Coordinates: 23°36′N 72°24′E / 23.6°N 72.4°E / 23.6; 72.4

మెహసానా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Mehsana
City
Rajmahal, a palace built in 1904 by Sayajirao Gaekwad III
Rajmahal, a palace built in 1904 by Sayajirao Gaekwad III
Mehsana is located in Gujarat
Mehsana
Mehsana
Location in Gujarat, India
Mehsana is located in India
Mehsana
Mehsana
Mehsana (India)
Coordinates: 23°36′N 72°24′E / 23.6°N 72.4°E / 23.6; 72.4
CountryIndia
రాష్ట్రంగుజరాత్
జిల్లాMehsana
Founded byMehsaji Chavda
Government
 • BodyMehsana Municipality
విస్తీర్ణం
 • City31.8 km2 (12.3 sq mi)
Elevation114 మీ (375 అ.)
జనాభా
 (2011)[3]
 • City1,84,991[1]
 • Rank17th (Gujarat)
 • Metro1,90,189
Languages
 • OfficialGujarati, Hindi
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)
పిన్ కోడ్
384001, 384002,384003
Telephone code91 2762
Vehicle registrationGJ-02
Sex ratio1.12[3] /

మెహసానా, (మహేసన అని కూడా అంటారు).ఇది భారతదేశం, గుజరాత్ రాష్ట్రం, మెహెసానా జిల్లాలోని [5] ఒక నగరం.ఇది పురపాలక సంఘ హోదాతో ఉన్న పట్టణం.[6] సా.శ.14వ శతాబ్దంలో స్థాపించబడిన ఈ నగరం 18వ శతాబ్దం నుండి 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు బరోడా రాష్ట్రంలోని గైక్వాడ్స్ ఆధ్వర్యంలో ఉంది. పురపాలక సంఘం 1919-20లో స్థాపించబడింది. పట్టణంలో దాదాపు 1,85,000 జనాభా ఉ్నారు. డైరీ ఉత్పత్తులు, చమురు, సహజ వాయువు నగరంలోని ప్రధాన పరిశ్రమలు అయితే నగరంలో అనేక చిన్న, మధ్యతరహా సంస్థలు ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]
తోరన్వాలి మాత ఆలయ ద్వారం

జైసింహ బ్రహ్మభట్ సా.శ.1932 నుండి తన కవితలలో ఈ క్రింది పురాణాన్ని వివరించాడు.[7] మెహసానాను చావ్డా రాజవంశ రాజపుత్ర వారసుడు మెహ్సాజీ చావ్డా స్థాపించాడు.అతను నగరంంలో తోరణ (ఆర్చి) నిర్మాణం , తోరన్ దేవతకు అంకితం చేయబడిన ఆలయం విక్రమాదిత్య శకం 1414 (సా.శ.1358) భాద్రపద మాసం 10న నిర్మించాడు.[8][9] విక్రమాదిత్య శకం1909 (సా.శ.1823) లో ప్రచురించబడిన ప్రగత్ ప్రభవి పార్శ్వనాథ్ అథ్వ పార్శ్వనాథ చమత్కారోలో ఈ పురాణం ధృవీకరించబడింది. మణిలాల్ న్యాల్‌చంద్ షా ద్వారా,మెహసాజీ చాముండికి అంకితం చేయబడిన ఆలయాన్ని నిర్మించాడని అందులో పేర్కొన్నాడు.మెహసాజీ విక్రమ్ సా.శ.1375 (సా.శ.1319) సంవత్సరంలో పట్టణాన్ని స్థాపించాడని మరొక పురాణం చెబుతోంది.రెండు ఇతిహాసాలు ఈ పట్టణానికి మెహసాజీ పేరు పెట్టినట్లు వివరిస్తున్నాయి.ఈ ఇతిహాసాలు కూడా ఈ పట్టణం రాజపుత్ర కాలంలో స్థాపించబడిందని నిర్ధారిస్తుంది.[10][11]

గైక్వాడ్స్ బరోడాను జయించి 1721లో బరోడా రాష్ట్రాన్ని స్థాపించారు. వారు ఉత్తర గుజరాత్‌లో తమ పాలనను విస్తరించారు. పటాన్‌ను దాని పరిపాలనా ప్రధాన కార్యాలయంగా స్థాపించారు.1721న ప్రారంభించబడిన గైక్వార్స్ బరోడా రాష్ట్ర రైల్వే ద్వారా నగరం అనుసంధానించబడిన తర్వాత 1902లో ప్రధాన కార్యాలయం కడికి, తదనంతరం మెహసానాకు మార్చబడింది.మార్చి 1887 మార్చి లోసాయాజీరావు గైక్వాడ్ III [12] లో రాజమహల్ అనే రాజభవనాన్ని నిర్మించాడు.

1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బరోడా రాష్ట్రం భారత సమాఖ్యలో విలీనమైంది.ఇది 1949లో బొంబాయి రాష్ట్రంలో మెహసానా జిల్లాగా విలీనం చేయబడింది.బొంబాయి రాష్ట్రాన్ని గుజరాత్, మహారాష్ట్రలుగా విభజించిన తర్వాత 1960లో ఇది గుజరాత్‌లో భాగమైంది. మెహసానా ఉత్తర గుజరాత్‌లోని మెహసానా జిల్లాకు ప్రధాన కార్యాలయం.[7][9]

భౌగోళిక శాస్త్రం

[మార్చు]

మెహ్సానా నగరం సముద్రమట్టానికి సగటున 375 feet (114 m) ఎత్తులో ఉంది. అహ్మదాబాద్-పల్న్పూర్ రైల్వే లైన్ ద్వారా,పట్టణం రెండుగా విభజనచెందింది.తూర్పు, పశ్చిమ భాగాలను వరుసగా మెహసానా-1, మెహసానా-2 అని పిలుస్తారు.[13]

పరిపాలన

[మార్చు]

మెహసానా పురపాలక సంఘం 1919-20లో స్థాపించబడింది. ఆగస్టు 1949 ఆగష్టు 1న బాంబే రాష్ట్రంతో బరోడా రాష్ట్రం విలీనం అయిన తర్వాత, ఇది బాంబే జిల్లా పురపాలకసంఘం చట్టం - 1902 ద్వారా పాలించబడింది. 1956 జనవరి 1 నుండి, ఇది గుజరాత్ నగరపాలక సంస్థ చట్టం -1963 కింద పాలించబడుతుంది. ఇది మెహసానా మహానగర ప్రాంత పరిధి కిందకు వస్తుంది.

ఇది కూడ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; 2011census1 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 2. "Mehsana Nagarpalika, Mehsana". Mehsana Nagarpalika. Archived from the original on 4 November 2016. Retrieved 1 February 2017.
 3. 3.0 3.1 "Provisional Population Totals, Census of India 2011; Cities having population 1 lakh and above" (PDF). Office of the Registrar General & Census Commissioner, India. Archived (PDF) from the original on 7 May 2012. Retrieved 26 March 2012.
 4. "Provisional Population Totals, Census of India 2011; Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Office of the Registrar General & Census Commissioner, India. Archived (PDF) from the original on 13 November 2011. Retrieved 26 March 2012.
 5. https://mehsanadp.gujarat.gov.in Archived 2016-11-16 at the Wayback Machine
 6. https://mehsana.gujarat.gov.in Archived 2017-07-08 at the Wayback Machine
 7. 7.0 7.1 "History". Government of Gujarat. Mehsana District Panchayat. 17 July 2012. Archived from the original on 8 May 2012. Retrieved March 17, 2013.
 8. "Mehsana - History". NRI Division. Government of Gujarat. 2009. Archived from the original on October 21, 2014. Retrieved March 17, 2013.
 9. 9.0 9.1 S. B. Rajyagor, ed. (1975). Gujarat State Gazetteers: Mehsana District. Gujarat State Gazetteers. Vol. 5. Directorate of Government Print., Stationery and Publications, Government of Gujarat. pp. 1, 805–806. Archived from the original on 2017-02-16.
 10. Shah, Manilal Nyalchand (1823). Pragat Prabhavi Parshwanth athwa Parshwanathna Chamatkaro. Ahmedabad: Manilal Nyalchand Shah. p. 118.
 11. "વિ.સં.૧૪૧૪, ભાદરવા સુદ ૧૦ના દિવસે શ્રી મેસાણાનું તોરણ બંધાયું". Divya Bhaskar. 2014-08-17. Retrieved 2020-11-06.
 12. Sergeant, Philip W. (1928). The Ruler Of Baroda: An Account of the Life and Work of the Maharaja Gaekwar. Albemarle Street, London: John Murray. pp. 226–229.
 13. "મહેસાણામાં બગીચાની અસમતુલા પશ્ચિમ ભાગમાં 7, પૂર્વમાં માત્ર 2 બગીચા". NavGujarat Samay. 2021-06-05. Archived from the original on 2022-10-06. Retrieved 2022-10-06.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మెహసానా&oldid=3933541" నుండి వెలికితీశారు