మైక్ పావెల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


మైక్ పావెల్
2007 ప్రపంచ ఛాంపియన్షిప్స్ అథ్లెటిక్స్ లో పావెల్
వ్యక్తిగత సమాచారం
జాతీయతఅమెరికన్
జననం (1963-11-10) 1963 నవంబరు 10 (వయసు 60)
ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా
క్రీడ
క్రీడట్రాక్, ఫీల్డ్
పోటీ(లు)లాంగ్ జంప్
Updated on 6 August 2012.

మైఖేల్ "మైక్" ఆంథోనీ పావెల్ (1963 నవంబరు 10 న జన్మించారు) పూర్వ అమెరికన్ ట్రాక్, ఫీల్డ్ క్రీడాకారుడు, లాంగ్ జంప్ ప్రపంచ రికార్డ్ హోల్డర్. మైక్ పావెల్ ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియాలో జన్మించాడు. ఇతను ఈ ఈవెంట్ లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్.

జీవిత చరిత్ర

[మార్చు]

1991 ప్రపంచ ఛాంపియన్షిప్స్ అథ్లెటిక్స్ (టోక్యో) లో, ఇతను బాబ్ బీమాన్ యొక్క దాదాపు 23 ఏళ్ల లాంగ్ జంప్ ప్రపంచ రికార్డును 5 సెం.మీ. (2 అంగుళాలు) ఎక్కువగా 8.95 మీటర్లు (29 అడుగుల 4 1⁄4 అంగుళాలు) దూకి అధిగమించాడు. ప్రపంచ రికార్డు ఇప్పటికీ నిలచివుంది, 1900 సంవత్సరం నుండి 20 సంవత్సరాలపైన రికార్డ్ నిలబెట్టుకున్న వారిలో పావెల్ నాల్గవ వ్యక్తి. తన అద్భుతకృత్యాలకు తను 1991లో E. జేమ్స్ సుల్లివన్ అవార్డు, BBC స్పోర్ట్స్ పర్సనాలిటీ అఫ్ ది ఇయర్ ఓవర్సీస్ పర్సనాలిటీ అవార్డు సంపాదించారు. 1992 లో ఇటలీలో ఇతను 8.99 మీటర్ల (29 అడుగుల 5 3⁄4 అంగుళాలు) అత్యంత పొడవైన చట్టపరం కాని జంప్ ను కూడా కలిగి ఉన్నాడు.[1] పావెల్ 1988 ఒలింపిక్స్, 1992 ఒలింపిక్స్ రెండింటిలో లాంగ్ జంప్ వెండి పతకాలను సాధించాడు. తన ప్రసిద్ధ 1991 విజయం లాగే తను మళ్ళీ 1993 ప్రపంచ ఛాంపియన్షిప్స్ అథ్లెటిక్స్ లో లాంగ్ జంప్ లో గెలిచాడు, 1995 ప్రపంచ ఛాంపియన్షిప్స్ అథ్లెటిక్స్ లో థర్డ్ వచ్చాడు. 1996 ఒలింపిక్స్ తర్వాత, పావెల్ విరమించుకున్నాడు. 2004 ఒలింపిక్స్ లో పోటీపడే లక్ష్యంతో 2001 లో తిరిగి వచ్చాడు, కానీ అమెరికన్ జట్టు తయారు కాలేదు.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • అంజు బాబీ జార్జ్ - లాంగ్‌జంప్‌లో 6.70 మీటర్లు దూరం దూకిన భారతదేశానికి చెందిన ప్రముఖ అథ్లెటిక్ క్రీడాకారిణి

మూలాలు

[మార్చు]
  1. "0 Toplists lj m - o". iaaf.org. Retrieved 2012-08-05.