మేరీ క్లబ్‌వాలా జాదవ్
మేరీ జాదవ్ MBE | |
|---|---|
13 నవంబర్ 1954న సేలంలో జరిగిన సోషల్ వర్క్ వార్షిక రాష్ట్ర సమావేశంలో మేరీ క్లబ్‌వాలా జాదవ్ ప్రసంగిస్తున్న దృశ్యం | |
| మద్రాసు షెరీఫ్ | |
| In office 1956 - 1957 | |
| అంతకు ముందు వారు | R.E. కాస్టెల్ |
| తరువాత వారు | R.M. దేవ్ |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | మేరీ పటేల్ 1909 జూన్ 10 ఉదకమండలం, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా |
| మరణం | 1975 (వయసు: 65–66) భారతదేశం |
| జాతీయత | బ్రిటిష్ ఇండియన్ (1909-1947) భారతీయురాలు (1947-1975) |
| జీవిత భాగస్వామి | నోగి క్లబ్‌వాలా మేజర్ చంద్రకాంత్ జాదవ్ |
| సంతానం | 1 |
| తల్లిదండ్రులు | రుస్తుం పటేల్ (తండ్రి) అల్లామాయి (తల్లి) |
| వృత్తి | పరోపకారి |
| పురస్కారాలు | పద్మశ్రీ (1955) పద్మభూషణ్ (1968) పద్మవిభూషణ్ (1975) |
| మారుపేరు | ఆర్మీ డార్లింగ్ |
మేరీ జాదవ్ (1909–1975), మేరీ క్లబ్‌వాలా జాదవ్ గా సుపరిచితురాలు. ఈమె భారతీయ పరోపకారి, సామాజిక కార్యకర్త. ఈమె చేసిన సామాజిక సేవలకు గాను భారత ప్రభుత్వం దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మశ్రీ, పద్మవిభూషణ్ లతో సత్కరించింది.[1][2] చెన్నై, దేశవ్యాప్తంగా అనేక స్వచ్ఛంద సంస్థలను ఈమె స్థాపించింది. భారతదేశంలో మొట్టమొదటి వ్యవస్థీకృత సామాజిక సేవా సంస్థలను నెలకొల్పిన ఘనత ఈమెకు దక్కుతుంది. ఈమె స్థాపించిన గిల్డ్ ఆఫ్ సర్వీస్ సంస్థ అనాథ శరణాలయాలు, మహిళా అక్షరాస్యత, వికలాంగుల పునరావాసం వంటి రంగాలలో అనేక విభాగాలను నిర్వహిస్తోంది.[3][4]
ప్రారంభ జీవితం
[మార్చు]మేరీ 1909 జూన్ 10న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని ఉదకమండలం (ఊటీ) లో రుస్తుం పటేల్, అల్లామాయి దంపతులకు జన్మించింది. ఈమె మద్రాసులోని పార్శీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.[5][6] మద్రాసులో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఈమె, 18 ఏళ్ల వయసులో నోగి క్లబ్‌వాలాను వివాహం చేసుకుంది. వీరికి 1930లో ఖుస్రో అనే కుమారుడు జన్మించాడు. 1935లో నోగి క్లబ్‌వాలా అనారోగ్యంతో మరణించాడు.[7] ఆ తర్వాత ఈమె తన జీవితాన్ని సామాజిక సేవకు అంకితం చేసింది. తదనంతరం ఈమె మేజర్ చంద్రకాంత్ కె. జాదవ్ ను వివాహం చేసుకుంది.[8]
కార్యక్రమాలు
[మార్చు]రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, 1942లో క్లబ్‌వాలా ఇండియన్ హాస్పిటాలిటీ కమిటీని స్థాపించింది.[4] మద్రాసు పరిసర ప్రాంతాలలో మొహరించిన భారతీయ సైనికులకు మొబైల్ క్యాంటీన్లు, ఆసుపత్రి సందర్శనలు, వినోద కార్యక్రమాల ద్వారా అండగా నిలిచింది. యుద్ధం ముగిసిన తర్వాత మాజీ సైనికుల పునరావాసానికి కృషి చేసింది. ఈమె సేవలను గుర్తించి 14వ ఆర్మీ ఈమెకు ఒక జపనీస్ ఖడ్గాన్ని బహుమతిగా ఇచ్చింది. జనరల్ కరియప్ప ఈమెను "ఆర్మీ డార్లింగ్" అని పిలిచేవారు.[9]
ఈమె 1952లో దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సామాజిక సేవా విద్యాసంస్థ అయిన 'మద్రాస్ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్'ను ప్రారంభించింది.[6] 1956లో మద్రాసు షెరీఫ్ గా నియమితులైన తొలి మహిళగా గుర్తింపు పొందింది.[6][10]
పురస్కారాలు
[మార్చు]- ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (MBE) (1941)
- పద్మశ్రీ (1955)[2]
- పద్మభూషణ్ (1968)[1]
- పద్మవిభూషణ్ (1975).
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.
- ↑ 2.0 2.1 "Padma Awards | Interactive Dashboard". dashboard-padmaawards.gov.in (in ఇంగ్లీష్). Retrieved 2025-04-11.
- ↑ "Guild of Service founder's role hailed". The Hindu. 30 September 2009. Retrieved 4 July 2012.
- ↑ 4.0 4.1 Venkatesh, R. Sai (2025-04-24). "Mary Clubwala Jadhav, a Parsi woman who changed the dynamics of social work". The Hindu (in Indian English). Retrieved 2025-05-13.
- ↑ "Mary Clubwala sculpture unveiled". 14 July 2009. Retrieved 4 July 2012.
- ↑ 6.0 6.1 6.2 "Book on 'poster girl of social work' Mary Clubwala Jadhav to be penned". The Times of India. 2017-06-11. ISSN 0971-8257. Retrieved 2025-04-11.
- ↑ lcn1c13 (2024-04-25). "Mary Clubwala Jadhav". University of Southampton Special Collections (in ఇంగ్లీష్). Retrieved 2025-04-11.
{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ "We care for Madras that is Chennai". Madras Musings. Retrieved 2022-04-11.[permanent dead link]
- ↑ Mistry, Zarin (2008-11-16). "The "darling" of Madras". Madras Musings. Retrieved 2026 మే 16.
{{cite web}}: Check date values in:|access-date=(help) - ↑ "dated December 20, 1956: New Sheriff of Madras". The Hindu. 20 December 2006. Retrieved 4 July 2012.