Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,14,261 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
ఆళ్వారులు

ఆళ్వారులు (తమిళం: ஆழ்வார்கள்) శ్రీవైష్ణవ సంప్రాదాయంలోనూ, తమిళ సాహిత్యంలోనూ విశిష్టమైన స్థానం కలిగిన విష్ణు భక్తులు. తమ పాశురాలతో విష్ణువును కీర్తించి దక్షిణాదిన భక్తి సంప్రదాయాన్ని పరిమళింపజేశారు. వీరు రచించి, పాడిన సుమారు నాలుగువేల పాశురాలన్నీ కలిపి దివ్య ప్రబంధం లేదా నాలాయిరం లేదా ద్రవిడ వేదం అని పిలుస్తారు. అళ్వారుల జీవితంలోనూ, రచనలలోనూ, వారిని గురించిన గాథలలోనూ ప్రముఖంగా కానవచ్చే అంశాలు భక్తి, పారవశ్యము, శరణాగతి. ఆళ్వారులు అందించిన సాంస్కృతిక వారసత్వం వలన వైదిక కర్మలతోనూ, సంస్కృతభాషా సాహిత్యాలతోనూ ప్రగాఢంగా పెన వేసుకొని పోయిన హిందూ మతాచారాలు దక్షిణాదిన కొంత స్వతంత్రతను సంతరించుకొన్నాయి. కుల వ్యవస్థను తోసిపుచ్చడం కూడా ఆళ్వారుల జీవితంలోనూ, శ్రీవైష్ణవ సిద్ధాంతాలలోనూ ముఖ్యమైన అంశాలు. ఆళ్వారుల ఔన్నత్యాన్ని గురించి ఎన్నో అలౌకికమైన ఘటనలు, మహత్తులు, నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ఆళ్వారులు అందరూ దైవాంశ సంభూతులనీ, సామాన్య జనానీకానికి భక్తిని ప్రబోధించి శ్రీమన్నారాయణుని పదపద్మాలను చేరుకొనే మార్గాన్ని ఉపదేశించిన మహనీయులనీ ప్రధానమైన విశ్వాసం. శైవభక్తుల చరిత్రనుగూర్చి పెరియ పురాణము అను గ్రంథం తెలియజేసినట్లు వైష్ణవాచార్యుల చరిత్రను గురించి గురుపరంపర అనుగ్రంథము తెలియజేస్తుంది. వాటిలో వీరిని గూర్చి అనేకమైన అద్భుత కథలు ఉన్నాయి.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... భారతదేశంలో రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా స్పీకరుగా ఎన్నికైంది షన్నో దేవి అనీ!
  • ... ఇంధన రంగంలో ప్రాచుర్యం పొందిన ఈక్వినార్ నార్వే దేశానికి చెందినదనీ!
  • ... కేరళ నుంచి వెలువడే గృహలక్ష్మి మలయాళ పత్రిక భారతదేశంలో ఐదవ అతిపెద్ద ప్రాంతీయ భాషా పత్రిక అనీ!
  • ... బెంగుళూరులోని బసవనగుడి ఆక్వాటిక్ సెంటర్ అనేకమంది అంతర్జాతీయ ఈతగాళ్ళు శిక్షణ పొందారనీ!
  • ... ప్రముఖ వ్యాపార విద్యాసంస్థ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ తొలుత కేవలం మగవారికి మాత్రమే ప్రవేశం కల్పించేదనీ!
చరిత్రలో ఈ రోజు
జూలై 9:
ఈ వారపు బొమ్మ
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.