మేఘాలయ ఉన్నత న్యాయస్థానం
స్వరూపం
| మేఘాలయ హైకోర్టు | |
|---|---|
| స్థాపితం | 2013 మార్చి 23 |
| ప్రదేశం | షిల్లాంగ్, మేఘాలయ |
| సంవిధాన పద్ధతి | భారత ప్రధాన న్యాయమూర్తి, సంబంధిత రాష్ట్ర గవర్నర్ సలహా, సమ్మతితో రాష్ట్రపతిచే నియామకం. |
| అధికారం పొందినది | భారత రాజ్యాంగం |
| న్యాయమూర్తుల పదవీ కాలం | 62 సంవత్సరాల వయస్సు వరకు |
| స్థానాల సంఖ్య | 4 |
| వెబ్‌సైట్ | meghalayahighcourt.nic.in |
| ప్రధాన న్యాయమూర్తి | |
| ప్రస్తుతం | రేవతి ప్రశాంత్ మోహితే దేరే |
| అప్పటినుండి | 10 జనవరి 2026 |
మేఘాలయ హైకోర్టు భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రానికి చెందిన హైకోర్టు.[1] భారత రాజ్యాంగం, 1971 ఈశాన్య ప్రాంతాల (పునర్వ్యవస్థీకరణ) చట్టానికి తగిన సవరణలు చేసిన తర్వాత ఇది 2013 మార్చిలో స్థాపించబడింది. గతంలో గౌహతి హైకోర్టు ధర్మాసనం మేఘాలయ రాష్ట్రంపై అధికార పరిధిని కలిగి ఉండేది. ఈ హైకోర్టు ప్రధాన పీఠం మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ఉంది. గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు గౌరవనీయ న్యాయమూర్తులతో కలిపి ఈ కోర్టుకు నలుగురు శాశ్వత న్యాయమూర్తులు ఉన్నారు.
ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు
[మార్చు]మాజీ ప్రధాన న్యాయమూర్తులు
[మార్చు]| # | ప్రధాన న్యాయమూర్తి | మాతృ హైకోర్టు | పదవీ బాధ్యతలు చేపట్టిన తేదీ | పదవీ విరమణ చేసిన తేదీ | పదవీ కాలం | నియమించిన వారు |
|---|---|---|---|---|---|---|
| 1 | టి. మీనా కుమారి | ఆంధ్రప్రదేశ్ | 23 మార్చి 2013 | 3 ఆగస్టు 2013 | 133 రోజులు | ప్రణబ్ ముఖర్జీ |
| – | టి. నందకుమార్ సింగ్ (తాత్కాలిక) | గౌహతి | 4 ఆగస్టు 2013 | 19 సెప్టెంబర్ 2013 | 46 రోజులు | |
| 2 | ప్రఫుల్ల చంద్ర పంత్ | ఉత్తరాఖండ్ | 20 సెప్టెంబర్ 2013 | 12 ఆగస్టు 2014 | 326 రోజులు | |
| – | టి. నందకుమార్ సింగ్ (తాత్కాలిక) | గౌహతి | 13 ఆగస్టు 2014 | 26 ఆగస్టు 2014 | 13 రోజులు | |
| – | ఉమా నాథ్ సింగ్ (తాత్కాలిక) | మధ్యప్రదేశ్ | 27 ఆగస్టు 2014 | 18 మార్చి 2015 | 203 రోజులు | |
| 3 | ఉమా నాథ్ సింగ్ | 19 మార్చి 2015 | 14 జనవరి 2016 | 301 రోజులు | ||
| – | టి. నందకుమార్ సింగ్ (తాత్కాలిక) | గౌహతి | 15 జనవరి 2016 | 23 ఫిబ్రవరి 2016 | 39 రోజులు | |
| 4 | దినేష్ మహేశ్వరి | రాజస్థాన్ | 24 ఫిబ్రవరి 2016 | 12 ఫిబ్రవరి 2018 | 1 సంవత్సరం, 353 రోజులు | |
| 5 | తరుణ్ అగర్వాలా | అలహాబాద్ | 12 ఫిబ్రవరి 2018 | 2 మార్చి 2018 | 18 రోజులు | రామ్‌నాథ్ కోవింద్ |
| – | సుదీప్ రంజన్ సేన్ (తాత్కాలిక) | గౌహతి | 3 మార్చి 2018 | 20 మే 2018 | 78 రోజులు | |
| 6 | మహ్మద్ యాకూబ్ మీర్ | జమ్మూ కాశ్మీర్ | 21 మే 2018 | 27 మే 2019 | 1 సంవత్సరం, 6 రోజులు | |
| 7 | అజయ్ కుమార్ మిట్టల్ | పంజాబ్, హర్యానా | 28 మే 2019 | 2 నవంబర్ 2019 | 158 రోజులు | |
| 8 | మహ్మద్ రఫీక్ | రాజస్థాన్ | 13 నవంబర్ 2019 | 26 ఏప్రిల్ 2020 | 165 రోజులు | |
| 9 | బిశ్వనాథ్ సోమద్దేర్ | కలకత్తా | 27 ఏప్రిల్ 2020 | 11 అక్టోబర్ 2021 | 1 సంవత్సరం, 167 రోజులు | |
| 10 | రంజిత్ వసంతరావు మోర్ | బాంబే | 12 అక్టోబర్ 2021 | 3 నవంబర్ 2021 | 22 రోజులు | |
| – | హమర్సన్ సింగ్ థాంగ్‌ఖివ్ (తాత్కాలిక) | మేఘాలయ | 4 నవంబర్ 2021 | 23 నవంబర్ 2021 | 19 రోజులు | |
| 11 | సంజీబ్ బెనర్జీ | కలకత్తా | 24 నవంబర్ 2021 | 1 నవంబర్ 2023 | 1 సంవత్సరం, 342 రోజులు | |
| – | హమర్సన్ సింగ్ థాంగ్‌ఖివ్ (తాత్కాలిక) | మేఘాలయ | 2 నవంబర్ 2023 | 10 ఫిబ్రవరి 2024 | 100 రోజులు | ద్రౌపది ముర్ము |
| 12 | ఎస్. వైద్యనాథన్ | మద్రాస్ | 11 ఫిబ్రవరి 2024 | 16 ఆగస్టు 2024 | 196 రోజులు | |
| – | హమర్సన్ సింగ్ థాంగ్‌ఖివ్ (తాత్కాలిక) | మేఘాలయ | 17 ఆగస్టు 2024 | 2 అక్టోబర్ 2024 | 46 రోజులు | |
| 13 | ఇంద్ర ప్రసన్న ముఖర్జీ | కలకత్తా | 3 అక్టోబర్ 2024 | 5 సెప్టెంబర్ 2025 | 337 రోజులు | |
| – | హమర్సన్ సింగ్ థాంగ్‌ఖివ్ (తాత్కాలిక) | మేఘాలయ | 6 సెప్టెంబర్ 2025 | 7 అక్టోబర్ 2025 | 31 రోజులు | |
| 14 | సౌమెన్ సేన్ | కలకత్తా | 8 అక్టోబర్ 2025 | 9 జనవరి 2026 | 93 రోజులు | |
| 15 | రేవతి ప్రశాంత్ మోహితే దేరే | బాంబే | 10 జనవరి 2026 | అధికారంలో ఉన్నారు | 243 రోజులు |
సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన న్యాయమూర్తులు
[మార్చు]ఇప్పటి వరకు, మేఘాలయ హైకోర్టుకు చెందిన ఏ న్యాయమూర్తి కూడా సుప్రీంకోర్టుకు నియమితులవ్వలేదు.
ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి పొందిన న్యాయమూర్తులు
[మార్చు]ఇప్పటి వరకు, మేఘాలయ హైకోర్టుకు చెందిన ఏ న్యాయమూర్తి కూడా ఇతర ఏ హైకోర్టుకూ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవ్వలేదు.
మూలాలు
[మార్చు]- ↑ "New Chief Justices for Manipur, Meghalaya & Tripura high courts". Times of India. 24 March 2013. Retrieved 24 March 2013.