Jump to content

మైఖేల్ మధుసూదన్ దత్

వికీపీడియా నుండి
మైఖేల్ మధుసూదన్ దత్

మైఖేల్ మధుసూదన్ దత్
జననం: 25 జనవరి 1824
వృత్తి: కవి, నాటక రచయిత

మైఖేల్ మధుసూదన్ దత్ (దత్త), (Bengali: মাইকেল মধুসূদন দত্ত మైఖేల్ మొధుసూదొనొ దొత్తొ) (1824-1873), 19వ శతాబ్దపు ప్రముఖ బెంగాలీ కవి, నాటక రచయిత. తూర్పు బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్) లోని జెస్సోర్ సమీపములోని సాగర్‌దారి గ్రామంలో మధుసూదన్ దత్ గా జన్మించాడు. బెంగాలీ నాటకరంగ ఆద్యులలో ఒకడు. ఈయన ప్రసిద్ధ కృతి మేఘ్‌నాథ్ బద్ద్ కావ్య (Bengali: মেঘনাদবধ কাব্য), విషాదభరిత కావ్యం. తొమ్మిది అంకాలతో శైలిలోనూ, వస్తువులోనూ బెంగాళీ సాహిత్యంలో అద్వితీయమైనది ఈ కావ్యం. ఈయన బాధలు, ప్రేమ ప్రలాపాల గురించి స్త్రీ గొంతుకతో అనేక కవితలు కూడా వ్రాశాడు.

బాల్యంనుండే, మధుసూదన్ ఆచార వ్యవహారాలలో ఆంగ్లేయునివలె ఉండాలని ఉవ్విల్లూరాడు. హిందూ జమిందారీ కుటుంబంలో పుట్టిన ఈయన, తన కుటుంబం యొక్క అభీష్టానికి వ్యతిరేకంగా క్రైస్తవాన్ని స్వీకరించి మైఖేల్ అనే పేరు పెట్టుకున్నాడు. అయితే ఆ తరువాత జీవితంలో తన ఆంగ్లేయ, పాశ్చాత్య మోజుకు పశ్చాత్తాపపడి తన మాతృభూమికి మద్దతునిచ్చాడు. ఆ దశలోని ఈయన వ్రాసిన కవితలు, గేయాలలో అది ప్రతిఫలించింది.

మధుసూదన్ దత్త్ ను బెంగాళీ సాహిత్వపు గొప్ప కవులలో ఒకడిగా, బెంగాళీ సానెట్ పితగా పరిగణిస్తారు. ఈయన అమృతాక్షర ఛందస్సు (బ్లాంక్ వర్స్) బాగా ఆపోసనపట్టాడు. మధుసూదన్ దత్త్ జూన్ 29, 1873న కలకత్తాలో మరణించాడు. భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ ఈయన సంతతి వాడే.

బాల్యము, విద్య

[మార్చు]

మధుసూదన్ దత్త్ విద్యాభ్యాసం షేక్‌పూరా గ్రామంలోని పాతమసీదులో పర్షియన్ నేర్చుకోవడంతో ప్రారంభమైంది. చాలా అసమానమైన ప్రతిభ బుద్ధి కలిగిన విద్యార్థిగా చిన్నతనం నుండే సాహితీ ప్రతిభ కలిగిన బాలమేధావిగా ఉపాధ్యాయుల దృష్టిని ఆకర్షించాడు. ఊహాత్మకత మెండుగా ఉండేది. చిన్నతనం నుండే ఇంటి వద్ద, కలకత్తాలో ఆంగ్ల విద్య, ఐరోపా సాహిత్యంతో పరిచయమేర్పడటం వల్ల దత్తాను ఆంగ్లేయుల అలవాటు, ఆచార వ్యవహరాలు, పద్ధతులు, ఆలోచనా ధోరణి అవలంభించేలా ప్రేరేపించాయి. దత్తా జీవితంలో అలాంటి తొలి ప్రభావం హిందూ కళాశాలలో ఆయన గురువు కెప్టేన్ డి.ఎల్.రిచర్డ్‌సన్. దత్తా ఆయన వలెనే థామస్ బాబింగ్టన్ మెకాలేకు మద్దతిచ్చాడు.

ప్రముఖ కృతులు

[మార్చు]

మూలాలు

[మార్చు]