మెహబూబ్ ఖాన్
| మెహబూబ్ ఖాన్ | |
|---|---|
1940 ల తొలినాళ్ళలో మెహబూబ్ ఖాన్ | |
| జననం | మెహబూబ్ ఖాన్ 1907 సెప్టెంబరు 9 బిలిమోరా, బరోడా సంస్థానం, బ్రిటిషు భారతదేశం |
| మరణం | 1964 మే 28 (వయసు: 56) బొంబాయి |
| విశ్రాంతి ప్రదేశం | బడా కబరస్థాన్, మరీన్ లైన్స్, ముంబై |
| వృత్తి | సినిమా దర్శకుడు, నిర్మాత |
| క్రియాశీలక సంవత్సరాలు | 1931–1962 |
| భార్య / భర్త | ఫాతిమా (విడిపోయారు) సర్దార్ అఖ్తర్ |
| పిల్లలు | 4; One adopted |
| Honors | పద్మశ్రీ (1963)[1] |
మెహబూబ్ ఖాన్ రంజాన్ ఖాన్ (1907 సెప్టెంబరు 9 [2] – 1964 మే 28) భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత. ఆయన సామాజిక ఇతిహాసం మదర్ ఇండియా (1957) కు దర్శకత్వం వహించినందుకు బాగా ప్రసిద్ధి చెందాడు. ఈ చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ విదేశీ భాషా చిత్రానికి అకాడమీ అవార్డుకు నామినేట్ చేయబడింది.[3] ఆయన 1954లో ముంబైలోని బాంద్రాలో తన నిర్మాణ సంస్థ - మెహబూబ్ ప్రొడక్షన్స్, తరువాత ఫిల్మ్ స్టూడియో - మెహబూబ్ స్టూడియోస్‌ను స్థాపించాడు.[4][5][6] ఆయన ఔరత్ (1940), మదర్ ఇండియాతో దోపిడీ చిత్ర శైలిని కూడా సృష్టించాడు.[7] రొమాంటిక్ డ్రామా అందాజ్ (1949), సంగీతప్రధానమైన ఆన్ (1951), మెలోడ్రామా అమర్ (1954) వంటి ఇతర బ్లాక్‌బస్టర్‌లను కూడా తీసాడు.
తొలినాళ్ళ జీవితం
[మార్చు]ఖాన్ 1907 సెప్టెంబరు 9 న సూరత్ రాష్ట్రం (ప్రస్తుతం గుజరాత్) లోని గండేవి తాలూకాలోని బిలిమోరాలో జన్మించాడు. పుట్టినపుడు అతనికి పెట్టిన పేరు మెహబూబ్ ఖాన్ రంజాన్ ఖాన్.[2]
కెరీర్
[మార్చు]ఆయనను గుజరాత్‌లోని తన స్వస్థలం నుండి నూర్ ముహమ్మద్ అలీ ముహమ్మద్ షిప్రా బద్ధియావాలా (భారతీయ సినిమాల్లో నిర్మాత, గుర్రపు సరఫరాదారు) బొంబాయికి తీసుకువచ్చి, ఒక గుర్రపుశాలలో (నూర్ ముహమ్మద్ అలీ ముహమ్మద్ షిప్రా బద్ధియావాలా యాజమాన్యంలో) గుర్రపునాడా మరమ్మతుదారుగా పనిలో పెట్టాడు. ఒక రోజు దక్షిణ భారత దర్శకుడు చంద్రశేఖర్ చేస్తున్న షూటింగ్‌లో మెహబూబ్, చంద్రశేఖర్‌తో కలిసి పనిచేయాలని ఆసక్తి చూపించాడు. అతని లోని ఆసక్తి, నైపుణ్యాలను చూసిన చంద్రశేఖర్, నూర్ ముహమ్మద్ అలీ ముహమ్మద్ షిప్రా బద్ధియావాలాను బొంబాయిలోని ఫిల్మ్ స్టూడియోలలో చిన్న ఉద్యోగాలలో పనిచేయడానికి మెహబూబ్‌ను తనతో తీసుకెళ్లడానికి అనుమతించమని కోరాడు. ఆయన సైలెంట్ ఫిల్మ్ యుగంలో అసిస్టెంట్ డైరెక్టరుగా, అర్దేషిర్ ఇరానీ ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ స్టూడియోలలో అదనపు డైరెక్టరుగా పనిచేశాడు. తర్వాత ఆయన తన మొదటి చిత్రం అల్ హిలాల్ ఉరఫ్ జడ్జిమెంట్ ఆఫ్ అల్లా (1935)కి దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత ఆయన సాగర్ ఫిల్మ్ కంపెనీ నిర్మిస్తున్న చిత్రాలకు దర్శకత్వం వహించడం ప్రారంభించాడు. సాగర్ మూవీటోన్ నేషనల్ స్టూడియోస్ కోసం అతను దర్శకత్వం వహించిన ప్రముఖ చిత్రాలలో డెక్కన్ క్వీన్ (1936), ఏక్ హీ రాస్తా (1939), అలీబాబా (1940), ఔరత్ (1940), బహెన్ (1941) ఉన్నాయి.
1945 లో ఖాన్, తన సొంత నిర్మాణ సంస్థ - మెహబూబ్ ప్రొడక్షన్స్ ను స్థాపించాడు. 1946 లో అతను సంగీతపరంగా హిట్ అయిన అన్‌మోల్ ఘడీ కి దర్శకత్వం వహించాడు. ఇందులో గాయకులు సురేంద్ర, నూర్ జెహాన్, సురైయా ప్రధాన పాత్రల్లో నటించారు. ఖాన్ అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించి, దర్శకత్వం వహించాడు. వాటిలో ముఖ్యమైనవి: రొమాంటిక్ డ్రామా అందాజ్ (1949), అద్వితీయమైన సంగీత చిత్రం ఆన్ (1951), మెలోడ్రామా అమర్ (1954), సామాజిక ఇతిహాసం మదర్ ఇండియా (1957). మదర్ ఇండియా, తానే 1940 లో తీసిన చిత్రం ఔరత్ కు రీమేక్. 1957 లో అది అకాడమీ అవార్డుకు నామినేట్ చేయబడింది. అతని మునుపటి రచనలు ఉర్దూలో ఉన్నాయి, కానీ అతని తరువాతి సినిమాలు, మదర్ ఇండియాతో సహా, హిందీ, హిందుస్తానీలో ఉన్నాయి. అతని అనేక చిత్రాలు, ముఖ్యంగా <i id="mwdA">హుమాయూన్</i> (1945) పై అతని మునుపటి రచన, భారతదేశాన్ని పాలించిన మొగల్ చక్రవర్తి కథ. అన్‌మోల్ ఘడీ (1946), <i id="mweA">తక్దీర్</i> (దీనిలో అతను నర్గీస్‌ను పరిచయం చేశాడు. ఆమె ఆ తరువాత సునీల్ దత్‌ను వివాహం చేసుకుంది), అఘజని కాష్మేరి రాశారు. నర్గీస్‌కు హిందుస్తానీ, ఉర్దూ సంభాషణలను ఎంచుకుని శిక్షణ ఇచ్చే బాధ్యత కాష్మేరిపై ఉంది. దర్శకుడిగా ఆయన చివరి చిత్రం 1962లో వచ్చిన సన్ ఆఫ్ ఇండియా.

ఆయన 1964 లో 56 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించాడు. ముంబైలోని మెరైన్ లైన్స్‌లోని బడా కబరస్తాన్‌లో ఖననం చేసారు. భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మరణించిన మరుసటి రోజున ఖాన్ మరణించాడు.[8]
పరిశ్రమపై ప్రభావం
[మార్చు]1940, 1950, 1960 లలో సురేంద్ర, అరుణ్ కుమార్ అహుజా, దిలీప్ కుమార్, రాజ్ కపూర్, సునీల్ దత్, రాజేంద్ర కుమార్, రాజ్ కుమార్, నర్గీస్, నిమ్మీ, నాదిరా వంటి అనేక మంది నటీనటులను ఖాన్ పరిచయం చేసి, వారి కెరీర్లను స్థాపించడంలో సహాయపడ్డాడు. 1961 లో అతను, 2 వ మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో జ్యూరీ సభ్యుడిగా ఉన్నాడు.[9] 1963 నుండి 1964 వరకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా పనిచేసాడు.[10]
మెహబూబ్ ఖాన్‌పై హాలీవుడ్ చిత్రాల ప్రభావం ఉంటుంది. అతని చిత్రాలలో ఆ సమయంలో హాలీవుడ్ శైలిలో విలాసవంతమైన సెట్లు ఉండేవి. పేదల అణచివేత, వర్గ యుద్ధం, గ్రామీణ జీవితం అతని రచనలలో పునరావృతమయ్యే ఇతివృత్తాలు.
భారత ప్రభుత్వం మెహబూబ్ ఖాన్ కు హిదాయత్ కర్-ఎ-ఆజం అనే బిరుదును ప్రదానం చేసింది.[11]
వ్యక్తిగత జీవితం
[మార్చు]మెహబూబ్ ఖాన్ రెండుసార్లు వివాహం చేసుకున్నాడు.[12][11] తన మొదటి భార్య ఫాతిమాతో అతనికి అయూబ్, ఇక్బాల్, షౌకత్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. మొదటి భార్య నుండి విడిపోయిన తర్వాత, అతను 1942 లో ప్రసిద్ధ భారతీయ సినీ నటి సర్దార్ అక్తర్ (1915–1986)ను పెళ్ళి చేసుకున్నాడు. అతను భారతీయ, విదేశీ ఆంగ్ల చిత్రాలలో నటించిన సాజిద్ ఖాన్ (జననం 1951 డిసెంబరు 28)ను దత్తత తీసుకున్నాడు.[11]
మరణం, వారసత్వం
[మార్చు]మెహబూబ్ ఖాన్ 1964 మే 28న గుండెపోటుతో మరణించాడు.[11] ఆయన శతజయంతి ఉత్సవాల్లో భాగంగా, భారత తపాలా శాఖ 2007 సెప్టెంబరులో మెహబూబ్ స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో మెహబూబ్ ఖాన్ స్మారక స్టాంపును విడుదల చేసింది.[13]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]దర్శకుడిగా
[మార్చు]- అన్ ఆఫ్ ఇండియా (1962)
- ఎ హ్యాండ్‌ఫుల్ ఆఫ్ గ్రెయిన్ (1959)
- మదర్ ఇండియా (1957)[11]
- అమర్ (1954)
- ఆన్ (1952)[11]
- [అందాజ్] Error: {{Lang}}: Non-latn text (pos 1: అ)/Latn script subtag mismatch (help) (1949)
- అనోఖీ అదా (1948)
- ఇలాన్ (1947)
- [అన్‌మోల్ ఘడీ] Error: {{Lang}}: Non-latn text (pos 1: అ)/Latn script subtag mismatch (help) (1946)
- హుమాయూన్ (1945)
- నజ్మా (1943)
- తక్దీర్ (1943)[11]
- రోటీ (1942)
- హ్యుమా గుణ్ అన్‌మొగల్దీ (1942)[14]
- బహెన్ (1941)
- ఆలీబాబా (1940)[11]
- ఔరత్ (1940)
- ఏక్ హీ రాస్తా (1939)[11]
- హం తుం ఔర్ వో (1938)
- వతన్ (1938)
- జాగీర్దార్ (1937)
- దక్కన్ క్వీన్ (1936)[11]
- మన్‌మోహన్ (1936)
- అల్ హిలాల్ (1935)[11]
నిర్మాతగా
[మార్చు]- మదర్ ఇండియా (1957) [11]
- అమర్ (1954) [11]
- ఆన్ (1952) [11]
- అనోఖి అదా (1948)
- ఎలాన్ (1947)
- Anmol Ghadi (1946) [11]
- జరీనా (1932)
నటుడిగా
[మార్చు]- చంద్రహాస (1933)
- జరీనా (1932)
- దిలావర్ (1931)
- మేరీ జాన్ (1931)
రచయితగా
[మార్చు]- వాతన్ (1938) (కథ)
- అల్ హిలాల్ అకా జడ్జిమెంట్ ఆఫ్ అల్లా (1935) (కథ, స్క్రీన్ ప్లే) [11]
అవార్డులు, గౌరవాలు
[మార్చు]
- 1958 – ఉత్తమ విదేశీ భాషా చిత్రం – మదర్ ఇండియా (నామినేషన్) [15]
- 1958 – ఉత్తమ చలనచిత్రంగా ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ – మదర్ ఇండియా [16]
- 1958 – రెండవ ఉత్తమ హిందీ చలనచిత్రంగా మెరిట్ సర్టిఫికేట్ – మదర్ ఇండియా [16]
- 1958 – ఉత్తమ చిత్రం – మదర్ ఇండియా
- 1958 – ఉత్తమ దర్శకుడు – మదర్ ఇండియా
- 1963 – ఉత్తమ దర్శకుడు – సన్ ఆఫ్ ఇండియా (నామినేషన్)
- గౌరవాలు
- 1963: భారత ప్రభుత్వం, పద్మశ్రీ ప్రదానం చేసింది.[17]
- 2007 మార్చి 30 న ఇండియా పోస్ట్, మహబూబ్ ఖాన్ స్మారక స్టాంపును, 'మదర్ ఇండియా' సినిమా లోని రాజ్ కుమార్ & నర్గీస్‌ల చిత్రంతో పాటు విడుదల చేసింది.[18]
మూలాలు
[మార్చు]- ↑ "Padma Awards | Interactive Dashboard". Archived from the original on 27 January 2021. Retrieved 16 March 2022.
- ↑ 2.0 2.1 Mehboob Khan Archived 21 మే 2011 at the Wayback Machine at filmreference.com.
- ↑ "The 30th Academy Awards (1958) Nominees and Winners". oscars.org website. Archived from the original on 2 April 2015. Retrieved 13 January 2021.
- ↑ "Mehboob mere, Mehboob tere". Pune Mirror (newspaper). 1 November 2008. Archived from the original on 18 July 2011. Retrieved 13 January 2021.
- ↑ "Mumbai, meri mehboob?". DNA (newspaper). 7 February 2011. Retrieved 13 January 2021.
- ↑ Karanjia, B. K. "Mehboob Khan: An Unfinished Story". A many-splendoured cinema. New Thacker's Fine Art Press. p. 215.
- ↑ Teo, Stephen (2017). Eastern Westerns: Film and Genre Outside and Inside Hollywood. Taylor & Francis. p. 122. ISBN 9781317592266.
- ↑ Karanjia, B.K. (1986). A many-splendoured cinema. New Thacker's Fine Art Press. p. 215. Archived from the original on 1 మార్చి 2018. Retrieved 1 మార్చి 2018.
... Mehboob Khan died the day after Jawaharlal Nehru. Neither the country, nor its cinema, have been the same since. Films continue to be made that may critically be compared to that all-time grosser "Mother India". But no leader since its maker died has approached the dimensions of leadership reached by this country bumpkin who began his career as a bit player in "Ali Baba and the Forty Thieves" (1927) and went on to make ...
- ↑ "2nd Moscow International Film Festival (1961)". MIFF. Archived from the original on 16 January 2013. Retrieved 4 November 2012.
- ↑ Karanjia, B. K. "Mehboob Khan: An Unfinished Story". A many-splendoured cinema. New Thacker's Fine Art Press. p. 215.
- ↑ 11.00 11.01 11.02 11.03 11.04 11.05 11.06 11.07 11.08 11.09 11.10 11.11 11.12 11.13 11.14 11.15 "Mehboob Khan - a profile". TAMASHA website. Archived from the original on 17 August 2016. Retrieved 13 January 2021.
- ↑ "Historic Mehboob Studio ticks away in anonymity". Hindustan Times (newspaper). 13 August 2007. Retrieved 13 January 2021.
- ↑ Karanjia, B. K. "Mehboob Khan: An Unfinished Story". A many-splendoured cinema. New Thacker's Fine Art Press. p. 215.
- ↑ Georges Sadoul; Peter Morris (1 జనవరి 1972). Dictionary of Film Makers. University of California Press. pp. 172–. ISBN 978-0-520-02151-8.
- ↑ Karanjia, B. K. "Mehboob Khan: An Unfinished Story". A many-splendoured cinema. New Thacker's Fine Art Press. p. 215.
- ↑ 16.0 16.1 "5th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Archived (PDF) from the original on 3 November 2013. Retrieved 2 September 2011.
- ↑ Karanjia, B. K. "Mehboob Khan: An Unfinished Story". A many-splendoured cinema. New Thacker's Fine Art Press. p. 215.
- ↑ Karanjia, B. K. "Mehboob Khan: An Unfinished Story". A many-splendoured cinema. New Thacker's Fine Art Press. p. 215.