మేధా ఖొలే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మేధా ఖొలే
వృత్తిమహిళా శాస్త్రవేత్త

మేధాఖొలే పుట్టి పెరిగింది పూనా. వారిది మద్యతరగతి కుటుంబం. ఆమె తన మాతృభాష అయిన మరాఠీ మాధ్యమంలో ఉన్నత పాఠశాల విద్యను సాగించింది. ఒకప్పుడు ఆమెకు సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. అయినప్పటికీ పదవతరగతి పరీక్షలలో 88% మార్కులు పొందిన తరువాత ఆమెనిర్ణయంలో మార్పులు సంభవించాయి. ఆమె స్నేహితులంతా విజ్ఞాన శాస్త్రము ప్రధానాంశంగా డిగ్రీ కోర్సు తీసుకున్న కారణంగా ఆమెకూడా విజ్ఞాన శాస్త్రము డిగ్రీలో చేరడానికి నిర్ణయించుకున్నది. తరువాత ఆమె " ఫర్గసన్ కాలేజిలో "లో బి..ఎస్.సి డిగ్రీ విద్యను కొనసాగించింది. డిగ్రీ చదుతున్న మూడు సంవత్సరాల కాలంలో ఆమెకు ప్రత్యేకంగా భౌతికశాస్త్రం పట్ల ఆసక్తి కలిగింది. ప్రధానంగా " క్వాంటం మెకానిజం " పట్ల మరింత ఆసక్తి కలిగింది.

తండ్రి అందించిన ప్రోత్సాహం

[మార్చు]

ఆయన విజ్ఞాన శాస్త్రము డిగ్రీ తీసుకుని తరువాత లా ప్రధానానంశగా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసాడు. అలాగే హ్యూమన్ ఫిజియాలజీ రీసెర్చ్ సేసాడు. ఆయన తన కుమార్తెలమీద సాంఘిక సంప్రదాయ నిబంధలను విధించక వారికి వారు కోరుకున్న విధంగా ఉన్నత విద్యను అభ్యసించడానికి అవసరమైన సహాయం ప్రోత్సాహం అందించాడు. మేధా తనతండ్రి నుండి నేర్చుకోవడంలో ఉన్న ఆనందాన్ని తెలుసుకున్నది. మేధా ఖొలె తండ్రి మానవీయ విలువలకు , విద్యకు అత్యంత గౌరవం ఉన్నవాడు.

ప్రయోగాలు చెయ్యడం, ధియరీ చదివి నేర్చుకోవడం , పుస్తకాలు చదవడం, ప్రాక్టికల్ క్లాసులలో జాగరూకతగా ఉండి పరిశీలించడం ప్రంసిపల్స్ నృర్చుకోవడం ఆమెకు ఆసక్తి కలిగించాయి. ఆసక్తితో అధ్యయనం చేసిన కారణంగా బి.ఎస్.సి డిగ్రీ పరీక్షలలో ఉన్నతశ్రేణిలో విజయం సాధించింది. తరువాత తండ్రి ప్రోత్సాహంతో " యూనివర్శిటీ ఆఫ్ పూనా "లో ఆమె ఎం.ఎస్.సి, ఫిజిక్స్ పూర్తిచేసింది.

సివిల్ సర్వీసెస్

[మార్చు]

1989లో ఎం.ఎస్.సి డిగ్రీ అందుకున్న తరువాత ఆమె " స్టేట్, నేషనల్ సివిల్ సర్వీసెస్ " పరీక్షలకు హాజరు అయింది. సమాజానికి సేవలు అదించడానికి సివిల్ సర్వీసెస్ ఉత్తమ మార్గమని ఆమె భావించింది. ఆమె స్టేట్ సివిల్ పరీక్షలద్వారా రెండుమార్లు గ్రూప్ ఏ గజిటెడ్ ఆఫీసర్‌గా ఎన్నిక చేయబడింది. అమె స్వ్లల్పకాలం ఇంకంటాక్స్ డిపార్ట్‌మెంటులో పనిచేసింది. విజ్ఞాన శాస్త్రము సంబంధం లేకపోయినా ఆ ఉద్యోగం ఆమెకు తృప్తినిచ్చింది. తరువాత ఆమె " యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ " ద్వారా గజిటెడ్ ఆఫీసర్‌గా ఎన్నికైంది. తరువాత ఆమె " ఇండియన్ మెటీరియరాజికల్ " డిపార్ట్‌మెంటులో చేరింది. తరువాత మెటీరియరాలజీ శిక్షణ తీసుకున్న సమయంలో మెటీరియరాలజీ రీసెర్చ్ చేయాలన్న ఆసక్తి అధికమైంది.

రీసెర్చ్

[మార్చు]

మెటీయరాలజీలో ఫిజిక్స్, మేథమెటుక్స్, స్టాటిస్టిక్స్, జాగ్రఫీ, ఎంవిరాన్మెంటల్, విజ్ఞాన శాస్త్రము, అలైడ్ ఫీల్డ్ సంబంధిత మిశ్రితమైన పలు అంశాలు ఉంటాయి. మెటీయరాలజీలో వాతావరణం ఒక అంశం కనుక శిక్షణ తరువాత ఆమె ముంబయితుఫాన్ హెచ్చరిక కేంద్రంలో వెదర్ ఫోర్కేస్టర్‌గా 1/5 సంవత్సరం పనిచేసింది. ఈ పని ఆమెకు వాతావరణంలో కలిగే మార్పులను గురించిన అవగాహన కలిగించింది. 1994లో ఆమె పూనా మెటీయరాజికల్ ఆఫీసు రీసెర్చ్ యూనిట్‌కు బదిలీ చేయబడి 8 సంవత్సరాలు పనిచేసింది. ఉద్యోగంలో భాగంగా ఆమె పలువిద్యార్థులకు మెటీయరాలజీలోని అంశాలలో శిక్షణ ఇచ్చిన కారణంగా అవగాహన మరింత మెరుగైంది. తరువాత ఆమె వైవిధ్యమైన భారతీయ వాతావరణంగురించి అధ్యయనం చేసి మొదటి రీసెర్చ్ పేపర్ (పరిశోధనా పత్రం) ప్రచురించింది. పరిశోధనాంశాలను జాయీయ, అంతర్జాతీయ సెమినార్లలో ప్రదర్శించింది. తరువాత వైవిధ్యమైన భారతీయ వాతావరణంగురించి చేసిన పరిశోధన ద్వారా 2001లో డాక్టరేట్ అందుకున్నది.

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా వ్రాయవచ్చు.
"https://te.wikipedia.org/w/index.php?title=మేధా_ఖొలే&oldid=3857984" నుండి వెలికితీశారు