మైక్రోమాక్స్
Jump to navigation
Jump to search
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
రకం | ప్రైవేటు |
---|---|
పరిశ్రమ | టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ |
స్థాపన | ఢిల్లీ, భారతదేశం (29 మార్చి 2000) [1] |
స్థాపకుడు | రాహుల్ శర్మ వికాస్ జైన్ సుమీత్ అరోరా రాజేష్ అగర్వాల్ |
ప్రధాన కార్యాలయం | గుర్గావ్, హర్యానా, భారతదేశం |
సేవ చేసే ప్రాంతము | భారతదేశం, రష్యా, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ |
కీలక వ్యక్తులు | సంజయ్ కపూర్ (అధ్యక్షుడు) వినీత్ తనేజా (ముఖ్య కార్యనిర్వహణ అధికారి) |
ఉత్పత్తులు | చరవాణులు, స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ కంప్యూటర్స్, 3G డేటా కార్డులు, LED టెలివిజన్లు |
రెవెన్యూ | US$ 2.88 billion (Q1 2015) |
వెబ్‌సైట్ | Micromaxinfo.com |
మైక్రోమాక్స్ భారతదేశానికి చెందిన ఒక చరవాణి తయారీ సంస్థ.
నేపధ్యము
[మార్చు]2000వ సంవత్సరంలో నోకియా సంస్థకు మొబైల్ విడిభాగాల సరఫరాదారుగా మైక్రోమాక్స్ ప్రస్థానం మొదలైంది. రాహుల్ శర్మ, రాజేష్ అగర్వాల్, సుమీత్ అరోరా, వికాస్ జైన్... ఈ నలుగురూ దీన్ని ఏర్పాటు చేశారు. 2008లో హ్యాండ్‌సెట్ విక్రయాల్లోకి అడుగుపెట్టింది. అనేక ఫీచర్లతో కూడిన బ్రాండెడ్ హ్యాండ్‌సెట్లను చౌక రేటుకు అందించడంతో మైక్రోమాక్స్‌కు విశేష ఆదరణ లభించింది. తర్వాత స్మార్ట్‌ఫోన్లలోనూ వేగంగా కొత్త మోడళ్లను పరిచయం చేయడం కంపెనీకి కలిసొచ్చింది. 2015 నాటికి నెలకు 30 లక్షలకుపైగా హ్యాండ్‌సెట్లను విక్రయిస్తోంది.[1]
ప్రత్యేకతలు
[మార్చు]- భారత్‌లో బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అధిగమించిన తొలి మొబైల్ ఫోన్ కంపెనీగా... డ్యుయల్ సిమ్ ఫోన్లను దేశంలో ప్రవేశపెట్టిన తొలి హ్యాండ్‌సెట్ సంస్థగా మైక్రోమాక్స్ నిలిచింది.
- ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రతాపం చూపిస్తున్న తరుణంలో సైనోజెన్ ఓఎస్‌తో (యురేకా బ్రాండ్) తొలిసారిగా చౌక 4జీ ఫోన్‌ను ప్రవేశపెట్టి సంచలనం సృష్టించింది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 ""Rahul Sharma, Co-Founder & Executive Director, Micromax on their journey to success at the TechSparks 2011 Delhi RoundTable"". yourstory.com. yourstory.com. 10 May 2011. Retrieved 26 February 2015.
బయటి లంకెలు
[మార్చు]- అధికార వెబ్సైటు Archived 2011-02-05 at the Wayback Machine