మొగలి నూనె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మొగలి చెట్టు
మగపూలగుత్తి

మొగలి నూనె లేదా మొగలి తైలం ఒక ఆవశ్యక నూనె/సుగంధ తైలం.ఈ నూనెను సుంగంధ నూనెగానే కాకుండ ఆయుర్వేద వైద్యంలో కూడా వినియోగిస్తారు.మొగలి మగపూలు అత్యంత సువాననను వెలువరించడంవలన ఈపూలను మహిళలు లేతమొగలి ఆకులతో జడపాలి అల్లికలో ఉపయోగిస్తారు.

మొగలిచెట్టు[మార్చు]

మొగలి ఒక ఓషధి చెట్టు. మొగలి చెట్టు వక్రమైన కాండాన్నికల్గి, వాటికి నలుపక్కలకు విస్తరించిన కొమ్మలు వుండును. కొనభాగం సన్నగా పొడిగించబడి. కంటకయుతమైన ఉపాంతంతో కత్తి ఆకారం (Ensiformis) లోని సరళపత్రాలువుండును.. అగ్రస్థ స్పాడిక్స్ పుష్ప విన్యాసంలో అమరి ఉన్న సువాసన గల మీగడ రంగు పుష్పాలు. మొగలి ఒక విభిన్నమైన సువాసననిచ్చే పూల మొక్క. హిందీలో దీనిని కేవడా లేదా కేతకీ అంటారు.ఏకలింగాశ్రయ వృక్షం.అనగా మగ ఆడ పూలు వేరు వేరు చెట్లకు వుండును..పొడవైన ఆకులఅంచులుచీలి ముళ్ళవలే వుండును.ఆకు ఆకులు నీలి-ఆకుపచ్చ రంగులో వుండి సువాసన కల్గి వుండును.కాండ్పు కణులులనుండి పెరిగిన వేర్లు చెట్టుకు ఆధారంగా వుండును.లేత ఆకులు లేత పసుపుగా, ముదురు ఆకులు ముదురు ఆకుపచ్చగా వుండును.లేత ఆకులు సువాసన కల్గి వుండును.కాండం కొమ్మలు కొద్దిగా ఓంకార టింకరగా పెరుగును.వేసవి కాలంలో పుస్పించ్చును.మొగలి ఆకుల నుండికూడా సువాసన నూనెను తీస్తారు.[1]

మొగలి మొక్క పాండనేసియే కుటుంభానికి చెందిన మొక్క. పాండనస్ ప్రజాతికిచెందిన మొక్కలు 600 రకాల వరకు ఉష్ణమండలం, ఉప ఉష్ణ మండల ప్రాంతాల్లో వ్యాపించి ఉన్నాయి.భారతదేశంలో 30-40 రకాలు ఉన్నాయి. మొగలి వృక్ష శాస్త్ర పేరు పాండనస్ ఓడోరాటిస్సిమస్ లాం (Pandanus odoratissimus Lam).[2] మొగలి చెట్టులో మగ, ఆడ పూలు వేరు వేరు చెట్లకు పుష్పించును.మొగలి చెట్టు సంవత్సరంలో మూడూ సార్లు పూయును.జులై-సెప్టెంబరులో ఎక్కువ పూల దిగుబడి వచ్చును.ఈ సీజనులో దాదాపు 60% పూలు పూయును.మగ పూలు గులాబీ వంటి తియ్యని వాసన వెలువరించును.మగ పూలనుండి నూనెను తీస్తారు.ఆడ పూలు ఎటువంటి వాసన కల్గి వుండవు.అందుకే వీటిని పండ్లుగా పక్వంవచ్చేవరకు వదలి వేస్తారు.మొగలి ఆకులను చాపలు, సంచులు, బుట్టలు తయారు చేస్తారు.మొగలి చెట్టా వేర్లను కూడా ఉపయోగిస్తారు.గణపతి పూజకు, స్వర్ణ గౌరి వ్రతం, వరమహాలక్ష్మి పూజల్లో మొగలి పూలను సమర్పిస్తారు.ఇండియాలో మహిళలు మొగలీ పూలను బట్టలకు సువాన రావటానికి మడతలలో, వాటిని వుంచుతారు[3] మొగలి ఆకులను చాపలు, సంచులు, బుట్టలు తయారు చేస్తారు.మొగలి చెట్ట వేర్లను కూడా ఉపయోగిస్తారు.

భారత దేశంలో వ్యాప్తి[మార్చు]

ఇవి భారతదేశంలో ఒడిషా (ముఖ్యంగా గంజాంజిల్లా), ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, రాష్ట్రాల తీరప్రాంతాల్లో వ్యాపించి ఉన్నాయి.అలాగే ఉత్తర ప్రదేశ్లో కూడా కొన్నిచోట్లవున్నది.[2]

ఇతర దేశాల్లో వ్యాప్తి[మార్చు]

మొగలి దక్షిణ ఆసియా దేశాల సముద్రతీర అడవుల్లో, పిలిప్పీన్స్,, ఇండోనేసియాతో సహా కలుపు కుని తూర్పుగా పాపుయ న్యూగినియా, ఉత్తర ఆస్ట్రేలియా వరకు వ్యాపించి ఉన్నాయి.అలాగే పసిఫిక్ బీచ్ లలో కూడా ఉన్నాయి.అలాగే ఇంకా పలు దేశాలలో విస్తరించివున్నది.[2]

నూనె సంగ్రహణ[మార్చు]

మొగలినూనెను సాధారణంగా స్టీము డిస్టిలేసను/ నీటిఆవిరి స్వేదన క్రియ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేస్తారు.పాండనస్ ఓడోరా టిస్సీమాస్ మొక్క పూలనుండి తీసిన నూనెను ఎక్కువ రెసోల్యూసన్ గ్యాస్ క్రోమోటోగ్రపీ,, గ్యాస్ క్రోమోటోగ్రపీ-స్పెక్టో మెట్రి ద్వారా పరీక్షించినపుడు అందులో ఈథర్ (37.7%), టెర్పేవ్-4-ఒల్ (18.6%), ఆల్ఫా టెర్పీనియోల్ (8.3%),2-పినైల్ ఇథైల్ ఆల్కహాల్ (7.5%), బెంజైల్ బేంజోయేట్ (11%), విరిడిన్ (8.8%), జెర్మాక్రేన్ –బి (8.3%) లతో పాటు స్వల్ప ప్రమాణంలో బెంజైల్శాలిసైలట్, బెంజైల్ ఆసిటేట్, బెంజైల్ ఆల్కహాల్ వంటివికూడా వున్నట్లు గుర్తించారు.[2] నూనె సంగ్రహణకై మగపూలను తెల్లవారు జాముననే సేకరిస్తారు.లేత ఆకులమధ్యదాగిన పూలు ఆకులను తెరవగానే సువాసన వెదజల్లును.నూనె లేలేత పసుపు లేదా బ్రౌన్ రంగులో వుండును.మొగలినూనెను సుగంధ ద్రవ్యాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.అగర బత్తులతయారీలో ఉపయోగిస్తారు.[4] మొగలిలో రెండు రకాలు ఉన్నాయి. తెలుపు, పసుపు. తెలుపు రకం ఆగస్టు-సెప్టెంబరు మధ్యలో పుష్పీస్తాయి.పచ్చరకం ఫిబ్రవరి-మార్చి నెలలో పుష్పీస్తాయి.ఫ్లోరల్ బ్రక్కెట్స్ నుండి నువ్వుల నూనె ద్వారా ను, లేదా పూలనుండి స్టీము డిస్టిలేసను పద్ధతిలో నూనెను ఉత్పత్తి చేస్తారు.[5]

ఆవిరి విధానంలో నూనె ఉత్పత్తి వివరాలకై ప్రధాన వ్యాసం ఆవశ్యక నూనెల ఉత్పత్తి- నీటి ఆవిరి ద్వారా స్వేదనక్రియ చూడండి

నూనె[మార్చు]

నూనె లేలేత పసుపు లేదా బ్రౌన్ రంగులో వుండును.ఆహాల్లదకరమైన సువాసన కల్గి ఉంది. 1200 పూలనుండి 370 పౌండ్ల నూనె ఉత్పత్తి అవును.[3]

నూనెలోని రసాయన సమ్మేళనాలు[మార్చు]

నూనెలోని కొన్ని ముఖ్య రసాయన సమ్మేళనాలపట్టిక[6]

వరుస సంఖ్య రసాయన సమ్మేళనం శాతం
1 2 పినేఈథైల్ మిథైల్ ఈథరు 65.6–75.4%),
2 టెర్పీనేన్ 4-ఒల్ 11.7–19.5%
3 p- సైమేన్ 1.0–3.1
4 ఆల్ఫాటెర్ప్నియోల్ 1.2–2.9%),

నూనె భౌతిక గుణాలు[మార్చు]

నీటిలో కరుగదు.అల్కహాల్‌లో కరుగును.నూనె వrNaరహితం లేదా లేలేత పసుపు రంగు, [7]

భౌతిక గుణాల పట్టిక[5]

వరుస సంఖ్య గుణం విలువ మితి
1 రంగు రంగు వుండదు
2 విశిష్ట గురుత్వం, 20oC వద్ద 0.932-0.934
3 దృశ్య భ్రమణం20oC వద్ద +2.76-2.788
4 వక్రీభవన సూచిక20oC వద్ద 1.483-1.500

నూనె ఉపయోగాలు[మార్చు]

  • మొగలి నూనెను గుట్కా తయారీలో ఉపయోగిస్తారు.3-5%మొగలి నూనెను చందన నూనెలో కలపడం వలన కేవడ అత్తరు తయారు అగును.కేవడ అత్తరును ఆరోమాటిక్, పెర్ఫ్యూమరి, కాస్మోటిక్ పరిశ్రమలలో ఉపయోగిస్తారు.[3]
  • కేవడ జల్ తయారు చేస్తారు.దీనిని తక్కువ రకాపు పూలనుండి తయారు చేస్తారు.మొగలి నూనె లేదా అత్తరు నుండి కేవడ జల్/మొగలి పన్నీరు తయారు ఆగును.మొగలి పన్నీరులో/కేవడ జల్ లో 0.02% వరకు మాత్రమే మొగలి తైలం వుండును.మొగలి పన్నీరును కొద్ది ప్రమాణంలో రసమలై, గులాబ్ జామూన్, లేదా రసగుల్లాను తయారు చేయుటకు ఉపయోగిస్తారు.బిరియానికి వాసన పెంచుటకు ఉపయోగిస్తారు.[3]
  • దయాబేటీస్ నియంత్రణ, జ్వరం, కీళ్ల నొప్పులు, చెవి నొప్పి నివారణకు ఉపయోగిస్తారు.[3]

వైద్యపరంగా ఉపయోగాలు[మార్చు]

  • వైద్యపరంగా యాంటీ బాక్టీరియాల్, యాంటీ సెప్టిక్, యాంటీ స్పాస్మోడిక్‌గా, కీళ్ల సంబంధమైన వాత నొప్పులను తగ్గిస్తుంది.చర్మానికి రాసి నపుడు చర్మపు లోపలి పొరల్లోకి వ్యాపించి చర్మాకణాలను మృదువుగా చేసి, తేమను చేర్చుతుంది. మొగలి నూనెను పలు సౌందర్యా ద్రవ్యాలతో చేర్చి ఉపయోగిస్తారు.[5]>
  • నూనెను తీపు వంటకాలలో సువాసన నిచ్చు దినుసుగా ఉపయోగిస్తారు.ఆరోమాపతిలో ఉపయోగిస్తారు.సుగంధ నూనె/అత్తరుగా ఉపయోగిస్తారు.[5]

బయటి వీడియోల లింకులు[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]