మైత్రి మూవీ మేకర్స్
పరిశ్రమ | వినోదం |
---|---|
స్థాపకుడు | నవీన్ యెర్నేని వై. రవి శంకర్ చెరుకూరి మోహన్[1] |
విధి | క్రియాశీలకం |
ప్రధాన కార్యాలయం | , భారత దేశం |
సేవ చేసే ప్రాంతము | భారత దేశం |
ఉత్పత్తులు | చలన చిత్రాలు |
సేవలు | చిత్ర నిర్మాణం |
యజమాని | యెర్నేని నవీన్ వై. రవి శంకర్ చెరుకూరి మోహన్ [2] |
మైత్రి మూవీ మేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ ల చేత స్థాపించబడిన ఒక చలన చిత్ర నిర్మాణ సంస్థ.[3][4]
ఉత్పత్తులు
[మార్చు]కంపెనీ మొదటి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు, శృతి హాసన్ నటించిన శ్రీమంతుడు. 40-70 కోట్ల రూపాయల పెట్టుబడి కలిగిన ఈ చిత్రం అగస్టు 7 2015న ప్రపంచవ్యాప్తంగా 2500 తెరలపై విడుదలైనది. వారి రెండవ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో మోహన్ లాల్, జూనియర్ ఎన్.టి.ఆర్, సమంత, నిత్య మేనన్ ప్రధాన పాత్రలో నటించిన జనతా గ్యారేజ్. ఈ చిత్రం సెప్టెంబరు 1 2016లో విడుదలైదంది. వారి తరువాతి సినిమా సుకుమార్ దర్శకత్వంలో రాం చరణ్ తేజ, సమంత, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన రంగస్థలం. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 30, 2018 న విడుదలైంది. 2021 లో అల్లు అర్జున్ తో పుష్ప ది రైస్ సినిమా ని నిర్మించారు ఈ సినిమా పాన్ ఇండియన్ లెవెల్ లో విడుదల చేసారు అన్ని భాషల్లో ఘన విజయం సాధించింది. దీని కొనసాగింపుగా పుష్ప 2 ది రూల్ నిర్మాణ దశలో ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాని నిర్మిస్తుంది ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
చలన చిత్రాలు
[మార్చు]† | ఇంకా విడుదలైన ఉత్పత్తులను సూచిస్తుంది |
మూలాలు
[మార్చు]- ↑ "Mahesh Babu's new film shoot delayed".
- ↑ "Mahesh babu & koratala Siva film by Mythri movie makers". Archived from the original on 2018-05-22. Retrieved 2018-05-28.
- ↑ "Mahesh Babu is Srimanthudu?". gulte.com. December 15, 2014. Retrieved July 27, 2015.
- ↑ "Mahesh Babu ventures into film production with Srimanthudu". indiaglitz.com. May 29, 2015. Archived from the original on 2015-05-29. Retrieved June 3, 2015.
- ↑ Boy, Zupp (2021-01-13). "Uppena Movie Teaser: Beautiful Village Love Story". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-01-14.