల్లోని లోపాలు ఎత్తిచూపటంలోనూ విజయం సాధించింది. పుస్తకానికి ముందుమాటలోనే రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, కితాబు పొందటమే ఒక గీటురాయి. వారి మాటల్లో ”ఆమె నిర్మించిన పదాల చతురత సహజ సౌందర్యమైనదే కాక అందరికి అర్థమయ్యే లలిత పదాల సొబగులున్నాయని, కఠిన శిలా సదృశమైనదిగా కాక మృదు మధురంగా, లాలిత్యంగా వున్నాయని, తనదైన కవితా నిర్మాణ కౌశలత కేవలం ఫాతిమా సొంతమని, ఆమె శిల్పం ఆమెదే ”నని అన్నారు. మరొక సాహితీ ప్రముఖుడు శాంతి నారాయణ అనునయ వాక్యాల ద్వారా ఆమె కవిత్వం యేపాటిదో తెలుస్తోంది. ప్రత్యేకంగా అమెను నిత్యం ప్రోత్సహించి, మెచ్చుకోలు దీవెనగా "ప్రవహిస్తున్న లావా, ఫాతిమా కవిత్వం. సాహిత్యంలోకి తొంగి చూడ్డానికి ఫాతిమాకి అంతర్వేదన కావ్యం ఒక కొత్త గవాక్షం" అన్నారు.

మూలాలు[మార్చు]

అంతర్వేదన కవితా సంపుటిపై కపిల రాంకుమార్ గారి వ్యాసం

ఇతర లింకులు[మార్చు]

మెరాజ్ ఫాతిమా రచనల బ్లాగు