మొబైల్ కామర్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

M-కామర్స్ లేదా m-కామర్స్ గా కూడా పిలువబడే మొబైల్ కామర్స్ మొబైల్ ఫోన్, PDA (పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్), స్మార్ట్ ఫోన్, లేదా ప్రస్తుతము ఆవిర్భవిస్తున్న డాష్టాప్ మొబైల్ ఉపకరణాల లాంటి మొబైల్ పరికరాలు మొదలైన మొబైల్ సాధనాలతో వ్యాపారాన్ని నిర్వహించడం. మొబైల్ కామర్స్ ఈ విధంగా విశదీకరించబడింది:

"ఒక ఎలెక్ట్రానిక్ పరికర సహాయంతో కంప్యూటర్ మీడియేటెడ్ నెట్వర్క్ లతో మొబైల్ అనుసంధానం ద్వారా వస్తువులను మరియు సేవలను వినియోగించుకునే యాజమాన్యాన్ని లేదా హక్కులను బదిలీ చేయడాన్ని మొబైల్ కామర్స్ అంటారు."[1]

చరిత్ర[మార్చు]

మొబైల్ కామర్స్ 1997లో మొదలయ్యింది. మొదటిసారిగా మొబైల్ ఫోన్ ఆధారిత కోక కోలా విక్రయ యంత్రాలను రెండిటిని ఫిన్‌ల్యాండ్ లోని హెల్సింకిలో ఏర్పాటు చేసారు. ఈ యంత్రాలు చెల్లింపులను SMS సందేశాల ద్వారా స్వీకరించేవి. మొదటి మొబైల్-ఆధారిత బ్యాంకింగ్ సేవ ఫిన్‌ల్యాండ్ లోని మెరిటా బ్యాంకులో 1997లో ప్రవేశపెట్టారు. ఇది కూడా SMS ఉపయోగించి పనిచేసేది.

1998లో డిజిటల్ విషయాలను డౌన్లోడ్స్ రూపంలో మొబైల్ ఫోన్లకు అమ్మడము మొదలయ్యింది. ఈ ప్రక్రియ వాణిజ్యపరమైన, డౌన్లోడ్ చేయదగ్గ రింగ్‌టోన్ లు రేడియోలింజా (ఇప్పుడు ఎలిసా ఒయ్జ్ లో ఒక భాగము) ఫిన్‌ల్యాండ్ లో ప్రవేశపెట్టడంతో మొదలయ్యింది.

1999లో జాతీయ స్థాయిలో మొబైల్ కామర్స్ కొరకు వాణిజ్యపరమైన రెండు ముఖ్యమైన వేదికలు ప్రవేశపెట్టబడ్డాయి. అవి ఫిలిప్పీన్స్‌లో స్మార్ట్ మని (http://smart.com.ph/money/) మరియు జపాన్‌లో NTT డోకోమో యొక్క ఐ-మోడ్ అంతర్జాల సేవ. ఐ-మోడ్ ఒక విప్లవాత్మక ఆదాయ పంపిణీ వ్యవస్థ అందించింది. దీని ప్రకారము NTT డోకోమో వినియోగదారులు విషయాల కోసం చెల్లించిన రుసుములో 9% ఉంచుకొని మిగతా 91% విషయ యజమానికి ఇచ్చింది.

మొబైల్-కామర్స్-సంబంధిత సేవలు 2000 మొదలులో విస్తృతంగా వ్యాపించాయి. నార్వే మొబైల్ పార్కింగ్ చెల్లింపులు మొదలు పెట్టింది. ఆస్ట్రియా రైలు టిక్కెట్లు మొబైల్ సాధనాల ద్వారా అమ్మడం మొదలు పెట్టింది. జపాన్ విమాన టిక్కెట్ల మొబైల్ కొనుగోళ్ళు ప్రవేశపెట్టింది.

2001 జూలైలో లండన్‌లో మొదటి మొబైల్ కామర్స్ గోష్ఠి ఏర్పాటు చేయబడింది.

2002లో టామీ ఆహోనెన్ యొక్క M-ప్రాఫిట్స్ అనే పుస్తకము మొబైల్ కామర్స్ గురించి రచించబడిన తొలి పుస్తకము.

యూనివర్సిటి ఆఫ్ ఆక్స్ఫర్డ్ లో 2003లో మొబైల్ కామర్స్ గురించిన ఒక తక్కువ నిడివిగల కోర్స్ ను ప్రవేశపెట్టింది. దీనికి టామీ ఆహోనెన్ మరియు స్టీవ్ జోన్స్ ఉపన్యాసకులుగా వ్యవహరించారు. 2008లో UCL కంప్యూటర్ సైన్స్ మరియు పీటర్ జే.బెంట్లే సంయుక్తంగా మొబైల్ సాధనాలతో మెడికల్ ప్రయోగాల యొక్క సాధ్యాసాధ్యాల గురించి నిరూపించారు.[2]

PDAలు మరియు సెల్యులార్ ఫోన్లు చాలా ప్రాచుర్యంలోనికి వచ్చాయి. ఎన్నో వ్యాపారాలు[specify] మొబైల్ కామర్స్ ఉపయోగించి తమ వినియోగదారులకు మెరుగైన రీతిలో చేరువ కాగలుగుతున్నాయి.

మొబైల్ కామర్స్ విపణి యొక్క సామర్థ్యతను ఎక్కువగా వాడుకునే ఉద్దేశంతో నోకియా, ఎరిక్సన్, మోటరోల మరియు క్వాల్‌కాం లాంటి మొబైల్ ఫోన్ తయారీదారులు AT&T వైర్లెస్ మరియు స్ప్రింట్ లాంటి వాహకాలతో కలిసి WAP-సహిత స్మార్ట్ ఫోన్ల తయారీలో నిమగ్నమయ్యారు. స్మార్ట్ ఫోన్లు ఫాక్స్, ఈ-మెయిల్ మరియు ఫోన్ సదుపాయాలను అందిస్తాయి.

బర్షేట్ చెప్పిన ప్రకారము మొబైల్ పరికర అమ్మకందారులు మరియు వాహకాల లాభాల సామర్థ్యము ఆకర్షణీయమైనటువంటి అప్లికేషన్ల సహితమైన అత్యుత్తమ మొబైల్ పరికరాల పై ఆధారపడి ఉంటుంది.[ఎవరు?] పరికరాల అమ్మకందారుల యొక్క దృష్టి యువత విపణి పై కేంద్రీకృతమై ఉంటుంది. తక్కువ ధరకు ఎక్కువ మొబైల్ విషయాలు మరియు అప్లికేషన్లు అందించడం ద్వారా ఈ విపణి పై వారు పట్టు సాధించగలరు.

ఐఫోన్ ప్రవేశంతో మొబైల్ కామర్స్ SMS వ్యవస్థ నుండి అసలైన అప్లికేషన్లకు మారింది. విస్తృతంగా వాడుకలో ఉండి మరియు ఆచరిచదగినదైనప్పటికి SMS భద్రతా కారణాల దృష్ట్యా హాని కలిగిస్తుంది మరియు నిడివి సంబధమైన సమస్యలు కలిగినది. దీనికి తోడు, మొబైల్ ఫోన్ పరికరాల సామర్థ్య పెంపు ద్వారా మొబైల్ పరికరాల పై రిసోర్స్ బాధ్యతలను పెట్టడం వివేకముతో కూడిన చర్య.

లభించు ఉత్త్పత్తులు మరియు సేవలు[మార్చు]

మొబైల్ టికెటింగ్[మార్చు]

మూస:Main:Mobile ticketing వివిధ రకాల సాంకేతికతలను ఉపయోగించి టికెట్లను మొబైల్ ఫోన్లకు చేరవేయవచ్చు. వినియోగదారులు సంఘటనాస్థలి వద్ద తమ మొబైల్ ఫోన్లను చూపించి వారి టికెట్లను వెంటనే ఉపయోగించుకోవచ్చు.

సులువైన అప్లికేషన్ల డౌన్లోడ్ ద్వారా మొబైల్ పరికరం పై టికెట్ల కొనుగోలు మరియు రద్దు చేసుకోవచ్చు. లేకపోతే వివిధ ట్రావెల్ ఏజెంట్లను నేరుగా సేవలందించే వారి WAP పోర్టల్స్ ను మొబైల్ పరికరాల ద్వారా చేరుకొని ఈ కార్యకలాపాలను నిర్వహించవచ్చు.

మొబైల్ వోచర్లు, కూపన్లు మరియు లాయల్టీ కార్డులు[మార్చు]

మొబైల్ టికెటింగ్ సాంకేతికత వోచర్లు, కూపన్లు మరియు లాయల్టీ కార్డుల పంపిణీ కొరకు కూడా ఉపయోగించవచ్చు. మొబైల్ ఫోన్ కు పంపబడిన వర్చువల్ టోకెన్ ద్వారా ఈ వస్తువులు ధ్రువీకరించబడతాయి. వినియోగదారుడు ఈ టోకెన్లలో ఏ ఒక దానినైనా అమ్మకపు స్థలము వద్ద చూపించినచో అతను సంప్రదాయ పద్ధతిలోని టోకెన్ పై లభించు లాభాలన్నీ పొందవచ్చు. ప్రదేశ-ఆధారిత సేవలను ఉపయోగించి వ్యాపారస్తులు తమ వినియోగదారులకు కూపన్లను పంపవచ్చు. దీని ద్వారా తమ వినియోగదారులు పక్కనే ఉన్నారా అని తెలుసుకోవచ్చు.

విషయ కొనుగోలు మరియు అప్పగింత[మార్చు]

ప్రస్తుతము, మొబైల్ విషయాల కొనుగోలు మరియు అప్పగింత ముఖ్యంగా మ్మొబైల్ ఫోన్లకు సంబంధించిన రింగ్టోన్లు, వాల్పేపర్లు, మరియు ఆటల పై కేంద్రీక్రుతమైనది. మొబైల్ ఫోన్లు, పోర్టబుల్ ఆడియో ప్లేయర్లు మరియు వీడియో ప్లేయర్లు ఒకే పరికరంగా కూడడంతో, పూర్తి నిడివి గల సంగీత మరియు వీడియో ట్రాకుల అమ్మకాలు పెరుగుతున్నాయి. 4G నెట్వర్క్ యొక్క డౌన్లోడ్ స్పీడు కారణంగా సినిమాలను మొబైల్ పరికరాల పై కొన్ని క్షణాలలోనే కొనుగోలు చేయడం సాధ్యపడుతుంది.

ప్రదేశ-ఆధారిత సేవలు[మార్చు]

మొబైల్ కామర్స్ లావాదేవీలలో మొబైల్ ఫోన్ వినియోగదారుని ప్రదేశం ముఖ్యమైన విషయం. వినియోగదారుని ప్రదేశం తెలుసుకోవడం ద్వారా ఈ కింద పేర్కొనబడిన ప్రదేశ-ఆధారిత సేవలు సాధ్యమవుతాయి.

 • స్థానిక తగ్గింపు ఆఫర్లు
 • స్థానిక వాతావరణం
 • ప్రజల యొక్క నియంత్రణ మారియు జాడ తెలుసుకొనుట

సమాచార సేవలు[మార్చు]

PCల మాదిరిగానే మొబైల్ ఫోన్లకు కూడా విభిన్న రకాల సమాచార సేవలు అందిచవచ్చు. వాటిల్లో కొన్ని:

 • వార్తలు
 • స్టాక్ కోట్ వివరాలు
 • క్రీడా స్కోరు వివరాలు
 • ఆర్థిక పద్దుల పట్టీ
 • ట్రాఫిక్ రిపోర్టింగ్

వినియోగదారుని యాత్ర ప్రకారం తగినటువంటి ట్రాఫిక్ సంబందిత వివరాలు మొబైల్ పరికరానికి పంపవచ్చు. సాధారణమైన ట్రాఫిక్ రిపోర్ట్ ప్రసారము కంటే కస్టమైజ్డ్ సమాచారం చాలా ఉపయోగకరమైనది. బ్యాండ్‌విడ్త్ ఆవశ్యకత కారణంగా, అత్యాధునికమైన మొబైల్ పరికరాల తయారీ ముందు కస్టమైజ్డ్ సమాచారం అసాధ్యమైయ్యింది.

మొబైల్ బ్యాంకింగ్[మార్చు]

బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలు మొబైల్ కామర్స్ వాడకం ద్వారా తమ వినియోగదారులకు ఖాతా యొక్క సమాచారము తెలుసుకొని స్టాక్ కొనుగోళ్ళు, పైకము పంపుట వంటి వ్యవాహారాలన్ని చూసుకొను వీలును కలిగిస్తున్నాయి. ఈ తరహా సేవలను మొబైల్ బ్యాంకింగ్ లేదా M-బ్యాంకింగ్ అంటారు. శరవేగంతో పురోగమిస్తున్న భారత బ్యాంకింగ్ రంగం - ఖాతాదారులకోసం మొబైల్ బ్యాంకింగ్ అనే కొత్త సేవలను ప్రవేశపెట్టింది. ఈ సేవల సహాయంతో ఖాతాదారులు బ్యాంకుకు వెళ్ళకుండానే కేవలం ఎస్ ఎమ్ ఎస్ అధారిత ప్రశ్నలు మరియు మెలుకువలు (ఎలర్ట్స్) ద్వారా తమ ఖాతాను, అందులోని లావాదేవీల గురించి తెలుసుకోవచ్చును . ఈ సేవలను కొన్ని బ్యాంకులు ఉచితంగా అందిస్తుండగా, మిగిలిన బ్యాంకులు ఖాతాదారులనుంచి సంవత్సరానికి కొంత మెత్తం ఫీసుగా వసూలు చేస్తున్నాయి. ఈ సేవలను పొందడానికి సెల్ ఫో్న్ నుంచి బ్యాంకుకు ఎస్.ఎమ్.ఎస్ పంపించడానికి అయ్యే ఛార్జిని మాత్రం ఖాతాదారే భరించాల్సిఉంటుంది.

కొన్ని బ్యాంకులైతే సెల్ ఫోన్ల ద్వారా ఖాతాదారులకు ప్రత్యేకమైన వ్యక్తిగత బ్యాంకింగ్ సేవలనుba కూడా అందిస్తున్నాయి. అయితే దీనికి గానూ ఆ బ్యాంకులు ఆ ఖాతాదారుల సెల్ ఫోన్ లలో ఒక ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ అమర్చవలసి ఉంది. ఇది జి పి ఆర్ ఎస్ వాడుకలో ఉన్న మొబైల్ హాండ్ సెట్స్ లో మటుకే వీలవుతుంది. ఈ ప్రక్రియ చాలా సులభమైనది, ఖాతాదారులు దీనిని సులువుగా వాడుకోవచ్చు.

మొబైల్ స్టోర్ ఫ్రంట్[మార్చు]

Error: no page names specified (help). మొబైల్ ఫోన్ ను టచ్ సెన్సిటివ్ చేతిలో ఇమిడే కంప్యూటర్లుగా (స్మార్ట్ ఫోన్లుగా) ఆపిల్ పునసృష్టి చేసింది. దీని వలన మొదటి సారిగా సంచార యుక్త ఈ-కామర్స్, మొబైల్ కామర్స్ సాధ్యపడ్డాయి. ABI పరిశోధన ప్రకారము మొబైల్ పరికరం ఈ-కామర్స్ విపణిలో మరింత పెద్దదిగా అవతరించనుంది. ఈ పరిశోధనా సంస్థ అంచనా ప్రకారం 2015లో $119bn విలువ గల వస్తువులు మరియు సేవల కొనుగోలు మొబైల్ ఫోన్ల ద్వారా జరుగనున్నాయి.

మొబైల్ మధ్యవర్తిత్వము[మార్చు]

మొబైల్ పరికరాల ద్వారా అందించబడుతున్న స్టాక్ విపణి సేవలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఇది మొబైల్ మధ్యవర్తిత్వముగా పేరుగాంచింది. చందాదారుడిని, వారున్న ప్రదేశంతో సంబంధం లేకుండా, విపణి యొక్క మార్పులకు సమయానుసారంగా స్పందించవచ్చు.

వేలములు[మార్చు]

గత మూడు సంవత్సరాలుగా[ఎప్పుడు?] మొబైల్ రివర్స్ వేలం యొక్క పరిష్కారాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.[by whom?] సాంప్రదాయమైన వేలముగా కాకుండా, ది రివర్స్ వేలంలో (లేదా తక్కువ బిడ్ వేలం) వినియోగదారుడు ఫోన్ ద్వారా బిడ్ వేసిన ప్రతిసారి రుసుము చెల్లించవలసి ఉంటుంది. ఎక్కువ శాతం మొబైల్ SMS కామర్స్ సొల్యూషన్లు ఏక-కాల కొనుగోలు లేక ఏక-కాల చందా పై ఆధారపడి ఉంటాయి. అయినప్పటికీ, వినియోగదారుడు చాలా కాలం వరకు ఎక్కువ లావాదేవీలు చేస్తారు కనుక రివర్స్ ఆక్షన్లు మొబైల్ అమ్మకందారునికి ఎక్కువ మొత్తాన్ని అందిస్తాయి.

మొబైల్ బ్రౌజింగ్[మార్చు]

మొబైల్ బ్రౌజర్ ఉపయోగించుట అంటే తమ మొబైల్ పరికరం పై వరల్డ్ వైడ్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించడం. దీని ద్వారా వినియోగదారులు ఆన్లైన్ కొనుగోలును వ్యక్తిగత కంప్యుటర్ వద్ద లేకపోయినా నిర్వహించగలరు.

మొబైల్ కొనుగోలు[మార్చు]

క్యాటలాగ్ వ్యాపారులు వినియోగదారుల నుండి ఆర్డర్లను వినియోగదారుని మొబైల్ పరికరం ద్వారా నేరుగా అందుకోగలరు. కొన్ని సందర్భాలలో, వ్యాపారులు సూచిపత్రాన్ని ఎలక్ట్రానిక్ పద్ధతులలోనే పంపవచ్చు. కాగితపు సూచిపత్రాన్ని తంతి ద్వారా పంపే బదులు ఈ విధానాన్ని ఉపయోగించవచ్చు. కొంతమంది వ్యాపారులు, మొబైల్ పరికరం యొక్క చిన్న వైశాల్యానికి అనువైన మొబైల్ వెబ్ సైట్లను అందించవచ్చు.

మొబైల్ మార్కెటింగ్ మరియు అడ్వర్టైజింగ్[మార్చు]

మొబైల్ కామర్స్ సందర్భంలో, మొబైల్ మార్కెటింగ్ అంటే మొబైల్ పరికరాలకు పంపబడిన మార్కెటింగ్. సంప్రదాయ ప్రచారాల కంటే మొబైల్ మార్కెటింగ్ ప్రచారాల నుంచే ఎక్కువగా స్పందన ఉందని కంపెనీలు చెబుతున్నాయి.[3][unreliable source?]

యువత విపణి పై ప్రభావం[మార్చు]

మొబైల్ మీడియా త్వరితగతిని మారుతున్న రంగము. వైమాక్స్ వంటి కొత్త సాంకేతికతలు మొబైల్ కామర్స్ లో వినూత్న మార్పులు తెచ్చుటకు దోహదపడుతున్నాయి. మొబైల్ ప్రచారంలో మొదటి తరం దిగ్గజాలుగా వోడాఫోన్, ఆరెంజ్, మరియు SK టెలికాం పేరుపొందాయి.

సౌత్ కొరియాలో మొబైల్ పరికరాలను మొబైల్ కామర్స్ నిర్వహించుటకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అంతకు ముందు తరానికి చెందిన సౌత్ కొరియన్లతో వారి అనుభవాల దృష్ట్యా, సౌత్ కొరియా లోని మొబైల్ ఫోన్ కంపెనీలు, మొబైల్ ఫోన్ టెక్నాలజీ యువత జీవన సరళికి మారు పేరుగా మారుతుందని నమ్మాయి. గిర్బాన్ బర్షేట్ చెప్పిన ప్రకారము మొబైల్ పరికర అమ్మకందారులు మరియు వాహకాల లాభాల సామర్థ్యము ఆకర్షణీయమైనటువంటి అప్లికేషన్ల సహితమైన అత్యుత్తమ మొబైల్ పరికరాల పై ఆధారపడి ఉంటుంది.[ఉల్లేఖన అవసరం]

మెమేటిక్ పరిశోధన[మార్చు]

లెవియస్ రోలాండో, జాన్ సోకోల్ మరియు గిబ్రన్ బుర్షేట్ లు మెమేటిక్ పరిశోధకులలో మొబైల్ ప్రచారానికి సంబంధించిన సేవలందించిన దిగ్గజాలు. 1999లో DVB-H తో సోనీ BMG రికార్డింగ్ కళాకారుడైన వూ-టాంగ్ క్లాన్ తో పరిశోధనలు చేశారు.

2007లో సౌత్ కొరియా యాత్రలో, రొలాండో ఆవిర్భవిస్తున్న యువత జీవనశైలి యొక్క ధోరణిని ఒక వెన్ డయగ్రాంగా తయారుచేశాడు. ఈ డయగ్రాం, మొబైల్ వాడుక మరియు ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ ఉత్పత్తుల మరియు సేవల యొక్క అమ్మకాలను వివరించింది. రోలాండో మరియు అతని సహచర్యులు చేసిన ఒక పరిశోధనలో మొబైల్ వాణిజ్య ప్రచారకాల (లేదా మోబిసోడ్ ల) రూపంలో వైరల్ ప్రచారం ప్రేక్షకులను ఆకర్షించి మరియు నిలుపుకొనుటకు ఉపయోగపడింది. ఆ ఇద్దరూ రాపిడ్ మెమేటిక్ డిస్సెమినేషన్ సూత్రాన్ని పరీక్షించారు. వీరు యువత యొక్క సాంస్కృతిక శైలినీ మరియు ధోరణులను అధ్యయనం చేశారు. యువత మధ్య పరీక్ష చేయబడ్డ విషయాలు ఎంత త్వరితంగా ఒకరి నుంచి ఒకరికి చేరవేయబడుతున్నాయో పరీక్షించారు. తరచూ జరిగే సంభాషణలలో వాడమని యువతలో ఒక గుంపుకు కొన్ని నిర్దిష్టమైన పదాలు మరియు వాక్యాలను ఇచ్చారు. మూల గుంపుకు ఇటువంటివేమీ ఇవ్వలేదు. ఈ పరిశోధన వల్ల ఆలోచనలు మరియు వాక్యాలు ఎంత త్వరితంగా చేరవేయబడుతున్నాయో లెక్కించగలిగారు.

మొబైల్ పరికరాలకు ఉత్పత్తులు మరియు కూపన్ల సహాయంతో తక్షణ పొదుపును అందిస్తున్న వైరల్ మొబైల్ డైరెక్ట్ మార్కెటింగ్ శిబిరాల గురించి రోలాండో ఐరోపా, సౌత్ కొరియా మరియు జపాన్ వంటి దేశాలలో పరిశోధనలు సాగించారు. ఈ పరిశోధనలు ద్యుయెట్షె టెలికాం (T-మొబైల్ యొక్క ఆపరేటర్) మరియు ఆరెంజ్ వంటి ఉన్నత మొబైల్ ప్రోవైడర్ల సూచనల పై జరగబడింది. ఈ ప్రయోగాలలో డిస్క్ జాకీలు మరియు మొబైల్ యువత వీధి జట్టులను ఉపయోగించి వేడుక-టికెట్ల అమ్మకాలు మరియు మూడు రకాలైన యువతకు సంబంధించిన ఉత్పత్తుల అమ్మకాలు ఎనిమిది రోజులలో 200,000 వినియోగదారులకు చేయబడ్డాయి. ప్రపంచ యువత మొబైల్ మార్కెట్ స్వతంత్రంగా స్పందించి కొత్త ఒరవడులను సృష్టించగలదని నిరూపించింది. దీనితో ఉత్పత్తులు యువత యొక్క ఆలోచనల విధానం వల్ల కొత్త జీవాన్ని ఎలా పోసుకున్తాయో తెలిసింది. యువత కొత్త రకమైన సామాజిక సాంకేతిక సేవలను అందరికంటే ముందుగానే ఉపయోగించడానికి ముందుకువచ్చే స్వభావం కలిగి ఉండడం వల్ల ఇది సాధ్యపడింది.

ఈ పరిశోధకులు, మరికొంతమందితో కలిసి, కొన్ని పద్ధతులను తయారుచేశారు. వీటిని ప్రపంచ వ్యాప్తంగా 2008లో యువత సంస్కృతికి సంబంధించిన సంఘటనలు మరియు వేడుకల ద్వారా అన్వయించారు. ఈ కార్యక్రమం ప్రఖ్యాత మొబైల్ సాఫ్ట్వేర్ మరియు నెట్వర్క్ ప్రొవైడర్ల సహాయంతో జరిగింది.

చెల్లింపు విధానాలు[మార్చు]

మొబైల్ కామర్స్ లో వినియోగదారులు ఎన్నో రకాల చెల్లింపు విధానాలను ఉపయోగించుకోవచ్చు. వాటిల్లో కొన్ని:

 • ప్రీమియం రేటు టెలిఫోన్ నంబర్లు' - ఇవి వినియోగదారుల దూర ప్రాంత బిల్లులకు విలువ కడతాయి.
 • ప్రీ-పెయిడ్ కాలింగ్ ప్లాన్ల తగ్గింపులతో సహా, వినియోగదారుని యొక్క మొబైల్ టెలిఫోన్ బిల్ లో కలిపిన చార్జీలు
 • క్రెడిట్ కార్డులు
  • కొంతమంది ప్రొవైడర్లు వినియోగదారుల క్రెడిట్ కార్డులను ఫోన్ యొక్క SIM కార్డుకి అనుసంధానం చేయుటకు అనుమతిస్తారు.
 • సూక్ష్మచెల్లింపు సేవలు
 • స్టోర్డ్-వాల్యూ కార్డ్ లు - మొబైల్-ఉపకరణ స్టోర్స్ లేదా మ్యూజిక్ స్టోర్స్

వీటిని కూడా చూడండి[మార్చు]

 • ఎలక్ట్రానిక్ వాణిజ్యం
 • మొబైల్ టికెటింగ్
 • మొబైల్ బ్యాంకింగ్
 • మొబైల్ కామర్స్ సేవ అందించువారు
 • మొబైల్ డయల్ కోడ్
 • మొబైల్ చెల్లింపులు

సూచనలు[మార్చు]

 1. Tiwari, R.; Buse, S. (2007). The Mobile Commerce Prospects: A strategic analysis of opportunities in the banking sector (PDF). Hamburg: Hamburg University Press. p. 33. ISBN 978-3-937816-31-9. Retrieved August 23, 2010.
 2. "iStethoscope in Medical Journal". Retrieved November 23, 2010. Cite web requires |website= (help)
 3. "Increasing Trend of Mobile Marketing". Youpark. Youpark ApS. Retrieved August 23, 2010.

బాహ్య లింకులు[మార్చు]