మైసూర్ మల్లిగె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైసూర్ మల్లిగె (జస్మినం గ్రాండిఫ్లోరం)

మైసూర్ మల్లిగె (కన్నడం: ಮೈಸೂರು ಮಲ್ಲಿಗೆ, బొటానికల్ నేమ్: జాస్మినమ్ గ్రాండిఫోర్లమ్ L.) ఒలేసియే కుటుంబానికి చెందిన ఈ పుష్పం కర్నాటకకు చెందిన మొత్తం మూడు స్థానిక మల్లె (Jasmine) రకాలులో అత్యంత ఆదరణ పొందినది; మిగిలిన రెండు రకాలను హదగలి మల్లిగే (జాస్మినమ్ ఔరికులటమ్ వహల్) మరియు ఉడిపి మల్లిగే (జాస్మినమ్ సంబాక్ (L.) ఐటన్) అనే పేర్లతో పిలుస్తారు.[1] సువాసన పరంగా ప్రపంచవ్యాప్త ప్రసిద్ధి పొందిన ఈ మూడు పుష్ప రకాలు మేథో సంపత్తి హక్కు కింద పేటెంట్ పొందడంతో పాటు నమోదు చేయబడ్డాయి.[2]

ప్రశాంతతను చేకూర్చడంతో పాటు తాజాదనాన్ని కలుగజేసే అద్భుతమైన సువాసన కారణంగా మల్లెను పుష్పాల రాణిగా పరిగణించడంతో పాటు “బెల్లె ఆఫ్ ఇండియా” లేదా "సువాసన రాణి" అని సంబోధిస్తుంటారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ పుష్పాన్ని విభిన్న రకాల పేర్లతో పిలుస్తుంటారు—మోగ్రా, మోతియా, చమేలి, మల్లి పూ, జాటి, మల్లిగే, జూహి, మోగ్రా లేదా పొద జాతి వృక్షాల్లో మూన్‌లైట్ అని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు. మొత్తంమీద మల్లెపూలలో 300 రకాలు ఉన్నట్టు అధికారికంగా నమోదైంది. అంతేకాదు మల్లె పరిమళం సముద్రాలను సైతం దాటి విశ్వవ్యాప్తమైంది — మొదట ఆసియా నుంచి యూరప్‌కు ప్రయాణించి, మధ్యధరా సముద్రం వెంబడి విస్తరించి, అటుపై గ్రీస్ మరియు టర్కీలను జయించి, స్పెయిన్ ద్వారా ప్రయాణించి పశ్చిమ ఐరోపా‌ను చేరుకున్న తర్వాత ఫ్రాన్స్ మరియు ఇటలీలను సైతం తన వశం చేసుకుని చివరగా 17వ శతాబ్దం చివరినాటికి ఇంగ్లాండ్‌కు కూడా చేరుకుంది. (18వ శతాబ్దంలో, మల్లె సువాసనలు కలిగిన చేతి తొడుగులు బ్రిటన్‌లో అత్యంత ప్రజాదరణ సాధించాయి).[3]

భిన్న రకాలు[మార్చు]

మైసూర్ మల్లిగె (జాస్మినమ్ గ్రాండిఫ్లోరమ్ )[మార్చు]

అత్యంత ఆదరణ కలిగిన మల్లె రకంగా ఇది సుపరిచితం. ఈ రకం చాలావరకు మైసూర్ నగరం చుట్టుపక్కల మరియు కొంతవరకు కర్నాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో ఉన్న శ్రీరంగపట్న తాలూకాలోనూ పెరగడం వల్ల దీనికి మైసూర్ మల్లిగె అనే పేరు వచ్చింది. మైసూరు నగరంతో మల్లెలకు ఉన్న సాంగత్యం, మైసూర్ రాజ్య పాలకుడు వొడెయార్ ఈ నగరాన్ని రాజ ప్రాసాదాల నగరం మార్చేందుకు కారణమైంది. ప్రతి ఏడాది అక్టోబరు మాసంలో ఇక్కడ జరిగే దసరా ఉత్సవంతో సమానంగా ఈ మల్లె సువాసనలు ఆకట్టుకోవడమే అందుకు కారణం.[4] ఇక్కడ పెరిగే మల్లిగె వ్యవసాయ క్షేత్రం, ఇంటి ముందుభాగం లేదా పెరడు లాంటి ఏ బాహ్య ప్రదేశాల్లోనైనా సరే విపరీతంగా పెరుగుతుంది.

మైసూర్ మల్లిగె అనేది ఎక్కువగా మైసూర్‌లోను మరియు దాని పరిసర ప్రాంతాల్లోనూ పెరుగుతుంది. చిన్న రైతులు సాగు చేసేందుకు ఇది అనుకూలమైన పంట. కాలానుగుణమైన ఈ పుష్పాల సాగు విషయంలో రైతులు రెండు పంటలను అందుకోగలరు. స్థానిక మార్కెట్‌ను మినహాయిస్తే, కేరళ మరియు తమిళనాడుల్లోని వివిధ ప్రాంతాల్లో వీటికి మంచి గిరాకీ ఉంది.

వృక్షశాస్త్ర సంబంధ వివరణ: ఇదొక తీగ మొక్క, 2 to 3 m (6.6 to 9.8 ft) ఎత్తులో, శాఖలు లేని పత్రాలతో లేదా కొన్ని సార్లు కొంచెం పల్లం కలిగిన పత్రాలను కలిగి ఉంటుంది, అరుదుగా ఈ పత్రాలపై నూగు కూడా ఉంటుంది, పత్రాలు వికల్పంగా ఉండి మూడేసి ఆకులను కలిగిన గుచ్ఛంగా ఉంటాయి; ఇవి 1–2 cm (0.39–0.79 in) పొడవుతో ఉండి, వాటి కాడలు 1 cm (0.39 in) పొడవుతో ఉంటాయి. మరియు వీటి మధ్యభాగంలో చిన్న చానెల్ ఉండి పత్ర రూపం అండాకారం నుంచి దీర్ఘవృత్తాకారం వరకు ఉంటుంది, 4-8x2-3.5 cm మందంతో, గాఢమైన పచ్చ రంగులో ఉండే ఈ పత్రాల్లో ఈనెలు కొంచెం కింది భాగం వైపు తేలి ఉంటాయి. ఇక ఈ మొక్కలో ఉండే పుష్పగుచ్ఛం అగ్రభాగం, 4–8 mm పరిమాణంతో 1 నుంచి 5 పుష్పాల సమూహాన్ని కలిగి ఉంటుంది. పుష్పాలు అత్యంత సువాసనభరితంగా ఉంటాయి. పుష్పం కాడ 0.3–2 cm (0.12–0.79 in) వరకు పొడవును కలిగి ఉంటుంది. రక్షకదళాలు నూగు లేకుండా లేదా నూగును కలిగి ఉంటాయి; 5–7 mm వ్యాసంతో 8-9 దళాలను కలిగి ఉంటుంది. పుష్పానికి ఉండే కాడ కొంచెం ఊదా రంగులో ఉండడంతో పాటు, 1.5 cm (0.59 in) పొడవు కలిగిన పూ రేకులు పూర్తి తెలుపు రంగులో ఉంటాయి, ఇవి దీర్ఘ చతురస్త్రాకారం నుంచి అర్థ వర్తుల రూపంలో 5–9 mm వ్యాసంతో ఉంటాయి. ఈ మొక్కకు సంబంధించి ఫలం నీలి నలుపు రంగులో గుండ్రంటి ఆకారంలో 1 cm (0.39 in) వ్యాసాన్ని కలిగి ఉంటుంది.

ఇసుక మిశ్రమాన్ని కలిగిన బంకమన్ను మృత్తికతో పాటు ఎక్కువ pH స్థాయి కలిగిన ప్రాంతాలు (మైసూర్ మరియు పరిసర ప్రాంతాలు) ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి. తేమతో కూడిన పొడి మరియు వెచ్చని వాతావరణం ఈ పంటకు అనుకూలమైన పరిస్థితులు. మార్చి-ఏప్రిల్ మధ్య కాలంలో ఈ మొక్కలు పుష్పించడం ప్రారంభమవుతుంది, ఏప్రిల్-మే నెలల్లో పంట దిగుబడి అధికంగా ఉంటుంది.

ఇక ఈ పుష్పాల్లో సుగంధ ద్రవ్యాల స్థాయి 0.24 నుంచి 0.42 శాతం వరకు ఉంటుంది.[5]

ముఖ్యమైన సుగంధభరిత అంశాలు

ఇండోల్, జాస్మోర్, బెంజాల్ ఎసిటేట్, బెంజాల్ బెంజోఏట్, మెథైల్ ఆంథ్రానిలేట్, లినాలూల్ & జెరనియాల్ లాంటివి ఇందులో ఉండే ముఖ్యమైన సుగంధభరిత అంశాలు. ప్రస్తుత రోజుల్లో వీటిని సుగంధ ద్రవ్య పరిశ్రమ, కాస్మోటిక్స్, ధూపము, అరోమా థెరపీ మరియు ఆయుర్వేద లాంటి వాటిల్లో ఉపయోగిస్తున్నారు.పొడి మరియు సున్నితమైన చర్మానికి సాంత్వన కలిగించేందుకు పై పూతగా కూడా దీనిని ఉపయోగిస్తున్నారు.[6].

హడగలి మల్లిగె (జాస్మినమ్ ఔరికులటమ్ )[మార్చు]

హడగలి మల్లిగె అనేది దానికి మాత్రమే ప్రత్యేకమైన అధిక సువాసన మరియు దీర్ఘకాలిక తాజాదనం లాంటి అంశాలతో ప్రసిద్ధి చెందింది. స్థానికంగా “వాసనె మల్లిగె” (సువాసన మల్లె) గా సుపరిచితమైన ఈ రకం, ప్రధానంగా హూవినా హడగలి మరియు కర్నాటకలోని బళ్ళారి జిల్లా పరిసరాల్లో పెరుగుతుంది.

వృక్షశాస్త్ర సంబంధ వివరణ చిన్నపాటి తీగల స్వభావం కలిగిన ఈ మొక్క పొద రూపంలో ఉంటుంది. ఈ మొక్క పత్రాలు సరళంగాను, దళసరిగాను, అంచులు పైభాగంలో మడతలు కలిగి కొద్దిపాటి నూగుతో ఉంటాయి. ఈ మొక్కలో పుష్పాలు గ్రీవపు కణుపుల్లోంచి పుట్టుకొస్తాయి. పుష్పాలు దాదాపు 1 cm (0.39 in) పొడవు కలిగిన ఆకర్షక పత్రాలను కలిగి ఉంటాయి. మొత్తం 7 పూ దళాలను కలిగి ఉండి అవి తెలుపు రంగంలో ఉంటాయి.

ఈ ప్రాతంలో విస్తరించి ఉండే ఇసుకతో కూడిన ఎర్రమట్టి నేలలు హడగలి మల్లిగె సాగుకు అత్యంత అనుకూలమైనవి. పొడి వాతావరణం మరియు చక్కటి నీటి సరఫరా సైతం ఈ పంట సాగుకు అనుకూలమైన పర్యావరణాన్ని అందుబాటులో ఉంచుతాయి. ప్రధానంగా ఛేదన ప్రక్రియ ద్వారా ఈ పంటను సాగు చేస్తారు.వర్షాకాలం ప్రారంభానికి ముందు అంటే జూలై–ఆగస్టు నెలల్లో దీని సాగు ప్రారంభిస్తారు. ఇక పుష్పాలు వికసించే కాలం ఆరునెలల వరకు విస్తరించి ఉంటుంది.

ఈ మొక్కకు సంబంధించిన పుష్పాలు ఎక్కువ మొత్తంలో సుగంధ తైలాన్ని కలిగి ఉండడంతో పాటు సంతృప్తికర స్థాయిలో సుగంధ తైల దిగుబడి (0.24 to 0.42%) ని కలిగి ఉంటాయి. సుంగధ తైలాన్ని సంగ్రహించడం కోసం ఈ పుష్పాలను ఉపయోగిస్తారు.[5]

ఉడిపి మల్లిగె (జాస్మినమ్ సాంబాక్ )[మార్చు]

ఉడుపి మల్లిగె (జాస్మినమ్ సాంబాక్)
వికసించిన ఉడుపి మల్లి

ఉడిపి మల్లిగె సాగు సైతం ఇతర మల్లె రకాల సాగును పోలి ఉంటుంది. ఉడిపి జిల్లాలోని శంకరపురాలో 100 ఏళ్ల క్రితమే దీని పెంపకం ప్రారంభమైంది.

భట్కల్, ఉడిపి, దక్షిణ కన్నడ మరియు ఉత్తర కన్నడ ప్రాంతాల్లో ఇది విస్తారంగా కనిపిస్తుంది, దీంతోపాటు మనం చెప్పుకున్న మూడు రకాల మల్లెల్లో ఇది ఎక్కువ ఆర్థిక విలువ కలిగినదిగా ఉంటోంది. తీర ప్రాంతాలతో పాటు ముంబయ్ లాంటి ప్రాంతాల్లోనూ ఈ పుష్పాలకు మంచి గిరాకీ ఉంది. ఈ ప్రాంతంలోని ప్రతి కుటుంబం కూడా మల్లె సాగు కోసం ఇంటి ముందు కనీసం ఎకరం విస్తీర్ణంలో సాగు భూమిని కలిగి ఉంటుంది.

వృక్షశాస్త్ర సంబంధ వివరణ: మొక్క చిన్నదిగాను మరియు పొద రూపంలో ఉండడంతో పాటు 5-7x2.5-3.5 cm వ్యాసంతో పసుపు ఛాయ కలిగిన లేత పచ్చ రంగు ఆకులను కలిగి ఉంటుంది, పత్ర ఈనెలు కొంచెం కింది వైపుకు తేలి ఉండడంతో పాటు, పత్రం రెండు చివర్ల వద్ద మొనదేలి అండాకార రూపంలో కూచిగా ఉంటుంది. పుష్పాలు గుచ్ఛాలుగా ఉండడంతో పాటు గ్రీవాలు మరియు అగ్రభాగం నుంచి పుట్టుకొస్తాయి. పుష్ప గుచ్ఛాలు 6 రక్షక దళాలు, 6-8 పుష్ప దళాలను కలిగిన పుష్పాలను కలిగి ఉంటాయి. ఫలాలు చిన్నవిగానూ 0.4-0.5 mm వ్యాసార్థంతోనూ ఉంటాయి.

ఈ ప్రాంతంలోని లేటరైట్ మృత్తిక, ఎక్కువ తేమ మరియు ఎక్కువ వర్షం (ఏడాదిలో సుమారు 2500-3000 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ) లాంటి పరిస్థితులన్నీ కలిసి ఈ పంట పెరుగుదలకు అనుకూలమైన పరిస్థితులను కల్పిస్తాయి. ఛేదన ప్రక్రియ ద్వారా ప్రధానంగా ఈ పంట సాగును చేపడుతారు. ఆగస్టు-సెప్టెంబరు నెలలో పంట సాగు ప్రారంభిస్తారు.

ఉపయోగాలు[మార్చు]

భారతదేశంలోని చెన్నై నగరంలో మల్లె పూల దండలు అమ్ముచున్న ఒక వీధి వర్తకురాలు.

పూల దండల తయారీ కోసం ఈ పూలను విరివిగా ఉపయోగిస్తారు. ప్రత్యేకించి పెళ్ళిళ్లు మరియు ఇతర శుభ కార్యాలకు వీటిని ఎక్కువగా ఉపయోగించడంతో పాటు దేవాలయాల్లోని దేవుళ్ల పూజకు అవసరమైన దండల తయారీ కోసం కూడా వినియోగిస్తారు. పువ్వుల కోసం తోటల్లో విస్తృతంగా సాగుచేయబడే మల్లె మొక్కలు, ఇంటి వద్ద పెరిగే మొక్కలుగా కూడా జీవిస్తున్నాయి. దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాలోని స్త్రీలు ఈ పువ్వులను తమ జడల్లో పెట్టుకుంటారు.ఈ పూలు విదేశాలకు ఎగుమతి కావడం ద్వారా వీటిని సాగుచేసే రైతులకు ఎక్కువ ఆదాయం లభిస్తోంది.[7] యాంటీ డిప్రెసెంట్, యాంటీ సెప్టిక్, యాంటీ స్పాస్మోడిక్, అప్రోడిసియాక్, సెడటివెయాన్డ్ యూట్రిన్ జాస్మిన్ లాంటి గుణాలను కలిగి ఉండడం ద్వారా వైద్యపరంగానూ ఈ పుష్పాలు ఉపయోగకరమైనవి.[8]

సుగంధ ద్రవ్యాల పరిశ్రమ[మార్చు]

జాస్మిన్ మొక్క ఒలేషియే కుటుంబానికి చెందినది. జాస్మిన్‌తో పాటు ఈ కుటుంబంలో ఉన్న మొక్కలను వాటి సువాసనతో నిండిన పూల కోసం మరియు సుగంధ తైలం ఉత్పాదన కోసం వాణిజ్యపరంగా పెంచుతారు. మల్లెల తైలాన్ని ప్రతి పుష్పాల సుగంధ ద్రవ్యంలోనూ కలపడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఒక ముఖ్యమైన పరిమళ ద్రవ్యంగా వినియోగించడం జరుగుతోంది. మొగ్గల్లో లభించే ఇండోల్ అనే ద్రవ్యం సుగంధ ద్రవ్య ప్రాముఖ్యత కలిగినది. అత్యంత త్వరగా ఆవిరి కాగల లక్షణం దీని సొంతం. పూర్తిగా వికసించిన, తెల్లవారు జాము ప్రాంతంలో అప్పటికప్పుడు తాజాగా సేకరించిన పుష్పాలను సుగంధ ద్రవ్య సేకరణకు ఉపయోగిస్తారు. సరాసరిగా లెక్కిస్తే, ఈ పుష్పాల నుంచి లభించే సుగంధ తైలం స్థాయి 0.24 నుంచి 0.42% వరకు ఉండడంతో పాటు ప్రతి హెక్టారుకు 22 kg (49 lb) వంతున మిశ్రమ తైలం దిగుబడి లభిస్తుంది. దీనితర్వాత మిశ్రమ తైలాన్ని ప్రాసెసింగ్ చేసినట్టైతే, మొత్తం మిశ్రమ తైలంలో 50% వరకు అబ్జల్యూట్‌ రూపంలో లభిస్తుంది.[5]

ప్రపంచ వ్యాప్త ఆదరణ కలిగిన కొద్దిపాటి సుగంధ తైలాల్లో అబ్జల్యూట్ సైతం ఒకటిగా ఉంటోంది. అటువంటి వాటిల్లో ముఖ్యమైనవి- ప్రఖ్యాత కోకో చానెల్ తయారు చేసిన చానెల్ No. 5, మరియు ఫ్రెంచ్ డిజైనర్ జీన్ పాటో తయారు చేసిన అత్యంత ఆదరణ కలిగిన “జాయ్” పెర్ఫూమ్‌ ఉన్నాయి. ఇప్పటికీ 'ప్రపంచంలో అత్యంత ఖరీదైన సుంగధ ద్రవ్యం”గా ఉంటోన్న జాయ్ పెర్ఫూమ్‌ను ఒక ఔన్స్ తయారు చేసేందుకు 10,600 మల్లె పుష్పాలు అవసరమవుతాయి.[9].

సుగంధ ద్రవ్యాల పరిశ్రమలో ప్రధానంగా జాస్మినమ్ గ్రాండిఫ్లోరమ్ మరియు జాస్మినమ్ సాంబాక్ రకాలను ఉపయోగిస్తుంటారు. [10].

ఎగుమతుల వృద్ధి మరియు అభివృద్ధి[మార్చు]

జాస్మిన్ అనేది ఫ్లోరీకల్చర్ లేదా పుష్పాల సాగులో ఒక భాగం, ఉద్యానవనాల కోసం మరియు పుష్పాల పరిశ్రమతో సంబంధం కలిగిన పుష్పాల వాణిజ్యం కోసం పుష్పాలు మరియు అలంకార మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించే హార్టీకల్చర్‌లో ఒక విభాగం. కొత్త రకాలకు చెందిన మొక్కలను అభివృద్ధి చేయడమనేది ఫ్లోరీకల్చరిస్టుల ప్రధాన బాధ్యతగా ఉంటుంది. ఫ్లోరీకల్చర్ పంటలనేవి బెడ్డింగ్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఫోలియేజ్ ప్లాంట్స్ లేదా హౌస్ ప్లాంట్స్, కట్ కల్టివేటెడ్ గ్రీన్స్, మరియు కట్ ఫ్లవర్స్ లాంటి అన్నింటినీ కలిగి ఉంటుంది. నర్సరీ పంటల నుంచి వైవిధ్యాన్ని ప్రదర్శించే ప్లోరీకల్చర్ పంటలు ప్రధానంగా పత్ర సంబంధమైనవి. బెడ్డింగ్ మరియు గార్డెన్ మొక్కలనేవి తక్కువ వయసు కలిగిన పుష్పించే మొక్కలు (ఏక వార్షికాలు మరియు బహు వార్షికాలు) మరియు కూరగాయ మొక్కలను కలిగి ఉంటాయి. పుష్పాలనేవి ముఖ్యంగా ఎగుమతికి ఉద్దేశించినవి కావడంతో పాటు ఈ రకమైన వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 6-10 శాతం మేర వృద్ధిని నమోదు చేస్తోంది. అయితే పుష్పాలకు సంబంధించిన ప్రపంచ మార్కెట్ విషయంలో భారతదేశం వాటా ఇప్పటికీ స్వల్పంగానే ఉంటోంది. అయినప్పటికీ, ఫ్లోరీకల్చర్ విషయంలో 18వ శతాబ్దం నుంచీ కర్ణాటక అగ్రస్థానంలో ఉండడమే కాకుండా భారతదేశంలోని మొత్తం పుష్పాల ఉత్పత్తిలో 75 శాతం వాటాను కలిగి ఉండడం ద్వారా ఫ్లోరీకల్చర్ విషయంలో ప్రస్తుతం ఆ రాష్ట్రమే అగ్రగామిగా నిలుస్తోంది. ఆధునిక కట్ ప్లవర్స్ కింద అత్యధిక ప్రాంతాన్ని కలిగిన ఆ రాష్ట్రం, 40 వరకు పుష్పాల పెంపకం మరియు ఎగుమతి విభాగాలను కలిగి ఉంది. దేశానికి చెందిన మొట్టమొదటి మరియు ఏకైక పుష్పాల వేలం కేంద్రాన్ని కలిగి ఉన్నది కర్ణాటక మాత్రమే. 2003-04 సంవత్సరానికి సంబంధించిన గణాంకాల ప్రకారం, వాణిజ్య పుష్పాల పంటల సాగుకు సంబంధించిన మొత్తం విస్తీర్ణం 18,182 ha (44,930 acres)లో మల్లె (ఆ మూడు రకాలు) వాటా 3,451 ha (దాదాపు 19%) గా ఉంటోంది. అలాగే సరాసరిగా 6 టన్నులు/ha తో మొత్తంమీద 20,244 టన్నుల పుష్పాల దిగుమతి జరుగుతోంది.[11]

నెదర్లాండ్స్‌లో పుష్పాల జిల్లాగా ప్రసిద్ధి చెదిన ఆల్స్‌మీర్ వేదికగా ప్రతి సంవత్సరం ఫ్లోరీకల్చర్ ఉత్సవం జరుగుతుంది (ప్రపంచంలోని నలుమూలలకు చెందిన పుష్పాల పెంపకందార్లు తమ పుష్పాలతో ఈ వేడుకకు హాజరవుతుంటారు). నెదర్లాండ్‌లో జరిగే అంతర్జాతీయ ఫ్లోరీకల్చర్ సమావేశానికి హాజరు కావడం కోసం ఉడిపి మల్లిగె, హదగలి మల్లిగె, మైసూర్ మల్లిగె పుష్పాలను సాగుచేసే ఒక బృందాన్ని నియమించినట్టు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. నెదర్లాండ్‌లో జరిగే ఉత్సవంలో ఒక వేదికను సృష్టించే దిశగా, పుష్పాలను దండలుగా గుచ్చే నైపుణ్యం కలిగిన స్త్రీలను (ఒక్కో ప్రాంతం నుంచి ముగ్గురు) ఆ కార్యక్రమానికి పంపండ ద్వారా విదేశీ పర్యాటకులను ఆకర్షించాలన్నది కర్ణాటక వ్యూహం. మల్లె పూలను దండగా గుచ్చడమనే నైపుణ్యంలో మహిళా పెంపకందార్లు బాగా ఆరితేరినవారు.[12][13]

భౌగోళిక సంకేతం (GI)[మార్చు]

భౌగోళిక సంకేతం లేదా GI అనేది మానవ తయారీ లేదా స్వాభావికమైన ఒక ప్రత్యేక లక్షణాలు గల ఉత్పత్తికి నకిలీల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ రకమైన గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారు ఆ ఉత్పత్తికి సంబంధించిన విశిష్ట లక్షణాన్ని కచ్చితమైన రీతిలో నిర్థారించడంతో పాటు ఆ ఉత్పత్తికి సంబంధించిన ప్రత్యేక నాణ్యత అనేది భౌగోళిక పరమైన అంశమని మరియు అదే రకమైన నాణ్యతను మరే ఇతర ప్రాంతం నుంచి సాధించడం వీలుకాదని రుజువులు చూపించాల్సి ఉంటుంది. రుచి గ్రహించే విషయంలో అత్యంత విలక్షణత కలిగిన ఫ్రెంచ్ మరియు స్కాటిష్ ప్రజలు ఈ రకమైన ద్రావణాల సువాసన గురించి కచ్చితంగా చెప్పగలరు; ఈ పూల విషయంలో ఉన్న విలక్షణత అనేది అది సాగు చేయబడే ప్రత్యేక భౌగోళిక ప్రాంతంలోని మృత్తిక, వాతావరణం సాగు విధానం ద్వారా ఏర్పడిందని నిర్ధారణ అయ్యింది. ట్రేడ్‌మార్క్ రూపంతో పూర్తి సారూప్యత (అయితే ఇవి రెండూ ఒకే లాంటివి కాదు) కలిగిన GI రూపంలో వాటి విశిష్టతను కాపాడడంతో ఒక తర్కం ఉంది. GI, ట్రేడ్‌మార్క్‌ల మధ్య ఉన్న ముఖ్యమైన విభేదం గురించి చెప్పాలంటే, GI భద్రత అనేది ఒక సమాజ హక్కు లాంటిది. ఒక ప్రత్యేక సమాజానికి చెందిన ఉత్పత్తులు గుర్తింపు ప్రమాణాలను అందుకున్నట్టైతే, ఆ ప్రత్యేక ప్రాంతానికి చెందిన తయారీదారులు/ఉత్పత్తిదారులందరికీ ఈ హక్కు లభిస్తుంది. ఒక ఉత్పత్తి GI భద్రతను సాధించాలంటే రిజిస్ట్రేషన్‌కు ముందుగానే ఆ ఉత్పత్తి తన ప్రతిష్ఠను నిరూపించుకోవాల్సి ఉంటుంది. GI అనేది TRIPSలోనూ & భారత ‘జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ (రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్) చట్టం 1999'లోనూ నిర్వచించబడుతుంది.[14]

ప్రత్యేకించి ప్రాంతీయత అనే విశిష్ట అంశం ఆధారంగా మల్లిగె పూల (జాస్మిన్స్) ప్రత్యేక లక్షణాలను దృష్టిలో ఉంచుకుని “మైసూర్ మల్లిగె”, "ఉడిపి మల్లిగె" మరియు "హడగలి మల్లిగె"లు భౌగోళిక సంకేత చట్టం కింద అన్ని అంశాలను సంతృప్తి పరిచే విధంగా ఉన్నాయని నిరూపించడం ద్వారా కర్ణాటక ప్రభుత్వం ఈ మూడు పూల రకాలకు GI రక్షణను సాధించింది. ఈ పూల రకాలకు సంబంధించి క్రింది వాటిని విశిష్ట అంశాలుగా పేర్కొనడం జరిగింది.

 • విశిష్టమైన నాణ్యత – విశిష్ట కారకమైన ఆవిరి గుణం కలిగిన నూనె (సుగంధ తైలం) పరిమాణం మిగిలిన వాటితో పోలిస్తే ఈ రకంలో తక్కువ.
 • వాతావరణ అనుకూలత: హడగలి తాలూకా చుట్టూ ఉన్న ప్రాంతంలో వ్యాపించిన పొడి ఇసుకతో కూడిన మృత్తిక ఈ పూలకు ప్రత్యేకమైన పరిమళాన్ని ఆపాదించేందుకు కారణమవుతోంది. అదేసమయంలో ఈ ప్రాంతంలోని పొడి వాతావరణం (తక్కువ/అప్పుడప్పుడూ కురిసే వర్షం) ఈ పంటకు అనువైన పర్యావరణాన్ని సమకూరుస్తోంది.
 • ఖ్యాతి: ముంబయ్, సముద్ర తీర ప్రాంతాల్లో ఈ పూలకు డిమాండ్ ఎక్కువ. పశ్చిమాసియాలో ఈ పూలకు డిమాండ్ ఉండడంతో వీటికి ఎగుమతి సామర్థ్యం కూడా తోడైంది.

భారత వాణిజ్య మరియు పరిశ్రమల కేంద్ర మంత్రిత్వ శాఖకు జోడించబడిన, రిజిస్ట్రార్ ఆఫ్ GIగా కూడా వ్యవహరించే కంట్రోలర్-జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్ అండ్ ట్రేడ్ మార్క్స్ నేతృత్వంలోని ఒక నిపుణుల కమిటీ సెప్టెంబరు 2007న మల్లె రకాలైన ఈ మూడు పుష్పాకు GI పేటెంట్‌ను అంగీకరించింది. దీంతో స్థానిక రైతులు 10 ఏళ్ల పాటు ఈ పుష్పాలకు సంబంధించిన పంటను సాగు చేసేందుకు అవసరమైన ప్రత్యేక హక్కులను జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అవకాశం కల్పించినట్టైంది. ఈ రకమైన GI గుర్తింపు లేదా పేటెంట్ కారణంగా ఈ ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతానికి బయట ఉన్నవారు ఎవరూ కూడా ఇదే పేరు మీదుగా ఈ పుష్పాలను విక్రయించడానికి అనుమతి నిరాకరించబడింది. ఈ పంటకు సమాజ యాజమాన్య హోదా దక్కడమే కాకుండా, GI కింద నమోదై ఈ పంటను సాగుచేస్తున్న వారికి అవసరమైన సాంకేతిక సాయం, బ్రాండ్ ఉత్పత్తి మరియు మార్కెట్ భరోసా కల్పించేందుకు ఉద్యానవన శాఖ ముందుకు వచ్చింది.[15].GI గుర్తింపు కారణంగా మైసూర్ నగరానికి మరియు మల్లిగె (జాస్మిన్) కు మధ్య ఉన్న బంధం ఇప్పుడు మరింత బలంగా మారింది.[14]

జాస్మిన్ అబ్జల్యూట్[మార్చు]

అబ్జల్యూట్ అనేది జాస్మిన్ నుంచి తయారుచేయబడే ఒక ద్రావణి. కోట్ రూపంలో కింద వివరించబడిన మ్యాండీ ఆఫ్టల్ విధానం ద్వారా ఇది తయారు చేయబడుతుంది.దక్షిణ భారతదేశంలోని కర్ణాటక మరియు తమిళనాడుల్లో సాగు చేస్తున్న వేలాది ఎకరాల మల్లె తోటల ప్రాంతంలో ఉన్న జాస్మిన్ సంగ్రహ యూనిట్ల నుంచి ఈ రకమైన ద్రావణ ఉత్పన్నాలు తయారవుతాయి.[16]

“మల్లెపూలను ఏమాత్రం గాలిచొరబడని డబ్బాల్లో వేసి సీలు చేసి వాటిని అలమారల్లో ఉంచుతారు. పూలలోని సుగంధ నూనెలను వెలికి తీయడం కోసం సీలు చేసే ముందు పూలను సాధారణంగా హెక్సేన్ లాంటి ద్రావణంతో తడుపుతారు. ఇలా చేయడం వల్ల ఈ సీలు చేసిన డబ్బాల్లో రసాయన చర్య జరిగి “కాంక్రీట్” అనే ఒక గట్టి మైనం లాంటి పేస్ట్ ఉత్పత్తి అవుతుంది. అటుపై ఈ మైనాన్ని అనేకసార్లు స్వచ్ఛమైన ఆల్కహాల్ (ఇథనాల్)తో చికిత్స చేయడం ద్వారా మైనం మొత్తం కరిగిపోయి చివరకు అబ్జల్యూట్ అని పిలవబడే అత్యంత సుగంధభరిత ద్రావణం తయారవుతుంది. రెజిన్లు మరియు బాల్సమ్‌లు మరియు సివెట్, మస్క్, అంబెర్గరిస్, క్యాస్టోరియం లాంటి జంతు సంబంధిత సుగుంధ తైలాల సంగ్రహణకు సైతం ఈ విధానాన్ని ఉపయోగిస్తారు”. (ఆధారం: మ్యాండీ ఆఫ్టల్, ఎస్సెన్స్ అండ్ ఆల్కెమీ".

కవితలు మరియు సినిమాలు[మార్చు]

'మైసూర్ మల్లిగె' అనే పేరుతో గత వందేళ్ల కాలంలో కవులు, నవలా రచయితలు మరియు కర్ణాటకకు చెందిన రంగస్థల నటుల ద్వారా ఈ రకం మల్లెపూవు అద్భుతంగా స్తుతించబడింది. మల్లిగె కవిగా సుపరిచితుడైన దివంగత K S నరసింహస్వామి “మైసూర్ మల్లిగె” అనే పేరుకు అమరత్వాన్ని ప్రసాదించారు. ఆయన కవితా సంపుటి అయిన మైసూరు మల్లిగె (1942) కన్నడ భాషలోని అత్యుత్తమ రచనల్లో ఒకటిగా పేరు సాధించడంతో పాటు 27 సార్లు పునఃముద్రితమైంది.

ఈ కవితల సంపుటి స్ఫూర్తితో "మైసూరు మల్లిగె" పేరుతో T.S. నాగాభరణ ఒక చిత్రాన్ని మరియు కలగంగోత్రి ఒక సంగీత నృత్యాన్ని రూపొందించడం జరిగింది. ఇందుకోసం ఆయన ప్రముఖ నేపథ్య గాయకులైన P. కళింగ రావు, మైసూర్ అనంతస్వామి మరియు నరసింహస్వామి కవితలను సినిమాలు మరియు రంగస్థలంపై ఆదరణ పొందేలా చేసిన C. అశ్వత్ లాంటి వారిని ఎంచుకున్నారు.

వీటిని కూడా చూడండి.[మార్చు]

సూచనలు[మార్చు]

 1. మూడు రకాలైన మల్లిగె (జాస్మిన్) కర్షకుల ఉపయోగం కోసం కర్ణాటక స్టేట్ హొర్టికల్చర్ డిపార్టుమెంటు యొక్క సమాచారం
 2. మైసోర్, ఉడిపి, హడగాలి మల్లిగె ఫ్లోవేర్స్ పేటెన్టెడ్
 3. ది బెల్లి అఫ్ ఇండియా-http://lotus-living.blogspot.com/2006/11/belle-of-india.html
 4. మైసోర్, ఉడిపి, హడగాలి మల్లిగె ఫ్లోవేర్స్ పేటెన్టెడ్
 5. 5.0 5.1 5.2 జాస్మిన్ http://horticulture.kar.nic.in/Home%20page.htm
 6. http://www.incensum.in/Jasmine.aspx
 7. జాస్మిన్ తన సుగంధాల ద్వారా యూరోప్‌ను సమ్మోహనం చేస్తోంది http://mangalorevideos.com/news.php?newsid=73873&newstype=local
 8. http://www.incensum.in/Jasmine.aspx.
 9. ములగ చెట్టు మరియు ఇతర వింతలూ http://web.archive.org/20090416044226/lotus-living.blogspot.com/2006/11/belle-of-india.html
 10. జాస్మిన్ సిరీస్: పార్ట్ 1~ జెనస్, రకాలు మరియు ఉత్పత్తి http://perfumeshrine.blogspot.com/2007/05/jasmine-series-part-1-genus-varieties.html
 11. పరిశోధన నివేదిక: IX/ADRT/105
 12. పుష్పాల కై వార్తలు - ఏప్రిల్ 2008
 13. జాస్మిన్ సుగంధాలు ద్వార యూరోప్ ను సమ్మోహనం చేస్తుంది
 14. 14.0 14.1 `మైసోర్ మల్లిగే' త్వరలో GI ట్యాగ్ తో అలంకరించబడును http://www.hindu.com/2006/11/09/stories/2006110918020200.htm
 15. ది బియోలోజికల్ డైవర్సిటీ యాక్ట్ http://spicyipindia.blogspot.com/2007_10_01_archive.html
 16. జాస్మిన్ సిరీస్: పార్ట్ 2 ~ది రోల్ అఫ్ జాస్మిన్ ఇన్ పెర్ఫుమరి ,http://perfumeshrine.blogspot.com/2007/05/jasmine-series-part-1-genus-varieties.html
 • మంది అఫ్టేల్, ఎస్సెన్స్ అండ్ అల్కేమి: ఏ నాచురల్ హిస్టరీ అఫ్ పెర్ఫ్యుం, గిబ్బ్స్ స్మిత్, 2001, ISBN 1-58685-702-9

బాహ్య లింకులు[మార్చు]

 • The dictionary definition of Jasminum at Wiktionary
 • "Jasminum L." Integrated Taxonomic Information System. Retrieved 3 June 2008. Cite web requires |website= (help)
 • "Flora Europaea Search Results". Flora Europaea. Royal Botanic Garden, Edinburgh. Retrieved 2008-06-03.
 • "Jasminum Linn". Flora of Pakistan: Page 12. Retrieved 2008-06-03.
 • "Jasminum L. record n° 1950". African Plants Database. South African National Biodiversity Institute, the Conservatoire et Jardin botaniques de la Ville de Genève and Tela Botanica. Retrieved 2008-06-03.
 • మూస:PLANTS
 • Metcalf, Allan A. (1999). The World in So Many Words. Houghton Mifflin. ISBN 0395959209.