మొనాకో

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నినాదము: "Deo Juvante" (Latin)
"With God's Help"
గీతం: Hymne Monégasque
English: Monégasque Anthem
Location of  మొనాకో  (green)on the European continent  (dark grey)  —  [Legend]
Location of  మొనాకో  (green)

on the European continent  (dark grey)  —  [Legend]

రాజధాని Monaco[a][1][2]
43°43′N 7°25′E / 43.717°N 7.417°E / 43.717; 7.417
అతిపెద్ద Quartier Monte Carlo
అధికార భాషలు French[3]
Common languages
జాతి సమూహాలు
ప్రజానామము
  • Monégasque
  • Monacan[c]
ప్రభుత్వం Unitary parliamentary constitutional principality
 -  Monarch Albert II
 -  Minister of State Michel Roger
 -  President of the National Council Laurent Nouvion (REM)
శాసనసభ National Council
Independence
 -  House of Grimaldi 1297 
 -  Franco-Monegasque Treaty 1861 
 -  Constitution 1911 
ప్రాంతం
 -  Total 2.02 km2 (248th)
0.78 sq mi 
 -  Water (%) negligible[4]
జనాభా
 -  2011 estimate 36,371[5] (217th)
 -  2008 census 35,352[4]
 -  Density 18,005/km2 (1st)
49/sq mi
GDP (PPP) 2010[b] estimate
 -  Total $4.694 billion[6][7] (156th)
 -  Per capita $132,571[6][7] (1st)
GDP (nominal) 2010[b] estimate
 -  Total $5.424 billion[6] (148th)
 -  Per capita $153,177[6] (1st)
ద్రవ్యం Euro () (EUR)
Time zone CET (UTC+1)
 -  Summer (DST) CEST (UTC+2)
Drives on the right[8]
Calling code +377
Internet TLD .mc
a. ^  Monaco is a city-state. However, government offices are located in the Quartier of Monaco-Ville.
b. ^  GDP per capita calculations include non-resident workers from France and Italy.
c. ^  Monacan is the term for residents.

యూరప్‌లో పర్యాటకులని ఆకర్షించే ఓ చిన్న దేశం ఇది. ప్రపంచంలోని రెండో చిన్నదేశం వాటికన్ సిటీ. మొదటిది అయిన మొనాకో ప్రపంచంలో అధిక జనసాంద్రత గల దేశం. ఫ్రాన్స్, ఇటలీల మధ్యగల మొనాకో విస్తీర్ణం రెండు చదరపు కిలోమీటర్లే! జనాభా 35,986. ప్రపంచంలో అధిక కాలం జీవించేది కూడా మొనాకో దేశస్థులే - తొంభై ఏళ్లు! నిరుద్యోగం జీరో పర్సంట్! ఫ్రాన్స్, ఇటలీల నించి ప్రతిరోజూ ఈ దేశంలోకి నలభై వేల మంది ఉద్యోగులు వచ్చి పనిచేసి వెళ్తూంటారు. మెడిటరేనియన్ సీ తీరాన గల మొనాకోకి పాయింట్ సెవెన్ కిలోమీటర్ల విస్తీర్ణం మేర సముద్రాన్ని పూడ్చి భూభాగాన్ని పెంచారు.

కేసినోలు[మార్చు]

మొనాకోలో 1297 నించి రాజ్యాంగబద్ధమైన రాజరికం కొనసాగుతోంది. ప్రిన్స్ ఆల్బర్ట్-2 నేటి రాజు. దీని రక్షణ బాధ్యత ఫ్రాన్స్ దేశానిది. ఇక్కడి మోంటీ కార్లో నగరం పర్యాటకులని అధికంగా ఆకర్షిస్తుంది. అందుకు కారణం అక్కడ గల జూదగృహాలు. లీగ్రాండ్ కేసినో ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. అందులో సినిమా థియేటర్, బాలే థియేటర్ మొదలైన వినోదాలు ఉన్నాయి. రాజ కుటుంబం భాగస్వాములుగా ఓ పబ్లిక్ కంపెనీ దీన్ని నిర్వహిస్తోంది. మోంటీ కార్లోలోనే కాక మొనాకో అంతటా నైట్ క్లబ్స్ విస్తారంగా ఉంటాయి. రౌలెట్, స్టడ్‌పోకర్, బ్లాక్‌జాక్, క్రాప్స్, బకారట్ లాంటి జూదాలు, స్లాట్ మెషీన్స్ అన్ని కేసినోలలో ఉంటాయి. తమాషా ఏమిటంటే మొనాకన్స్ - అంటే మొనాకో దేశస్థులకి మాత్రం వీటిలోకి ప్రవేశం లేదు. ప్రతీ కేసినో బయట సందర్శకుల పాస్‌పోర్ట్‌లని తనిఖీ చేసే లోపలికి పంపుతారు. ఈ దేశపు ప్రధాన ఆదాయం కేసినోల నించే వస్తోంది. 1873లో జోసెఫ్ డేగర్ అనే అతను కేసినోలోని రౌలెట్ వీల్స్ తిరిగే పద్ధతిని జాగ్రత్తగా గమనించి మోంటీ కార్లో బేంక్‌ల్లోని డబ్బుకన్నా ఎక్కువ జూదంలో సంపాదించాడు. దీన్ని ‘బ్రేకింగ్ ది బేంక్ ఎట్ మోంటీ కార్లో’గా పిలుస్తారు.

ఇతర ఆకర్షణలు[మార్చు]

1866లో మోంటీకార్లోకి ఆ పేరు ఇటాలియన్ భాష నించి వచ్చింది. దాని అర్థం వౌంట్ ఛార్లెస్. ఛార్లెస్-3 గౌరవార్థం ఈ పేరు ఆ నగరానికి పెట్టబడింది. ఇక్కడి మరో ఆకర్షణ ఫార్ములా ఒన్ గ్రాండ్ ప్రిక్స్ పోటీ. సింగిల్ సీటర్ ఆటో రేసింగ్‌ని గ్రాండ్స్ పిక్స్ పేరుతో ఇక్కడ నిర్వహిస్తున్నారు. గంటకి 360 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఎఫ్ ఒన్ (్ఫర్ములా ఒన్) కార్లు ఈ రేసుల్లో పాల్గొంటాయి. ప్రపంచం నలుమూలల నించి రేసర్లు వచ్చి ఈ పోటీల్లో పాల్గొంటారు. 1879లో ఆరంభించిన శాలీగార్నియర్ లేదా ఒపేరా డి మాంటీ కార్లో అనేక నాటక శాలలో ఒపేరాలు జరుగుతూంటాయి. ముందే వీటికి టిక్కెట్ బుక్ చేసుకోవాలి. 1864లో నిర్మించబడ్డ హోటల్ డి పేరిస్, మోంటీ కార్లో నడిబొడ్డున ఉంది. 106 గదులు గల ఈ హోటల్‌లో వివిధ దేశాల ప్రముఖులు బస చేసారు. దీన్ని కూడా పర్యాటకులు ఆసక్తిగా చూస్తారు.

పర్యటక సమయము[మార్చు]

హాలీవుడ్ నటి గ్రేస్‌కెల్లీ, ప్రిన్స్ రెయినియర్‌ని వివాహం చేసుకుని ఇక్కడే నివసించింది. ఆమె కొడుకే నేటి రాజు ఆల్బర్ట్-2. హాలీవుడ్ హీరోయిన్స్‌లో మహారాణి అయింది ఈమె మాత్రమే. 1954లో ఇక్కడ ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ ‘కు టేచ్ ఏ థీఫ్’ అనే చిత్రాన్ని ఇక్కడ చిత్రీకరించాడు. ఇంకా మ్యూజియం ఆఫ్ ఏంటిక్ ఆటోమొబైల్స్ (ఇందులో ప్రిన్స్ రెయినియర్ 85 వింటేజ్ కార్లని కూడా చూడచ్చు) ప్రినె్సస్ గ్రేస్ రోజీ గార్డెన్, స్టాంప్స్ అండ్ మనీ మ్యూజియం, లూయిస్-2 స్టేడియం, మ్యూజియం ఆఫ్ ప్రీ హిస్టారిక్ ఏంత్రోపాలజీ, ఓషనోగ్రాఫిక్ మ్యూజియం, మ్యూజియం ఆఫ్ నెపోలనిక్ సావెనీర్స్ ఇక్కడ చూడదగ్గవి. మే నించి అక్టోబరు దాకా టూరిస్ట్ సీజన్. ఇటలీ, ఫ్రాన్స్ దేశాల నించి రోడ్డు మార్గంలో అరగంటలో ఇక్కడికి చేరుకోవచ్చు. యూరప్‌లోని అన్ని ముఖ్య నగరాల నించి ఇక్కడికి విమాన సర్వీసులున్నాయి.

మూలాలు[మార్చు]

  1. "United-Nations data, country profile". Retrieved 29 October 2013. 
  2. "Constitution of Monaco (art. 78): The territory of the Principality forms a single commune.". Retrieved 29 October 2013. 
  3. "Constitution de la Principauté". Council of Government. Archived from the original on 22 July 2011. Retrieved 22 May 2008. 
  4. 4.0 4.1 Monaco en Chiffres at the Wayback Machine (archived నవంబర్ 15, 2009), Principauté de Monaco. Retrieved 7 June 2010.
  5. "Population et emploi / IMSEE — Monaco IMSEE" (in ఫ్రెంచ్). Imsee.mc. Retrieved 6 September 2012. 
  6. 6.0 6.1 6.2 6.3 "National Accounts Main Aggregates Database". United Nations Statistics Division. Retrieved 8 October 2012. 
  7. 7.0 7.1 "World Development Indicators". World Bank. Retrieved 8 October 2012.  Note: "PPP conversion factor, GDP (LCU per international $)" for France (0.8724) was used.
  8. "What side of the road do people drive on?". Whatsideoftheroad.com. Retrieved 28 May 2012. 
"https://te.wikipedia.org/w/index.php?title=మొనాకో&oldid=2125241" నుండి వెలికితీశారు