మైసూరు సాండల్ సబ్బు
![]() |
ఈ వ్యాసం భౌగోళిక గుర్తింపు (GI) జాబితాలో భాగం | ||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
మైసూరు సాండల్ సబ్బు (ఆంగ్లం: Mysore Sandal Soap; కన్నడ: ಮೈಸೂರ್ ಸ್ಯಾಂಡಲ್ ಸೋಪ್) ఒక సబ్బుల బ్రాండ్. దీన్ని కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (Karnataka Soaps and Detergents Limited; KSDL) ఉత్పత్తిచేస్తుంది. ఈ సబ్బుల కర్మాగారం క్రీ. శ.1916 సంవత్సరం నుండి నల్వాడి కృష్ణరాజ ఒడయారు, మైసూరు మహారాజుగా రాజ్యం చేస్తున్న కాలంలో బెంగుళూరులో స్థాపించబడింది..[1] మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మైసూరు సామ్రాజ్యం నుండి ఐరోపా ఖండానికి చందనం కలప ఎగుమతి ఆగిపోవడంతో అధికమైన చందన నిల్వల వినియోగం ఈ కర్మాగార స్థాపనకు ప్రధాన కారణంగా చెప్పబడుతున్నది.[1] క్రీ. శ.1980 సంవత్సరం ఈ సంస్థను షిమోగా మరియు మైసూరులోని ఇతర చందన నూనెల కర్మాగారాలతో విలీనం చేశారు.[2] మైసూరు సాండల్ సబ్బు ప్రపంచంలో పూర్తిగా (100%) చందన తైలంతో తయారుచేయడిన ఏకైక సబ్బు.[1] ఇతరులు డూప్లికేషన్ చేయకుండా మరియు సరైన క్వాలిటీ నియమాల్ని పాటించేందుకు, ఈ సంస్థ (KSDL) భౌగోళిక గుర్తింపు (Geographical Indication; GI) tag ను పొందినది.[3] క్రీ. శ.2006 లో, మహేంద్ర సింగ్ ధోనీ మైసూరు సాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరించాడు.[4]
విషయ సూచిక
చరిత్ర[మార్చు]
20వ శతాబ్దం ప్రారంభకాలంలో, మైసూరు సామ్రాజ్యం ప్రపంచంలో అత్యధికంగా చందనం ఉత్పత్తిదారులలో ఒకరు. చందనం ఎగుమతి చేసేవారిలో కూడా వీరిదే ప్రథమస్థానం; ముఖ్యంగా ఐరోపా ఖండానికి. మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో అత్యధికంగా చందననిల్వలు నిలిచిపోయాయి. వీటిని వినియోగంలోకీ తేవడానికి, మైసూరు మహారాజా నల్వాడి కృష్ణరాజ ఒడయారు, బెంగుళూరులో ప్రభుత్వ సబ్బుల కర్మాగారాన్ని స్థాపించారు. క్రీ. శ.1916 లో ప్రారంభించబడిన ఈ కర్మాగారం అధికంగా చందనతైలాన్ని ఉపయోగించి సబ్బులను తయారుచేసేది దీనిని మోక్షగుండం విశ్వేశ్వరయ్యఆధ్వర్యంలో నిర్మించారు[5].. చందనం కలప నుండి చందన తైలాన్ని డిస్టిల్లేషన్ చేసే కర్మాగారాన్ని కూడా మైసూరులో అదే సంవత్సరం స్థాపించారు. క్రీ. శ.1944 సంవత్సరం షిమోగాలో రెండవ కర్మాగారాన్ని స్థాపించారు.[2] కర్ణాటక విలీనం అనంతరం, ఈ కర్మాగారాల నిర్వహణ కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలోని వచ్చింది. క్రీ. శ.1980 లో ఈ కర్మాగారాలను విలీనం చేసి, కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ గా నామకరణం చేశారు. సింహం శరీరం మరియు ఏనుగు తలను కలిగిన పౌరాణిక జంతువు శరభము (Sharabha), ఈ సంస్థకు చిహ్నంగా ఎన్నుకోబడింది.[2] ఈ కంపెనీ తరువాతి కాలంలో అగర్బత్తీలు, టాల్కం పౌడర్ మరియు ఇతర డిటర్జెంట్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది.
వ్యాపారం[మార్చు]
మార్చి క్రీ. శ.2006 కల్లా, భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న 450 వేల టన్నుల చందన సబ్బులల్లో, 6,500 టన్నుల భాగాన్ని మైసూరు సాండల్ సబ్బు కలిగివున్నది.[4] బెంగుళూరులోని సబ్బుల కర్మాగారం సంవత్సరానికి 26,000 టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన అతిపెద్దది.[2] ఈ సంస్థ 2004-5 సంవత్సరానికి 1.15 బిలియను (సుమారు $ 28.75 మిలియను) రూపాయల అమ్మకాలను నమోదు చేసుకొన్నది. సాంప్రదాయ పద్ధతిలో మార్కెటింగ్ చేస్తున్న ఈ సంస్థ, మొదటిసారిగా క్రీ. శ.2006 లో మహేంద్ర సింగ్ ధోనీని మైసూరు సాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసడర్ గా ఎన్నికచేసింది. ఈ సబ్బుల అమ్మకాలలో సుమారు 85% దక్షిణ భారతదేశ రాష్టాలైన కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ మరియు తమిళనాడు లోనే ఉన్నాయి. దీని వినియోగ దారులలో అధికశాతం 40 సంవత్సరాల పైబడినవారిగా అంచనాలు తెలుపుతున్నాయి. కర్ణాటకలో చందన కలప నిల్వల కొరత ఈ కర్మాగారం ఉత్పత్తిని చేరుకోవడాన్ని కష్టంగా మారుస్తున్నది.
శతాబ్ది ఉత్సవాలు[మార్చు]
ఈ క్రీ. శ.2016 సంవత్సరం మైసూరు సాండల్ సబ్బు శతాబ్దికాలాన్ని పూర్తిచేసుకొంటున్నది. శతాబ్ది సమయంలో జరిగే ఉత్సవాలలో భాగంలో మైసూరు సాండల్ శతాబ్ది సబ్బును విడుదల చేయాలని సంస్థ భావిస్తున్నది.
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 1.2 Bageshree S. (2006-10-28). "Scent of the region". Online Edition of The Hindu, dated 2006-10-28. Chennai, India: The Hindu. Retrieved 2007-07-31.
- ↑ 2.0 2.1 2.2 2.3 "Profile". Online webpage of the Karnataka Soaps and Detergents Limited. మూలం నుండి July 16, 2007 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-07-31. Cite uses deprecated parameter
|deadurl=
(help) - ↑ P. Manoj (2006-03-05). "GI certificate for Mysore Sandal Soap". Online Edition of The Hindu, dated 2006-03-05. Chennai, India: The Hindu. Retrieved 2007-07-31.
- ↑ 4.0 4.1 Madhumathi D. S. "A whiff of cricket". Online Edition of The Hindu Business Line, dated 2006-03-30. The Hindu Business Line. Retrieved 2007-07-31.
- ↑ http://hindtoday.com/Blogs/ViewBlogsV2.aspx?HTAdvtId=3609&HTAdvtPlaceCode=IND