మొగుడంపల్లి మండలం
మొగుడంపల్లి మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, మొగుడంపల్లి మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°36′59″N 77°29′51″E / 17.616353°N 77.497612°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | మొగుడంపల్లి |
గ్రామాలు | 16 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 151 km² (58.3 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 36,445 |
- పురుషులు | 18,513 |
- స్త్రీలు | 17,932 |
పిన్‌కోడ్ | 502221 |
మొగుడంపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా లోని మండలం.[1] మండల కేంద్రం, మొగుడంపల్లి. ఇది సమీప పట్టణమైన జహీరాబాద్ నుండి 12 కి. మీ. దూరంలో ఉంది. పునర్య్వస్థీకరణలో భాగంగా ఈ మండలం మెదక్ జిల్లా నుండి కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లాలో పశ్చిమాన కర్నాటక రాష్ట్రం సరిహడ్డులో ఉంది. జహీరాబాదు రెవెన్యూ డివిజను పరిధిలో భాగంగా ఉంటుంది.జహీరాబాదు శాసనసభ నియోజకవర్గం, జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గం లలో భాగంగా ఉంది చెందిన మండలం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం జహీరాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 151 చ.కి.మీ. కాగా, జనాభా 36,445. జనాభాలో పురుషులు 18,513 కాగా, స్త్రీల సంఖ్య 17,932. మండలంలో 7,005 గృహాలున్నాయి.[4]
మండల పరిషత్ అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు
[మార్చు]పునర్య్వవస్థీకరణ తరువాత కొత్త మండలానికి తొలిసారిగా అధ్యక్షురాలుగా ప్రియాంక (తెరాస), ఉపాధ్యక్షురాలుగా హసీనాబేగం ఎన్నికైయ్యారు.[5]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- మొగుడంపల్లి
- మద్గి
- అసద్‌గంజ్
- గొపన్‌పల్లి
- గొదెగర్పల్లి (పత్తి ధనసిరి)
- ఖన్ జమలపూర్
- ధనసిరి
- గుద్పల్లి
- ఔరంగనగర్
- గౌసబాద్
- ఇప్పెపల్లి
- మన్నాపూర్
- రాయిపల్లి (పట్టి ధనసిరి)
- పర్వతపూర్
- సర్జారావుపేట్
- మల్కాపూర్ (జది)
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ Eenadu. "మొగుడంపల్లి ఎంపీపీగా ప్రియాంక - EENADU". www.eenadu.net. Retrieved 2020-01-17.[permanent dead link]