మేరీ కస్సట్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మేరీ కస్సట్
Mary Cassatt-Selfportrait.jpg
Self-portrait by Mary Cassatt, c. 1878, gouache on paper, 23 5/8 × 16 3/16 in., Metropolitan Museum of Art, న్యూయార్క్
జన్మ నామం మేరీ స్టీవెన్సన్ కస్సట్
జననం (1844-05-22)మే 22, 1844
అలెగ్నీ, పెన్సిల్వేనియా, అ.సం.రా.
మరణం 1926(1926-06-14) (వయసు 82)
Château de Beaufresne, పారిస్ వద్ద, ఫ్రాన్స్
జాతీయత అమెరికా సంయుక్త రాష్ట్రములు
రంగం చిత్రలేఖనం
శిక్షణ పెన్సిల్వేనియా అకాడమీ, జీన్ లోన్ జిరోమ్, ఛార్లెస్ ఛాప్లిన్, థామస్ కోటె
ఉద్యమం ఇంప్రెషనిజమ్(Impressionism)

మేరీ స్టీవెన్సన్ కస్సట్ (మే 22, 1844 - జూన్ 14, 1926) ఒక అమెరికన్ చిత్రకారిణి మరియు ముద్రణాకర్త. ఆమె తన పరిణత వయసును అధిక భాగం ఫ్రాన్సులో గడిపారు. అక్కడ ఆమె మొదట ఎడ్గార్ డేగాస్ సాన్నిహిత్యంలో ఉన్నారు, తరువాత భావ ప్రాధాన్య కళాకారులతో తన కృతులను ప్రదర్శించారు.

కస్సట్ తరచూ స్త్రీల సాంఘిక మరియు వ్యక్తిగత జీవితాల చిత్తరువులను చేసేవారు. ప్రత్యేకించి తల్లీ మరియు బిడ్డల ఆంతరంగిక బంధానికి ప్రాముఖ్యతనిచ్చారు.

ప్రారంభ జీవితం[మార్చు]

కస్సట్ పెన్సిల్వేనియా లోని, అల్లెఘేనీ నగరంలో జన్మించారు, అది నేటి పిట్స్‌బర్గ్లో భాగంగా ఉంది. ఈమె అనుకూలమైన పరిస్థుతులలో జన్మించారు : ఆమె తండ్రి, రాబర్ట్ సిమ్సన్ కస్సట్ (తర్వాత క్యాసెట్ ), ఒక విజయవంతమైన స్టాక్ బ్రోకర్ మరియు భూమి వ్యాపారం చేసేవారు, మరియు ఆమె తల్లి కాతెరీన్ కెల్సో జోన్స్టన్, ఒక బ్యాంకింగ్ కుటుంబం నుంచి వచ్చారు. వంశం పేరు కస్సార్ట్ గా ఉండేది.[1] కళాకారుడు రాబర్ట్ హెన్రి క్యాసెట్ యొక్క సోదరుడు. ఏడుగురి సంతానంలో కస్సట్ ఒకరు, సంతానంలో ఇద్దరు చిన్నతనములోనే చనిపోయారు. ఈమె కుటుంబం తూర్పుదిక్కుకు, మొదట లన్కాస్టర్, పెన్సిల్వేనియా, దాని నుంచీ ఫిలడెల్ఫియాకు మారారు, ఇక్కడే ఈమె తన ఆరేళ్ల వయసులో విద్యారంభము చేశారు.

కస్సట్ పెరిగిన వాతావరణంలో విద్య అనేది ప్రయాణంతోనే పరిపూర్ణమవుతుందని గ్రహించారు; ఆమె 5 సంవత్సరాలు యూరోప్లో గడిపారు మరియు అనేక రాజధానులను సందర్శించారు, వాటిలో లండన్, పారిస్, మరియు బెర్లిన్ ఉన్నాయి. ఆమె విదేశంలో ఉన్నప్పుడే జర్మన్ ఇంకా ఫ్రెంచ్ మరియు చిత్రలేఖనం మరియు సంగీతంలో తోలి పాఠాలను నేర్చుకున్నారు. ఆమె మొదటిసారిగా ఫ్రెంచ్ కళాకారులు ఇన్గ్రేస్, డేల క్రోయిక్స్, కోరోట్, మరియు కూర్బెట్ లను 1885 'పారిస్ వరల్డ్స్ ఫెయిర్' లో కలుసుకొని ఉండవచ్చు. మరియు డేగాస్ మరియు పిస్సర్రోలతో ప్రదర్శలను నిర్వహించారు. వీరిద్దరూ భవిష్యత్తులో ఆమె సహకళాకారులూ మరియు సలహాదారులు అయ్యుంటారు.[2]

ఆమె కుటుంబం ఆమె వృత్తిరీత్యా కళాకారిణి అవ్వటాన్ని వ్యతిరేకించినప్పటికీ, కస్సట్ పదిహేను ఏళ్ళ వయసులో ఫిలడెల్ఫియా లోని పెనిసిల్వేనియా అకాడమీ అఫ్ ది ఫైన్ ఆర్ట్స్‌లో చిత్రలేఖనం చదవడం ఆరంభించారు. కస్సట్ స్త్రీ స్వాతంత్ర్య ఆలోచనలు బహిర్గతం చేయడం మరియు కొంతమంది పురుష విద్యార్థుల సాంఘిక కట్టుబాట్లు అతిక్రమించే నడవడి ఆమె తల్లితండ్రుల ఆందోళనకు కొంతభాగం కారణమైనది. విద్యార్థులలో 20% మంది ఆడవారైనప్పటికీ చాలామంది కళను సాంఘికంగా విలువైన నైపుణ్యంగానే గుర్తించారు; కొంతమంది కస్సట్ లాంటివారు కళను వృత్తిగా మలుచుకోవాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఆమె తన చదువును అమెరికన్ సివిల్ వార్ కాలంలో కూడా కొనసాగించారు. ఆమె సహా విద్యార్థులలో థామస్ ఎయకిన్స్ ఉన్నారు, తర్వాత వివాదస్పదమైన అకాడమీ డైరెక్టర్ గా ఉన్నారు.

మందగతిలో సాగుతున్న బోధనలు మరియు మగవిద్యార్థులకి మరియు బోధకులకీ ఉన్న పక్షపాతవైఖరికి ఆమె సహనం కోల్పోయి, ఆమె ఓల్డ్ మాస్టర్స్‌ను సొంతంగానే చదవటానికి నిశ్చయించుకున్నారు. తర్వాత ఆమె చెప్పారు- అకాడమీలో శిక్షణ ఏమీ లేదు. మహిళా విద్యార్థులు జీవం ఉన్న నమూనాలను (దాని తర్వాత కొంతకాలం వరకు) కాక ముఖ్య చిత్రలేఖనం అంతా పోతపోసిన వాటినుంచి ఉండేది.[3]

కస్సట్ తన చదువును ముగించాలని నిశ్చయించుకొంది. (ఆ సమయంలో, పట్టాను కూడా ఇవ్వలేదు.) ఆమె తండ్రి ఆక్షేపణలు అధిగమించి 1866 లో పారిస్ కు వెళ్ళారు, ఆమె తల్లి మరియు కుటుంబ స్నేహితులు ఆమె సంరక్షకులుగా ఉన్నారు. మహిళలు ఎకోల్ డెస్ బ్యుయాక్స్-ఆర్ట్స్ కు హాజరుకాలేక పోయినప్పటికీ, ఆమె ప్రైవేటుగా మాస్టర్స్ చదవటానికి దరఖాస్తు చేసుకున్నారు మరియు జీన్ -లియాన్ జెరోమోతో చదవటానికి అనుమతి పొందారు. ఈయన అతిసహజమైన నైపుణ్యము మరియు పరదేశ విషయాల చిత్రించడంలో ఖ్యాతి పొందారు. కొద్ది నెలల తర్వాత జెరోమ్ ఈయకిన్స్ ను కూడా విద్యార్థిగా స్వీకరించింది. కస్సట్ తన చిత్రకళా శిక్షణను ప్రతిరోజూ లౌవ్ర్‌లోని వాటిని నకలు చేస్తూ పెంచుకున్నారు (దానికి కావలసిన అనుమతిని ఆమె పొందగలిగారు, అది అతి తక్కువ పారితోషికము పొందే నకలుచేసే మహిళలను నియంత్రించడానికి, వీరు ప్రతిరోజూ వీరు వస్తుప్రదర్శనశాలలో చిత్రించిన ప్రతులను అమ్మకానికి నింపేవారు). ఈ ప్రదర్శనశాల ఫ్రెంచ్ పురుషులకు మరియు అమెరికా మహిళా విద్యార్థులకు సాంఘిక సమావేశా స్థలంగా ఉండేది, కస్సట్ లాంటివారికి కాఫీ స్థలాలలోకి అనుమతి ఉండేది కాదు. ఇక్కడ గొడవలకు సిద్ధంగా ఉండేవారు కలిసేవారు. ఈ పద్ధతిలో, తోటి కళాకారిణి మరియు స్నేహితురాలు ఎలిజబెత్ జేన్ గార్డ్నెర్ మరియు ప్రముఖ చిత్రకారుడు విల్లియం-అడాల్ఫ్ బోగురియో కలుసుకొని వివాహం చేసుకున్నారు.[4]

1866 నాటి చివరికి, ఈమె సృష్టిలో సాధారణ విషయాలను చిత్తరువులుగా చూపించే కళాకారుడు చార్లెస్ చాప్లిన్ వద్ద చిత్రలేఖనం తరగతుల కోసం చేరారు. 1868, లో కస్సట్ కళాకారుడు థామస్ కుతూర్ తో కూడా కలసి చదువుకున్నారు. వీరి విషయాలు ప్రధానంగా ప్రేమభరితమైన మరియు నగరాలకు సంబంధించినవిగా ఉండేవి. పల్లెటూరు యాత్రలకు వెళ్ళినప్పుడు, విద్యార్థులు వారి జీవితాలను చిత్రీకరించేవారు. ముఖ్యంగా పల్లెటూరివారి రోజువారీ జీవనవిధానం ఉండేది. 1868 లో ఆమె చిత్రాలలో ఒకటైన ఎ మాన్డలిన్ ప్లేయర్ పారిస్ సలోన్ ఎన్నుకోబడిన వారితో మొదటిసారిగా ఎంపిక చేయబడింది. ఈ పని ప్రేమ శైలిలో ఉన్న కోరోట్ మరియు కోటుర్ విధానం, ఇంకనూ లిఖితరూపంగా ఉన్న ఈనాటి ఆమె వృత్తి జీవన మొదటి దశాబ్దంలో ఉన్న రెండు చిత్రాలలో ఇది ఒకటి. అప్పుడు ఫ్రెంచ్ కళా రంగం మారే క్రమంలో ఉంది. మూలమైన కళాకారులు కోర్బెట్ మరియు మానేట్ వంటివారు అకాడెమిక్ సంప్రదాయం నుండి చీలిపోవటానికి ప్రయత్నించారు మరియు నచ్చచేప్పేవారు ముందు కాలంతోనే ఉన్నారు. కస్సట్ స్నేహితురాలు ఎలిజా హాల్డ్మన్ వ్రాశారు, కళాకారులు అకాడమీ శైలిని వదిలివేసి ఇంకా ప్రతిఒక్కరూ ఒక కొత్త విధానం కావాలనుకుంటున్నారు. దీని మూలంగా ప్రతిదీ గందరగోళంగా ఉన్నది.[4] కస్సట్ సాంప్రదాయ పద్ధతిలోనే తన పనిని కొనసాగించారు. పెరుగుతున్న విసుగుతోనే తన పనులను పదేళ్ళకు పైగా సలోన్ కు అప్పగించారు.

ది బోటింగ్ పార్టీ 1893-94 ది బోటింగ్ పార్టీ బై మేరీ కస్సట్, 1893–94, ఆయిల్ ఆన్ కాన్వాస్, 35 1/2 x 46 ఇన్., నేషనల్ గేలరీ అఫ్ ఆర్ట్, వాషింగ్టన్

ఫ్రాంకో -ప్రష్యన్ యుద్ధం ఆరంభమవుతుండగా ఈమె యునైటెడ్ స్టేట్స్‌కు 1870 ఎండాకాలం చివరిలో వచ్చేశారు- కస్సట్ తన కుటుంబంతో అల్టూనాలో నివసించారు. ఆమె తండ్రి ఆమె గడుపుతున్న సెలవలను వ్యతిరేకించారు, మరియు కనీస అవసరాలకు డబ్బులిచ్చేవారు కానీ ఆమె కళలకి కావలసినవాటికి మాత్రం కాదు.[5] ఆమె తన రెండు చిత్రాలను న్యూయార్క్ గేలరీలో ఉంచారు, అయితే చాలామందే ప్రశంశకులు వాటిని గుర్తించారు కానీ కొనేవారే లేరు. ఎండాకాలం సెలవలలో అధ్యయనం చేయటానికి ఏమీ చిత్రాలు లేకపోవటంతో ఆమె దిగులుపడిపోయింది. ఆమె స్వతంత్రంగా జీవించటానికి దృఢ సంకల్పంతో ఉండటం వల్ల కస్సట్ కళను వదిలివేయటాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. జూలై, 1871లో ఆమె ఒక ఉత్తరం వ్రాశారు- నేను నా స్టూడియో ను వదిలేశాను ఇంకా నా తండ్రి చిత్తరువును చింపేశాను, నేను కుంచె పట్టుకొని ఆరు వారాలు అయింది ఇంకా ఏమన్నా యూరోప్ వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటే తప్ప నేను పట్టుకోను. నేను వచ్చే కాలానికి పశ్చిమానికి వెళ్లాలని మరియు ఉద్యోగం పొందాలని ఉత్కంటతో ఉన్నాను, కానీ ఎక్కడ అనేది నేను ఇంకా నిశ్చయించుకోలేదు. ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి చికాగో వెళ్లారు కానీ 1871 చికాగో అతిఘోర అగ్ని ప్రమాదంలో ఆమె తోలి రోజులనాటి చిత్రాలు కాలిపోయాయి. ఇది జరిగిన కొంతకాలానికి, ఆమె పని పిట్స్‌బర్గ్‌లోని ఆర్చ్ బిషప్‌ను ఆకర్షించింది. ఈయన ఇటలీ పర్మలోని కరెగియో చిత్రం రెండు ప్రతులను చిత్రించమని ఈమెకు పురమాయించాడు. ఆమె ప్రయాణ ఖర్చులకు ఇంకా ఉండటానికి కావలసిన ధనంలో కొంత భాగం ముందుగానే ఇచ్చారు. ఆమె ఆత్రుతతో ఇలా రాశారు- యెంత ఘాటుగా నేను పని చేయాలనుకుంటున్నానో, నా వేళ్ళు దురద పెడుతున్నాయి ఇంకా మంచి చిత్రాలను మళ్ళీ చూసి నా కళ్ళ లోంచి నీరు వస్తున్నాయి. ఫిలడెల్ఫియాలో పేరు ప్రఖ్యాతలున్న కళాత్మక కుటుంబంలోని సహా కళాకారుడు ఇమిలి సార్టైన్ తో కలసి ఉండటానికి కస్సట్ తిరిగి యూరోప్ వెళ్ళారు.

భావాలకు ప్రధానమిచ్చే కళా శైలి[మార్చు]

టీ బై మేరీ కస్సట్, 1880, ఆయిల్ ఆన్ కాన్వాస్, 25 1/2 x 36 1/4 ఇన్ ., మ్యూజియం అఫ్ ఫైన్ ఆర్ట్స్, బోస్టన్

1871 లో యూరోప్ తిరిగి వచ్చిన కొద్ది నెలలకే కస్సట్ ఆశలు మళ్ళీ చిగురించాయి. ఆమె చిత్రం ఆనందోత్సవములో ఇద్దరు మహిళలు పువ్వులు విసరటంను 1872 లోని సలోన్‌లో బాగా స్వీకరించారు మరియు అది అమ్ముడైంది. ఆమె పర్మలో అనుకూలంగా ఆకర్షించబడ్డారు మరియు అక్కడి కళారంగానికి తోడ్పాటుని మరియు ప్రోత్సాహాన్ని ఇచ్చారు; పర్మలో అంతా కస్సట్ గురించి ఇంకా ఆమె చిత్రాల గురించి మాట్లాడుకుంటున్నారు, మరియు ప్రతిఒక్కరూ ఆమె గురించి తెలుసుకోవాలని ఆత్రుతగా ఉన్నారు.[6]

ఆర్చ్ బిషప్ పురమాయించిన పని పూర్తవ్వగానే, కస్సట్ మాడ్రిడ్ ఇంకా సెవిల్లె వెళ్ళారు, ఇక్కడ ఈమె స్పానిష్ విషయాల మీద చిత్రాలను చిత్రించారు, వీటిలో లేస్ మన్టిల్ల వేసుకున్న స్పానిష్ నృత్యకారిణి (1873 లో నేషనల్ మ్యూజియం అఫ్ అమెరికన్ ఆర్ట్, స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్). 1874 లో ఆమె తన నివాసంని ఫ్రాన్స్ లో ఏర్పరుచుకున్నారు. ఆమె తన సోదరి లిడియాతో ఒక అపార్ట్మెంట్ లో కలిసి ఉన్నారు. కస్సట్ సలోన్ లోని రాజకీయాలను మరియు అక్కడ ఉన్న సంప్రదాయాలను ఆమె బహిర్గతం చేస్తూనే ఉన్నారు. ఆమె తన విమర్శలలో కటువుగా ఉండేవారు, సార్టైన్ నివేదికలో రాసిన ప్రకారం: ఆమె పూర్తిగా బాదిపడేస్తారు, నవీన కళని లెక్కచేయరు, సలోన్ చిత్రాలు కాబనెల్, బొన్నట్ మరియు మనం గౌరవించే అన్ని పేర్లని ఆమె తిరస్కరించారు. కళాకారిణి జ్యురీలో ఉన్న వారి స్నేహితురాలో లేక సంరక్షకరాలో అయితే తప్ప మహిళా కళాకారులు చేసిన పనిని తరచుగా తిరస్కార ద్వేషముతో పంపివేయటాన్ని కస్సట్ గమనించారు, ఇంకా ఈమె సభ్యుల పక్షపాతవైఖరిని ఏమాత్రం సహించేవారు కాదు. 1875 లో ఆమె సమర్పించిన రెండు చిత్రాలు జ్యూరీ తిరస్కరించిన తర్వాత ఆమెకు మనుషుల పట్ల ద్వేషం పెరిగింది. తర్వాత సంవత్సరం ఈమె చిత్రాలలో బ్యాక్ గ్రౌండ్ నలుపు చేయటంతో అవి స్వీకరింపబడినాయి. కస్సట్ తనకు నిష్కర్షగా మాట్లాడటం మరియు స్వార్ధపరంగా ఉండటం నేర్పిన సార్టైన్ గొడవపడ్డారు. వారిద్దరూ విడిపోయారు. మిక్కిలి వ్యధ మరియు ఆత్మ విమర్శతో కస్సట్ సహజ చిత్రాలనుంచి నాగరిక విషయాలకు మారారు. ఇది విదేశాలలోని అమెరికన్ల చిత్తరువుల కమిషనును ఆకర్షించడానికే, కానీ అ ప్రయత్నం ఆరంభంలో అంట ఆశాజనకముగా లేదు.[7]

డేగాస్, పోర్త్రైట్ అఫ్ మిస్ కస్సట్, సీటేడ్, హోల్డింగ్ కార్డ్స్, c. 1876-1878, ఆయిల్ ఆన్ కాన్వాస్

1877 లో ఆమె రెండు ఎంట్రీలను తిరస్కరించారు, మరియు ఏడేళ్ళలో మొదటిసారిగా ఆమెకు సలోన్ లో పనిలేకపోయింది. ఆమె వృత్తి జీవితంలో అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఎడ్గార్ డేగాస్ వద్ద నుంచి ఈమె కృతులను భావ శైలురుతో చూపించమని ఆహ్వానం అందుకున్నారు. వీరు 1874 లో ఆరంభమైన ఒక వర్గం, వీరు తమ ప్రదర్శనలను స్వతంత్రంగా నిర్వహిస్తారు. భావ శైలురుకు (“స్వతంత్రులు” లేక “అంగీకరించు స్వభావం లేనివారు” అని కూడా పిలవబడతారు) ముందుగానే ఏమీ ఆశల ఆశయాల ప్రకటన లేదు మరియు విషయ సంగ్రహంలోను ఇంకా మెళుకువలోను చాలా వ్యత్యాసం ఉంది. వారు బహిరంగ చిత్రలేఖనాన్ని అభిమానించారు మరియు ముందుగానే కొంత కలుపుకున్న ఉత్సాహపూరితమైన రంగులు వివిధ రకాలుగా వేయటాన్ని సమర్ధించారు. దీని ఫలితంగా కంటికి చూడగానే ఆకర్శించేతట్టుగా ఉంటుంది. భావచిత్రకారులు విమర్శకుల కోపాన్ని చాలా సంవత్సరాలు ఎదుర్కున్నారు. కస్సట్ స్నేహితురాలు హెన్రీ బకన్ ఆలోచన ప్రకారము భావచిత్రకారులు చాలా తీవ్రవాదులుగా ఉన్నారు ఇంకా వారికి తెలియని కంటి జబ్బుతో బాధ పడుతున్నారు అని తెలిపారు.[8] వారిలో అప్పటికే ఒక మహిళా సభ్యురాలు ఉంది, ఆమె కళాకారిణి బెర్త్ మోరిసోట్, ఈమె తర్వాత కస్సట్ స్నేహితురాలు మరియు తోటి ఉద్యోగిని అయ్యారు.

కస్సట్ డెగాస్‌ను ఆరాధించారు, 1875 లో కళా వ్యాపారస్తుడి కిటికీ లోంచి చూసిన చిత్రాలలోని రంగులు ఈమె మీద శక్తివంతమైన ముద్రను వేశాయి. నేను అక్కడికి వెళ్ళి నా ముక్కును కిటికీకి వట్టిపెట్టి చూస్తూ ఆయన కళ లోని సారాన్ని గ్రహించేదాన్ని అని తర్వాత ఆమె గుర్తుచేసుకున్నారు. అది నా జీవితాన్ని మార్చివేసింది. నేను చూడాలనుకున్న కళను నేను చూడగలిగాను. ఆమె డెగాస్ ఆహ్వానాన్ని ఆత్రుతతో అంగీకరించారు. మరియు వచ్చే భావ చిత్రాల ప్రదర్శన కోసం చిత్రాలను తయారు చేయడం ఆరంభించారు. ఇది 1878లో ఏర్పాటు చేయాలని సంకల్పించినప్పటికీ (ప్రపంచ ప్రదర్శన వల్ల వాయిదా వేయబడినది) ఏప్రిల్ 10, 1879 లో జరిగింది. ఈమె భావ చిత్రకారులతో ఉత్సాకారంగా కలిశారు మరియు వారి ఉద్దేశ్యానికి మద్దతునిస్తూ ప్రకటించారు: మేము ఒక నిరుత్సాహ పరిచే పోరాటంను సాగిస్తున్నాము, ఇందుకు మా అన్ని శక్తులు కావాలి. ప్రతికూలమైన మర్యాదను ఆకర్షించడం వల్ల కాఫీ స్థలాలకు వారితో వెళ్ళే వీలులేదు, అందుచే ఆమె వారిని ఏకాంతముగా మరియు ప్రదర్శనలలో కలుసుకునేవారు. ఆమె చిత్రాలను అత్యంత ఆధునిక పర్షియన్లకు అమ్మి ఇప్పుడు వ్యాపారపరముగా విజయాన్ని ఆశిస్తున్నారు. అసంకల్పముగా రెండేళ్ళ మధ్యలో ఆమె శైలి కొత్తగా వృద్ది చెందింది. ముందు ఆమె ఒక స్టూడియో కళాకారిణి కావడం వల్ల, ఆమె బయటికి వెళ్ళేటప్పుడు మరియు థియేటర్లకు ఒక నమూనా గీయు పుస్తకమును తనతో పాటు తీసుకు వెళ్ళటం అలవాటు చేసుకున్నారు, మరియు దానిలో ఆమె చూసినవి నమోదు చేసుకునేవారు.[9]

సమ్మర్టైం, c. 1894, ఆయిల్ ఆన్ కాన్వాస్

1877 లో కస్సట్ ఆమె సోదరి లిడియాతో తల్లితండ్రులను పారిస్ లో కలుసుకున్నారు. మేరీ వారి సంబంధానికి విలువనిచ్చారు. ఆమె, లిడియా కూడా వివాహం చేసుకోలేదు. వివాహం మరియు వృత్తి జీవితం పోటీపడలేవని మేరీ చిన్నతనంలోనే నిశ్చయించుకున్నారు. తన సోదరి (మేరీ) చే తరచుగా చిత్రించబడే లిడియా మాటిమాటికీ అనారోగ్య పాలు కావటంతో, ఆమె 1882 లో మరణించారు, దీనితో కస్సట్ కొంతకాలం పనిచేయలేకపోయారు.[10]

కస్సట్ తండ్రి ఆమె స్టూడియోకు మరియు అవసరమైన వస్తువుల ఖర్చు అమ్మకాల ద్వారా వచ్చే డబ్బు లోంచే ఇవ్వాలని పట్టుబట్టేరు, కానీ అవి ఇంకా అంత బలంగా లేవు. కనీస అవసరాలను తీర్చడం కోసం నాసిరకపు చిత్రాలు వస్తాయనే భయంతో, కస్సట్ తనకు తానుగా వచ్చే భావచిత్రాల ప్రదర్శన కోసం కొంచం విలువ కలిగిన చిత్రాలను చిత్రించారు. 1878 లో ఆమె సాధించిన మూడు చిత్రాలలో కళాకారుని వర్ణన (సొంత-వర్ణన), నీలంరంగు చేతి కుర్చీలో చిన్న పిల్ల, మరియు లే ఫిగరో చదవటం (ఈ వర్ణన ఆమె తల్లిది ).

డేగాస్ ప్రభావం కస్సట్ మీద చెప్పుకోదగినంత ఉంది. ఆమె రంగులు వాడటంలో అత్యంత నైపుణ్యాన్ని సంపాదించారు. తద్వారా ఆమె ముఖ్యమైన చిత్రాలను ఆ తరహాలో చేయగలిగారు. డేగాస్ ఆమెకు బొమ్మలు చెక్కడంలో కూడా ప్రవేశపెట్టారు. ఇందులో ఇతను నిష్ణాతుడు. వీరిద్దరూ కలిసి పనిచేశారు, మరియు ఆమె చిత్తుచిత్తరువులను చేయడంలో ఆమె ఇతని క్రింద మంచి శిక్షణ పొందింది. లోవెరేకు ప్రయాణం చేసినప్పుడు నమోదు చేసుకున్నవాటిని ఆటను చెక్కటానికి కస్సట్ కు ఇచ్చాడు. ఆమెకు అతని మీద గాఢమైన అభిప్రాయాలు ఉన్నాయి కానీ అతని చపలచిత్తం మరియు తొందరగా కోపం వచ్చే స్వభావం వల్ల ఆమె ఎక్కువ ఆశించలేదు. అత్యాధునిక మరియు చక్కగా దుస్తులు ధరించే నలభై ఐదేళ్ళ డెగాస్ కస్సట్ ఇంటికి రాత్రీ భోజనానికి ఆహ్వానించబడ్డాడు.[11]

రేనోయిర్, సిస్లేయ్, మనేట్ మరియు సెజాన్నే గైర్హాజరైనప్పటికీ 1879 లోని భావచిత్రకారుల ప్రదర్శన అత్యంత విజయవంతమైనది. వీరు మరి ఒక్కసారి సలోన్ గుర్తింపు సాధించడం కోసం ప్రయత్నించారు. ఈ ప్రదర్శనను రాసిన మరియు నిర్వహించిన గుస్తావే కైల్లెబొట్టే ప్రయత్నాలవల్ల, వారు లాభాలు సాధించి మరియు చిత్రాలను చాలావరకూ అమ్మగాలిగారు. అయినప్పటికీ విమర్శలు ఎప్పుడూలేనంత కఠినముగా ఉండేవి. రెవ్యు డేస్ డెయక్స్ మొండ్స్ రాశారు, "ఎమ్. డేగాస్ అండ్ మల్లె. కస్సట్లు మాత్రమే అందరిలో ప్రత్యేకతను చూపించారు ...మరియు తమ కిటికీలలో చూసిన ఇంకా చిన్నపిల్లల చిత్రాలను గీయటములో కొంత ఆకర్షణను చూపించగలిగారు."[12]

కస్సట్ ల లోగ్తో పాటు పదకొండు చిత్రాలను ప్రదర్శించారు. విమర్శకులు ఆమె రంగులు మరీ ముదురుగా ఉన్నాయని ఆరోపించినప్పటికీ ఆమె వర్ణించిన చిత్రాలు విషయాన్ని చెప్పటంలో కచ్చితంగా ఉన్నాయి, ఆమె పని మొనెట్ లాగా అనాగరికముగా లేదు, ఆ సమయంలో భావచిత్రకారులలో మొనెట్ పరిస్థితి సహాయ రహితంగా ఉంది. తనకొచ్చిన లాభాలను ఆమె డేగాస్‌తో మరియు మొనెట్ తో పంచుకునేవారు. ఆమె భావచిత్రాల ప్రదర్శనలు 1880 మరియు 1881 లలో ప్రదర్శించారు, మరియు ఆమె భావచిత్రకారుల వర్గములో 1886 వరకూ ఉత్సాహంగా ఉన్నారు. 1886 లో కస్సట్ యునైటెడ్ స్టేట్స్ లో జరిగిన మొదటి భావచిత్రాల ప్రదర్శనకోసం రెండు చిత్రాలను ఇచ్చారు. దీనిని చిత్రాల వ్యాపారస్తుడు పాల్ డురాండ్ -రుఎల్ నిర్వహించారు. ఆమె స్నేహితురాలు లౌసిన్ ఎల్డెర్ హర్రి హవ్మెయెర్ను 1883 లో వివాహం చేసుకున్నారు. మరియు వీరిద్దరూ కస్సట్‌ను సలహాదారురాలిగా ఉంచుకొని పెద్ద సంఖ్యలో భావచిత్రకారులని పోగుచేయటము ఆరంభించారు. వారు సేకరించినవి ఎక్కువ భాగం న్యూ యార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం అఫ్ ఆర్ట్ లో ఉన్నాయి. ఆ కాలంలో ఆమె కుటుంబ సభ్యుల పలు చిత్రాలను చిత్రించారు, వాటిలో అలెగ్జాండర్ కస్సట్ మరియు అతని కుమారుడు రాబర్ట్ కెల్సో చిత్ర వర్ణన (1885) ఉత్తమమైనదిగా చెప్పబడింది.కస్సట్ శైలి విస్తరించినది, మరియు ఆమె భావచిత్రాల నుంచి సాధారణమైన, సూటిగా చెప్పే విధానమును ఎంచుకున్నారు. ఆమె తన చిత్రాలను న్యూ యార్క్ ప్రదర్శనశాలలలో కూడా ప్రదర్శించారు. 1886 తర్వాత కస్సట్ తనను ఏవిధమైన కళా ఉద్యమంతో గుర్తించుకొనలేదు, మరియు ఆమె వివిధ పద్ధతులను ప్రయోగించారు.

తర్వాత జీవితం[మార్చు]

"అండర్ ది హార్స్ చెస్ట్నట్ ట్రీ ", డ్రై పాయింట్ అండ్ యాక్వాటింట్ ప్రింట్, 1898.

ఆమె విస్తృత క్రమంలో చిత్రించడం, మృదువైన పరిశీలన, ఇంకనూ జాలి కనిపించని చిత్రాలు మరియు చిత్రించే వస్తువు తల్లి మరియు పిల్లల ప్రతుల మూలముగా కస్సట్ ఖ్యాతి గడించటానికి ఆధారమైయింది. మొట్టమొదట ఈ విషయం మీద పనిచేసిన తారీఖు డ్రైపాయింట్ తోటమాలి అతని తల్లిచే పట్టుకోబడినాడు (ఆముద్రణ "Jan/88"ను న్యూ యార్క్ పబ్లిక్ లైబ్రరీలో అంతర్లిఖించారు) గా చెప్పారు. ఆమె అంతకు ముందే ఆ విషయం మీద కొన్ని చిత్రాలను చేశారు. వీటిలో కొన్ని వాటిలో ఆమె తన బంధువులను, స్నేహితులను, లేదా ఖాతాదారులను చిత్రించారు. అయినప్పటికీ తర్వాత సంవత్సరాలలో గతంలో ఆమె వృత్తి రీత్యా మోడల్ గా ఉన్న ఇటాలియన్ పునర్వికాసములోని మడోన్న మరియు పిల్లాడు వ్యాస రచనా శిల్పములో తరచుగా వాడారు.1900 తర్వాత ఆమె తన దృష్టిని పూర్తిగా తల్లి-పిల్లల అంశాలమీదే ఉంచారు.[13]

1891 లో, ఆమె ఒక పరంపరలో అధిక సహజ రంగులను డ్రైపాయింట్ మరియు యాక్వాటింట్ ప్రతులను ప్రదర్శించారు, వీటిలో అమ్మాయి స్నానం చేయడం మరియు ది కాయ్ఫ్యుర్ ఉన్నాయి. అంతక్రిత సంవత్సరం జపాన్ శిక్షకులు పారిస్‌లో చూపించిన వాటి నుంచి ఈమె స్ఫూర్తి పొందారు. కస్సట్ జపనీయుల ప్రతులలోని సరళత్వము మరియు స్పష్టతకు, మరియు నైపుణ్యంతో రంగుల వాడకం వైపు ఆకర్షితురాలైయ్యారు. తన వివరణలో, ఆమె ప్రధానంగా లేత మరియు మృదువైన రంగులను వాడారు ఇంకా నలుపును విసర్జించారు (ఇది భావచిత్రకారులలో నిషేధించిన రంగు). స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ లోని ఎ.బ్రీస్కిన్ ప్రకారం ఈ రంగుల ముద్రణలు ఈనాడు ఆమె సహజంగా చేసిన వాటికి ఇవి ప్రతీకలు.. స్పష్టమైన కళల చరిత్రకు ఒక కొత్త అధ్యాయము చేర్చబడినది..సాంకేతికంగా రంగు ముద్రణలు కావటం వల్ల వాటిని అధిగమించలేరు.[14]

ది చైల్డ్ 'స్ బాత్ (ది బాత్) బై మేరీ కస్సట్, 1893, ఆయిల్ ఆన్ కాన్వాస్, ఆర్ట్ ఇన్స్టిట్యూట్ అఫ్ చికాగో

1890లు కస్సట్ యొక్క అత్యంత కార్యమగ్నమైన మరియు సృజనాత్మకమైన కాలము. ఆమె తగినంత పరిపక్వము పొందారు మరియు ఆమె ఎక్కువ వ్యాపార దక్షతను చూపిస్తూ నిష్కర్ష అభిప్రాయాలను తగ్గించారు. ఆమె అమెరికా లోని యువ కళాకారులకు ఆదర్శముగా నిలిచారు. వారు ఈమె సలహాల కోసం సంప్రదించేవారు. వారిలో లూసీ ఎ. బకన్ ఉన్నారు. ఈమెను కస్సట్ కామిల్లె పిస్సర్రోకు పరిచయం చేశారు. భావకళాకారుల వర్గము లేకపోయినప్పటికీ కస్సట్ ఇప్పటికీ కొంతమంది సభ్యులతో సంబంధం కలిగి ఉన్నారు, వారిలో రేనోయిర్, మోనెట్, మరియు పిస్సర్రో ఉన్నారు.[15]

కొత్త శతాబ్దం వచ్చింతర్వాత ఆమె సలహాదారురాలిగా అధికముగా కళా సేకరణ చేసేవారికి సహాయం చేశారు మరియు వారు కొనుగోళ్ళ ద్వారా వచ్చిన దానిని అమెరికా ఆర్ట్ మ్యూజియంలకు చందాగా ఇవ్వాలని నిభంధనలు ఏర్పరచారు. ఆమె కళలకు చేసిన కృషికి గుర్తుగా ఫ్రాన్స్ ఆమెను 1904లో ల గిఒన్ డి'హోన్నెర్ అవార్డుతో సత్కరించారు. అమెరికాలో సేకరించేవారికి ఆమె కారణభూతమైనప్పటికీ, యునైటెడ్ స్టేట్స్‌లో ఆమె కళకు గుర్తింపు చాలా నిదానముగా వచ్చింది. అమెరికాలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులలో కూడా ఆమెకు చాలా తక్కువ గుర్తింపు వచ్చింది, సుప్రసిద్ధుడైన ఈమె సోదరుడు మూలంగా ఈమెను పూర్తిగా వెనకకు నెట్టివేయబడింది.[16]

ఈమె సోదరుడు అలెగ్జాండర్ కస్సట్, (1889 నుండి ఆయన చనిపోయేవరకూ పెన్సిల్వేనియా రైల్రోడ్అధ్యక్షులు) 1906లో చనిపోయారు. వారిద్దరూ చాలా దగ్గర కావడంతో ఆమె కృంగిపోయారు. కానీ ఆమె మంచి పనిని తర్వాత సంవత్సరాలు 1910 దాకా ఇచ్చారు. 1900లలో పెరిగిన జాలి గుణాన్ని స్పష్టంగా ఆమె చిత్రాలలో చూడవచ్చు; ఆమె పని ప్రజలలోను మరియు విమర్శకులలోను ప్రసిద్ధిచెందారు, కానీ ఆమె క్రొత్తవి ఏమీ చేయలేదు, మరియు ఒకప్పుడు ఉత్తేజింపచేసిన ఇంకా విమర్శించిన ఆమె తోటి భావచిత్రకారులు చనిపోతున్నారు. ఆ విధమైన నూతన అభివృద్ధికి ఆమె విరోధముగా ఉన్నారు, వీటిని పోస్ట్-యింప్రేషనిజం, ఫావిజం మరియు క్యూబిజంగా పేర్కొన్నారు.[17]

1910 లోని ఈజిప్టు యాత్రలో అక్కడి పురాతన కళ కస్సట్‌ను మంత్రముగ్డురాలిని చేసింది కానీ దానిలో సృజనాత్మకత లోపించినది; ఆ యాత్రలో ఆమెను మిక్కిలి అలిసిపోవటమేకాకుండా ఆమె తనకుతానుగా ప్రకటించారు 'ఈ కళా బలంలో నేను నలిగిపోయాను. ఇంకా చెప్తూ నేను దీనికి వ్యతిరేకంగా పోరాడాను కానీ అదే గెలిచింది, ఇది కచ్చితంగా గతం మనకు వదిలిపెట్టిన గొప్ప కళ...ఎలా నా బలహీనమైన వేళ్ళు నా మీద పడిన ప్రభావాన్ని చిత్రించలేదు. 1911 లో చక్కరవ్యాది , కీళ్ళవాతం, నరాల వ్యాధి, మరియు కంటిపొర నిర్దారించినప్పటికీ ఆమె తన వడిని తగ్గించలేదు, కానీ 1914 తర్వాత ఆమె ఇంచుమించుగా అంధురాలు అవటమువల్ల బలవంతముగా ఆమె తన చిత్రలేఖనంను ఆపివేయవలసి వచ్చినది. ఏమైనప్పటికీ ఆమె 1915 లో మహిళలను ఎన్నుకొను అధికారంను సమర్దిస్తూ, ఆ ఉద్యమానికి మద్దతుగా తన పద్దెనిమిది చిత్రాలను ప్రదర్శించారు.

ఆమె జూన్ 14, 1926లో పారిస్ దగ్గర షాటో డే బ్యుఫ్రెస్న్లో మరణించారు, ఆ తర్వాత ఆమెను ఫ్రాన్స్ లో వారి కుటుంబంకు సంబంధించిన నేల లే మేస్నిల్ -థెరిబ్స్లో పూడ్చిపెట్టారు. ఆమె చిత్రాలు అత్యధికంగా $2.9 మిలియన్లకు అమ్ముడైనాయి.

ఇది కూడా చూడండి[మార్చు]

గమనిక[మార్చు]

 1. నాన్సీ మౌల్ మత్త్యూస్, మేరీ కస్సట్ : అ లైఫ్ , విల్లర్డ్ బుక్స్, న్యూ యార్క్, 1994, p. 5, ISBN 0-394-58497-X.
 2. రాబిన్ మక్ కౌన్, ది వరల్డ్ అఫ్ మేరీ క్యాసెట్ , థామస్ Y. క్రోవెల్ Co. , న్యూ యార్క్, 1972, pp. 10-12, ISBN 0-690-90274-3
 3. McKown, 1974, p. 16
 4. 4.0 4.1 మత్యూస్, 1994, p. 32
 5. మత్యూస్, 1998, p. 75
 6. మత్యూస్, 1994, p. 79
 7. మత్యూస్, 1994, p. 96
 8. మత్యూస్, 1994, p. 107
 9. మత్యూస్, 1994, p. 125
 10. మత్యూస్, 1998, p. 163
 11. మక్కౌన్ , 1974, pp. 63-64
 12. మక్కౌన్, 1974, p. 73
 13. నేషనల్ మ్యూజియం అఫ్ అమెరికన్ ఆర్ట్, 1985, p. 106
 14. మక్కౌన్, 1974, pp. 124-126.
 15. మక్కౌన్, 1974, p. 155.
 16. మక్కౌన్, 1974, p. 182.
 17. మత్యూస్, 1998, p. 284

సూచనలు[మార్చు]

 • మత్యూస్, నాన్సీ మౌల్, మేరీ కస్సట్ : అ లైఫ్ , 1998, యల్ యూనివెర్సిటి ప్రెస్ . ISBN 0-300-07754-8
 • మక్కౌన్ , రాబిన్, ది వరల్డ్ అఫ్ మేరీ కస్సట్ , థామస్ Y. క్రోవేల్ Co. , న్యూ యార్క్, 1972. ISBN 0-690-90274-3
 • నేషనల్ మ్యూజియం అఫ్ అమెరికన్ ఆర్ట్ (యు.S.), & క్లోస్స్, W. (1985)ట్రెజర్స్ ఫ్రం ది నేషనల్ మ్యూజియం అఫ్ అమెరికన్ ఆర్ట్ . వాషింగ్టన్: నేషనల్ మ్యూజియం అఫ్ అమెరికన్ ఆర్ట్. ISBN 0-87474-595-0
 • పొల్లాక్, గ్రీస్ఎల్డా, లుకింగ్ బ్యాక్ టు ది ఫ్యూచర్ . G&B 2001. ISBN 90-5701-132-8
 • వైట్, జాన్ H., Jr. (స్ప్రింగ్ 1986), అమెరికా 'స్ మోస్ట్ నోట్ వర్తి రైల్రోడర్స్, రైల్ రోడ్ హిస్టరీ, రైల్వే అండ్ లోకోమోటివ్ హిస్టారికల్ సొసైటీ, 154, p. 9-15. (మేన్షన్స్ ఫ్యామిలీ రిలేషన్షిప్ టు అలెగ్జాండర్ కస్సట్ )

బాహ్య లింకులు[మార్చు]