మెహమూద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Mehmood
Mehmood Ali - Actor.jpg
జననం(1932-09-29) 1932 సెప్టెంబరు 29
మరణం2004 జూలై 23 (2004-07-23)(వయసు 71)
Pennsylvania, US
వృత్తిActor

మెహమూద్ ఆలీ (హిందీ: महमूद अली ఉర్దూ: محمود علی‎) (సెప్టెంబర్ 29, 1932జూలై 23, 2004), ప్రజలకు సాదా సీదాగా మెహమూద్‌ గా (హిందీ: महमूद ఉర్దూ: محمود‎) పరిచయమైన ఇతడు, భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమాలలో హాస్య పాత్రలలో నటించడం ద్వారా ఇతడు అందరికీ సుపరిచితుడయ్యాడు. నాలుగు దశాబ్దాల పైబడిన తన కెరీర్‌లో, ఇతడు 300 పైగా హిందీ సినిమాలలో పనిచేశాడు.

జీవితం మరియు వృత్తి[మార్చు]

బాంబేలో నటుడు, నర్తకుడు ముంతాజ్ ఆలీకి పుట్టిన ఎనిమిది మంది బిడ్డల్లో మెహమూద్ ఒకరు.[1] మెహమూద్‌కు ఒక పెద్దక్క ఉంది, అయితే మిగిలిన ఆరుగురు సోదరీసోదరులు ఇతడి కంటే చిన్నవారు. బాంబే టాకీస్ చిత్రాలైన కిస్మత్ వంటి వాటిలో ఒక పిల్లవాడుగా ఇతడు నటనను అన్యమనస్కంగానే ప్రారంభించాడు. నటనపై చూపు సారించకముందు ఇతడు మొదట్లో డ్రైవింగ్, కోళ్లను అమ్మడం వంటి చిన్నా చితకా పనులను చేసేవాడు. ఇతడు దర్శకుడు P. L. సంతోషి డ్రైవర్‌గా పనిచేశాడు. తర్వాత, సంతోషి కుమారుడు రాజ్‌కుమార్ సంతోషి తన అందాజ్ అప్నా అప్నా చిత్రంలో ఇతడికి నటుడిగా అవకాశం ఇచ్చాడు. ఆ రోజుల్లో ఇతడు మీనా కుమారికి టేబిల్ టెన్నిస్ నేర్పడానికి నియమించబడ్డాడు. తర్వాత ఆమె సోదరి మధునే ఇతడు పెళ్లాడాడు. పెళ్లయి, తండ్రయ్యాక, మరింత మంచి జీవితం కోసం నటించాలని అతడు నిర్ణయించుకున్నాడు. C.I.D. సినిమాలో హత్యకు గురయిన వాడిగా ఇతడి కెరీర్‌లో చిన్న మలుపు వచ్చింది. దో బీగా జమీన్ మరియు ప్యాసా వంటి సినిమాలలో ఇతడు అంతగా ప్రాధాన్యం లేని చిత్రాలతో నట జీవితం ప్రారంభించాడు. తర్వాత ఇతడు ముఖ్య పాత్రల్లో నటించసాగాడు కాని, తన హాస్యనటనకు గాను బాగా ప్రశంసలు పొందాడు, వీటిలో కొన్ని హైదరాబాద్ ప్రాంత ఉర్దూ యాసతో ఉండేవి.

నటి తనూజాతో కలిసి నటించిన భూత్ బంగ్లా చిత్రం డైరెక్టర్‌గా మరియు నటుడిగా అతడి కెరీర్‌కు మొదటి బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రంలో మెహమూద్ బాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన హాస్యనటుడిగా జానీ వాకర్‌‌ని అధిగమించసాగాడు. పడోసన్ (తమిళ బ్రాహ్మణ సంగీత మాస్టారు - ఇతడు నటించిన గొప్ప పాత్రల్లో ఒకటి). లవ్ ఇన్ టోక్యో, ఆంఖేన్, బాంబే టు గోవా మరియు ప్యార్ కియే జా వంటి సూపర్‌హిట్ కామిక్ పాత్రల ద్వారా అతడిని విజయం వరించింది. హిందీ చిత్రాలకు సంబంధించినంతవరకు ఇతడు అగ్రదర్శకుడుగా మారాడు—కున్వారా బాప్ దీనికి ఒక ముఖ్య ఉదాహరణ.

మెహమూద్ 1965 నుంచి 1985 వరకు విజయపధంలో పయనించాడు, ఈ కాలంలోనే ఇతడు అత్యంత విజయవంతమైన కళాకారులలో ఒకరుగా గుర్తించబడేవాడు. అమితాబ్ బచ్చన్ 1967-68 కాలంలో 11 నెలలపాటు, మరియు 1972-73 కాలంలో (4 నెలలు) పాటు మెహమూద్ ఔట్ హౌస్‌లో కిరాయిదారుగా ఉండేవాడు. అమితాబ్ ముఖ్య పాత్రధారిగా నటించిన బాంబే టు గోవా చిత్రంలో మెహమూద్ నటించాడు, దర్శకత్వం వహించాడు.

అయితే 1985 నుంచి మెహమూద్ కెరీర్ పతనం కాసాగింది ఎందుకంటే ముఖ్య నటుల పాత్రలలో కొంత మేరకు హాస్యం కూడా తొంగి చూసేలా కొత్త రకం ట్రెండ్ వచ్చేసింది. ఇతర సహాయ నటులైన అనుపమ్ ఖేర్, జగదీప్ మరియు జానీ లివర్ వంటి వారు కూడా విజయబాటలో నడుస్తుండే వారు. ఇతర తోటి నటులలాగే మెహమూద్ సంపాదనను దాచుకోలేదు దీంతో తన ఆర్థిక స్థితిగతులు పతనం కానారంభించాయి. 1989 నుంచి 1999 వరకు ఇతడు కొన్ని సినిమాలలో నటించాడు కాని వీటిలో చాలావరకు నాసిరకంగా ఉండేవి లేదా ఎలాంటి స్ఫూర్తినీ కలిగించేవి కాదు. ఇతడు రాజ్‌కుమార్ సంతోషి తీసిన అందాజ్ అప్నా అప్నా సినిమాలో జానీ గా నటించాడు, ఇది నటుడిగా ఇతడి చిట్టచివరి సినిమా.

US లోని పెన్సిల్వేనియాలో 2004 జూలైన నిద్రలోనే ఇతడు కన్ను మూశాడు, అనేక సంవత్సరాలపాటు ఆరోగ్య సమస్యలతో బాధపడిన మొహమూద్ గుండె వ్యాధికి చికిత్సకు గాను అమెరికాకు వెళ్లి అక్కడే కన్నుమూశాడు.[1] భారత్‌లో, ముంబైలోని మెహబూబ్ స్టూడియోలో అభిమానులు అతడికి నివాళి అర్పించారు.

మెహమూద్ కుమారుడు లక్కీ ఆలీ కూడా గాయకుడు మరియు కంపోజర్, ఇతడూ కూడా సినిమాలలో నటించాడు.

ముఖ్యమైన ఫిల్మోగ్రఫీ[మార్చు]

 • కానూన్ (1961)
 • చోటే నవాబ్ (1961)అమేటాతో
 • ససురాయ్ (1961) శోభా ఖోటేతో
 • దిల్ తేరా దివానా (1962)
 • జిందగీ (1964)
 • గుమ్నామ్ (1965) హెలెన్‌తో
 • జోహార్ మహమూద్ ఇన్ గోవా I. S. జోహార్‌తో (1965)
 • భూత్ బంగ్లా (1965)
 • ప్యార్ కియా జా (1966) ముంతాజ్‌తో
 • లవ్ ఇన్ టోక్యో (1966) శోభా ఖోటెతో
 • పత్తర్ కె సనమ్ (1967)
 • సంఘర్ష్ (1968)
 • పడోసన్ (1968) సునీల్ దత్, సైరా బాను మరియు కిషోర్ కుమార్‌లతో
 • ఆంఖే (1968
 • నీల్ కమల్ (1968)
 • దో పూల్ (1968)
 • బాంబే టు గోవా (1972)
 • సాధు ఔర్ సైతాన్ (1968)
 • హమ్ జోలీ (1970)
 • మైన్ సుందర్ హూన్ (1971) లీనా చంద్రావర్కార్‌తో
 • జోహార్ మెహూద్ ఇన్ హాంకాంగ్ I. S. జోహార్‌తో (1971)
 • కన్వారా బాప్ (1974)
 • దో పూల్ (1974)
 • గిన్నీ ఔర్ జానీ (1976)
 • సబ్‌సే బడా రుపయ్యా (1976)
 • అందాజ్ అప్నా అప్నా (1994)
 • గుడ్డూ (1995)

అవార్డులు[మార్చు]

 • ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ ఫర్ దిల్ తెరా దివానా
 • ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ కమెడియన్ అవార్డ్ ఫోర్డ్ టైమ్స్, ప్యార్ కియా జా లో, వారిస్, పరాస్, మరియు వరదాన్

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 "Indian comedian Mehmood dead". Daily Times. 2004-07-24. మూలం నుండి 16 ఏప్రిల్ 2013 న ఆర్కైవు చేసారు. Retrieved 2 January 2009.

మరింత చదవటానికి[మార్చు]

 • జవెరి, హనీఫ్. మెహమూద్, ఎ మ్యాన్ ఆఫ్ మెనీ మూడ్స్, పాపులర్ ప్రకాశన్, 2005. ISBN 0262081504

బాహ్య లింకులు[మార్చు]

మూస:FilmfareAwardBestComedian మూస:FilmfareBestSupportingActorAward మూస:Bollywood

"https://te.wikipedia.org/w/index.php?title=మెహమూద్&oldid=2818517" నుండి వెలికితీశారు