Jump to content

మై బేబి

వికీపీడియా నుండి
మై బేబి
దర్శకత్వంనెల్సన్ వెంకటేశన్
రచన
  • నెల్సన్ వెంకటేశన్
  • అతిషా వినో
నిర్మాత
సహ-నిర్మాతలుదుప్పాడిగట్టు సారిక రెడ్డి
పి. సాయిచరణ్ తేజ
తారాగణం
ఛాయాగ్రహణంపార్థిబన్
కూర్పువిజె సాబు జోసెఫ్
సంగీతంబ్యాక్‌గ్రౌండ్ స్కోర్:
జిబ్రాన్
పాటలు:
  • సత్యప్రకాష్
  • శ్రీకాంత్ హరిహరన్
  • ప్రవీణ్ సాయివి
  • సాహి శివ
  • అనల్ ఆకాష్
నిర్మాణ
సంస్థలు
  • ఎస్. కె. పిక్చర్స్,
  • యష్ ఫిలిం ఫ్యాక్టరీ
విడుదల తేదీ
18 జులై 2025 (2025-07-18)
సినిమా నిడివి
139 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

మై బేబి 2025లో విడుదలైన తెలుగు సినిమా. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో తమిళంలో విడుదలైన 'డి.ఎన్.ఏ.' సినిమాను తెలుగులో 'మై బేబి' పేరుతో ఎస్. కె. పిక్చర్స్, యష్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యాన‌ర్స్‌పై సురేష్ కొండేటి నిర్మించాడు.[1][2] అథర్వ, నిమిషా సజయన్, మహమ్మద్ జీషాన్ అయ్యూబ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను జులై 18న విడుదల చేశారు.[3]

మై బేబి సినిమా జూలై 19 నుండి తెలుగుతో పాటు త‌మిళం, మలయాళం, కన్నడ, హిందీ భాష‌ల్లో జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]

ఆనంద్ (అథర్వ) కాలేజీలో ప్రేమించిన అమ్మాయి (మానసా చౌదరి) మరొకరిని పెళ్లి చేసుకుని విదేశాలు వెళ్లడంతో మందుకి బానిస‌గా మారతాడు. దివ్య (నిమిషా సజయన్) బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ మానసిక సమస్యతో బాధపడుతూ ఉంటుంది. వీరిద్ద‌రికి పెళ్లి జ‌రుగుతుంది. ఆనంద్ దివ్య మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని ఆమెను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో వాళ్లకు ఓ బాబు పుడతాడు. అయితే బిడ్డ పుట్టిన కొన్ని నిమిషాలకే ఆ బిడ్డ తమది కాదని, ఎవరో ఆసుప‌త్రిలో మార్చేశారని దివ్య చెబుతుంది. ఆమె మానసిక స్థితి (పోస్ట్ పార్టుమ్ సైకోసిస్) కారణంగా ఆమె చెప్పేది ఎవరూ నమ్మరు. కానీ ఆనంద్ తన భార్య దివ్య మాటలను నమ్మి, నిజం తెలుసుకోవడానికి బయలుదేరతాడు. ఈ క్రమంలో పిల్లలను కిడ్నాప్ చేసి అమ్ముకునే ఒక పెద్ద నెట్‌వర్క్‌ను ఆనంద్ కనుగొంటాడు. ఆ తర్వాత ఏం చేశాడు ? వారి నుండి తన బిడ్డను తిరిగి తెచ్చాడా ? అనేదే మిగతా సినిమా కథ.[5][6][7]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "తెలుగులో రాబోతున్న తమిళ డి.ఎన్.ఎ." Chitrajyothy. 4 July 2025. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.
  2. "'మై బేబి' చిత్రం 'ప్రేమిస్తే', 'జర్నీ' లాంటి గొప్ప సక్సెస్ సాధిస్తుంది : నిర్మాత సురేష్ కొండేటి". NT News. 17 July 2025. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.
  3. "'డి.ఎన్.ఎ' జూలై 18న గ్రాండ్ రిలీజ్". NT News. 13 July 2025. Archived from the original on 16 July 2025. Retrieved 16 July 2025.
  4. "నిన్న థియేట‌ర్‌లో రిలీజ్‌.. ఇవ్వాళ ఓటీటీలో". Chitrajyothy. 19 July 2025. Archived from the original on 30 July 2025. Retrieved 30 July 2025.
  5. "రివ్యూ: డీఎన్‌ఏ.. తెలుగులో వచ్చిన మరుసటిరోజే ఓటీటీలోకి.. క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?". Eenadu. 19 July 2025. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.
  6. "మై బేబీ రివ్యూ". NTV Telugu. 18 July 2025. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.
  7. "'మై బేబీ' రివ్యూ & రేటింగ్: తమిళంలో హిట్... తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా? అథర్వ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?". ABP Desam. 18 July 2025. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మై_బేబి&oldid=4610529" నుండి వెలికితీశారు