Jump to content

మేఘా ధాదే

వికీపీడియా నుండి
మేఘా ధాదే
మేఘా ధాదే (2019)
జననంమే 22[1]
ఇతర పేర్లుపరి, బాలి, మేఘుడి
వృత్తినటి, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2004-ప్రస్తుతం
జీవిత భాగస్వామిఆదిత్య పావస్కర్‌
పిల్లలు2

మేఘా ధాడే మహారాష్ట్రకు చెందిన టివి, సినిమా నటి. 2018లో బిగ్ బాస్ మరాఠీ 1 మొదటి సీజన్‌లో పాల్గొని విజేతగా నిలిచింది.[2] తర్వాత బిగ్ బాస్ 12 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా పాల్గొన్నది.[3]

జననం

[మార్చు]

మేఘా ధాడే జూన్ 22న మహారాష్ట్ర, జల్గావ్‌లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది.

నటనారంగం

[మార్చు]

కిస్ ధేష్ మై హై మేరా దిల్, కస్తూరి వంటి సీరియళ్ళతోపాటు ఇతర హిందీ టీవీ సీరియల్స్‌లో నటించింది.[4] 2012లో మరాఠీ సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది. డిడి నేషనల్‌లో ప్రసారమైన పెహచాన్‌ సీరియల్ లో కూడా నటించింది.[5] 2018 ప్రారంభంలో బిగ్ బాస్ మరాఠీ రియాలిటీ షోలో విజేతగా నిలిచింది.[6] 2018 అక్టోబరు చివరలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మరొక రియాలిటీ షో బిగ్ బాస్ 12 లో చేరింది. డిసెంబరు 6న ఆ షో నుండి తొలగించబడింది.[7]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మేఘా ధాడేకు ఆదిత్య పావస్కర్‌తో వివాహం జరిగింది.[8] తన భర్త మొదటి వివాహం నుండి ఇద్దరు పిల్లలు, కుమార్తె, సాక్షి, సవతి కుమారుడు వేదాంత్ ఉన్నారు.[9]

నటించినవి

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా భాష పాత్ర మూలాలు
2009 మాన్ సన్మాన్ మరాఠీ
2011 సూపర్ స్టార్ మరాఠీ
2012 విషయం మరాఠీ [10]
2016 ఏక్ హోతీ రాణి మరాఠీ

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం కార్యక్రమం భాష పాత్ర ఇతర వివరాలు
2004 కసౌతి జిందగీ కే హిందీ
2008 పెహచాన్ హిందీ సునైనా
2009 కస్తూరి హిందీ సాచి
2014 జుంజ్ మారత్మోలి మరాఠీ పోటీదారు
2018 బిగ్ బాస్ మరాఠీ 1 మరాఠీ విజేత పోటీదారు
అస్సల్ పహునే ఇర్సల్ నమునే మరాఠీ అతిథి పాత్ర
బిగ్ బాస్ 12 హిందీ (వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ 36వ రోజున ప్రవేశించి, 83వ రోజు తొలగించబడింది)
ఏక్దమ్ కడక్ మరాఠీ బిగ్ బాస్ మాజీ విజేతగా
2019 బిగ్ బాస్ మరాఠీ 2 మరాఠీ స్పెషల్ టాస్క్ కోసం
2020 ఆజ్ కే స్పెషల్ మరాఠీ శివ్ ఠాకరేతో పాటు
2021 బిగ్ బాస్ మరాఠీ 3 మరాఠీ [11]

మూలాలు

[మార్చు]
  1. "Actress Sai Lokur wishes Megha Dhade a very happy birthday - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-17.
  2. "Bigg Boss Marathi winner Megha Dhade: Sai was my biggest competitor". Times of India. 23 July 2018.
  3. "Bigg Boss 12: Bigg Boss Marathi winner Megha Dhade enters the show as wild card contestant".
  4. "Meet Bigg Boss 12 wild card contestant Megha Dhade". The Indian Express. 23 October 2018.
  5. "Pehchaan". indiantelevision.com. Archived from the original on 19 February 2015. Retrieved 2022-12-17.
  6. "Bigg Boss Marathi: Megha Dhade wins the trophy". Times of India. 23 July 2018.
  7. "Bigg Boss 12 evicted contestant Megha Dhade: Deepak Thakur is a disgusting guy".
  8. "Bigg Boss Marathi Exclusive: Megha Dhade's husband Aditya talks about the actress and her game". Times of India. 22 July 2018.
  9. "Bigg Boss Marathi: From Getting Pregnant Before Marriage To Sleeping On A Railway Platform, A Quick Look At Megha Dhade's Journey". Times of India. 24 April 2018.
  10. "Review: 'Matter' (Marathi)". Daily News and Analysis. Retrieved 2022-12-17.
  11. "Bigg Boss Marathi 3: BB Marathi 1 winner Megha Dhade and former contestant Resham Tipnis to appear on the show - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-17.

బయటి లింకులు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మేఘా ధాదే పేజీ

"https://te.wikipedia.org/w/index.php?title=మేఘా_ధాదే&oldid=3780771" నుండి వెలికితీశారు