మొదటి హరిహర రాయలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
విజయ నగర రాజులు
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు 1336-1356
మొదటి బుక్క రాయలు 1356-1377
రెండవ హరిహర రాయలు 1377-1404
విరూపాక్ష రాయలు 1404-1405
రెండవ బుక్క రాయలు 1405-1406
మొదటి దేవరాయలు 1406-1422
రామచంద్ర రాయలు 1422
వీర విజయ బుక్క రాయలు 1422-1424
రెండవ దేవ రాయలు 1424-1446
మల్లికార్జున రాయలు 1446-1465
రెండవ విరూపాక్ష రాయలు 1465-1485
ప్రౌఢరాయలు 1485
సాళువ వంశము
సాళువ నరసింహదేవ రాయలు 1485-1491
తిమ్మ భూపాలుడు 1491
రెండవ నరసింహ రాయలు 1491-1505
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు 1491-1503
వీరనరసింహ రాయలు 1503-1509
శ్రీ కృష్ణదేవ రాయలు 1509-1529
అచ్యుత దేవ రాయలు 1529-1542
సదాశివ రాయలు 1542-1570
ఆరవీటి వంశము
అళియ రామ రాయలు 1542-1565
తిరుమల దేవ రాయలు 1565-1572
శ్రీరంగ దేవ రాయలు 1572-1586
రామ రాజు
వేంకటపతి దేవ రాయలు 1586-1614
శ్రీరంగ రాయలు 1 1614-1614
రామదేవుడు 1617-1632
వేంకటపతి రాయలు 1632-1642
శ్రీరంగ రాయలు 2 1642-1646

హరిహర రాయలు విజయనగర సామ్రాజ్య స్థాపకుడు. ఇతనికి "హక్కరాయలు" మరియు "వీర హరిహరుడు" అనే పేర్లున్నాయి.

విజయనగర సామ్రాజ్య స్థాపన

హరిహర మరియు ఈతని తమ్ముడు బుక్క కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని వద్ద కోశాధికారులుగా ఉన్నారు. 1323వ సంవత్సరములో ఓరుగల్లు పతనము తరువాత ఈ గొల్ల సోదరులిద్దరూ కంపిలికి పోయి ఆనెగొంది సంస్థానములో చేరారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1326లో కంపిలిని జయించినపుడు వీరిద్దరూ బందీలుగా ఢిల్లీ తరలించబడ్డారు. దారిలో భయంకరమైన గాలి దుమారం వచ్చి సైనికులు, బందీలు చెల్లాచెదరయ్యారు. సోదరులిద్దరు మాత్రము పారిపోక ఒక చెట్టు కింద కూర్చొనివుండగా సుల్తాను గమనించి వారిని ప్రశ్నించగా వారిచ్చిన సమాధానానికి సంతసించి వారికి ఢిల్లీ దర్బారులో స్థానమిచ్చాడు. సోదరులిద్దరూ ఇస్లాం మతానికి మార్చబడ్డారు.

కంపిలిలో మాలిక్ నయీబు పట్ల వ్యతిరేకత పెల్లుబికి రాజ్యము చేజారిపోగా విప్లవాన్ని అణచివేయుటకు తుగ్లక్ హరిహర, బుక్క రాయలను పంపాడు. అన్నదమ్ములు కంపిలిని స్వాధీనపరచుకున్నారు. శ్రీ విద్యారణ్య స్వామి ప్రభావముతో తిరిగి హిందూ మతము స్వీకరించి సుల్తాను నెదిరించి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు.[1][2] [3].

ప్రాబల్యం

మొదటగా హరిహరరాయలు, బుక్కరాయలు తుంగభద్రానది లోయ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకొన్నారు. క్రమంగా కొంకణ తీరం, మలబారు తీరం వారి అధీనంలోకి వచ్చాయి. ఈ సమయంలో హొయసల రాజ్యం పతనమైంది. మధుర సుల్తానుతో యుద్ధంలో చివరి హొయసల రాజు వీరభల్లాలుడు మరణించాడు. ఇలా ఏర్పడిన పాలనాశూన్యత హరిహరరాయలుకు రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి బాగా పనికివచ్చింది. హొయసల రాజ్యం మొత్తం వారికి వశమయ్యింది. 1346 కాలానికి చెందిన శృంగేరి శాసనంలో ’హరిహరుడు రెండు సముద్రాల మధ్యభాగానికి రాజు’ అని, అతని రాజధాని విద్యానగరమని చెప్పబడింది.

హరిహరుడు సుస్థిరమైన పాలనా వ్యవస్థను ఏర్పరచాడు. ఇందువల్ల రాజ్యం సుస్థిరమయ్యింది. ఇతని తరువాత ఇతని తమ్ముడు మొదటి బుక్క రాయలు రాజ్యానికి పాలకుడయ్యాడు. సంగమవంశంలో బుక్కరాయలు అందరికంటే ముఖ్యునిగా పరిగణించబడ్డాడు.

మూలాలు

ఈయన గురించి అటకల గుండు శాసనం తెలియజేస్తుంది.


విజయనగర రాజులు విజయ నగర రాజులు
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము


ఇంతకు ముందు ఉన్నవారు:
మూడవ వీర బల్లాల
విజయనగర సామ్రాజ్యము
1336 — 1356
తరువాత వచ్చినవారు:
మొదటి బుక్క రాయలు