Jump to content

మెర్క్యురిక్ క్లోరైడ్

వికీపీడియా నుండి
మెర్క్యురీ(II) క్లోరైడ్
బాల్-అండ్-స్టిక్ మోడల్ క్రిస్టల్ నిర్మాణం
స్పేస్-ఫిల్లింగ్ మోడల్ క్రిస్టల్ నిర్మాణం
పేర్లు
IUPAC నామముs
మెర్క్యురీ(II) క్లోరైడ్
మెర్క్యురీ డైక్లోరైడ్
ఇతర పేర్లు
మెర్క్యురీ బైక్లోరైడ్
అబావిట్
మెర్క్యురిక్ క్లోరైడ్
సులేమా (రష్యా)
TL-898
అగ్రోసన్
హైడ్రాగిరి డైక్లోరిడమ్ (హోమియోపతి)
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
Infobox references

మెర్క్యురిక్ క్లోరైడ్ (ఆంగ్లం: mercuric chloride | mercury(II) chloride | corrosive sublimate), మెర్క్యురిక్ ఫ్లోరైడ్ తెల్లటి స్పటికాకార ఘనపదార్థం.[1][2] పాదరసం మీద క్లోరిన్ చర్య ద్వారా మెర్క్యూరిక్ క్లోరైడ్ తయారవుతుంది. నైట్రేట్ వంటి పాదరసం(I) సమ్మేళనాల వేడి, సాంద్రీకృత ద్రావణానికి హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని జోడించడం ద్వారా కూడా దీనిని ఉత్పత్తి చేయవచ్చు.

  • సాధారణ నామం: కాలోమెల్
  • రసాయన ఫార్ములా: HgCl2

మెర్క్యురిక్ క్లోరైడ్ పాదరసం, క్లోరిన్ ల అకర్బన రసాయన సమ్మేళనం,. దీన్ని ప్రయోగశాలల్లో కారకంగా ఉపయోగిస్తారు. ఇది తెల్లటి స్ఫటికాకార ఘనపదార్థం. మానవులకు చాలా విషపూరితమైన పరమాణు సమ్మేళనం. ఒకప్పుడు సిఫిలిస్‌కు చికిత్సగా దీన్ని ఉపయోగించేవారు. అయితే, 1948 నుండి తక్కువ విషపూరితమైన ప్రోకైన్ పెన్సిలిన్‌తో చికిత్స మొదలుపెట్టారు.

ఉపయోగాలు

[మార్చు]
  1. రసాయన పరిశ్రమలో, కొన్ని కర్బన సమ్మేళనాల తయారీలో ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు.
  2. దీన్ని కాలోమెల్ అనే ప్రామాణిక ఎలక్ట్రోడ్ తయారీలో, కాలోమెల్ ఎలక్ట్రోడ్ ద్రావణాల్లో విద్యుత్ పొటెన్షియల్‌ను కొలిచేందుకు ఉపయోగిస్తారు.
  3. పూర్వం గాయాలకు యాంటీసెప్టిక్గాను, చర్మవ్యాధుల చికిత్సలోనూ వాడేవారు.

ప్రస్తుతం వైద్య అవసరాల కోసం వినియోగించడం లేదు.

విషపూరితం

[మార్చు]

మెర్క్యురీ డైక్లోరైడ్ అనేది అత్యంత విషపూరితమైన సమ్మేళనం.[3] మెర్క్యూరిక్ క్లోరైడ్ విషప్రయోగం వల్ల సాధారణ దుష్ప్రభావాలలో నోరు, గొంతులో మంట, కడుపు నొప్పి, వాంతులు, మూత్రపిండాల వైఫల్యం వంటివి ఉంటాయి.[4] పెద్ద మొత్తంలో మెర్క్యూరిక్ క్లోరైడ్ 24 గంటల్లో మరణానికి కారణమవుతుంది.[5]

మూలాలు

[మార్చు]
  1. ↑ "రంగు లేని సమ్మేళనం.. నవ్వు పుట్టిస్తుంది". EENADU. Retrieved 2025-09-12.
  2. ↑ Chisholm, Hugh, ed. (1911). "Corrosive Sublimate" . ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్) (11th ed.). Cambridge University Press.
  3. ↑ Mercury (II) chloride, toxicity
  4. ↑ "అందమైన శత్రువు." Sakshi. Retrieved 2025-12-03.
  5. ↑ "Mercuric chloride" in ToxNet: Hazardous Substances data bank.