Jump to content

మైసూర్ మంజునాథ్

వికీపీడియా నుండి
మైసూర్ మంజునాథ్
సోదరుడు మైసూర్ ఎం.నాగరాజ(కుడి)తో మైసూర్ మంజునాథ్
వ్యక్తిగత సమాచారం
జననం(1969-10-05)1969 అక్టోబరు 5
మైసూరు, కర్ణాటక, భారతదేశం
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తివాయులీన విద్వాంసుడు
వాయిద్యాలువయోలిన్

మైసూర్ మంజునాథ్ ఒక కర్ణాటక సంగీత వాయులీన విద్వాంసుడు. తన సోదరుడు మైసూర్ ఎం.నాగరాజతో కలిసి మైసూర్ బ్రదర్స్ పేరుతో జంటగా వయోలిన్ కచేరీలు నిర్వహిస్తున్నాడు. కంచి కామకోటి పీఠానికి ఇతడు ఆస్థాన విద్వాంసుడు. యదువీర మనోహరి, భరత అనే రెండు కొత్త రాగాలను సృష్టించాడు.

విశేషాలు

[మార్చు]

మంజునాథ్ 1969 అక్టోబరు 5న మైసూరులో జన్మించాడు.[1] ఇతడు తన సోదరునితో కలిసి తండ్రి ఎస్.మహదేవప్ప వద్ద వయోలిన్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఇతడు తన మొట్టమొదటి కచేరీ తన 8వ యేట నిర్వహించి బాలమేధావిగా గుర్తించబడ్డాడు.[2]

విద్య

[మార్చు]

ఇతడు మైసూరు విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో స్నాతకోత్తర విద్యను చదివి మొదటి ర్యాంకును సంపాదించి నాలుగు బంగారు పతకాలను పొందాడు. మైసూరు విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో పి.హెచ్.డి. చేసి డాక్టరేట్‌ను సంపాదించాడు.[3][4]

వృత్తి

[మార్చు]

ఇతడు తన 8వ యేటి నుండి తన తండ్రితో, సోదరునితో కలిసి కచేరీలు చేయసాగాడు.[5] ఇతడు తన అన్న మైసూర్ ఎం.నాగరాజతో కలిసి మైసూర్ బ్రదర్స్ పేరుతో కచేరీలు చేడాడు.[6] ఇతడు లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్, ఆస్ట్రేలియా లోని సిడ్నీ ఒపేరా హౌస్, ఇంటర్నేషనల్ వయోలిన్ కాన్ఫరెన్స్, అమెరికాలో కామన్ థ్రెడ్ మ్యూజికల్ ఫెస్టివల్, మెలబోర్న్‌లో ఫెడరేషన్ స్క్వేర్, వరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్ [7], చికాగో, [8] ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, [9]గ్వాలియర్‌లో తాన్‌సేన్ సంగీత్ సమారోహ్, సింగపూర్‌లోని ఎస్ప్లనేడ్ థియేటర్, బి.బి.సి వారి వరల్డ్ మ్యూజిక్ సిరీస్, న్యూ మెక్సికోలో శాంటా - ఫె ఫెస్టివల్, [10]ఇరాన్‌లోని పర్షియన్ అకాడమీ ఆఫ్ కల్చర్, కోల్‌కాతా డోవర్‌లేన్ మ్యూజిక్ ఫెస్టివల్, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ [11]మొదలైన వేదికలపై తన వాయులీన ప్రదర్శన కావించాడు. ఇతడు అంతర్జాతీయ కళాకారులు నెడ్ మెక్‌గోవన్, ఫాబ్రిజియో కాసోల్, జై ఉత్తల్, జో క్రావెన్, ఫ్రెడ్ హామిల్టన్, టాడ్ హాబీ, భారతీయ కళాకారులు విశ్వమోహన్ భట్, రోను మజుందార్, ఎన్.రాజం, తేజేంద్ర మజుందార్[12] మొదలైన వారితో కలిసి సంగీత ప్రదర్శనలు కావించాడు.

ఇతడు మైసూరు విశ్వవిద్యాలయానికి సాంస్కృతిక రాయబారిగా నియమించబడ్డాడు.[13] ఇతడు యదువీర మనోహరి, [14] భరత అనే కొత్త రాగాలను సృష్టించాడు. ఇతడు ఇటీవల యోగా ఆంథమ్‌ అనే పేరుతో ప్రపంచ సంగీత కళాకారులతో కలిసి చేసిన కార్యక్రమం దేశవ్యాప్తంగా గుర్తింపును పొందింది.[15][16] కరోనా మహమ్మారిపై ఇతడు 20మంది ప్రపంచ కళాకారులతో తయారు చేసిన లైఫ్ ఎగైన్ అనే పాటను ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐ.సి.సి.ఆర్) 150 దేశాలలో విడుదల చేసింది.[17]

అవార్డులు, గౌరవాలు

[మార్చు]

ఇతడు సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన యువ కళాకారులలో ఒకడు.[18] కర్ణాటక ప్రభుత్వం ఇతడిని రాజ్యోత్సవ ప్రశస్తి పురస్కారంతో గౌరవించింది.[19] ఇతడు అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ కల్చర్ వారిచే ఎక్సలెన్స్ అవార్డు, ఇండో అమెరికన్ ఆర్ట్స్ కౌన్సిల్ వారిచే సన్మానం, మ్యూజిక్ అకాడమీ వారిచే ఉత్తమ వయోలినిస్ట్ అవార్డు, ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ వారి ఉత్తమ వయోలినిస్ట్ అవార్డు, ఆర్యభట్ట అవార్డు, ఒక్లహామా యూనివర్సిటీ వారి మెరిటోరియస్ అవార్డు, సంస్కృతి సంచార అవార్డు, వై.టి.తాతాచారి జాతీయ అవార్డు, చౌడయ్య జాతీయ అవార్డు, [20]కర్ణాటక గానకళా పరిషత్తు వారిచే గానకళా భూషణ అవార్డు, [21] సంగీత సామ్రాట్టు, సంగీత రత్న, సంగీత విద్వన్మణి, గాన వారిధి, తంత్రీ వాద్య శిరోమణి, రామ గానకళాచార్య[22] సంగీత వేదాంత ధురీణ[23] మొదలైన బిరుదులు సంపాదించాడు. కంచి కామకోటి పీఠం ఇతడిని ఆస్థాన విద్వాంసుడిగా నియమించింది.

మూలాలు

[మార్చు]
  1. web master. "Mysore Manjunath". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 6 మే 2021. Retrieved 4 April 2021.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-04-13. Retrieved 2021-04-04.
  3. https://www.news18.com/news/india/a-sonorous-journey-by-violin-maestros-377583.html
  4. https://www.thehindu.com/news/cities/bangalore/honour-for-mysores-violin-maestros/article5665242.ece
  5. https://www.thehindu.com/entertainment/music/raised-to-the-power-of-two/article27546520.ece
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-04-09. Retrieved 2021-04-04.
  7. https://www.youtube.com/watch?v=MVVSJL7k9ls
  8. http://www.radioandmusic.com/content/editorial/news/zakir-hussain-niladri-kumar-open-chicago-world-music-festival
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-03-18. Retrieved 2021-04-04.
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2021-04-04.
  11. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-04-23. Retrieved 2021-04-04.
  12. http://www.akamoon.com/index.php?id=159[permanent dead link]
  13. http://www.bangalorefirst.in/?p=13376
  14. https://www.deccanchronicle.com/nation/in-other-news/260616/yaduveer-raga-for-mysuru-royal-wedding.html
  15. https://timesofindia.indiatimes.com/city/mysuru/mysuru-musician-composes-anthem-for-international-yoga-day/articleshow/69864567.cms
  16. https://www.asianage.com/life/more-features/210619/anthem-for-yoga.html
  17. https://www.youtube.com/watch?v=7dsBzcibCQM
  18. https://starofmysore.com/selected-sangith-natak-academy-award/
  19. http://www.thehindu.com/2003/10/31/stories/2003103101770600.htm
  20. http://www.thehindu.com/todays-paper/tp-national/tp-karnataka/honour-for-musicians/article4132242.ece
  21. https://www.deccanherald.com/metrolife/metrolife-on-the-move/karnataka-focused-music-parishat-marks-50th-year-799827.html
  22. https://www.thehindu.com/news/cities/bangalore/mysore-brothers-to-receive-rama-gana-kalacharya-award/article23531128.ece
  23. https://www.thehindu.com/news/cities/bangalore/honour-for-mysores-violin-maestros/article5665242.ece

బయటి లింకులు

[మార్చు]