మేరీ కాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం. సి. మేరీ కాం
Mary Kom - British High Commission, Delhi, 27 July 2011.jpg
Mary Kom speaking at the British High Commission in Delhi, 2011
Personal information
Full nameMangte Chungneijang Mary Kom
Nickname(s)మాగ్నిఫిసెంట్ మేరీ
Nationalityభారతీయులు
Born (1982-11-24) 1982 నవంబరు 24 (వయస్సు: 37  సంవత్సరాలు)
కంగతేయ్, మణిపూర్, భారతదేశం.
Residenceఇంఫాల్, మణిపూర్, భారతదేశం.
Height1.58 m (5 ft 2 in)
Weight51 kg (112 lb)
Spouse(s)K (Karung) Onkholer Kom
Sport
Countryభారతదేశం
Sportబాక్సింగ్ (Rated at 46kg, 48kg, 51kg)
Coached byM.Narjit Singh , Charles Atkinson

MC మేరీ కాం లేదా మేరీ కాం అని పిలవబడే మాంగ్టే చుంగ్నీజంగ్ మేరీకాం భారతదేశం మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఒక మహిళా బాక్సర్, ఈమె ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్‌చే ప్రోత్సాహాన్ని పొందుతున్నారు.[1] ఇద్దరు పిల్లలకు తల్లైన మేరీ కాం ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా వరుసగా ఐదుసార్లు విజయాన్ని పొందారు. రెండు సంవత్సరాల విరామ అనంతరం, తన నాల్గవ వరల్డ్ అమెచ్యూర్ బాక్సింగ్ పసిడి పతాకాన్ని సాధించటానికి 2008లో తిరిగి ఆడారు. ఆమె ఇందులో కనపరచిన ప్రదర్శన, AIBA ఆమెను 'మాగ్నిఫిషియంట్ (దేదీప్యమానమైన) మేరీ' అని కొనియాడేటట్టు చేసింది.[2] ఆమె ఆరంభంలో పరుగు పందాలలో ఆసక్తి కలిగి ఉండేది. తనతోటి మణిపూర్ బాక్సర్ డింగ్‌కో సింగ్ విజయం తరువాత ఆమె తన ఆసక్తిని బాక్సింగ్‌కు మరల్చింది.[3][4] ఇటీవల, మేరీ కాం తన ఐదవ వరుస ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ బిరుదును గెలిచారు. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో మేరీ కాం ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ బిరుదును సెప్టెంబరు 18, 2010 శనివారం నాడు బ్రిడ్జ్‌టౌన్‌లో స్వీకరించారు. ఈ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ బిరుదును మేరీ కాం ఐదవసారి వరుసగా గెలుచుకుంది. మేరీ కాం 16-6 స్కోరుతో రొమానియన్ ప్రత్యర్థి డుటా సెలూటాను ఓడించారు.

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ యొక్క నాలుగు టైటిల్స్‌ను 46 కిలోల విభాగంలో సాధించారు. కానీ ఈసారి ఆమె దీనిని 48 కిలోల విభాగంలో సాధించారు. సెమీఫైనల్‌లో మేరీ కాం 8-1 స్కోరుతో ఫిలిప్పినో ప్రత్యర్థి ఆలిస్ అప్పారీని ఓడించారు.

ఆరు ప్రపంచ ఛాంపియన్ షిప్ లలో ప్రతి ఒక్కటిలో పతకం గెలిచిన ఒకేఒక్క బాక్సర్‌గా మేరీ కాం ఉన్నారు.

2010 అక్టోబరు 3న, ఢిల్లీలో జరిగిన 2010 కామన్వెల్త్ గేమ్స్ కొరకు స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్వీన్స్ బాటన్‌ను పట్టుకునే గౌరవాన్ని ఆమె పొందారు.[5][6]

జీవిత చరిత్ర[మార్చు]

విద్య[మార్చు]

 • Cl. I-IV - క్రిస్టియన్ మోడల్ హై స్కూల్, లోక్టాక్, మణిపూర్
 • V-IX - St. జేవియర్స్ స్కూల్, మోయిరంగ్
 • పధొవ తరగతి - ఆదిమజాతి హై స్కూల్, ఇంఫాల్
 • PUC (ఆర్ట్స్)
 • BA విద్యార్థి

1985–2003: ఆరంభ జీవితం మరియు బాక్సింగ్ మీద ఆకస్మిక ఆసక్తి[మార్చు]

కుటుంబానికి ఆర్థిక సహకారాన్ని అందించటానికి మేరీ కాం క్రీడలలోకి ప్రవేశించారు. "నేను ఆరంభంలో అన్ని-క్రీడలను ఆడేదానిని మరియు 400-మీ ఇంకా జావెలిన్ నా అభిమాన క్రీడలుగా ఉన్నాయి. డింగ్‌కో సింగ్ బ్యాంకాక్ (ఏషియన్ గేమ్స్)నుండి స్వర్ణంతో తిరిగి వచ్చిన తరువాత, నేను కూడా ప్రయత్నించాలని భావించాను. డింగ్‌కో విజయం మణిపూర్‌లో ఒక విప్లవాన్ని లేపింది మరియు ఆశ్చర్యకరంగా బాక్సింగ్‌లోకి ప్రవేశించనిది నేను ఒక్క అమ్మాయినే కాదు,"అని ఆమె తలిపారు.ఆమె ఎంతొ కష్తపది ఈ స్థాయెకీ వచరు తన కుతుంబ సభులను కుద వదులలుకొని వచి యీన్త గూప్ప స్తయెకి చెరుకున్నరు

ఆమె బాక్సింగ్ శిక్షణను 2000లో ఆరంభించారు మరియు వేగవంతంగా ఆటను గ్రహించే క్రీడాకారిణిగా, పురుషులకు అందించే శిక్షణను తీసుకోవటాన్ని ఇష్టపడ్డారు. ఆమె ఆరంభంలో ఈ క్రీడ మీద ఉన్న తన ఆసక్తిని తండ్రి M. తొంపు కాం మరియు తల్లి సనీఖమ్ కాం నుంచి దాచి ఉంచటానికి ప్రయత్నించారు, కానీ 2000ల సంవత్సరంలో ఆమె స్టేట్ ఛాంపియన్షిప్‌ను గెలిచిన తరువాత ఆమె ఫోటో వార్తాపత్రికలో వచ్చింది.

2000ల సంవత్సరంలో మణిపూర్‌లో ఫస్ట్ స్టేట్ లెవల్ ఇన్విటేషన్ మహిళా బాక్సింగ్ పోటీలో మొదటి పురస్కారంను మరియు ఉత్తమ బాక్సర్ పురస్కారంను పొందిన తరువాత, మేరీ కాం పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఏడవ ఈస్ట్ ఇండియా ఉమెన్స్ బాక్సింగ్ పోటీలో జయించారు మరియు తదనంతరం 2000 నుండి 2005 వరకు జరిగిన భారత జాతీయ స్థాయి పోటీలలో బంగారు పతకంను సాధించారు.

అంతర్జాతీయ పోటీలలో కూడా ఆమె తన ప్రతిభను చూపించటం ఆరంభించటంతో, స్వర్ణ పతకాలు మరియు గౌరవసమ్మానాలు ఆమె సొంతమయ్యాయి.

బ్యాంకాక్‌లో జరిగే ఏషియన్ ఉమెన్స్ బాక్సింగ్ పోటీకి క్రీడాకారులను ఎంపిక చేసే శిక్షణా శిబిరానికి వెళుతున్న సమయంలో రైలులో ఆమె వస్తువులన్నింటినీ మరియు పాస్‌పోర్ట్‌ను దొంగిలించబడింది. ఆమె తల్లితండ్రులు వెనక్కు వచ్చేయమని చెప్పినప్పటికీ, ఆమె పోటీలో పాల్గొనటానికి వెళ్ళింది.

భారతదేశంలోని హిసార్‌లో ఉన్న మహాబీర్ స్టేడియంలో నవంబర్ 22, 2003న జరిగిన ఏషియన్ ఉమెన్స్ పోటీలలో 46-కిలోల విభాగంలో ఆమె చైనీస్ థాయ్‌పే యొక్క చౌ స్జు యిన్‌ను RSCO-2తో ఓడించారు. దీనికి ముందు ఆమె శ్రీలంకకు చెందిన L. G. చంద్రికను RSCO-2తో ఓడించారు.

2003- ప్రస్తుతం వరకు పొందిన పురస్కారాలు మరియు విజయాలు[మార్చు]

మేరీకాం యొక్క "అంతర్జాతీయ బంగారు పతకాల పరంపర" హిస్సార్‌లో జరిగిన రెండవ ఏషియన్ ఉమెన్స్ పోటీలతో ఆరంభమైనది మరియు తైవాన్‌లో జరిగిన మూడవ ఏషియన్ ఉమెన్స్ పోటీలలో గెలవటం వరకూ కొనసాగింది.

ఆమె మొదటిసారి పాల్గొనిన, 2001లో USAలోని స్క్రాంటన్‌లో జరిగిన AIBA వరల్డ్ ఉమెన్స్ బాక్సింగ్ పోటీలో వెండి పతకంతో సంతృప్తి చెందవలసి వచ్చింది, 48-కిలోల విభాగంలో క్వార్టర్ ఫైనల్‌లో పోలాండ్‌కు చెందిన నాడియా హోక్మిను RSCO-3తో మరియు సెమీ-ఫైనల్‌లో కెనడాకు చెందిన జామీ బెల్‌ను 21-9తో ఓడించినా ఫైనల్ పోటీలో టర్కీకి చెందిన హుల్యా సాహిన్ చేతిలో 13-5తో ఓడిపోయారు. ఫైనల్‌లో మేరీ కాం ప్రదర్శన గురించి శిక్షకుడు అనూప్ కుమార్ మాట్లాడుతూ "ఆమె మొదటి రౌండులో ముందంజలో ఉన్నారు, కానీ ఆమె ప్రత్యర్థి చివరి రౌండులో ఆధిక్యాన్ని సంపాదించగలిగారు," అని తెలిపారు.

తరువాతి సంవత్సరం 2002లో టర్కీలోని అంటాలయాలో అక్టోబరు 21–27 మధ్య తేదీలలో రెండవ జరిగిన AIBA వరల్డ్ ఉమెన్స్ సీనియర్ బాక్సింగ్ పోటీలో బంగారు పతకాన్ని సాధించారు, ఇందులో ఆమె 45-కిలోల విభాగంలో సెమీ-ఫైనల్‌లో ఉక్రెయిన్‌కు చెందిన స్వెట్లానా మిరోష్నీచెంకోను మరియు ఫైనల్‌లో ఉత్తర కొరియాకు చెందిన జాంగ్ సాంగ్-యేను ఓడించారు.

ఒకప్పుడు ఆమె క్రీడా జీవితం మీద సందేహాస్పదంగా ఉన్న ఆమె తండ్రి, 2003లో భారతదేశం యొక్క అత్యున్నతమైన అర్జున పురస్కారాన్ని బాక్సింగ్‌లో సాధించిన ఘనతకు తొలి మహిళగా స్వీకరించే సమయంలో, మార్గదర్శిగా ఉన్న కుమార్తెతో పాటు ఆయన కూడా హాజరైనారు.

27 ఏప్రిల్ నుండి 2004 మే 2 వరకు నార్వేలోని టాన్స్‌బర్గ్‌లో జరిగిన మహిళా ప్రపంచ బాక్సింగ్ పోటీలో 46-కిలోల విభాగంలో ఆమె సెమీ ఫైనల్‌లో టర్కీకు చెందిన దెర్యా అక్టోప్‌ను RSCO-2తో మరియు ఫైనల్‌లో చైనాకు చెందిన క్సియా లీను RSCO-2తో ఓడించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు.

2004లో హంగరీలో జరిగిన ఆమె విచ్ కప్ టోర్నమెంట్ ఛాంపియన్‌గా కూడా ఉన్నారు.

తైవాన్‌లో ఆగస్టు 2004లో జరిగిన ఏషియన్స్ ఉమెన్స్ బాక్సింగ్ పోటీలో 46-కిలోల విభాగం ఫైనల్‌లో ఫిలిప్పీన్స్‌కు చెందిన గ్రెట్చన్ అబనీల్‌ను 35-11తో ఓడించారు.

రష్యాలోని పోడోల్‌స్క్‌లో 25 సెప్టెంబరు నుండి 2005 అక్టోబరు 2 వరకు జరిగిన మూడవ AIBA ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్స్‌లో 46-కిలోల విభాగంలో ఆమె తన ప్రపంచ పురస్కారాన్ని విజయవంతంగా నిలుపుకోగలిగారు. ఆమె ఫైనల్‌కు ఫిలిప్పీన్స్‌కు చెందిన గ్రెట్చెన్ అబనీల్‌ను 22-20తో ఓడించిన తరువాత చేరారు, ఫైనల్‌లో ఆమె ఉత్తర కొరియాకు చెందిన జాంగ్ ఓక్‌ను 28-13 స్కోరుతో ఓడించారు. కాం సెమీ-ఫైనల్‌లో రష్యాకు చెందిన ఎలేనా సబిటోవాను 31-16తో మరియు క్వార్టర్ ఫైనల్‌లో కెనడాకు చెందిన నాన్సీ ఫోర్టిన్‌ను 30-13తో ఓడించింది. ఆమె మరలమరల విజయాన్ని సాధించటం ఒక గొప్ప పురోగమనంగా భావించినప్పటికీ, జట్టు విభాగంలో విజయాన్ని సాధించిన రష్యన్ల మీద తన అభిమానాన్ని వ్యక్తపరచారు.

డెన్మార్క్‌లోని వెజ్లేలో 19–2006 అక్టోబరు 22లో జరిగిన వీనస్ బాక్స్ కప్‌లో, మేరీ కాం 46-కిలోల విభాగంలో సెమీ-ఫైనల్‌లో డెన్మార్క్‌కు చెందిన సోఫీ మల్హోర్‌ను RSCO-2తో మరియు మూడవ రౌండులో రొమానియాకు చెందిన స్టెలూటా డూటా మీద విరమణ ద్వారా గెలుపొందారు. డూట ఫైనల్ చేరటానికి ఇటలీకి చెందిన వలేరియా కాలబ్రీస్‌ను RSCI-2తో ఓడించారు మరియు 2006లో జరిగిన అహ్మెట్ కామెర్ట్ పోటీలో 46-కిలోల విభాగంలో టర్కీకి చెందిన దెర్యా అక్టాప్‌ను RSCO-2తో ఓడించి పోటీ గెలిచారు (మేరీకాం ఈ పోటీలో పాల్గొనలేదు).

2006 నవంబరు 23న భారతదేశంలోని న్యూఢిల్లీలో ఉన్న తల్కాటొర ఇండోర్ స్టేడియంలో జరిగిన AIBA వరల్డ్ ఛాంపియన్షిప్స్‌లో మేరీ కాం 46-కిలోల విభాగంలో మళ్ళీ విజయాన్ని సాధించారు- ఈసారి ఆమె వీనస్ బాక్స్ కప్ పోటీలోని ఫైనల్ ప్రత్యర్థి రొమానియాకు చెందిన స్టెలూటా డూటా మీద 22-7 స్కోరు నిర్ణయంతో గెలుపొందారు. మేరీ కాం ఆటలో చాలాసేపటి వరకూ రొమానియన్ తన‌ను తాను కాపాడుకునే ప్రయత్నంలో ఉంచారు, తరువాత ఆమె తన విజయ సంబరాన్ని బాక్సింగ్ రింగ్ లోపల మణిపూరి జానపద నృత్యంతో ఆనందించారు. డూటా ఫైనల్‌ను కజఖస్తాన్‌కు చెందిన బోరన్బాయేవా జల్గుల్‌ను RSCO-2తో ఓడించి చేరారు.

న్యూఢిల్లీలో, మేరీ కాం సెమీ-ఫైనల్‌లో ఉత్తర కొరియాకు చెందిన జాంగ్ ఓక్‌ను 20-8తో మరియు మొదటి రౌండులో బై తరువాత క్వార్టర్ ఫైనల్‌లో శ్రీలంకకు చెందిన చంద్రికే గెరూగాను RSCO-2తో ఓడించారు. ఆమె ఈ పోటీని దగ్గు మరియు జ్వరంతో ఆరంభించారు (డోపింగ్ పరీక్ష కారణంగా ఆమె వైద్యాన్ని కూడా తీసుకోలేకపోయారు) అయినను ఆమె ఒక రౌండు తరువాత చంద్రికే గెరూగా మీద 13-3తో ఆధిపత్యాన్ని కొనసాగించారు మరియు రెండవ రౌండులో మేరీ కాం 19-4తో ముందంజలో ఉండడంతో ఆటను ఆపివేశారు.

సాధనలు[మార్చు]

 • బాక్సింగ్ ఛాంపియన్ (ఉమెన్ PIN బరువు 46 కిలోల విభాగం)
 • స్థాపకురాలు, MC మేరీ కాం బాక్సింగ్ అకాడెమి (మహిళలు), A/112, గేమ్స్ విలేజ్, ఇంఫాల్ 2006
జాతీయ
 • బంగారు పతకం - Iవ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్, చెన్నై 6-12.2.2001
 • ది ఈస్ట్ ఓపెన్ బాక్సింగ్ చాంప్, బెంగాల్ 11-14.12.2001
 • 2వ Sr వరల్డ్ ఉమెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్, న్యూఢిల్లీ 26-30.12.2001
 • నేషనల్ ఉమెన్ సార్ట్ మీట్, N. ఢిల్లీ 26-30.12.2001
 • 32వ నేషనల్ గేమ్స్, హైదరాబాద్ 2002
 • 3వ Sr వరల్డ్ ఉమెన్ బాక్సింగ్ చాంప్, ఐజ్వాల్ 4-8.3.2003
 • 4వ Sr WWBC, కొక్రాజర్, అస్సాం 24-28.2.2004
 • 5వ Sr WWBC, కేరళ 26-30.12.2004
 • 6th Sr WWBC, జంషెడ్పూర్ 29 Nov-3.12.2005
 • 10th WNBC, జంషెడ్పూర్ lost QF by 1-4 on 5.10.2009
అంతర్జాతీయ
 • Iవ ఏషియన్ ఉమెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ (AWBC), బ్యాంకాక్ 2001
 • 2వ AWBC, హిస్సార్, హర్యానా 19-22.11.2003
 • 3వ AWBC, కౌసింగ్ సిటీ, టైవాన్ 5-12.8.2005
 • రజత పతకం - 2001 ఉమెన్స్ వరల్డ్ అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్, స్క్రాన్టన్, పెన్సిల్వేనియా, USA.
 • స్వర్ణ పతకం - 2002 ఉమెన్స్ వరల్డ్ అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్, అంటాల్యా, టర్కీ.
 • స్వర్ణ పతకం - 2005 ఉమెన్స్ వరల్డ్ అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్, పోడోల్స్క్, రష్యా.
 • స్వర్ణ పతకం - 2006 వరల్డ్ ఉమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్షిప్, న్యూ ఢిల్లీ, భారతదేశం.
 • Iవ WWB పోటీ, నార్వే 2004
 • వీనస్ కప్ ఇంటర్నేషనల్ ఉమెన్ బాక్స్ పోటీ, వెజ్ల (డెన్మార్క్ ) 8-23.10.2006
 • స్వర్ణ పతకం - 2008 AIBA ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్, నింగ్బో, చైనా.
 • స్వర్ణ పతకం - 2010 AIBA ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్, బార్బడోస్.

పురస్కారాలు[మార్చు]

 • అర్జున పురస్కారం (బాక్సింగ్) 2004
 • పద్మశ్రీ HhN>..... (క్రీడలు) 2006
 • రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం 2007
 • పీపుల్ ఆఫ్ ది ఇయర్- లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2007
 • CNN-IBN ‘రియల్ హీరోస్’ పురస్కారం 14.4. 2008 సోమవారం
 • పెప్సి MTV యూత్ ఐకాన్ 2008 23.12.2008 మంగళవారం
 • ‘మాగ్నిఫిసెంట్ మేరీ’, AIBA 2008
 • న్యూ లంకా YPA హాల్ వద్ద జోమీ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ZSF) చేత అభినందన 17.12.2008 బుధవారంనాడు చేశారు
 • రాజీవ్ గాంధీ ఖేల్ రత్న 29.8.2009 శనివారం, న్యూఢిల్లీ (27.7.2009 బుధవారం)
 • ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్స్ అంబాసిడర్ ఫర్ ఉమెన్స్ బాక్సింగ్ 2009 (TSE 30.7.2009 గురువారం) [7][8]

2009 ఆగస్టు 29న భారతదేశంలోని సర్వోత్తమమైన క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారానికి బాక్సర్ విజేందర్ సింగ్ మరియు కుస్తీ యోధుడు సుశీల్ కుమార్‌తో పాటు ఆమె కూడా ఎంపికయ్యారు.[9]

సూచనలు[మార్చు]

 1. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ అధికారిక వెబ్సైటు
 2. మేరీ మహిళా బాక్సింగ్ యొక్క ఒలింపిక్ కేసును బలోపేతం చేశారు: AIBA అధ్యక్షుడు
 3. "మాంగ్టే చుంగ్నీజంగ్ మేరీకాం జీవితచరిత్ర". మూలం నుండి 2016-03-03 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-23. Cite web requires |website= (help)
 4. తిరిగి బరిలోకి
 5. CBC, 2010 కామన్వెల్త్ గేమ్స్, ఆరంభ ఉత్సవాలు, ప్రసార తేదీ 3 అక్టోబర్ 2010, 9:00am-12:30pm (తూర్పు), సిర్కా 2h20m మార్క్, CBC టెలివిజన్ మెయిన్ నెట్వర్క్
 6. "CWG ఆరంభోత్సవం: లైవ్ బ్లాగ్" Archived 2010-10-04 at the Wayback Machine., గీతికా రస్తోగీ , 3 అక్టోబర్ 2010 (5 అక్టోబర్ 2010న పొందబడింది)
 7. మణిపూర్ ఎక్స్‌ప్రెస్, 31.6.2006 శనివారం, Ed. L. చిన్ఖంలియన్, లమ్క; ది సాంగై ఎక్స్‌ప్రెస్, 19.4.2008, ఇంఫాల్
 8. Zamzachin, Dr. G. (2009-11-03). "MARY KOM MC (Mangte Chungneijang)". Zogam.Com. Retrieved 2010-05-08. Cite web requires |website= (help)
 9. "Mary Kom, Vijender and Sushil get Khel Ratna". The Hindu. 2009-07-29. Retrieved 2010-05-08. Cite web requires |website= (help)
 • Williams, Dee (6 February 2008). "Mary Kom". (WBAN) Women Boxing Archive Network. మూలం నుండి 3 మార్చి 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 8 May 2010. Cite web requires |website= (help)
 • Buncombe, Andrew (7 May 2010). "India's school of hard knocks". The Independent. London. Retrieved 8 May 2010.

బాహ్య లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మేరీ_కాం&oldid=2825193" నుండి వెలికితీశారు