మెర్రిల్ లించ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Bank of America Merrill Lynch
రకంSubsidiary
స్థాపితం1914 (as Charles E. Merrill & Co.)
వ్యవస్థాపకు(లు)Charles E. Merrill
Edmund C. Lynch
ప్రధానకార్యాలయంNew York City, USA
సేవా ప్రాంతముWorldwide
పరిశ్రమFinance and Insurance
ఉత్పత్తులుFinancial Services
Investment Banking
Investment management
ఉద్యోగులు60,000 (2008)
ఆదాయంBank of America
వెబ్‌సైటుML.com

బ్యాంకు ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ [1] బాంక్ ఆఫ్ అమెరికాలోని ఒక ఇన్వెస్త్మేంట్ బాంకింగ్ మరియు సంపద మేనేజ్మెంట్ విభాగము. 20,000 మంది కంటే ఎక్కువ బ్రోకర్లు మరియు $2.2 ట్రిలియనులు ఖాతాదారుని ఆస్తుల రూపంలో ఉండడంతో అది ప్రపంచంలోనే అతి పెద్ద బ్రోకరేజిగా నిలిచింది.[2] మెర్రిల్ లించ్ & కో., ఇంక్. గా గతంలో పిలువబడి, ఇదివరలో ప్రజలందరి స్వంతంగా ఉండి, టికర్ గుర్తైన MER ఉపయోగించి న్యూ యార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా వ్యాపారంగావించబడిన సంస్థ ఇది. ఈ సంస్థ దురవస్థలో ఉండి, బాంక్ ఆఫ్ అమెరికా ఆధీనంలోనికి 2008 ఆర్ధిక సంక్షోభం కాలంలో వచ్చింది. అదే సమయంలో బాంక్ ఆఫ్ అమెరికా, దాని ప్రపంచవ్యాప్త బాంకింగ్ మరియు సంపద నిర్వాహణ విభాగాన్ని, క్రొత్తగా సంపాదించిన సంస్థతో విలీనం చేసింది.

ఈ విషయ వివరణలో మెరిల్ లించ్ యొక్క చారిత్రాత్మక మరియు బాంకు యొక్క ఉప విభాగ బాంకుగా దాని ప్రస్తుత విధివిధానాలు కూడా వివరించబడ్డాయి. మెర్రిల్ లించ్ కాపిటల్ మార్కెట్ ల సేవలు, ఇన్వెస్ట్మెంట్ బాంకింగ్ మరియు సలహాల ద్వారా సేవలు, సంపద నిర్వాహణ, ఆస్తుల నిర్వాహణ, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ మరియు ప్రపంచవ్యాప్తంగా సంబంధిత ఆర్ధిక సేవలు. మెర్రిల్ లించ్ న్యూ యార్క్ లో తన ప్రధాన కేంద్రాన్ని నిర్వహిస్తూ, మన్హట్టాన్ లోని ఫోర్ వరల్డ్ ఫైనాన్షియల్ సెంటర్ భవనంలోని మొత్తం 34 అంతస్తులను ఆక్రమించింది.

చరిత్ర[మార్చు]

ఆ కంపెనీ జనవరి 6 న 1914 లో చార్లెస్ ఈ.మెర్రిల్ & co చే స్థాపించబడి, న్యూ యార్క్ మహానగరంలోని 7 వాల్ స్ట్రీట్ వద్ద వ్యాపారం చేయటం ప్రారంభించింది. కొన్ని నెలల తరువాత, మెర్రిల్ స్నేహితుడైన ఎడ్మండ్ C. లించ్ అతనితో జత కలిసినాక, 1915 లో ఆ పేరు అధికారికంగా మెర్రిల్, లించ్ & కోగా మార్చబడింది. ఆ సమయంలో, ఆ సంస్థ పేరులోని మెర్రిల్ మరియు లించ్ [3] మధ్య ఒక కామా కూడా ఉండేది. 1916 లో విన్త్రోప్ H. స్మిత్ ఆ సంస్థలో భాగస్వామిగా మారాడు.

తొలి రోజుల నాటి చరిత్రలో, మెర్రిల్, లించ్ & కో. అనేక ఫలప్రథమైన పెట్టుబడులను చేసింది. 1921 లో ఆ కంపెనీ పతే ఎక్స్చేంజ్ను కొనుగోలు చేసింది. అదే తరువాత RKO పిక్చర్స్గా మారింది. 1926 లో ఆ సంస్థ ఆ కాలంలోనే అత్యంత ప్రముఖమైన ఆర్ధిక పెట్టుబడిని పెట్టి, సేఫ్వేలో ఒక ముఖ్యమైన ఇంటరెస్ట్ ని కొనుగోలు చేసింది. ఆ విధంగా అది ఒక చిన్న సరుకుల కొట్టును దేశంలోనే మూడవ అతి పెద్ద సరుకుల స్టోర్ ల శ్రేణిగా 1930 లలోనే మార్చింది. ఈ పెట్టుబడి తరువాత, ఆ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో తన ఆసక్తిని మరింత పెంచుకుని, తన రీటైల్ మధ్యవర్తిత్వపు సేవలను E.A. పియర్సెకు బదలీ చేసింది.

1940 లో ఆ సంస్థ E. A. పియర్స్ & Co. తోనూ, కస్సట్ట్ & Co. తోనూ కలసిపోయి, మెర్రిల్ లించ్, E. A. పియర్స్, మరియు కస్సట్ట్ అని కొద్దికాలము పిలువబడింది.[4] ఆ కంపెనీ 1941 లో వార్షిక ఫిస్కల్ నివేదికను ప్రచురించిన వాటిలో వాల్ స్ట్రీట్ లో మొదటిదిగా నమోదు అయింది. అంతే కాక, 1941 లో ఫెంనేర్ & బీన్ ఆ సంస్థలో చేరారు. దానితో అ సంస్థ పేరు మెర్రిల్ లించ్, పియర్స్, ఫెన్నర్ & బీన్గా మార్చబడింది. 1952 లో ఎడ్మండ్ లించ్ మరణం తరువాత ఆ కంపెనీ పేరు మెర్రిల్ లించ్ & కోగా అధికారికంగా మార్పు చేయబడింది. 1957 డిసెంబరు 31న థ న్యూ యార్క్ టైమ్స్ ఇలా వ్రాసింది: ఆ పేరును "అమెరికా యొక్క నాదము" అని వర్ణించి, "పదహారు సంవత్సరాలుగా ప్రాచుర్యంలోకి తెచ్చిన తరువాత మెర్రిల్ లించ్, పియర్స్, ఫెన్నేర్ మరియు బీన్ దానిని మార్చబోతున్నారు-దాని మూలాన ఒక బ్రోకరేజ్ సంస్థను అమెరికాలో ఇంటింటా తెలిసిన పేరుగా మార్చడానికి కారకులైన వ్యక్తిగా గౌరవించింది" 1940 నుండి సంస్థను నిర్వహిస్తున్న విన్త్రాప్ హెచ్. స్మిత్. ఈ మెర్జర్ అనంతరం ఆ సంస్థ 98 నగరాలలో కార్యాలయాలు, 28 ఎక్స్చేంజ్ లలో సభ్యత్వం కలిగి ఉండి, ప్రపంచములోనే అతిపెద్ద సెక్యూరిటీల సంస్థగా ఏర్పడింది. 1958 మార్చి 1 న సంస్థ యొక్క ఆర్ధిక సంవత్సర ప్రారంభములో సంస్థ పేరు 'మెర్రిల్ లించ్, పియర్స్, ఫెన్నేర్ & స్మిత్' గా మార్చబడి, సంస్థ న్యూ యార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో బిగ్ బోర్డ్ సభ్యత్వం పొందింది.[5]

"ఉరుమే మంద" అని కొన్ని సార్లు పిలవబడే మెర్రిల్ లించ్ వారి బ్రోకరేజ్ నెట్వర్క్ (2006 నాటికి 15,000+) [6] యొక్క బలం మీద మెర్రిల్ లించ్ ప్రసిద్ధి చెందింది. దీని మూలంగా తాము అండర్ రైట్ చేసిన సెక్యూరిటీ లను నేరుగా పెట్టడానికి వీలైంది.[7] దీనికి భిన్నంగా, మోర్గాన్ స్టాన్లీ వంటి బాగా స్థిరపడిన పలు వాల్ స్ట్రీట్ సంస్థలు వారు అండర్ రైట్ చేసిన సేక్యూరిటీలను స్వతంత్ర బ్రోకేర్ ల ద్వారా పెట్టేవారు.[8] 1970 వరకు కూడా ఇది వాల్ స్ట్రీట్ యొక్క "కథోలిక్" సంస్థ అని పిలవబడింది.[9] 1971లో సంస్థ పబ్లిక్ అయి ఒక బహుళజాతి కార్పరేషన్గా ఏర్పడింది. US $1.8 ట్రిలియను కంటే ఎక్కువ విలువగల ఖాతాదారుల ఆస్తులు కలిగి ఉండి ప్రపంచమంతట 40 దేశాలలో కార్యకలాపాలు జరుపుతుంది. 1977లో కేష్ మేనేజ్మెంట్ ఎకౌంట్ (CMA) అనే పధకముని ప్రవేశ పెట్టింది. దీని ద్వారా ఖాతాదారులు తమ మొత్తము నగదుని మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్ కు మార్చుకునే వీలు కలిగింది. దీనిలో చెక్కు వ్రాసే సదుపాయం మరియు క్రెడిట్ కార్డ్ కూడా ఉన్నాయి. ఫార్చూన్ సంచిక దీనిని "ఏళ్లలో అతి ముఖ్యమైన ఆర్ధిక నూతన ప్రయోగం" అని పిలిచింది.[10] 1978లో సంస్థ వైట్ వెల్డ్ & కం. అనే ఒక పాత తరముకు చెందిన ప్రతిష్ఠాత్మక పెట్టుబడి బ్యాంకును కొనుగోలు చేసి గణనీయంగా తమ అండర్ రైటింగ్ వ్యాపారాన్ని బలపరుచుకుంది. ప్రపంచవ్యాప్త ప్రైవేట్ ఖాతాదారుల సేవలకు మరియు బలమైన విక్రయ బలగానికు మెర్రిల్ లించ్ పేరొందింది.

2007 నవంబరు 1 నాడు మెర్రిల్ లించ్ CEO అయిన స్టాన్లీ ఓ'నీల్ సంస్థనుండి వైదొలిగారు. దీనికి కారణాలు ఏమనగా, అతను సంస్థ యొక్క రిస్కు మానేజ్మెంట్ మరియు సబ్ ప్రైం తనఖా సంక్షోభంను నడిపించిన విధము, దాని మూలాన సంస్థకు ఏర్పడిన US$2.24 బిలియను మేరకు అనుకోని నష్టాలు మరియు బోర్డ్ అనుమతి లేకుండానే వాచోవియా బ్యాంకింగ్ కార్పోరేషన్తో మెర్జర్ అయ్యే అవకాశాన్ని బహిరంగంగా చర్చించడం వంటి కారణాలు. సుమారు US $161 మిలియను విలువగల స్టాక్ ఆప్షన్ లు మరియు విశ్రాంతి ప్రయోజనాలతో అయిన మెర్రిల్ లించ్ నుండి వైతొలిగారు.[11] న్యూ యార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క CEO అయిన జాన్ తైన్ డిసంబర్ 1, 2007 నాడు నూతన CEO గా అయ్యారు.

2008 జనవరి 17న మెర్రిల్ లించ్ నాలుగవ త్రైమాసికంలో $9.83 బిలియను నష్టాన్ని ప్రకటించింది. ఇది సబ్ ప్రైం తనఖాలకు సంబంధించిన ఆస్తులను తీసి వేసిన అనంతరం. 2008 ఏప్రిల్ 17న మెర్రిల్ లించ్ 2008 సంవత్సర మొదటి త్రైమాసికానికి $1.97 బిలియను నికర నష్టం ప్రకటించింది.

[12] ఈ నష్టాన్ని సరి చేసేందుకు ప్రెఫెర్రెద్ షేర్ ల అమ్మకం ద్వారా మూలధనాన్ని పెంచింది. ఐతే ఈ పద్ధతి సంస్థ యొక్క క్రెడిట్ రేటింగ్ మీద ప్రభావం చూపించి సంస్థ ఋణము పొందే ఖర్చులను పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.[13]

2009 జనవరి 22 నాడు జాన్ తైన్ సంస్ CEO పదవికి రాజీనామా చేశారు. దీనికి కారణము సంస్థను బ్యాంక్ అఫ్ అమెరికా కొనే నిర్ణయం వేలువడే కొంత ముందుగానే 2008 చివరలో ఆయన మెర్రిల్ ఉద్యోగుస్తులకు $3–4 బిలియన్ డాలర్లు నాలుగవ త్రైమాసిక బోనస్ గా ఇచ్చారు.[14] ఈ బోనస్ చెల్లింపులను బ్యాంకు అఫ్ అమెరికా అధికారులకు తైన్ తెలియచేయలేదని అతని మీద ఆరోపణ ఉంది. బ్యాంకు అఫ్ అమెరికా తమ అనుబంధ సంస్థైన మెర్రిల్ లించ్ కు సంబంధించిన నష్టాలను భరించడానికి $20 బిలియను అదనపు మూలధనము కేటాయించమని బ్యాంకు అఫ్ అమెరికా ఇటీవల ప్రభుత్వాన్ని కోరింది.[15] జనవారి 22, 2009 నాడు బ్యాంకు అఫ్ అమెరికా మరియు మెర్రిల్ లించ్ పై వాటా దారులు వేసిన ఉమ్మడి చర్య దావాలో తిన్ ను సహా-నిందితుడుగా పెర్కొనబడ్డాడు. ఈ దావా ప్రకారం, బ్యాంకు అఫ్ అమెరికా CEO ఐన కేం లేవిస్, పూర్వ మెర్రిల్ ప్రధాన ఆర్ధిక అధికారి నెల్సన్ చాయ్, పూర్వ మెర్రిల్ ప్రధాన అకౌంటింగ్ అధికారి గారి కార్లినండ్ మరియు తైన్ వీరందరూ బ్యాంకు అఫ్ అమెరికా మెర్రిల్ కొనుగోలు చేసే ముందు మెర్రిల్ యొక్క భారి నష్టాల గురించి వాటాదారాలను హెచ్చరించలేదు.

సబ్‌ప్రైమ్ తనఖా సంక్షోభం[మార్చు]

నవంబరు 2007లో, దేశీయ గృహ సంక్షోభంకు సంబంధించి, $8.4 బిలియను మొత్తాన్ని నష్టాలుగా పరిగణించి, ప్రధాన అధికారి ఐన ఈ. స్టాన్లీ ఓ'నీల్ ను తోలగిస్తున్నట్లుగా మెర్రిల్ లించ్ ప్రకటించింది.[16] దానికి ముందు బోర్డ్ అనుమతి లేకుండానే ఓ'నీల్ వాచోవియా బ్యాంకును మెర్జర్ కొరకు సంప్రదించాడు. ఐతే ఓ'నీల్ ను తొలగించడంతో ఈ సంప్రదింపులు ఆగి పోయాయి.[16] డిసంబర్ 2007న వాణిజ్య ఆర్ధిక వ్యాపారాన్ని జనరల్ ఎలెక్ట్రిక్కు అమ్ముతున్నట్లుగా సంస్థ ప్రకటించింది. మరియు మూలధనము సమకూర్చే కొరకు తమ స్టాక్ లో పెద్ద భాగాన్ని సింగపూర్ ప్రభుత్వ పెట్టుబడి కూటమి అయిన టేమాసేక్ హొల్డింగ్స్కు అమ్ముతున్నట్లుగా సంస్థ ప్రకటించింది.[17] ఈ లావాదేవీ ద్వారా $6 బిలియను కంటే ఎక్కువగా లభించింది.[17] జూలై 2008న మెర్రిల్ లించ్ యొక్క కొత్త CEO ఐన జాన్ తైన్ నాల్గవ త్రైమాసకములో డిఫాల్ట్ లు మరియు తప్పుడు పెట్టుబడులు మూలాన $4.9 బిలియను నష్టము వాటిల్లందని ప్రకటించారు.[18] జూలై 2007-జూలై 2008 మధ్య ఉన్న సంవత్సర కాలములో మెర్రిల్ లించ్ $19.2 బిలియను నష్టపడింది అనగా రోజుకు $52 మిలియను.[18] ఈ కాలములో సంస్థ యొక్క స్టాక్ ధర గణనీయంగా తగ్గింది.[18] తనఖాకు సంబంధించిన పెట్టుబడులను తగ్గించుకోవడం కొరకు కొన్ని ఎన్నుకున్న హెడ్జ్ ఫండ్ లను సేక్యూరిటిలను అమ్ముతున్నట్లు రెండు వారాలు తరువాత సంస్థ ప్రకటించింది.[19] ఈ ఫండ్ లను కొని సంస్థలో తమ పెట్టుబడిని $3.4 బిలియనుకు పెంచుకోవడానికి టెమాసేక్ హొల్డింగ్స్ అంగీకరించింది.[20]

మెర్రిల్ సిన్చ్ తమ తనఖా-ఆధారిత సెక్యూరిటీల రిస్కును అవాస్తవంగా చూపించిందని న్యూ యార్క్ అటార్నీ జెనెరల్ అయిన అండ్రూ క్యోమో ఆరోపించి న్యాయస్థానములో దావా వేస్తానని బెదిరించారు.[21] ఒక వారం క్రితము, వేలం-రేటు ఋణంలో $12 బిలియను మొత్తాన్ని తిరిగి కొంటామని మెర్రిల్ లించ్ చెప్పింది. ఈ దావా తమకు ఆశ్చర్యం కలిగిస్తుందని సంస్థ చెప్పింది.[21] మూడు రోజుల తరువాత సంస్థ నియామకాలని నిలివేసింది. తాము తమ యునైటెడ్ కింగ్డం లోని అనుబంధ సంస్థకు దాదాపు $30 బిలియను నష్టం ఏర్పడిందని ఆ దేశములో పన్నులనుండి మినాయింపు లభించినదని ప్రకటించింది.[22] సంస్థలో $100 మిలియను కంటే తక్కువ డిపాసిట్ చేసిన ఖాతాదారుల యొక్క అన్ని వేలం-రేటు సేక్యూరిటీలను తిరిగి కొనడానికి మస్సచుసేట్ట్స్ సెక్రటరీ అఫ్ స్టేట్తో ఒప్పందం కుదిరినట్లు 2008 ఆగస్టు 22న CEO జాన్ తైన్ ప్రకటించారు. ఇది అక్టోబరు 2008లో మొదలయి జనవరి 2009లో విస్తరించబడింది.[23] సెప్టంబర్ 5, 2008న మెర్రిల్ లించ్ యొక్క స్టాక్ ను "కన్విక్షన్ సెల్"కు గోల్డ్ మాన్ సాక్స్ తగ్గించి సంస్థకు మరిన్ని నష్టాలు ఏర్పడవచ్చని హెచ్చరించింది.[24] సబ్ ప్రైం సంక్షోభంలో భాగంగా తనఖా-ఆధారిత సెక్యూరిటీలలో మెర్రిల్ లించ్ కు $51.8 బిలియను నష్టం వాటిల్లిందని సెప్టెంబర్ 2008న బ్లూంబెర్గ్ ప్రకటించింది.[24]

CDO వివాదాలు[మార్చు]

అనేక ఇతర బ్యాంకుల మాదిరిగానే మెర్రిల్ లించ్ కూడా తనఖా-ఆధారిత కొల్లేటరలైజ్డ్ డేట్ ఆబ్లిగేషన్ (CDO) మార్కెట్ లో 2000ల ప్రారంభములో భారీగా మునిగిపోయి ఉంది. క్రెడిట్ సంచికలో వచ్చిన ఒక వ్యాసం ప్రకారం, CDO మార్కెట్ లో అగ్రగామిగా మెర్రిల్ సాధించిన పురోగతి 2003లో క్రిస్టోఫర్ రిక్కియర్డి తన CDO బృందాన్ని క్రెడిట్ సుయిస్ ఫస్ట్ బోస్టన్ నుండి మెర్రిల్ కు తీసుకు రావడముతో మొదలయింది. [25] 2005లో తమ గ్లోబల్ మార్కెట్స్ అండ్ ఇన్వెస్టింగ్ గ్రూప్ "2004 సంవత్సరానికి గాను #1 ప్రపంచవ్యాప్త CDOల అండర్ రైటర్" అని డెరివేటివ్స్ వీక్ సంచిక వెనుక అట్టలో మెర్రిల్ ప్రకటనలు ప్రచురించింది[26]. CDO లకు తనఖాలను సరఫరా చేయడానికి సిద్దముగా ఉండటానికి వీలుగా దేశములోనే అతి పెద్ద సబ్ ప్రైం ఋణం జారీ చేసే సంస్థలలో ఒకటైన ఫస్ట్ ఫ్రాన్క్లిన్ ఫైనాన్షియల్ కార్ప్.ను మెర్రిల్ డిసంబర్ 2006న కొన్నది.[27] 2006-2007 మధ్యలో $93,000,000,000 విలువ గల 136 CDO లలో మెర్రిల్ 'అగ్రగామి అండర్ రైటర్' గా ఉన్న విధముని బిసినెస్ వీక్ తరువాత వివరించింది. 2007 చివరిలో ఈ CDO ల విలువ కుప్ప కూలడం మొదలయింది. కాని మెర్రిల్ వాటిలో కొంత భాగాన్ని అట్టి పెట్టుకుని ఉండటంతో సంస్థకు బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది. [28] 2008 మధ్యలో ఒకప్పుడు $30.6 బిలియను విలువ కలిగి ఉన్న CDO లను $1.7 బిలియను నగదు మరియు $5.1 బిలియను ఋణముకు లోన్ స్టార్ ఫండ్స్కు మెర్రిల్ అమ్మింది.[29][30]

ఏప్రిల్ 2009లో MBIA అనే బాండ్ భీమా సంస్థ మోసం మరియు అయిదు ఇతర ఉల్లంఘనలకు గాను మెర్రిల్ లించ్ పై దావా వేసింది. ఇవి MBIA నుండి మెర్రిల్ యొక్క 4 తనఖా-ఆధారిత కొల్లేటరలైజ్డ్ డేట్ ఆబ్లిగేషన్ లకు సంబంధించిన ఋణ డిఫాల్ట్ మార్పు "భీమ" ఒప్పందాలకు సంబంధించినవి. ఇవి "ML-సిరీస్" CDOలు, బ్రోడేరిక్ CDO 2, హైరిడ్జ్ ABS CDO I, బ్రోడేరిక్ CDO 3, మరియు న్యూబరీ స్ట్రీట్ CDO. ఈ CDOల నాణ్యత గురించి MBIA ను మెర్రిల్ మోసం చేసిందని MBIA ఆరోపించింది. ఈ ఫలాన CDO ల (CDO స్కొయర్డ్ మరియు క్యూబ్డ్) చిక్కైన గుణగణాలని వాడుకుని ఆగి ఈ సేక్యూరిటీలపై ఆధారపడి ఉన్నాయని వాటి నాణ్యత గురించి తమకు తెలిసిన సమస్యలను దాచిందని MBIA ఆరోపించింది. 2010లో జస్టిస్ బెర్నార్డ్ ఫ్రైడ్ ఒక చార్జ్ తప్ప మిగిలిన అన్నిటిని నిరాకరించారు. CDO లు AAA రేటింగ్ కలవి అని మెర్రిల్ చెప్పిందని కాని నిజానికి కావని అందువల్ల మెర్రిల్ ఒప్పంద ఉల్లంఘన చేసిందని MBIA చేసిన ఆరోపణలను మాత్రం అనుమతించారు. CDOలు విలువ కూలిపోయినప్పుడు, MBIA మెర్రిల్ కు పెద్ద మొత్తములో డబ్బు బాకీ పడి, సంస్థ మూసివేయబడింది. ఐతే మెర్రిల్ MBIA యొక్క ఆరోపణలను త్రోసిపుచ్చింది.[31][32][33]

2009లో రాబోబాంక్ 'నార్మా' అనే CDO కు సంబంధించి మెర్రిల్ మీద దావా వేసింది. ' ఇది గోల్డ్ మాన్ సాక్స్ వారి అబాకస్ CDOల సంబంధముగా తమను మోసం చేశారనే SEC యొక్క ఆరోపణ వంటిదే తమ ఆరోపణ కూడా అని రాబోబాంక్ తరువాత చెప్పింది. మగ్నేటర్ కాపిటల్ అనే పేరుగల ఒక హెడ్జ్ ఫండ్ ఆస్తులను నార్మాకు వెళ్లనిచ్చిందని, వాటికి వ్యతిరేకంగా పందెం కాసిందని కాని ఈ నిజాన్ని మెర్రిల్ తమకు తెలియజేయలేదని రాబోబాంక్ ఆరోపించింది. దానికి బదులుగా NIR గ్రూప్ ఆస్తులను ఎన్నుకుంటుందని మెర్రిల్ చెప్పినట్లు రోబోబాంక్ ఆరోపించింది. CDO విలువ పడి పోయినప్పుడు రాబోబాంక్ పెద్ద మొత్తములో మెర్రిల్ కు డబ్బు ఇవ్వవలసి వచ్చింది. రాబోబాంక్ యొక్క ఆరోపణలను మెర్రిల్ తిరస్కరించింది. "ఈ రెండు విషయాలకు సంబంధం లేదని ఈరోజు చేసే ఆరోపణలకు ఏ ఆధారము లేదని ఏడాది ముందు రాబోబాంక్ వేసిన దావాలో ఇవి లేవు" అని ఒక మెర్రిల్ ప్రతినిధి చెప్పారు.[34][35][36][37]

బ్యాంకు అఫ్ అమెరికాకు అమ్మకం[మార్చు]

కోలేటరైజ్ద్ డేట్ ఆబ్లిగేషన్స్ రూపములో ఉన్న ఆ సంస్థ యొక్క భారీ మరియు హెడ్జ్ చేయలేని తనఖా పోర్ట్ ఫోలియో యొక్క విలువ తగ్గడమే గణనీయంగా నష్టాలు ఏర్పడటానికి కారణాలని చెప్పబడుతాయి. మెర్రిల్ లించ్ యొక్క సాల్వన్సి మరియు స్వల్ప కాల రుణాలను రీఫైనాన్స్ చేసే సామర్ధ్యం వలన ఆ సంస్థ యొక్క వాణిజ్య భాగస్వాములకు నమ్మకం పోయి దాని అమ్మకానికి దారి తీసింది.[38][39] 2008 సెప్టెంబరు 8 వారములో లేహ్మన్ బ్రధర్స్ తీవ్రమైన లిక్విడిటీ సమస్యలు ఎదుర్కొని అసలు సంస్థ యొక్క భవిష్యత్తే ప్రశ్నార్ధకంగా మారింది. లేహ్మన్ బ్రధర్స్ విఫలమైతే ఆ సమస్య ఇతర పెట్టుబడి బ్యాంకులకు కూడా పాకవచ్చని మదుపరులు భయపడ్డారు. [ప్రభుత్వ అధికారులు సంస్థకు మెర్జర్ బాగస్వామి ఎవరని కూడా కనుక్కోలేకపోయే సరికి లేహ్మాన్ బ్రధర్స్ సెప్టంబర్ 15, 2008న దివాళా అర్జి పెట్టింది.] సెప్టంబర్ 14, 2008 నాడు తాము మెర్రిల్ లించ్ ను $38.25 బిలియనుకు స్టాక్ రూపములో కొనడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు బ్యాంకు అఫ్ అమెరికా ప్రకటించింది.[40]

మెర్రిల్ లించ్ ను బాంక్ అఫ్ అమెరికాకు ప్రతి మెర్రిల్ లించ్ స్టాక్ కు 0.8595 బ్యాంకు అఫ్ అమెరికా షేర్లు లేదా సుమారు US$50 బిలియను లేదా ప్రతి షేర్ కు $29 అనే ప్రాతిపదిక మీద అమ్మబడింది అని అదే రోజు తరువాత ది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకటించింది.[41] ఈ ధర సెప్టెంబరు 12 ముగింపు ధరకంటే 70.1% హెచ్చు లేదా మెర్రిల్ షేర్ యొక్క పుస్తక విలువ అయిన $21 కంటే 38% హెచ్చు.[42] కాని ఇది ఆ సంస్థ యొక్క సెప్టెంబరు 2007 నాటి ధరకంటే 61% తక్కువ.[43] బ్యాంక్ ఆఫ్ అమెరికా CEO అయిన కెన్నెత్ లేవిస్ ఇచ్చిన విభిన్న వర్గాల సమావేశంలోని వాంగ్మూలం మరియు హౌస్ ఓవర్ సైట్ కమిటీ విడుదల చేసిన ఆంతరంగిక ఈ మెయిల్స్ ద్వారా బ్యాబ్క్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ ను స్వాదీనపరుచుకోకపోతే దాని యొక్క నిర్వాహకులను, బోర్డుని నిర్మూలించటమే కాక ఆ బ్యాంకుకు ఫెడరల్ నియంత్రణాధికారుల మధ్యన ఉన్న సంబంధాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది.[44][45][46]

2008 లో మెర్రిల్మా లించ్ర్చ్ బెయిల్ తెచ్చుకోవటానికి, AIGతో ఇన్షూరెన్స్ సర్దుబాట్ల ద్వారా బిలియన్ల డాలర్లు అందుకుందని, అందులో $6.8 బిలియన్లు యునైటెడ్ స్టేట్స్ యొక్క పన్ను కట్టే ప్రజలు ఇచ్చిన సొమ్ము ఉందని 2009 లో నివేదికలో తెలిపారు.[47][48]

ఆరంజ్ కౌంటీ సర్దుబాటు[మార్చు]

పూర్వ ఆరంజ్ కౌంటి కోశాధికారి రాబర్ట్ సిట్రన్ కు, తగని మరియు ఆపదతో కూడిన పెట్టుబడులను మెర్రిల్ లించ్ అమ్మిందనే ఆరోపణలను పరిష్కరించడానికి మెర్రిల్ లించ్ అతిపెద్ద మొత్తమైన $400 మిలియను ఆరంజ్ కౌంటీ కలిఫోర్నియాకు చెల్లించింది. సిట్రన్ $1.69 బిలియను నష్ట పోవడముతో కౌంటి డిసంబర్ 1994న దివాళా అర్జి పెట్టింది. కౌంటి డజనుకంటే ఎక్కువ సంస్థలు, సలహాదారులు, అక్కౌంటంట్ ల పై దావా వేసింది. కాని తమ బాధ్యతను ఒప్పుకోకుండా మెర్రిల్ జూన్ 1998 నాడు సర్దుబాటు చేసుకుంది. కౌంటి సుమారు మొత్తము $600 మిలియను రాబట్ట కలిగింది (మెర్రిల్ లించ్ వారి $400 మిలియనుతో కలిపి).

నియంత్రణా విధానాలు[మార్చు]

పరిశోధనా విశ్లేషకుని వివాదపరిష్కారం[మార్చు]

2002 లో మెర్రిల్ లించ్ 100 మిలియన్ డాలర్లకు గతి తప్పిన పరిశోధనను ప్రచురణ చేసినందుకు జరిమానా చెల్లించింది. న్యూ యార్క్ అటార్నీ జనరల్ మరియు ఇతర రాష్ట్ర సెక్యూరిటీ నియంత్రణ కర్తలతో ఒప్పందం ఆధారంగా, మెర్రిల్ లించ్ పరిశోధన యొక్క వివరాలను వెల్లడించటం మరియు పెట్టుబడి బాంకింగ్ వ్యవస్థ నుండి పరిశోధనను విడదీసే అంశాలపై దృష్టి పెట్టింది.[49]

ఒక ప్రఖ్యాత విశ్లేషకుడైన హెన్రీ బ్లోద్జేట్ తన కంపెనీ ఈ మెయిల్స్ లో స్టాక్స్ గురించిన తన విశ్లేషణను తెలుపగా అది మెర్రిల్ బాహాటంగా ప్రచురించిన విషయానికి విరుద్ధంగా ఉంది. 2003 లో అతని సివిల్ సెక్యూరిటీల మోసపూరిత చర్య కారణంగా U.S. సెక్యూరిటీలు మరియు ఎక్స్చేంజ్ కమిషన్ వారు అతనిపై నేరం ఆపాదించారు. అతను తనపై మోపబస్డిన నేరాలు అంగీకరించటం కానీ నిరాకరించటం కానీ చేయకుండానే స్థిరపడ్డాడు. తరువాత దశలో అతను సెక్యూరిటీల పరిశ్రమ నుండి జీవితాంతము బహిష్కరించబడ్డాడు. అతను $2 మిలియన్ జరిమానా మరియు $2 మిలియన్ వసూలు సొమ్ము చెల్లించాడు.

అప్పటి CEO అయిన డేవిడ్ కొమాన్స్కీ అన్నదేమంటే......, "నేను అనుకుంటున్నాను...బాహాటంగా మా వినియోగాదారులు అందరికీ, మా వాటాదార్లకు మరియు మా ఉద్యోగస్ట్లులకు క్షమాపణ చెప్పాలని," ఎందుకంటే పరిశోధనా విభాగంలో కంపెనీ అత్యుత్తమ విలువలు నిలుపుకోలేకపోయింది కాబట్టి.

ఎన్రాన్/మెర్రిల్ నైజీరియన్ దుండగుడిని హత్యగావించటం[మార్చు]

2004 లో మెర్రిల్ నిర్వాహకుల యొక్క నేర నిరూపణలు, ఎన్రాన్ విచారణలో ప్రభుత్వం, బ్యాంకులు గానీ సెక్యూరిటీల వ్యాపార సంస్థల యొక్క కానీ ఉద్యోగులపై, నేరారోపణ కావించిన ఒకే ఒక సందర్భము. ఆ కేసు మెర్రిల్, ఎన్రాన్ మరియు నైజీరియ దేశంలోని తీర ప్రాంతపు విద్యుత్ బార్జేస్ యొక్క అమ్మకానికి సంబంధించిన 1999 సంవత్సరపు లావాదేవీల చుట్టూ తిరిగింది. 1999 లో నైజీరియాలో ఎన్రాన్ ఎంటిటీ మెర్రిల్ లించ్ కు శక్తి బార్జేస్ అమ్మటానికి సంబంధించి అంశం ఒక మోసం అని, అసలు ఎ రకమైన అమ్మకం కానీ లాభం కానీ లేకుండానే దాని ద్వారా ఎన్రాన్ ప్రీటాక్స్ లాభంవలె చట్టవిరుద్ధంగా $12 మిలియన్లు సంపాదించిందని ఆపాదించబడింది.

నలుగురు గతం లోని మెర్రిల్ ఉన్నతస్థాయి అధికారులు మరియు ఇద్దరు మధ్య స్థాయి ఎన్రాన్ అధికారులు పై మోసము మరియు కుట్ర నేరాలు ఆపాదించబడ్డాయి. మెర్రిల్ తన ఒప్పందాన్ని తానే ఉపసంహరించుకుని, బ్యాంకర్లను ఉద్యోగాలనుండి తీసివేసి, తన యొక్క ఆర్ధిక ప్రణాళికలు, లావాదేవీల లోని అత్యుత్సాహము తప్పని ఒప్పుకుంది. U.S. సెక్యూరిటీల మరియు ఎక్స్చేంజ్ కమిషన్ ఆపాదించిన సివిల్ కుట్ర నేరాలను నిజమా కదా అని తేల్చకుండానే ఈ విధంగా పరిస్థితి చక్కపరచబడింది.[50]

పక్షపాత ధోరణులు గురించిన ఆరోపణలు[మార్చు]

2007 జూన్ 26 న U.S. ఈక్వల్ ఏమ్ప్లోయ్మెంట్ ఆపర్చ్యునిటీ కమిషన్ (EEOC) మెర్రిల్ లించ్ కి వ్యతిరేకంగా చట్టంలో వ్యాజ్యం వేసి, [51] ఆ సంస్థ డాక్టర్ మాజిద్ బోరుమాండ్ కు వ్యతిరేకంగా, అతను ఇరానియన్ జాతీయుడు మరియు ఇస్లామిక్ మతస్తుడనే వివక్షను, అతని యొక్క సామాజిక హక్కులను తీవ్రంగా ధిక్కరిస్తూ వివక్ష చూపించిందని నేర ఆరోపణ చేశారు.[52] EEOC చట్టపు వ్యాజ్యం, ఆ సంస్థలోని సభ్యులు ఉద్దేశపూర్వకంగానే తప్పులు చేశారని మరియు వారి దురుద్దేశాన్ని బహిర్గతపరచారని అన్నది. మెర్రిల్ లించ్ లోని ఒక ఇరానియన్ ఉద్యోగిని బాధించిన కారణాన, మరొక కేసులో 2007 జూలై 20 లో NASD మధ్యవర్హిత్వం వహించిన పానెల్ మెర్రిల్ లించ్ ని తన పూర్వపు ఇరానియన్ ఉద్యోగికి నష్టపరిహారం చెల్లించాలని ఆజ్ఞాపించింది.[53][54][55] మెర్రిల్ లించ్ యొక్క కార్యక్రమాలు నేషనల్ ఇరానియన్-అమెరికన్ కౌన్సిల్ మరియు అమెరికన్-అరబ్ విచక్షణా వ్యతిరేక కమిటీల నుండి వ్యతిరేకతలను ప్రదర్శించేలాగా చేశాయి.[56]

జూన్ 2008 దైవెర్సిటీ Inc. అను సంచికలో, మెర్రిల్ లించ్ ను లెస్బియన్, గే, బైసెక్షువల్ మరియు లింగమార్పిడి జరిగిన ఉద్యోగస్తులు కలిగిన మొట్టమొదటి పది కంపెనీలలో 7 వదిగా U.S. మొత్తం మీద నిలిచింది. డైవర్సిటీ మాగజైన్ 2007 లో మెర్రిల్ లించ్ ను US లోని వికలాంగ ప్రజలకు ఇది రెండవ అత్యుత్తమ కంపెనీగా నమోదు అయింది.[57] 2008 జూన్ 5 లో, మెర్రిల్ లించ్ వారు పశ్చిమ ఏషియన్, తూర్పు మధ్య ప్రాంతపు మరియు ఉత్తర ఆఫ్రికన్ (WAMENA) వృత్తిపరమైన వ్యవస్థను స్థాపించి, సహాయం చేయటానికి మరియు ఇతరత్రా ఉపాధి సదుపాయాలు వివిధ రకాల నేపథ్యాలవారికి కల్పించటానికి పూనుకున్నారు. మే 2008 లో, డైవర్సిటీ ఎడ్జ్ సంచిక మెర్రిల్ లించ్ ను "వైవిధ్య కాలేజీ గ్రాడ్యుయేట్ల"కు #1 US కంపెనీగా మైక్రోసాఫ్ట్ ను అధిగమించి అత్యధిక స్థాయిలో నిలిచింది.[58]

న్యూ జెర్సీ న్యాయస్థానములో ఆగస్టు 13 న 2008 సంవత్సరములో మెర్రిల్ని లించ్వేకు వ్యతిరేకంగా పక్షపాతము చూపించారంటూ ఒక గే ఉద్యోగి విన్నవించుకున్నాడు.[59]

మార్కెట్ టైమింగ్ సెటిల్మెంట్[మార్చు]

ఫోర్ట్ లీ న్యూ జెర్సీ కార్యాలయం నుండి జరిగిన అక్రమ కార్యకలాపాలకు గాను 2002లో మెర్రిల్ లించ్ 10 మిలియను జరిమానా విధించింది. ముగ్గురు ఆర్ధిక సలహాదారులు మరియు కొంత మేరకు నాల్గవ సలహాదారుడు, మిల్లియనియం పార్ట్నర్స్ అనే ఒక ఖాతాదారుడు కొరకు 12,457 లావాదేవీలను కనీసం 40 మారే తరహాలోని అన్యుటి ల యొక్క 21 మ్యూచువల్ ఫండ్ లలోను 63 మ్యూచువల్ ఫండ్ సబ్ అకౌంట్ లలోను పెట్టారు. మిల్లియనం సగాని కంటే ఎక్కువ ఫండ్ లు మరియు ఫండ్ సబ్ అకౌంట్ లలోను లాభాలు పొందింది. మిల్లియనం లాభాలు పొందిన ఫండ్ లలో దాని లాభాలు $60 మిలియనులు అయ్యాయి. ఈ ఆర్ధిక సలహాదారులను సరైన రీతిలో పర్యవేక్షణ లేదు. ఈ సలహాదారులు మార్కెట్ టైమింగ్ ద్వారా మ్యూచువల్ ఫండ్ లనుండి కొలది కాలపు లాభాలను తీసేసి దీర్ఘ-కాలపు మదుపరులకు హాని చేశారు.[60]

2008 బోనస్ చెల్లింపులు[మార్చు]

"విశేషమైన సమయములో" బిల్లియన్ల డాలర్ల చెల్లింపును బోనస్ గా ఇవ్వడానికి మెర్రిల్ లించ్ సన్నాహాలు చేసింది. $3.6 బిలియను విలువగా ఈ బోనస్ లు సంస్థ ప్రభుత్వము నుండి TARP బైల్అవుట్ క్రింద తీసుకున్న సొమ్ములో మూడులో ఒక వంతు.

అంటే కాక, బోనస్ తీసుకున్న సమయము అనేక అమెరికా ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. ఎందుకంటే, ఈ బోనస్ లు సంస్థ బ్యాంక్ అఫ్ అమెరికాచే కొనబడే ముందే అంగీకరించబడ్డాయి. BOA కనుక రక్షించి ఉండక పొతే, మెర్రిల్ కుప్ప కూలేదని ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే.[ఉల్లేఖన అవసరం] 2008లో మెర్రిల్ కు బిల్లియన్ల నష్టం వాటిల్లింది. అయినా 3.6 బిలియను బోనస్ క్రింద చెల్లించారు.

మెర్రిల్ బోనస్ లను మెర్రిల్ యొక్క పరిహార సంఘం తమ డిసంబర్ 8, 2008 రోజు జరిగిన సమావేశములో, BOA వాటాదారులు మెర్జర్ ను అనుమతించిన వెనువంటనే కాని నల్గువ త్రైమాసిక ఆర్ధిక ఫలితాలు ప్రకటించే ముందు, నిర్ధారించారు. ఇది సంస్థ సాధారణ ఆచరణ విధము నుండి భిన్నంగా ఉంది. మెర్రిల్ ఇచ్చిన బోనస్, ఒక ప్రదర్శన బోనస్. అంటీ, సంస్థ విధానము ప్రకారం, ఇటువంటి బోనస్ మొత్తము నాలుగు త్రైమాసికాల ప్రదర్శనలను పరిగణలోనికి తీసుకుని జనవరి లోనో ఆ తరువాతనో చెల్లించబడుతుంది. కాని ఇప్పుడు, బోనస్ లను డిసంబర్ లోనే, నాల్గవ త్రైమాసిక ప్రదర్శన తెలియకముందే ప్రకటించారు.

మెర్రిల్ కు TARP ఇచ్చిన మొత్తముతో పోల్చుకుంటే, ఈ బోనస్ లు చాలా పెద్ద మోత్తాలే. ప్రభుత్వం మెర్రిల్ కు కేటాయించిన TARP సొమ్ములో మెర్రిల్ బోనస్లు 36.2%తో సమానము. ఈ బోనస్ పొందాలంటే, ఉద్యోగులు జీతం కనీసం $300,000 గా ఉండి, ఉప-అధ్యక్షుడు లేదా దానికంటే పెద్ద పదవి కలిగి ఉండాలి.[61][62]

ఇతర ఇబ్బందులు[మార్చు]

2009లో బ్యాంక్ కు €2.75m జరిమానా విధించబడింది. రెండు సంఘటనలలో లండన్ లోని వర్తకులు తమ పోసిషన్ లను సరిగ్గా విలువల కట్టడంలో విఫలమయి, సంస్థకు $461m నష్టం వాటిల్లేలా చేశారు. "సక్రమమైన మరియు పారదర్శకత పరివీక్షత మెర్రిల్ లో లేక పోవడము" మరియు "వర్తకుక కార్యకాలాలను పరివీక్షించడములో విఫలమవ్వడం, నెలాఖరులో ధర సరిచూసే స్వతంత్ర ప్రక్రియ లేక పోవడం" వంటి కారణాల వాళ్ళ ఇది జరిగింది. "వర్తకుల కార్యకాలపాలకు సంబంధించి మార్కెట్ రిస్కు హద్దులను సక్రమంగా నిర్వహించలేక పోవడము" కూడా ఇంకొక కారణము.[63][64][65]

$11 మిలియను రుసుము పుచ్చుకున్న తరువాత ఆంగ్లో ఐరిష్ బ్యాంకు "ఆర్ధికంగా స్థిరంగా" ఉందని మెర్రిల్ నివేదిక ఇవ్వడం గురించి సంస్థ తీవ్ర విమర్శకు గురయింది. కొన్ని రోజుల తరువాతే సంస్థ దేశీయము చేయబడింది.[66]

పారిశ్రామిక అవార్డులు[మార్చు]

2008లో 2008 ALB SE ఆసియా లా అవార్డ్స్లో మెర్రిల్ లించ్ కు డీల్ అఫ్ ది ఇయర్ - ఈక్విటి మార్కెట్ డీల్ అఫ్ ది ఇయర్ అవార్డ్ ఇవ్వబడింది.[67]

2008 ALB చైనా లా అవార్డ్స్ [67] లో, మెర్రిల్ లించ్ కు డీల్ అఫ్ ది ఇయర్ - ఈక్విటి మార్కెట్ డీల్ అఫ్ ది ఇయర్ అవార్డ్ ఇవ్వబడింది. 2008 ALB హాంగ్ కాంగ్ లా అవార్డ్స్ [67] లో, మెర్రిల్ లించ్ కు డీల్ అఫ్ ది ఇయర్ - M&A డీల్ అఫ్ ది ఇయర్ అవార్డ్ ఇవ్వబడింది.

ఇవి కూడా చూడండి[మార్చు]

Lua error in package.lua at line 80: module 'Module:Portal/images/c' not found.

సూచనలు[మార్చు]

 1. http://www.namedevelopment.com/blog/archives/2009/01/merrill_lynch_n.html
 2. http://www.ml.com/index.asp?id=7695_8134
 3. "మేక్కోరీ స్టోర్స్ కార్పోరేషన్," ప్రదర్శింపబడిన ప్రకటన, థ న్యూ యార్క్ టైమ్స్, డిసెంబరు 15, 1915, పుట. 18. మొత్తంగా: ఒక పెట్టుబడితో కూడిన ముందు జాగ్రత్త, మంచి ఆదాయం మరియు మార్కెట్ విలువ అభివృద్ది చెందే అవకాశాలు ప్రేఫెర్డ్ స్టాక్ లో మేక్కోరీ స్టోర్స్ కార్పోరేషన్ వారు ఉంచారు. ఈల్డ్ 7% యొక్క ధర. సర్కులర్ కోరు వ్రాయండి. T. M. మెర్రిల్, లించ్ & కో. 7 వాల్ స్ట్రీట్, న్యూ యార్క్. పెనోబ్సోట్ బిల్డింగ్. డిట్రాయిట్. టెలిఫోన్ రెక్టర్ 4940.
 4. "$15,000,000 కోరుకున్న క్రూసిబుల్ స్టీల్." ది న్యూ యార్క్ టైమ్స్, డిసెంబర్ 19, 1940, పే. 39, "మెర్రిల్ లించ్, ఈ. ఎ. పియర్స్ అండ్ కసాట్," అని వర్ణిస్తూ, "లించ్ తరువాత ఒక కామా మరియు "అండ్" అనే పదానికి బదులుగా అంపెర్సాండ్ వడబడి, మాన్టన-డకోటా యుటిలిటీస్ కంపని జారీ చేసిన బాండ్ లను అండర్ రైటింగ్ చేసే సంస్థలలో ఒకటిగా వివరించబడింది."
 5. "రేవైసింగ్ ఎ సోనరస్ పీస్ అఫ్ అమెరికానా: మెర్రిల్ లించ్, పియర్స్, ఫెన్నేర్ అండ్ స్మిత్." ది న్యూ యార్క్ టైమ్స్, డిసెంబర్ 31, 1957, పే. 29
 6. మెర్రిల్ లించ్ - టోటల్ మెర్రిల్ - టోటల్ మెర్రిల్
 7. ఎడ్విన్ జే. పెర్కిన్స్, వాల్ స్ట్రీట్ టు మెయిన్ స్ట్రీట్: చార్లస్ మెర్రిల్ మరియు మిడిల్-క్లాస్ ఇన్వెస్టర్స్ , కేంబ్రిడ్జ్ యూనివెర్సిటీ ప్రెస్: 1999
 8. రాన్ చెర్నో, ది హౌస్ అఫ్ మోర్గన్ , టచ్ స్టన్ బుక్స్, 1990.
 9. జేమ్స్ బి. స్తేవర్ట్, దెన్ అఫ్ థీవ్స్ , టచ్ స్టోన్ బుక్స్, 1992. "1971 లో, వాల్ స్ట్రీట్ "యోధులు" మరియు "WASP" సంస్థాలుగా విబజించాబడి ఉంది. క్రితములో పెద్ద సంస్థలు మరియు బ్యాంకులు యోదులకు వ్యతిరేకంగా పక్షపాత వైఖరి ప్రదిర్శించిన సమయములో వాల్ స్ట్రీట్ మెరిట్ కు సాహసానికి ప్రాధాన్యత ఇచ్చేది. గోల్డ్ మాన్, సాక్స్, లేహ్మన్ బ్రదర్స్ మరియు కున్, లోఎబ్ & కో. వంటి సంస్థలు (చారిత్రాత్మికంగా జర్మన్ వారసత్వం కలిగిన యోధులుతో కూడిన సంస్థలు) అత్యంత ప్రతిష్టాత్మక WASP సంస్థలు హొదాలో చేరాయి:మోర్గాన్ స్టాన్లీ—జే. పి. మోర్గాన్ యొక్క ఆర్ధిక సామ్రాజ్యం నుండి పుట్టినది—ఫస్ట్ బోస్టన్, డిల్లాన్, రీడ్, మరియు బ్రౌన్ బ్రోధర్స్ హర్రిమన్. అతిపెద్ద సంస్థైన మెర్రిల్ లించ్ పియర్స్ ఫెన్నేర్ & స్మిత్, ఒక రకంగా చూస్తే క్రమరహితమినది, ఒకప్పుడు "కాతోలిక్" సంస్థ అని భావించబడేది. కిడ్డేర్, పీబాడి స్థిరంగా WASP కేంప్ లోనే ఉండిపోయింది."
 10. "మెర్రిల్ లించ్ క్వాక్స్ లైక్ ఎ బాంక్," ఫార్చూన్, అక్టోబర్ 20, 1980
 11. http://www.tijd.be/nieuws/ondernemingen/financien/artikel.asp?Id=3331161
 12. మెర్రిల్ లించ్ నివేదికలు
 13. http://money.cnn.com/news/newsfeeds/articles/djf500/200804250840DOWJONESDJONLINE000645_FORTUNE5.htm
 14. Stephen Bernard and Ieva M. Augstums (2009-01-22). "Former Merrill chief Thain out at Bank of America". Associated Press. Retrieved 2009-01-22. Cite news requires |newspaper= (help)
 15. Eric Dash, Louise Story and Andrew Ross Sorkin (2009-01-15). "Bank of America to Receive Additional $20 Billion". The New York Times. Retrieved 2009-01-22. Cite news requires |newspaper= (help)
 16. 16.0 16.1 Jenny Anderson (2007-11-15). "NYSE Chief Is Chosen to Lead Merrill Lynch". The New York Times. Retrieved 2008-09-14. Cite news requires |newspaper= (help)
 17. 17.0 17.1 Eric Dash (2007-12-25). "Merrill Lynch Sells Stake to Singapore Firm". The New York Times. Retrieved 2008-09-14. Cite news requires |newspaper= (help)
 18. 18.0 18.1 18.2 Louise Story (2008-07-11). "Chief Struggles to Revive Merrill Lynch". The New York Times. Retrieved 2008-09-14. Cite news requires |newspaper= (help)
 19. "Merrill Lynch Announces Substantial Sale of U.S. ABS CDOs, Exposure Reduction of $11.1 Billion". Market Watch. 2008-07-28. Retrieved 2008-09-14. Cite news requires |newspaper= (help)
 20. "Merrill Lynch to cut mortgage-backed securities, raise new capital by issuing shares". International Herald Tribune. 2008-07-29. మూలం నుండి 2012-12-08 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-09-14. Cite web requires |website= (help)
 21. 21.0 21.1 "Lawsuit threat to Merrill Lynch". British Broadcasting Corporation. 2008-08-15. Retrieved 2008-09-14. Cite news requires |newspaper= (help)
 22. "Merrill Lynch freezes jobs and UK tax liability". The Banking Times. 2008-08-17. Retrieved 2008-09-14. Cite web requires |website= (help)
 23. Frank Quaratiello (2008-08-22). "Merrill Lynch settles up". The Boston Herald. Retrieved 2008-09-14. Cite news requires |newspaper= (help)
 24. 24.0 24.1 Brett Miller (2008-09-05). "Merrill Lynch Cut to 'Sell' at Goldman on Writedowns". Bloomberg.com. Retrieved 2008-09-14. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help); Cite web requires |website= (help)
 25. మెర్రిల్ లించ్ (ప్రొఫైల్), డలియా ఫామి రచించినది, క్రెడిట్ సంచిక (రిస్క్.నెట్ లో పునఃప్రచురించిన విధముగా), 2005 మే 1, 2010 4 29 న చూడబడింది
 26. "Derivatives Week, Merrill Lynch advertisement" (PDF). 2005 11 7. మూలం (pdf) నుండి 2011-07-09 న ఆర్కైవు చేసారు. Retrieved 2010 4 29. Cite web requires |website= (help); Check date values in: |accessdate=, |date= (help)
 27. http://money.cnn.com/magazines/fortune/fortune_archive/2007/11/26/101232838/
 28. మెర్రిల్ లించ్ ఎందుకు కాలిపోయింది, మాథ్యూ గోల్డ్ స్టెయిన్, 2007 ఆక్టోబర్ 25
 29. మెర్రిల్ $8.5 బిలియను విలువగల స్టాక్ మరియు CDOలను అమ్మబోతుంది(అప్డేట్ 3), బ్రాడ్లీ క్యోన్ మరియు క్రిస్టిన్ హర్పెర్ రచన, బ్లూమ్బెర్గ్.కామ్, 2010 4 29 న చూడబడింది
 30. మేర్రిల్ల్స్ పిక్ద్ పాకట్స్, రోడ్డి బోయ్ద్, ఆగస్ట్ 6, 2008, cnn.com, 2010 4 26 న చూడబడింది
 31. Supreme Court of New York County (2009 Apr). "MBIA Insurance Co. v Merrill Lynch" (PDF). mbia.com. మూలం (pdf) నుండి 2010-12-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2010 4 23. Cite web requires |website= (help); Check date values in: |accessdate=, |date= (help)
 32. MBIA మెర్రిల్ లించ్ పై దావా వేసింది , వాల్ స్ట్రీట్ జర్నల్, సెరీనా Ng, 2009 మే 1, 2010 4 23 న చూడబడింది
 33. UPDATE 1- మెర్రిల్ పై MBIA వేసిన దావాలో అనేక నిందలను జడ్జి నిరాకరించారారు ఏప్రిల్ 9, 2010, ర్యూటర్స్, ఎడిత్ హోనన్, ed. జేరల్ద్ ఈ. మక్కార్మిక్
 34. ఒక దావా మెర్రిల్ లించ్ పాత్రను సూచిస్తుంది, జేస్సే ఎసిన్గర్ మరియు జాక్ బెర్న్స్టెయిన్, ప్రోపబ్లికా - ఏప్రిల్ 9, 2010 , 2010 4 23 న చూడబడింది
 35. జడ్జ్ బెర్నార్డ్ ఫ్రైడ్, NY సుప్రీం కోర్ట్ కు లేఖ. విషయము: రాబోబాంక్ మరియు మెర్రిల్ లించ్, జోనాథన్ పిఖార్డ్, క్విన్ ఏమన్యువేల్ ఉర్క్వహర్ట్ & సల్లివన్, 2010 4 16, ప్రోపబ్లికా ద్వారా, 2010 4 23 న చూడబడింది
 36. వాల్ స్ట్రీట్ విజార్డ్రి యమ్ప్లిఫైడ్ క్రెడిట్ క్రైసిస్ , వాల్ స్ట్రీట్ జర్నల్, కార్రిక్ మోల్లెన్కాంప్ మరియు సెరీనా Ng, 2007 12 27, 2010 4 23 న చూడబడింది(ఈ వ్యాసం నార్మా CDO లను వివరిస్తుంది)
 37. గోల్డ్ మాన్ వాడిన అదే మోసాన్ని మెర్రిల్ వాడింది (అప్డేట్1), విలియం మక్క్విలేన్ పట్రిశియ హర్టడో తో పాటు, ed: పాట్రిక్ ఆస్టర్, జాన్ పికేరింగ్. ఏప్రిల్ 16, 2010, బ్లూంబెర్గ్ బుసినెస్వీక్, 2010 4 23 న చూడబడింది
 38. Morgenson, Gretchen (2008-11-08). "The Reckoning: How the Thundering Herd Faltered and Fell". New York times. Retrieved 2008-11-13. Some banks were so concerned that they considered stopping trading with Merrill if Lehman went under, according to participants in the Federal Reserve's weekend meetings on Sept. 13 and 14 [2008].
 39. Paulden, Pierre (2008-08-26). "Merrill, Wachovia Hit With Record Refinancing Bill (Update1)". Bloomberg News. Retrieved 2008-11-12. In response to a slump in demand for their bonds, financial firms, which have incurred $504 billion of writedowns and credit losses since the start of 2007, are selling assets such as mortgage securities and collateralized debt obligations at fire- sale prices to pay down looming maturities.
 40. Andrew Ross Sorkin (2008-09-14). "Bank of America in Talks to Buy Merrill Lynch". The New York Times. Cite news requires |newspaper= (help)
 41. Matthew Karnitschnig (2008-09-14). "Bank of America Reaches Deal for Merrill". The Wall Street Journal. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help); Cite news requires |newspaper= (help)
 42. http://www.newsweek.com/id/159010
 43. http://archive.is/20120920102434/http://www.forbes.com/equities/2008/09/15/bofa-merrill-deal-markets-equity-cx_er_0915markets2.html?partner=newsweek
 44. LOUISE STORY and JO BECKER (2009-06-11). "Bank Chief Tells of U.S. Pressure to Buy Merrill Lynch". New York Times. Retrieved 2009-06-13. Cite news requires |newspaper= (help)
 45. Scott Lanman and Craig Torres (2009-06-10). "Republican Staff Says Fed Overstepped on Merrill Deal (Update1)". Bloomberg.com. Retrieved 2009-06-13. Cite news requires |newspaper= (help)
 46. BARBARA BARRETT (2009-06-10). "BofA documents, e-mails show pressure to buy Merrill Lynch". Miami Herald. Retrieved 2009-06-13. Cite news requires |newspaper= (help)
 47. బిలియన్ల బెయిల్ అవుట్ ను AIG విదేశాలకు పంపుతుంది, ది పోలిటికో, మార్చ్ 15, 2009
 48. పన్ను కట్టేవారు సొమ్ము నుండి తాము డబ్బు చెల్లించిన సంస్థల జాబితాను A.I.G. ప్రకటిస్తుంది, ది న్యూ యార్క్ టైమ్స్, మార్చ్ 15, 2009
 49. http://www.reuters.com/article/fundsFundsNews/idUSN0519185620070905
 50. http://www.forbes.com/2004/09/20/cx_da_0920topnews.html
 51. మెర్రిల్ ముస్లీంను చూసే విధానం పై U.S. దావా వేసింది
 52. http://online.wsj.com/public/resources/documents/eeoc062607mer1.pdf EEOC vs. Merrill Lynch $ Co. - Complaint
 53. పక్షపాత వైఖరి తీర్పు మెర్రిల్ కు మరొక చివాటు
 54. తొలగించబడిన ఇరానియన్ బ్రోకర్ మెర్రిల్ నుండి $1.6M గెలిచాడుj
 55. "Amended Award" (PDF). WSJ.com. 2007-07-20. Retrieved 2008-09-15. Cite web requires |website= (help)
 56. "EEOC: Merrill Lynch Hired Iranian for His Brains, Fired Him for His Nationality". NIA Council. 2007-07-04. Retrieved 2008-09-15. Cite web requires |website= (help)
 57. http://magazine.diversityinc.com/link/div/2007/NOV/75
 58. "The Diversity Edge Announces its 2008 Best Companies for Diverse Graduates". The Diversity Edge. 2008-05-29. Retrieved 2008-09-15. Cite web requires |website= (help)
 59. "Single Anti-Gay Remark Sufficient for Hostile Workplace Claim, N.J. Court Says". Law.com. 2008-08-15. Retrieved 2008-09-15. Cite web requires |website= (help)
 60. http://www.consumeraffairs.com/news04/2005/nj_merrill.html
 61. Story, Louise (2009-02-12). "Nearly 700 at Merrill in Million-Dollar Club". The New York Times. Retrieved 2010-03-27. Missing |author1= (help)
 62. http://www.huffingtonpost.com/2009/03/30/merrill-lynch-bonuses-22_n_180780.html
 63. http://www.independent.ie/business/irish/irish-unit-of-merrill-lynch-fined-8364275m-by-regulator-1923508.html
 64. http://www.independent.ie/business/irish/exregulator-redfaced-as-bank-hit-by-8364275m-fine-1923992.html
 65. http://www.financialregulator.ie/publications/Documents/Merrill%20Lynch%20Publicity%20statement.pdf
 66. http://www.independent.ie/national-news/failed-bank-got-all-clear-in-report-that-cost-state-836474m-1934598.html
 67. 67.0 67.1 67.2 http://www.legalbusinessonline.com.au

మరింత చదవడానికి[మార్చు]

 • Stiles, Paul (1998). Riding the Bull: My Year in the Madness at Merrill Lynch. New York: Times Business. ISBN 0812927893.
 • Perkins, Edwin (1999). Wall Street to Main Street: Charles Merrill and Middle-Class Investors. New York: Cambridge University Press. ISBN 0521630290.
 • Schooley, Keith (2002). Merrill Lynch: The Cost Could Be Fatal: My War Against Wall Street's Giant. Enid: Lakepointe Publishing. ISBN 0971610363.

బాహ్య లింకులు[మార్చు]

మూస:Major investment banks మూస:2008 economic crisis