Jump to content

మైదుకూరు పురపాలక సంఘం

అక్షాంశ రేఖాంశాలు: 14°42′00″N 78°46′48″E / 14.700°N 78.780°E / 14.700; 78.780
వికీపీడియా నుండి
మైదుకూరు పురపాలక సంఘం
మైదుకూరు
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం

మైదుకూరు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైఎస్‌ఆర్ జిల్లా లోని పురపాలక సంఘం.ఈ పురపాలక సంఘం కడప లోక్‌సభ నియోజకవర్గం లోని, మైదుకూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందింది. అసెంబ్లీ నియోజకవర్గానికి, రెవెన్యూ డివిజన్ కేంద్రానికి మైదుకూరు పట్టణం ప్రధాన కేంద్రం.[1]

చరిత్ర

[మార్చు]

ఈ పురపాలక సంఘం 2012 ఏర్పాటు చేశారు. మొత్తం వార్డులు 23 ఉన్నాయి దీని కోసం ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇది 4970 చ. కి.లో విస్తీర్ణంలో 45701 జనాభాతో విస్తరించి ఉంది.[2]

భౌగోళికం

[మార్చు]

మైదుకూరు పురపాలక సంఘం 14°42′00″N 78°46′48″E / 14.700°N 78.780°E / 14.700; 78.780 అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని అమరావతి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లా కేంద్రం కడప నుండి 40 కి.మీ దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2001 లో 35231 ఉన్న పట్టణ జనాభా 2011 లో 45701 కి పెరిగింది.గత దశాబ్దంలో 1.9% పెరిగింది.సెక్స్ 1000 మంది పురుషులకు 984 మంది మహిళలు ఉన్నారు.అక్షరాస్యత రేటు పురుష జనాభాలో 64.5% ఉండగా స్త్రీ జనాభాలో 76.5% అక్షరాస్యులు 52.5% ఉన్నారు.[3]

పౌర పరిపాలన

[మార్చు]

ఈ పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 23 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. "About Us | Commissioner and Director of Municipal Administration". cdma.ap.gov.in. Retrieved 2021-10-22.
  3. "S.Mydukur Village Population - S.Mydukur - YSR, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-10-22.
  4. "Commissioner and Director of Municipal Administration |". cdma.ap.gov.in. Retrieved 2021-10-19.

వెలుపలి లంకెలు

[మార్చు]