Jump to content

మేఘాలు చెప్పిన ప్రేమకథ

వికీపీడియా నుండి
మేఘాలు చెప్పిన ప్రేమకథ
దర్శకత్వంవిపిన్
రచనవిపిన్
ఆర్ట్తోట తరణి
నిర్మాతఉమా దేవి కోట
తారాగణం
ఛాయాగ్రహణంమోహన కృష్ణ
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంజస్టిన్ ప్రభాకరన్
నిర్మాణ
సంస్థ
  • సునేత్ర ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీ
17 జులై 2025 (2025-07-17)
దేశంభారతదేశం
భాషతెలుగు

మేఘాలు చెప్పిన ప్రేమకథ 2025లో విడుదలైన రొమాంటిక్ డ్రామా సినిమా. సునేత్ర ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఉమా దేవి కోట నిర్మించిన సినిమాకు విపిన్ దర్శకత్వం వహించాడు. నరేశ్ ఆగస్త్య, రబియా ఖాతూన్, రాధిక శరత్‌కుమార్,తనికెళ్ళ భరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 31న,[1] ట్రైలర్‌ను జులై 25న విడుదల చేసి,[2] సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో ఆగష్టు 22న విడుదలైంది.[3]

మేఘాలు చెప్పిన ప్రేమకథ సినిమా సెప్టెంబర్ 26 నుండి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4][5]

వరుణ్(నరేష్ అగస్త్య)కు సంగీతం అంటే పిచ్చి. సంగీతంలో ప్రయోగాలు చేయాలని, పెద్ద గాయకుడిగా, సంగీతకారుడు అవ్వాలని లక్ష్యం, తన నాయనమ్మ 'కాంచీపురం' కామాక్షి శంకరమూర్తి (రాధికా శరత్ కుమార్) కల నెరవేర్చాలని అనుకుంటాడు. వరుణ్ అమెరికా నుంచి ఇండియాకు వస్తాడు. ఈ విషయాన్ని తండ్రి మహేంద్ర (సుమన్)కి చెబితే బిజినెస్ చూసుకోమని, ఆర్ట్ ఫుడ్ పెట్టదని అదే కావాలంటే బయటకు వెళ్లిపొమ్మని అంటాడు. వరుణ్ చేసిన ఓ మ్యూజిక్ ఆల్బమ్ మ్యూజిక్ కంపెనీకి నచ్చలేదు అని చెప్పడంతో బెస్ట్ ఆల్బమ్ చేయడానికి తన నానమ్మ ఊరు తమిళనాడులోని వాల్పరైకి వెళ్తాడు. అక్కడ తన ఎస్టేట్ చూసుకుంటూ మ్యూజిక్ ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. వాల్పరైలో వరుణ్, మేఘన (రబియా ఖతూన్) తో ప్రేమలో పడతారు. కానీ కొంతకాలం తరువాత వరుణ్ కు చెప్పకుండానే మేఘన హైదరాబాద్‌ వెళ్ళిపోతుంది. అసలు మేఘన హైదరాబాద్ ఎందుకు వెళ్ళింది? వరుణ్ తన నాయనమ్మ కల తీర్చాడా ? లేదా? చివరకు ఏమైంది ? అనేది మిగతా సినిమా కథ.[6]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."తిల్లాన"మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రిన్స్ రామవర్మ2:25
2."సౌండ్‌ ఆఫ్‌ లవ్‌[7]"రెహమాన్‌4:40ఎస్.పి. చరణ్, షాషా తిరుపతి 
3."గలా గలా[8]"రెహమాన్‌ కార్తిక్, చిన్మయి శ్రీపాద4:07
4."సాగే నదే"కృష్ణకాంత్ అనురాగ్ కులకర్ణి3:56

మూలాలు

[మార్చు]
  1. "Meghalu Cheppina Prema Katha teaser: Two lovers explore music, nature and every form of beauty that life has to offer" (in ఇంగ్లీష్). Cinema Express. 31 May 2025. Archived from the original on 26 September 2025. Retrieved 26 September 2025.
  2. "'మేఘాలు చెప్పిన ప్రేమకథ' ట్రైలర్ రిలీజ్". Sakshi. 25 July 2025. Archived from the original on 26 September 2025. Retrieved 26 September 2025.
  3. "ప్రేమకథల్లో ఇదో కొత్త కోణం". NT News. 19 August 2025. Archived from the original on 26 September 2025. Retrieved 26 September 2025.
  4. "'ఘాటి', 'ధడక్ 2'.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వ‌చ్చిన సినిమాలివే". NT News. 26 September 2025. Archived from the original on 26 September 2025. Retrieved 26 September 2025.
  5. "ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ సినిమా". Sakshi. 22 September 2025. Archived from the original on 26 September 2025. Retrieved 26 September 2025.
  6. "మేఘాలు చెప్పిన ప్రేమకథ సినిమా రివ్యూ: థియేటర్లలో చివరి వరకూ కూర్చోగలమా?". ABP Desam. 22 August 2025. Archived from the original on 26 September 2025. Retrieved 26 September 2025.
  7. "చినుకు కురిసింది సిరిమువ్వగా." NT News. 15 June 2025. Archived from the original on 26 September 2025. Retrieved 26 September 2025.
  8. "కార్తీక్‌, చిన్మ‌యిల గాత్రంలో.. గ‌ల‌గ‌ల లిరిక‌ల్ వీడియో సాంగ్‌". Chitrajyothy. 30 June 2025. Archived from the original on 26 September 2025. Retrieved 26 September 2025.

బయటి లింకులు

[మార్చు]