మేకతోటి సుచరిత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మేకతోటి సుచరిత

పదవీ కాలం
8 జూన్ 2019 – 2022 ఏప్రిల్ 10[1]
ముందు నిమ్మకాయల చిన్న రాజప్ప

ఆంధ్రప్రదేశ్ శానససభ, ఆంధ్రప్రదేశ్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019
ముందు రావెల కిషోర్‌బాబు
నియోజకవర్గం ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం
పదవీ కాలం
2009 – 2014
ముందు రావి వెంకటరమణ
తరువాత రావెల కిషోర్‌బాబు
నియోజకవర్గం ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 25 డిసెంబరు 1972
ఫిరంగిపురం
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి మేకతోటి దయాసాగర్‌ (ఐఆర్‌ఎస్‌)
సంతానం హర్షిత్‌, రితిక
నివాసం ఫిరంగిపురం, గుంటూరు 522529

మేకతోటి సుచరిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కి చెందిన నాయకురాలు. ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని వై.యస్.జగన్మోహనరెడ్డి మంత్రి వర్గంలో హోం వ్యవహారాలు, విపత్తు నిర్వహణా శాఖల మంత్రిణిగా ఉంది. [2][3][4]

రాజకీయ జీవితం[మార్చు]

ఆమె 2009లో మొదటి సారి ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి శాసనసభ్యురాలిగా కాంగ్రెస్ పార్టీ టికెట్టుతో గెలుపొందింది. 2003 లో వై.ఎస్.రాజశేఖర రెడ్డి చారిత్రిక పాదయాత్ర సందర్భంలో ఆమె కాంగ్రెస్ పార్టీలోకి చేరింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ కు వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజశేఖర రెడ్డి చేత రాజకీయాభివృద్ధి చెందింది. ఆమె 2006లో గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం నుండి జడ్.పి.టి.సి సభ్యురాలిగా కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించి, ఆ పదవిలో రెండేళ్ళు కొనసాగింది.

2009 లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందింది. 2009 సెప్టెంబరులో రాజశేఖర రెడ్డి మరణం తరువాత ఆమె వై.ఎస్.జగన్మోహర రెడ్డి విధేయురాలిగా ఉంది. 2011 మార్చిలో జగన్మోహనరెడ్డి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ స్థాపించినపుడు ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీలో చేరింది. 2012 మే లో జరిగిన ఉప ఎన్నికలలో ఆమె వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి అదే స్థానంలో మరలా గెలుపొందింది.

2014 లో తెలుగుదేశం పార్టీ ఆమెకు సీటును ఇచ్చేందుకు అంగీకరించినప్పటికీ, ఆమె వైఎస్ఆర్ కుటుంబానికి విధేయతతో ఉంది. జగన్ మళ్లీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు వైయస్ఆర్సిపి టికెట్ కేటాయించారు.[5] ఆమె ముఖ్యమైన ఇద్దరు నేతలను ఓడించింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు డి.మాణిక్య వరప్రసాద్, జనసేన పార్టీలో చేరిన రావెల కిషోర్ బాబులను ఓడించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆమె గుంటూరు జిల్లా ఫిరంగిపురం వాస్తవ్యురాలు.[6] ఆమె భర్త ఎం.దయాసాగర్ ఐ.ఆర్.ఎస్. అధికారి. అతను ప్రస్తుతం ముంబైలో ఇన్‌కం టాక్సు లో కమీషనరుగా పనిచేస్తున్నాడు. ఆమె తండ్రి ఎన్.అక్కారావు ప్రభుత్వ వైద్యశాలలో వైద్యుడు. ఆతను తరువాత ఫిరంగిపురంలో వైద్యశాలను నడిపాడు. ఆమె 1990లో రాజనీతిశాస్త్రంలో బి.ఎ. పూర్తి చేసింది.

మూలాలు[మార్చు]

  1. Prajasakti (10 April 2022). "రాజీనామాలను ఆమోదించిన గవర్నర్". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  2. "Mekathoti Sucharita, the Dalit woman Home Minister of Andhra Pradesh". The New Indian Express. Hyderabad. 9 June 2019.
  3. "Mekatoti Sucharita set to create history". The Hindu. Guntur. 8 June 2019.
  4. TV5 News (8 June 2019). "ఏపీ మంత్రుల ప్రొఫైల్." (in ఇంగ్లీష్). Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "Jagan Reddy appoints Dalit woman as home minister of Andhra Pradesh". Hindustan times (in ఇంగ్లీష్). 2019-06-08. Retrieved 2019-06-11.
  6. Sakshi (22 March 2019). "తాడికొండలో పుట్టి.. ప్రత్తిపాడులో పోటీ". Sakshi. Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.