మొఘల్ గార్డెన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాకిస్థాన్లోని లాహోర్లో ఉన్న షాలిమర్ గార్డెన్స్. మొఘల్  యుగపు గార్డెన్లలో సుప్రసిద్ధమైనది.

మొఘల్ గార్డెన్స్ అనేవి పెర్షియన్ శైలిలో మొఘలులు నిర్మించిన తోటలు. ఈ రకపు తోటలు పెర్షియా తోటల చార్ బాగ్ నిర్మాణంలో కట్టినవి.[1] ఈ గార్డెన్స్ చుట్టూ ప్రహారీ ఉంటుంది. సాధారణంగా ఈ గార్డెన్స్ లో సరస్సులు, ఫౌంటైన్లు, కాలువలు కూడా ఉండటం విశేషం.

చరిత్ర

[మార్చు]
తోట నిర్మాణాన్ని మొఘల్ చక్రవర్తి బాబర్ పర్యవేక్షిస్తున్నట్టు వేసిన బొమ్మ

మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ చార్ బాగ్ ను తనకు ఇష్టమైన తోటగా అభివర్ణించారు. తోటను బాగ్, బగీచా అని అంటారు పెర్షియన్లు. ప్రస్తుతం ఆగ్రాలో ఉన్న రామ్ బాగ్ మొట్టమొదటి చార్ బాగ్ అని కొందరి అభిప్రాయం. భారత్, పాకిస్థాన్బంగ్లాదేశ్ లలో ఎన్నో మొఘల్ గార్డెన్స్ ఉన్నాయి. ఈ తోటల ప్రస్థావన బాబర్హుమాయూన్అక్బర్ ల జీవిత చరిత్రలలోనూ ఉంది. అలాగే యూరప్ కు చెందిన పర్యాటకులు భారత్ గురించి రాసిన "ది ఎకౌంట్స్ ఆఫ్ ఇండియా" వంటి పుస్తకాల్లోనూ ఈ తోటల గురించి ఉంది. కాన్స్ టెన్స్ విల్లియర్స్-స్టార్ట్ రాసిన గార్డెన్స్ ఆఫ్ ది గ్రేట్ మొఘల్స్(1913) అనేది మొఘల్ గార్డెన్స్ పై వచ్చిన మొట్టమొదటి పరిశోధనా గ్రంధం. ఈ రచయిత భర్త బ్రిటన్ కు చెందిన భారత సైన్యంలో కల్నల్ గా పనిచేసేవారు. వారు పింజోర్ గార్డెన్స్ లో నివసించేటప్పుడు ఆ మొఘల్ గార్డెన్ బాగోగులు చూసుకునే అవకాశం ఆమెకు దక్కింది. ఆమె పుస్తకంలో ఒక గార్డెన్ ను ప్రభుత్వ భవనంగా మార్చక ముందు దాని శైలి ఎలా ఉందో వివరించారు. అదే ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్.[2] మొఘల్ గార్డెన్స్ పై ప్రస్తుత పరిశోధనా విషయాలు డంబర్టన్ ఓక్స్, స్మిత్ సనియన్ ఇన్స్టిట్యూషన్ ల ఆధ్వర్యంలో బయటకు వచ్చాయి. షాలిమర్ గార్డెన్స్(లాహోర్), ఢాకాలోని లాల్ బాగ్ కోట, శ్రీనగర్ లోని  షాలిమర్  గార్డెన్స్ వంటి పలు తోటలు మొఘల్ గార్డెన్స్ కావడం  విశేషం.

తాజ్ మహల్ వద్ద ఉన్న మొఘల్  గార్డెన్స్

మొఘల్ సామ్రాజ్య తొలినాళ్ళ నుంచే తోటల నిర్మాణం జరిగేది.[3]  మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ లాహోర్, ఢోలాపూర్ లలో గార్డెన్స్  ను నిర్మించారు. ఆయన కుమారుడు హుమాయూన్ కాలంలో  ఎక్కువగా  తోటల నిర్మాణాలు జరగలేదు. రాజ్యాన్ని విస్తరించడం,  నిలబెట్టుకోవడంలోనే ఎక్కువకాలం గడిచిపోయింది. అయితే తండ్రి నిర్మించిన తోటల్లో ఎక్కువ సమయం హుమాయూన్ గడిపివారని  చరిత్రకారుల నమ్మకం.[4] మొదట్లో అక్బర్ ఢిల్లీలో చాలా తోటల  నిర్మాణం చేశారు.[5] ఆ తరువాత అక్బర్ తన కొత్త రాజధాని అయిన ఆగ్రాలో కూడా తోటలు కట్టించారు.[6] ఈ కాలంలో నిర్మించిన తోటలు ఎక్కువగా కోటలలో కాక, నదుల ముందు ఉంటాయి. అక్బర్ కు  ముందు రాజులు కోటల్లో తోటలు నిర్మించినా, ఆయన నదుల ముందు నిర్మించడంతో అదే శైలి స్థిరపడిపోయింది. ఆ తరువాత అది మొఘల్ నిర్మాణ శైలిలోకి ఇమిడిపోయింది.

మూలాలు

[మార్చు]
  1. Penelope Hobhouse; Erica Hunningher; Jerry Harpur (2004).
  2. Villiers-Stuart, C. M. (1913).
  3. Jellicoe, Susan.
  4. Hussain, Mahmood; Rehman, Abdul; Wescoat, James L. Jr. The Mughal Garden: Interpretation, Conservation and Implications, Ferozsons Ltd., Lahore (1996). p 207
  5. Neeru Misra and Tanay Misra, Garden Tomb of Humayun: An Abode in Paradise, Aryan Books International, Delhi, 2003
  6. Koch, Ebba.