మెహర్బన్ సింగ్ రావత్
| మెహర్బన్ సింగ్ రావత్ | |||
| పదవీ కాలం 2013 – 2018 | |||
| ముందు | సురేష్ చౌదరి | ||
|---|---|---|---|
| తరువాత | బైజ్‌నాథ్ కుష్వాహ | ||
| నియోజకవర్గం | సబల్‌ఘర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| బంధువులు | సరళ విజేంద్ర రావత్ (కోడలు)[1] | ||
| నివాసం | మధ్యప్రదేశ్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మెహర్బన్ సింగ్ రావత్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మధ్యప్రదేశ్ శాసనసభకు సబల్‌ఘర్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]మెహర్బన్ సింగ్ రావత్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1985 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో సబల్‌ఘర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి భగవతి ప్రసాద్ బన్సాల్ చేతిలో 12849 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 1990 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి ప్రీతమ్ ప్రసాద్ చౌదరిపై 16,131 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
మెహర్బన్ సింగ్ రావత్ 1993 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో సబల్‌ఘర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో, 1998 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో రెండోస్థానంలో నిలిచాడు. ఆయన 2003 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి జలీం సింగ్ ధకడ్ పై 5257 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
మెహర్బన్ సింగ్ రావత్ 2008 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో సబల్‌ఘర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఐఎన్‌సీ అభ్యర్థి సురేష్ చౌదరి చేతిలో 9041 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2013 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సురేష్ చౌదరిపై 22504 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
మరణం
[మార్చు]మెహర్బన్ సింగ్ రావత్ క్యాన్సర్‌తో బాధపడుతూ 2019 ఆగస్టు 14న ఖాన్‌పురా మంగ్రోల్‌లో మరణించాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "पूर्व MLA मेहरबान सिंह की बहू को सबलगढ़ से टिकट: विधानसभा चुनाव के लिए भाजपा ने सरला रावत ने बनाया प्रत्याशी". Dainik Bhaskar. 17 August 2023. Archived from the original on 16 February 2025. Retrieved 16 February 2025.
- ↑ "Sabalgarh Constituency Election Results 2023" (in ఇంగ్లీష్). The Times of India. 2023. Archived from the original on 16 February 2025. Retrieved 16 February 2025.
- ↑ "मध्य प्रदेश BJP के वरिष्ठ नेता मेहरबान सिंह का निधन, जन्मदिन के दिन ली अंतिम सांस". News18 हिंदी. 14 August 2019. Archived from the original on 16 February 2025. Retrieved 16 February 2025.