మెల్లీ సోలింగర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మెల్లీ సోలింగర్ (1898-1965):  స్విట్జర్లాండులో జన్మించిన సామాజిక ఉద్యమ కర్త ,ఈవిడ యూరప్ లో ను అక్కడ మహిళల ఓటుహక్కు ఉద్యమంలోనూ, కార్మికోద్యమాల్లోనూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆపై, 1929లో భారత దేశం వచ్చాక జాతీయోద్యమంలో పాలుపంచుకున్నారు[1]

బాల్యం[మార్చు]

మెల్లీ సోలింగర్ 28.3.1898 న జ్యూరిచ్ స్విట్జర్లాండ్ లో జన్మించారు, ఈమె తల్లిదండ్రులు జర్మను మాతృభాషగా గల్గిన స్విట్జర్లాండ్ దేశస్తులైన ఆధల్ఫ్, బెర్తా సోలి గరు . సంపన్న గృహసులగుటచే కుమారెకు వున్నతవిద్య చెప్పించవలననే అభిలాషతో సెంటో కాయిల్స్ నగరంలో ఫ్రెంచి భాషలో పాండి త్యం సంపాదించుటకుగాను, ఆ నగరంలో ప్రసిద్ధిచెందిన బోర్డింగు స్కూలుకు పంపారు, ఆ స్కూలునుండి మెట్రిక్యులేషన్ పరీక్ష 1914 లో పాసైన తరువాత జ్యూరిచ్ నగరంలో హోము సైన్సు కాలేజీలో ప్రవే శించి మూడు సంవత్సరముల తరువాత పట్టభద్రురాలు అయ్యారు వైద్య విద్య లో ప్రవేశించి అది పూర్తి చేయకుండానే కుటుంబ పరిస్థితుల వలన తండ్రి రసాయనిక పట్టు వ్యాపారం లో చేరారు 1920 వరకు అందులో పనిచేసి అందులో భాగంగా యూరోపు ఇంగ్లాండ్ పర్యటన 1920 నుండి 1922 వరకు దక్షిణ జర్మనీ మొదలగునవి పర్యటించారు . అప్పట్లో ట్యూబిన్ గన్ యూనివర్శిటీలో విద్య నభ్యసించుచున్న ఉప్పల లక్ష్మణరావు తో పరిచయ మేర్పడినది.అప్పటికే ఆమెకు హిందూదేశము పట్ల అభిమానమేర్పడి. సుప్రసిద్ధ ఇండాలజిస్టు ఓల్డెన్ బరు వేదముల గురించి. బౌద్ధమతమును గురించి గ్రంథములూ, హిందూ దేశము, సింహళము గురించి రచించిన నోబెల్ బహుమతి గ్రహీత హెల్మెన్ హెన్స్ రచించిన గ్రంథములూ చదివారు.

భారతదేశంతో అనుబంధం[మార్చు]

రసాయనిక పట్టు వ్యాపారం లో 1920 వరకు పనిచేసి అందులో భాగంగా యూరోపు ఇంగ్లాండ్ పర్యటన చేసి 1929లో భారతదేశానికి వచ్చారు . మొదటినుండీ సోషలిజమూ, ప్రపంచ కార్మికోద్యమమూ చే ఆకర్షించబడి యుండుటచే, గాంధీయిజం పట్ల అత్యంత ఆసక్తి తో . అప్పుడు జరుగుతున్న సత్యాగ్రహ ఉద్యమంలో సబర్మతి ఆశ్రమం వెళ్లి అక్కడే ఖాదీ మీద; శిక్షణ పొంది 1935 వరకు ఆంధ్ర రాష్ట్ర మంతా ఖాదీ ప్రచారం చేశారు తరువాత కలకత్తాలో సతీష్ గుప్తా సంస్థ అయిన ఖాదీ ప్రతిష్టాపన లో కొంతకాలం ఖాదీ మీద పరిశోధన చేస్తూ హరిజన ఆస్పత్రిలో కూడా సేవలు అందించారు తరువాత డాక్టర్ ఉప్పునూతల లక్ష్మణ రావు గారి తో ఆంధ్రలో పొందూరు సన్న నూలు మీద పరిశోధన చేసి భారతి, మోడ్రన్ రివ్యూ వంటి పత్రికలలో కొన్ని వ్యాసాలు ప్రచురించారు .1937 సంవత్సరంలో స్వదేశానికి తిరిగివెళ్ళి జర్మనీ ఇటలీ తో పాటు అక్కడ మాస్కో వెళ్లారు చిరకాల మిత్రులకు లక్ష్మణ రావు ని వివాహం సుకొని 1938 లో భారతదేశానికివచ్చారు. 1940 సత్యాగ్రహ ఉద్యమం లో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. రామస్వామిగారి కుటుంబము వెంట లాహోరు కాంగ్రెసుకు వెళ్ళెను. హిందూ దేశమునూ, ప్రజల గురించి తెలుసుకోవాలని కోరికతో మూడవ తరగతిలోనే ప్రయాణించి, కాశీ, గయ, అలహాబాదు, లక్నో, ఆలీఘర్, అమృతసర్ , హరిద్వార్ మొద లగు యాత్రా సలములను సందర్శించి, ధర్మశాలలోనూ, సత్రవులలోనూ మకాం చేసి, భారతీయ హృదయస్పందనను అర్ధంచేసుకొన్నారు. లక్ష్మణ రావు కన్నా మెల్లీనే ఎక్కువగా ఉద్యమ జీవితం గడిపారు. ఓ విదేశీ వనిత భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొని జైలు జీవితాన్ని అనుభవించడం, జైల్లో ఖైదీల కనీసావసరాలకోసం సత్యాగ్రహం చేయడం ఆశ్చర్య పరిచే విషయాలు[2]

సబర్మతీ ఆశ్రమం[మార్చు]

గాంధీ రోజులలో ఆశ్రమమును సందర్శించిన యెడల సబర్మతీ ఆశ్రమవాసుల దైనందిన జీవితమూ, ఖద్దరు దీక్షా తెలుసుకొనవచ్చుననే వుద్దేశముతో అచ్చటనున్న సంవత్సరకాలములో పతి నిడుచుట, ప తిని ఏకుట, ఏకులు చేయుట, నూలుతీయుట మొదలగునవి అభ్యసించారు . ఆకాలంలో ఆశ్రమము చుట్టూ చిట్టడవి యుండుటచే, పాములు ఆశ్రమములో విచ్చలవిడిగా తిరుగు చుండెను. పాములనుండి దుండగుల నుండి ఆశ్రమ వాసులను కాపాడటం కోసం . ప్రతి ఆశ్రమ వాసీ, రాత్రి పూట గస్తీ తిరగటం నియమంగా ఉన్నది , అయితే వారు పాములను చంపకుండ వాటిని పటుకొను సాధనము ఒకటి తప్ప వారి చేతిలో చాపాటి కర్ర మొదలగునవి వాడకూడదు వారు పాములను పట్టుకొని చంపకుండా తిరిగి అడవిలో విడిచిపెట్టాలి, అయితే ఇలా రాత్రిపూట గస్తీ తిరిగే నియమము ఆశ్రమ స్త్రీలకు మాత్రము వరించదు, తానుకూడా రాత్రిపూట గస్తీ తిరుగుతాను అని , పాములు పట్టటం నేర్చుకొంటాను అని ఆశ్రమ నిర్వాహకులను మెల్లీ సోలింగర్ కోరింది అందుకు, గాంధీగారి ప్రత్యేక అనుమతి అవసరమని, అది లేనిదే, తాను ఆశ్రమ పద్దతులను మార్చుటకు వీలుకాదని నిర్వాహకులు చెప్పెను. ఆశ్రమ స్త్రీలలో ధైర్య సైర్యములను పెంపొందించుటకునూ, ఆశ్రమ విధుల పాటింపులో స్త్రీ పురుష వ్యత్యాసముండకూడదని ఆమె అభిప్రాయ పడినందున యీ నిబంధనను మార్చటానికి ఆసమయంలో ఎర్రవాడా జైలులో నున్నగాంధీ పేర దీర మైన లేఖలు రాసెను. ఒక లేఖకు జవాబుగా, “ఇటినిబంధనను విధించినఎడల అందు కవసరమైన ధైర్యసాహ సములు, మన సైర్యము ఆశ్రమస్త్రీలకు గలవో లేవో" అని ఆయన సందేహ మును వెలిబుచ్చి మెల్లీ సోలింగర్ అభ్యర్థనను నిరాకరించెను. "స్త్రీలకు తమకున్న ధైర్యసాహసములను చూపుటకు అవకాశము కల్గించుటయే కర్తవ్యమనియూ, మొదటి మెటుగా ఉన్న ఈ పనికి స్వచ్ఛందముగా యీపనికి ముందుకు వచ్చెదరో అట్టి వారిని ఒంటరిగా కాకుండ, ఇద్దరు కలిసి గస్తీ తిరుగుటకు అనుమతి ఇవ్వాలని ఆమె గాంధీగారికి ప్రత్యుత్తరమిచ్చెను. ఈ విషయమై మెల్లీ సూచనను గాంధీ అంగీకరించి, ఆ నిబంధనల మార్పునకు అనుమతించారు.సబర్మతీలో ఆమె నివసించుచుండిన కాలములోనే పొట్టి శ్రీరాములు వుండుటచేత వారితో ఆమెకు సన్నిహిత స్నేహ మేర్పడెను. తరువాత ఆమె బెజవాడలో నివసించుచున్నపుడు శ్రీరాములు తమ స్వ గ్రామము వెళునపుడు విధిగా బెజవాడలో ఆమె యింట్లో బసచేసేవారు . ఆయన ప్రాయోపదేశమునకు ముందు మదరాసు వెళ్ళునపుడు కూడ ఆమె యింట్లో బసచేసివెళ్లారు. ఆశ్రమమునుండి వచ్చిన తరువాత ఆంధ్రదేశములోని సన్ననూలు ఖద్దరు కేంద్రమయిన శ్రీకాకుళం నగరంలో సిరనివాస మేర్పరచుకొని అచ్చట 2, 3 ఏండ్లు ఉన్నారు . అప్పుడు పొందూరు, బొంతలకోడూరు మొదలైన పట్టుశాలీ కేంద్రములను సందర్శించి, వారు ఆవ లంభించు పద్దతు లను క్షుణ్ణముగా అభ్యసించారు. ఖాదీ ఉద్యమంలో పనిచేశారు. బాల్‌ బేరింగ్‌ చరఖాతో ఇద్దరూ ఖాదీ ప్రచారంలో ఊరూ వాడా తిరిగారు. నెల్లూరులో చరఖా ప్రదర్శన కాలంలో గాంధీగారితో మెల్లికి భేటీ అయింది. 'నేను ఎరవాడ జైల్లో ఉన్నప్పుడు నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించింది నువ్వేనా?' అని గాంధీ ఆమెను పలకరించారు.

ఉప్పల లక్ష్మణరావు తో వివాహం[మార్చు]

భిన్న సంస్కృ తులు, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు అడ్డంకిగా ఉండొచ్చు. వాటన్నింటినీ అర్థం చేసుకునే ఓపిక, తీరిక, ప్రేమికులకు చాలా అవసరం. ప్రసిద్ధ రచయిత, శాస్త్రవేత్త అయిన ఉప్పల లక్ష్మణరావు - మెల్లి దంపతులది అలాంటి ప్రేమ[3]. 1984 లో స్వదేశమునకు వెళ్లిపోయారు ఆమెకు శ్రీ లక్ష్మణరావు గారికినీ 1922 లో ఏర్పడిన పరిచయము 'స్వరాజ్యమోద్యమము నందు స్నేహముగా రూపొందిన మెత్రి 1936 నాటికి ప్రేమగా పరిగణించెను. ఆనాడు హిందూ వివాహ స్మృతి ఈనాడున్నంత ఉదారముగా లేనందున తన వివాహమును హిందూదేశ వైవాహిక చటముల ననుసరించి జరిగించు కొనుటకు ఆమె యిషపడక, రాజకీయ, సాంఘిక ఆరికాది విషయము లన్నింటిలో స్త్రీ పురుష సమానత్వమూనూ, విడాకుల సమాన హక్కులనూ గల ఏకైక దేశమైన సోవియట్ రష్యాలోనే, ఆ చట పద్దతుల ప్రకారమే వివాహము చేసుకొవాలని, అందుకు అంగీకరిస్తే సోవియట్ రావాలని లక్ష్మణరావుకి తెలియచేసారు , లక్ష్మణరావు జీవితంలో మెల్లీ షోలింగర్ తో పరిచయం ఒక మేలుమలుపు. నిస్వార్థ స్నేహంతో, కొంతకాలం నిష్కల్మష సహజీవన పాటిస్తూ నాటి సామ్రాజ్యవాద వ్యతిరేక పీడిత ప్రజావిప్లవ కేంద్రం సోవియట్ యూనియన్ లో వారి దేశాంతర, మతాంతర ,వర్ణాంతర వివాహం సంతానం వద్దనుకుని సామాజిక సాహిత్య సేవతో సమష్టిజీవనం ఓ గొప్ప ఆదర్శం[4]. మాస్కోలో 1937 ఆగష్టు 30 న సోవియట్ పద్దతుల ప్రకారము రిజిష్టరీ వివాహము జరిగినది,తరువాత భారతదేశం వచ్చారు.

మూలాలు[మార్చు]

  1. https://archive.org/details/in.ernet.dli.2015.329190
  2. మురళి (మే 23, 2016). "నెమలికన్ను: బతుకు పుస్తకం". నెమలికన్ను. Retrieved 2020-10-06.
  3. "అనగనగా ఓ ప్రేమకథ – విజయ్ చంద్ర" (in ఇంగ్లీష్). Retrieved 2020-10-06.[permanent dead link]
  4. "మేమే ఆయన వారసులం... | Prajasakti". www.prajasakti.com. Retrieved 2020-10-06.

ఉప్పల లక్ష్మణరావు రచన ‘అతడు-ఆమె’ నవల <br>

లక్ష్మణరావు గారి స్వీయ చరిత్ర- బతుకు పుస్తకం