మొబైల్ టివి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దక్షిణ కొరియాలో DMB

మొబైల్ టెలివిజన్ అంటే చేతిలో ఇమిడే పరికరముతో టెలివిజన్ చూడడం. ఆ ప్రసారాలు మొబైల్ ఫోనులో రుసుము పైన పొందగలిగే ప్రసారాలు కావచ్చు లేదా మొబైల్ నెట్ వర్క్ లు స్థానిక ప్రసార కేంద్రాల నుంచి ఉచితంగా ప్రసారం చేయబడే ప్రసారాలు లేదా ప్రత్యేక మొబైల్ టీవీ ప్రసారాలు కావచ్చు. కొన్ని మొబైల్ టీవీలు ఇంటర్నెట్ నుంచి టీవీ కార్యక్రమాలను డౌన్డ్ లోడ్ చేసుకోగలవు, ఇందులో టీవీలో రికార్డ్ ఐన కార్యక్రమాలు మరియు మొబైల్ పరికరంలో డౌన్ లోడ్ చేయబడి, దాచబడి తరువాత వీక్షించడానికి వీలుపడేలా చేసే పోడ్ కాస్ట్‌ల ద్వారా కూడా చూడవచ్చు.

మొదటి చేతిలో ఇమిడే టీవీని క్లైవ్ సింక్లైర్ జనవరి 1977లో ప్రజలకి అందుబాటులోకి తెచ్చాడు. ఆ పరికరాన్ని మైక్రో విజన్ లేదా MTV-1 అని అంటారు. ఆ పరికరంలో 2 ఇంచుల CRT తెర ఉండేది, మరియు ఇది వివిధ దేశాల సిగ్నల్ లను పొందగలిగేలా తయారు చేయబడిన మొదటి టెలివిజన్ కూడా.[1][2]

చరిత్ర[మార్చు]

దస్త్రం:MTV-1.jpg
స్టెయిన్లెస్ స్టీల్ టేలిస్కోపిక్ ఏరియల్ తో ఉన్న ఒక నల్లని దీర్ఘ చతురస్ర ఆకార పరికరందాని చివరలో చిన్న ఉదా రంగు తెర మరియు వివిధ రంగుల బటన్స్ మరియు సూచికలు.

మొదటి టీవీలు జేబులో పట్టేంత చిన్నవిగా ఉండేవి, MTV-1 లేదా (మైక్రో విజన్) లను జనవరి 1977లో క్లైవ్ సింక్లైర్ ప్రజల అందుబాటులోకి తెచ్చాడు. ఆ పరికరంలో 2 ఇంచుల సి ఆర్ టి తెర ఉండేది, అంతే కాకుండా వివిధ దేశాల సిగ్నల్ లను పొందగలిగేలా తయారు చేయబడిన మొదటి టెలివిజన్ కూడా ఇదే. ఆ పరికరం యొక్క కొలతలు 102x159x41 మి.మిలు, UKలో £100 పౌండ్ల కన్నా తక్కువ ధర ఉండేది అమెరికాలో $400 డాలర్లు.ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చడానికి, దీనిని అభివృద్ధి పరచడానికి పది సంవత్సరాల సమయము పట్టింది. బ్రిటిష్ ప్రభుత్వం 1.6 మిలియన్ పౌండ్ల ఆర్థిక సహాయం అందించింది.[1][2]

చాలా 3g ఫోనుల్లో మొబైల్ టీవీ వాటికున్న ప్రత్యేకతలలో ఒకటి. 2005లో దక్షిణ కొరియా మే 1 మరియు డిసెంబరు 1న ప్రయోగించిన సాటిలైట్ డిఏంబి (ఎస్-డిఏంబి, మరియు టెరస్ట్రియల్ డిఏంబి (టి-డిఏంబి) ఉపగ్రహాల ద్వారా మొబైల్ టివి ప్రసారాలు అందుబాటులోకి తెచ్చిన మొదటి దేశం అయింది. ప్రస్తుతం, ఈ అభివృద్ధి చెందుతున్న రంగంలో దక్షిణ కొరియా మరియు జపాన్ దేశాలు ముందు ఉన్నాయి.[3] హాంగ్ కాంగ్ లో మార్చి ౨౦౦౬ లో మొబైల్ టివి ప్రసారాలు 3G నెట్వర్క్ పై CSL సంస్థ ప్రారంభించింది.[4] దక్షిణ కొరియాలో కాకుండా తొలిసారిగా మొబైల్ ప్రసారాలను యునైటెడ్ కింగ్డంలో BT సంస్థ సెప్టెంబరు 2006 న ప్రారంభించింది . కానీ ఆ సేవలను సంవత్సరం లోపలే నిలిపివేశారు.[5] ఇలాగే "MFD మొబైల్స్ ఫెర్న్సెహెన్ డచ్ల్యాండ్"కు కూడా జరిగింది, ఇది జూన్ 2006 లో జర్మనీలో DMB ఆధారిత సేవలను ప్రారంభించి ఏప్రిల్ 2008 లో నిలిపివేశారు.[6] జూన్ 2006 లోనే ఇటలీలో మొబైల్ సేవలు అందించే 3 సంస్థ (హచ్చిసన్ వహమ్ప అంతర్భాగం) తమ మొబైల్ ప్రసారాలను ప్రారంభించింది, కానీ తమకు పోటీ సంస్థ అయిన జర్మనీ సంస్థకు భిన్నంగా DVB-H ఆధారిత ప్రసారాలను ప్రారంభించింది.[7] ఫిబ్రవరి 2006 లో స్ప్రింట్ ఈ సేవలను అందించడం మొదలు పెట్టింది మరియు ఇలాంటి సేవలను అందించిన మొదటి US సంస్థ అయింది. USలో ప్రస్తుత కాలంలో వెరిజాన్ వైర్ లెస్ మరియు AT&Tసంస్థలు ఈ ప్రసారాలను అందిస్తున్నాయి.

 • ఎడిట్: పానసోనిక్ TR 001 మొదటి జేబులో ఇమిడే టెలివిజన్ పరికరం, ఇది నియోగదారులకు 1970 నుండి అందుబాటులోకి వచ్చింది. పానాసోనిక్ పరిమాణం 6.25 x 3.90 x 1.85 ఇంచిలు. నేను ఈ సెట్ ను 1970లో కొన్నాను. సింక్లైర్ ఏంటివి-1 1977లో అందుబాటులోకి వచ్చింది, దాని పరిమాణం 4 x 6 1/4 x 1 5/8 ఇంచిలు లేదా 102x159x41 మి.మీలు. సోనీ FD -210 ఉత్పాదనలో ఉన్న మొదటి ఫ్లాట్ CRT చిన్నటీవీ. (పురాతన మైక్రో టెలివిజన్ చూడండి https://web.archive.org/web/20131212201648/http://www.visions4.net/journal/time-line/)

పర్యావలోకనం[మార్చు]

సెల్ ఫోన్ సంస్థలు అందించే టీవీ ప్రసారాలను వినియోగదారులు చూడగలిగేలా చేసే ఒక సేవని మొబైల్ టీవీ అని అంటారు. టెలివిజన్ సమాచారమును మనుగడలో ఉన్న సెల్యులర్ నెట్వర్క్ నుంచి లేదా అధికారిక నెట్వర్క్ నుండి పొందవచును.

దక్షిణ కొరియాలో మొబైల్ టీవీ శాటిలైట్ ద్మ్బ్ (S-DMB) మరియు టెరస్ట్రియల్ DMB (T-DMB) లుగా విభజించబడింది. S-DMB సేవలలో ప్రసారాలు ఎక్కువ ఉన్నప్పటికీ T-DMB ఉచితముగా మరియు చాల మొబైల్ పరికరాలలో అందుబాటులో ఉండడం వల్ల బహుళ ప్రజాదరణ పొందింది.

మొబైల్ టివి భారత దేశ వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంది. భారత తూర్పు మరియు ఉత్తర ప్రాంతాలలో BSNL ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. 2007లో "ఐసీ" అనే మొబైల్ సేవను ప్రారంభించింది. ప్రస్తుతం ఐసీ సేవలు నాలుగు బ్స్న్ల్ ప్రాంతోల్లోనే కాకుండా మిగతా సెల్ ఫోన్ సంస్థలు (రిలయన్స్ మరియు TATA ఇండికాం CDMA కాకుండా ) కూడా ఈ సేవలను అందిస్తున్నాయి. ఒక వ్యక్తి స్ట్రీమింగ్-ఎనేబల్ద్ పరికరం ఉపయోగించి డౌన్ లోడ్ లేదా WAP అప్లికేషన్ ని అతడు/ఆమె మొబైల్ నుంచి సరళమైన సంక్షిప్త సందేశాన్ని 57575కి పంపించి లేదా http://www.isee.co.in for further ఇన్ఫర్మేషన్ లో లాగిన్ అయ్యి ప్రసారాలను పొందవచ్చును.

సవాళ్లు[మార్చు]

 • పరికర ఉత్పత్తిదారుల యొక్క సవాళ్ళు

1. విద్యుత్ వినియోగం: ఈ మొబైల్ పరికరాల్లోని బ్యాటరీ పరిజ్ఞానం పోటీలలో పాల్గొంది. మెరుగు పరచబడిన బ్యాటరీ పని దినాలను మొబైల్ లోని సేవలను ఇంకా మెరుగు పరచవచ్చు. అయినప్పటికీ డాష్ టాప్ మొబైల్ పరికరాలకు 12 వోల్టుల వాహన బ్యాటరిలతో విద్యుత్ అందించవచ్చు కానీ మొబైల్ పరికరాలకు వాహన బ్యాటరీలుచే విద్యుత్ అందించడం సరికాదు.

2. జ్ఞాపక శక్తి:ఎక్కువ సేపు టీవిని మొబైల్ పరికరాలలో వీక్షించడం ప్రస్తుత జ్ఞాపక సమర్ధత వల్ల కుదరదు.దీనికి కారణం మొబైల్ టివి అవసరాలను బఫర్ చేయక పోవడమే. ఇంకా వృద్ది చెందుతున్న మొబైల్ పరిజ్ఞానాలు అయిన పీర్-టు-పీర్ విడియో షేరింగ్ మరియు వినియోగదారుల ప్రసారాలు లాంటి వాటికి చాల మెమొరీ అవసరం. ప్రస్తుత వాడుకలో ఉన్న మొబైల్ P2P అల్గారిథాలు మొబైల్ పరికరాల్లో సరిపోవు, కొత్త P2P అల్గారిథాలు ప్రవేశ పెట్టవలసిన అవసరము ఎంతైనా ఉంది. కొత్తగా ఎదుగుతున్న ఒక పరిజ్ఞానం తమ మొబైల్ P2Pని పేటెంట్ చేయడానికి ప్రయత్నిస్తోంది.కానీ ఇంకా మొబైల్ పరికరాల ఉత్పత్తిదారుల గుర్తింపు పొందలేదు.

3. యూసర్ ఇంటర్ ఫేస్ నమునా:పెద్ద సంఖ్యలో మొబైల్ పరికరాలు మొబైల్ టీవీని అందించలేవు;వినియోగదారులు అభివృద్ధి చెందిన ల్చ్ద్ తెరలు మరియు యూజర్ ఇంటర్ ఫేస్ మొబైల్ టీవీ కలిగిన మొబైల్ పరికరాలను కొనవలసి ఉంటుంది. పెద్ద LCD టచ్ స్క్రీన్ తెరలు కలిగిన మొబైల్ పరికరాలకు చాల మంది వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు మరియు యునైటెడ్ స్టేట్స్ లోని వినియోగదారుల్లో ఐఫోన్ ప్రజాదారణ పొందడం దీనికి బలమైన సాక్ష్యంగా నిలిచింది.

4. విశ్లేషణ శక్తి:పరికర ఉత్పత్తిదారులు చెప్పుకోదగ్గ విశ్లేషణ శక్తిని అభివృద్ధి చెయ్యాలి MIPS వంటి క్లిష్టమైన అప్లికేషన్ లు మొబైల్ టీవీలో రాగలిగినంత సాంకేతిక పరిజ్ఞానం అందులో ఉండాలి.

 • విషయ సరఫరాదారుని సవాళ్ళు

మొబైల్ టివిల కోసమే అభివృద్ధి చేసిన కార్యక్రమాలు కొత్త వ్యాపారములకు ద్వారములు తెరిచింది. ఇందులో కొత్తగా మోబిసోడ్స్-మొబైల్ ఎపిసోడ్స్ మొబైల్ ఫోన్ కోసమే తయారు చేసిన కార్యక్రమం ఇవి మాములు వాటికన్నా తక్కువ నిడివి (3 నుంచి 5 నిముషాలు) కలవి.

డిజిటల్ టివి[మార్చు]

ఉత్తర అమెరికా[మార్చు]

మూస:Coat rack ఉత్తర అమెరికాలో మొబైల్ టీవీ మరియు మొబైల్ డిజిటల్ రేడియో ప్రసారాలు ఒక సవాలుగా నిలిచాయి, U.S.ఫెడెరల్ కమ్యునికేషన్స్ కమిషన్ (FCC) నెట్వర్క్ లు ఉపయోగిస్తున్న ప్రామాణికాలను కాదని గుర్తింపు పొందిన వ్యవస్థలే ప్రసారాలు చేయాలనీ ఆంక్షలు విధించింది. ఈ విధానం వల్ల మొబైల్ ఫోన్ సంస్థలు మరియు ఉత్పత్తిదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది.[ఉల్లేఖన అవసరం] మూస:Weasel-inline

FCC డిజిటల్ టీవి ప్రసారాల కోసం 8 VSB మాడ్యులేషన్ కలిగిన ATSC పద్ధతిని ఎన్నుకుంది, ఈ పద్ధతి వల్ల వేరు వేరు ప్రసారాలు కలవడం వల్ల అంతరాయం ఏర్పడుతుంది (మొబైల్ పరికరాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది). మొబైల్ ప్రసారాలకు అనుగుణంగా ATSC-MH అభివృద్ధి చేసారు, వేరు వేరు MPEG టీవి కేంద్రాల ప్రసారాల నడుమ అంతరాయలను సరిచేస్తుంది, బలహీన సిగ్నళ్ళు సరిచేయడానికి కూడా ఈ పరిజ్ఞానం పనిచేస్తుంది, ప్రసార కేంద్రం యొక్క ప్రతి డిజిటల్ సబ్ చానల్/లేదా HDTVల మధ్య "బిట్ బడ్జెట్" ఖాళీను పూరిస్తుంది.DVB-T కన్నా ఇది ఎక్కువ, LDTV ప్రసారాలకు పాత మాడ్యులేషన్ అడ్డురాదు, ఏది ఏమైనా MPEG-4 స్కేలబుల్ వీడియో కోడింగ్‌ను ATSC-M/H లో వాడడము గుర్తించదగ్గ స్థాయిలో రిజల్యుషన్ మరియు ఫ్రేం రేట్ లు ఇవ్వగలము.As of 2009ATSC-M/Hకొరకు చిప్ సెట్ లు ఇంకా ఏ కన్జ్యుమర్ ఎలెక్ట్రానిక్స్ పరికరములలో కుడా లేవు, కానీ చిప్ సెట్స్ ను వాడుతూ LG మరియు సామ్సంగ్ లు డిజైన్ చేయబడిన మొదటి పరికరములు CES మరియు NAB కాన్ఫరెన్సేస్ లో చూపబడ్డాయి.

FCCHD రేడియోని కూడా ఎన్నుకుంది COFDM పరిజ్ఞానాన్ని వాడినప్పటికీ మొబైల్ టీవి ప్రసారాలకు అనుకూలం కాదు, DAB-T మరియు DMB-T పొరుగు దేశం కెనడాలో కూడా అనుకూలం కాదు.కెనడియన్ రేడియో-టెలివిజన్ మరియు టెలి కమ్యునికేషన్స్ కమిషన్ (CRTC) ముందే L బ్యాండ్ DABని ఎన్నుకుంది. FCC నిబంధనల ప్రకారం ఉపగ్రహ రేడియో కూడా వేరే అవకాశం లేకుండా గుర్తింపు పొందిన యాజమాన్యాల ద్వారా మాత్రమే తమ ప్రసారాలు చేయాలి. COFDM ను ఉపయోగించి మీడియా FLO UHF టీవీ చానెల్ 55లో ప్రసారం చేస్తుంది. కానీ ఉపగ్రహ టీవీ లాగా నిక్షిప్తం చేసి మరియు నియంత్రించి షరతులతో కూడిన అనుమతి (సెల్యులర్ నెట్వర్క్) ద్వారా ఇస్తుంది. అంతే కాకుండా, AT&T చలన శక్తి లేదా వెరైజోన్ వైర్లెస్ ఫోన్ సేవ కలిగిన పరిమిత సంఖ్య సెల్ ఫోన్లకు దానిని పే టీవిలా కొనవలసి ఉంటుంది.

మొబైల్ డిటీవి ప్రసారాల అభివృద్ధి[మార్చు]

మీడియా ఎఫ్ ఎల్ ఓ టీవీ స్పెక్ట్రం మరియు మోబిటీవి పొందు పరిచిన సెల్ ఫోన్ నెట్‌వర్క్‌లను వాడుతుంది, [8] "మొబైల్ డిటీవి" (ATSC-M/H) డిజిటల్ టీవిల స్పెక్ట్రంను వాడుతుంది.

ఏప్రిల్ 2007 లాస్ వేగాస్‌లో జాతీయ ప్రసరణ కర్తల మండలి (NAB) మొబైల్ టీవి సేవలను అందించడానికి ATSC మరియు 8 VSB పద్ధతులను అవలంబిస్తున్నట్టు చూపారు. అంతకు ముందు సంవత్సరం సామ్సంగ్ మరియు రోడ్&స్క్వర్జ్లకు చెందిన A-VSB (అడ్వాన్స్డ్ VSB) పరిజ్ఞానాన్ని ప్రదర్శించారు. 2007లో జెనైత్ ఎలెక్ట్రానిక్స్, LG సంస్థలు 8 VSB పరిజ్ఞానాన్ని ప్రేవేసపెట్టాయి (హారిస్ గ్రూప్‌తో కలిసి), అది ఒక చేతిలో ఇమిడే మొబైల్-పెడెస్ట్రియన్-హ్యాండ్ హెల్ద్ (MPH) సిస్టం పరికరాన్ని ప్రవేశపెట్టాయి.

ప్రసార మాధ్యమాలు ఆన్ లినేలో తమ కార్యక్రమాలని అందుబాటులోకి తెచ్చాయి, అయితే మొబైల్ DTV కేంద్రాలు ఇంకో విధంగా పోటీ పడ్డాయి. సింక్లైర్ ప్రసార సంస్థ 2006లో తమ A-VSB పరిజ్ఞానాన్ని పరీక్షించింది.NAB ప్రదర్శనలో పాల్గొని తమ KVCW మరియు KVMY DTVఉత్పత్తులను ప్రదర్శించింది. 2007లో జరిగిన వినియోగదారుల ఎలెక్ట్రానిక్స్ ప్రదర్శనలో A-VSB పరిజ్ఞానం బస్సులో పనిచేసింది.

సింగల్ ఫ్రిక్వెంసి నెట్వర్క్ (SFN) మరియు డిజిటల్ LPTV అవసరాల కోసం ఇయాన్ మీడియా నెట్వర్క్ చానెల్ 38 పేరుతో ఒక పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించింది. కొన్ని సందర్భాలలో అన్ని ప్రాంతాలకి ప్రసారాలు అందాలంటే ఒకటి కన్నా ఎక్కువ టీవీ ట్రాన్స్మిటర్లుఅవసరం పడవచ్చు.

HD టీవీ ప్రసారాలకు అంతరాయం కలగదు కాబట్టి ఆ సమయంలో మొబైల్ DTV ని ఉపయోగించవచ్చు. ఒకే ప్రామాణికాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది.[9]

జనవరి 2009 లో జరిగిన వినియోగదారుల ఎలెక్ట్రానిక్స్ ప్రదర్శనలో మొదటి తరం పరికరాలని LG మరియు ఇతర ఉత్పత్తిదారులు ప్రదర్శించారు, ఇందులో కార్లలో ప్రసారాలు పొందగలిగే రిసీవర్లు కెన్ వుడ్, విస్టఇయాన్ మరియు డెల్ఫీల ఉత్పత్తులు ఉన్నాయి. 63 ప్రసార కేంద్రాలు ప్రపంచంలోని 22 విపనుల్లో 2009లో తమ సేవలను అందుబాటులోకి తీసుకుని వస్తాయి అని ప్రకటించారు. బరాక్ ఒబామా ఉద్ఘాటనకు విచ్చేసిన అందరూ ఆయన్ని చూసే అవకాశం పొందారు అని ఈ పరిజ్ఞానంతో ఆ సమస్య తీరుతుందని గేన్నేట్ ప్రసార సంస్థ అధ్యక్షుడు డేవిడ్ లౌగి పేర్కొన్నారు.[10]

ఏప్రిల్ 2009లో 800 ప్రసార కేంద్రాలు కలిసిన ది ఓపెన్ మొబైల్ విడియో కొలిజన్ నాలుగు పరీక్షా కేంద్రాలను ఎంచుకుంది:అట్లాంటాలో గేన్నేట్ WATL మరియు WPXA -TV, సియాటల్లో ఫిషర్ కమ్యునికేషన్ KOMO-TV మరియు బేలో KANG-TV. WPXA మొబైల్ DTV ప్రసారాలను ఏప్రిల్ 1న ప్రారంభించింది. మిగత వారు మేలో మొదలుపెడతారు.[11]

2009లో ఇయాన్ సంస్థ హెచ్ డి టివి ప్రసారాలను అందుబాటులోకి తేనున్నట్టు చెప్పింది, ప్రామాణిక నిర్వచనము మరియు మొబైల్ డిటివి ధారలను ఉపయోగించి న్యూయార్క్ పట్టణం మరియు వాషింగ్టన్, డి.సి.లలో అందుబాటులోకి రానున్నాయి.మొబైల్ డిటివి ప్రమాణాలను తయారు చేసే క్రమంలో ట్రిప్ల్-ప్లే పద్ధతిని అవలంబించారు. ఆ సమయంలో ముందు తరం గ్రాహకాలు ఉన్న పరికరాలు మాత్రమే ఈ ప్రసరాలని పొందగలిగేవి.

ఇయాన్ సంస్థ అధ్యక్షుడు మరియు సీఇఓ బ్రాండన్ బర్గెస్ ఇలా "మీ ముంగిలి దాటి ఆలోచించించండి మరియు లైవ్ టీవీ ను మరియు నిజమైన సమాచారమును వినియోగదారుడు ఎక్కడ ఉంటె అక్కడే అందుకునేలా చూడండి" అని నినదించాడు.[12]

మే 2007లో అడ్వాన్స్డ్ టెలివిజన్ సిస్టమ్స్ కమిటీ మొబైల్ టీవీ ప్రమాణాలను తయారు చేయడం ప్రారంభించింది, ఉత్పత్తిదారులు మరియు అమ్మకందారులు వెంటనే ఈ కొత్త పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చే పని ప్రారంబించారు. మే 2008లో OMVC సామ్సంగ్ మరియు LG సంస్థలను కలసి పని చేయమని అభ్హ్యర్దించింది ఎందుకంటే వేరు వేరు వ్యవస్థల వాళ్ళ పరిజ్ఞానం అందుబాటులోకి రావడం ఆలస్యం అవ్వవచ్చు లేదా అంతరించి పోవచ్చు స్వవినాశము చేసుకునే ఘర్షణగా రూపం దిద్దుకోవచ్చు).

జూలై 2009 ప్రారంభంలో ATSC మరియు ప్రమాణాల సమాఖ్య అన్ని మొబైల్ DTV లకు ATSC -M /H ప్రమాణాన్ని ఆమోదించింది, అక్టోబరు 15న సభ్యులు అందరూ ఆ నిర్ణయాన్ని ఆమోదించారు. ప్రజలకు ఈ కొత్త పరికరాలు 2010లో అందుబాటులోకి రానున్నాయి, కానీ సెల్ ఫోనులో టీవీను వీక్షించడము సమీప కాలంలో జరగకపోవచ్చు ఎందుకంటే టెలిఫోన్ ఉత్పత్తిదారులు ఆ సేవలను పరికరాల్లో ఇంకా పొందుపరచలేదు. ఆ పరిజ్ఞానాన్ని ఎన్నికలలో మరియు వోటు వేయడానికి కూడా ఉపయోగించవచ్చు అని భావిస్తున్నారు.[13][14] సంవత్సరాంతానికి ATSC మరియు వినియోగదరుల ఎలెక్ట్రానిక్స్ సమాఖ్య "MDTV" ప్రమాణాలకు సరిపడే ఉత్పత్తులను గుర్తించడం మొదలు పెట్టాయి.[15]

NAB టెలివిజన్ సభాపతి మరియు మెరేడిత్ ప్రసార సంస్థకు అధ్యక్షులు అయిన పాల్ కర్పోవిజ్ ఇలా చెప్పారు.

సాధించిన మైలురాళ్ళ ద్వారా డిజిటల్ టెలివిజన్ ప్రసార శకంలో నూతన ద్వారాలు తెరుచుకున్నాయి మరియు ఈ ప్రయాణములో ప్రేక్షకులని చేరుకోవడానికి స్థానిక టీవీ కేంద్రాలకు మరియు నెట్ వర్క్ లకు కొత్త అవకాశాలు ఇస్తున్నాయి. స్థానిక ప్రసారాల శక్తిని నూతన తరానికి పరిచయం చేస్తుంది మరియు ముఖ్యమైన అత్యవసర పరిస్థితుల హెచ్చరికలు పొందడానికి వీలుపడుతుంది,స్థానిక వార్తలు మరియు ఇతర దేశంలో ఉన్న ప్రసార కార్యక్రమాలు వీక్షించే అవకాశం ఉంటుంది.[14]

తరువాత జూలైలో వాషింగ్టన్ డి.సి.లో మొదటి బహుళ కేంద్రాల ప్రసార పరీక్షలు మొదలు అయ్యాయి, మొబైల్ డిటివిని న్యూయార్క్ మరియు రలీఘ్, ఉత్తర కరోలిన సంస్థలు ఏక కేంద్ర ప్రసారాలు చేస్తున్నాయి.అట్లాంటాకి చెందిన WATL మరియు సియాటల్ కి చెందిన కాంగ్ కేంద్రాలని "నమూనా కేంద్రాలుగా" OMVC ఎంచుకుంది అక్కడ ఉత్పత్తులను పరీక్షిస్తారు. 2009 చివరికల్లా 70 కేంద్రాలు 28 మీడియా విపణిలో ప్రసారాలు చెయ్యాలని యోచిస్తున్నాయి.

వాషింగ్టన్ పరీక్షల్లో WPXW-TV, WUSA, WDCA, WRC-TV, WHUT -TV, బాల్టిమోర్‌లో WNUV మరియు WNVT MHz నెట్వర్క్ లో ఒక భాగం, అది ఒక బహుళ ప్రసార సేవ. అన్ని కేంద్రాలు రెండు కన్నా ఎక్కువ చానెళ్ళు మరియు "ఎలెక్ట్రానిక్ సేవ మార్గదర్శి హెచ్చరికల చిట్టా" ఉంటాయి.

పరికరాల 20 అమ్మకందారులు ఇ కేంద్రాలను ఉపయోగించి ప్రస్తుత ప్రమాణాలను పరీక్షించు కోవాలి. కానీ చివరి ప్రమాణాలు తరువాత వస్తాయి, మరియు ఇంకా వివిధ పరికరాలు అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రజల పరీక్ష 2010 లో జరుగుతాయి. ఇందుమూలంగా పెద్ద సంఖ్యలో పరికరాలను ప్రమాణాలు వెలువడే వరకు ఉత్పత్తి చేయడం కుదరదు. ఐనప్పటికీ జూన్ లో LG పెద్ద సంఖ్యలో చిప్ ల ఉత్పత్తి ప్రారంభించింది.

"మనము ఇంకా డిటివి 1988 ప్రారంభ సమయంలో ఉన్నట్టు ఉంది" అని ఐయాన్ టెక్నాలజీ ఉప అధ్యక్షుడు బ్రెట్ జెంకిన్స్ పేర్కొన్నారు. వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో మొబైల్ టీవీ వీక్షకుల కన్నా ప్రసార సాధనాలు ఎక్కువ ఉండే అవకాశము ఉంది.

ఈ పరికరాల్లో USB డాంగ్ఎల్, నెట్ బుక్స్, పోర్టబుల్ డివిడి పరికరాలు మరియు వాహనాల్లో ప్రదర్శనా పరికరాలు ఉన్నాయి.[16]

వైట్ హౌస్ అధికారులు మరియు కాంగ్రెస్ సభ్యులు ట్రిపల్-పే పద్ధతిని ఐయాన్ ప్రదర్శనలో 2009 జూలై 28న వీక్షించారు.[17][18] ఇంకో ప్రదర్శన 2009 అక్టోబరు 16న జరిగింది ఇందులో పాత్రికేయులు, పరిశ్రమ అధికారులు మరియు ప్రసారకర్తలు పాల్గొన్నారు.వాషింగ్టన్ చుట్టూ బస్సులో ప్రయాణిస్తూ కొత్త పరికరాలను పరీక్షించారు. అ ప్రయాణంలో వాషింగ్టన్ మరియు బాల్టిమోర్ విపణిలో పరీక్షించ దలచిన వారు కూడా ఉన్నారు.[19]

ఆగుస్ట్ 7 2009న బ్లాక్ బెర్రీ సేవలు ఆరు కేంద్రాల్లో మొదలు అయ్యాయి--ఇండియానపోలిస్లో విష్-టివి;హంప్తాన్ రోడ్స్ విర్జినియలో WAVY-TV; అల్బక్యుర్క్యు న్యూ మెక్సికోలో KRQE;ఫోర్ట్ వెన్ ఇండియానాలో WANE-TV;అలబామాలో మొబైల్, WALA-TV; ఆస్టిన్ టెక్సాస్ లో KXAN-TV. ఇంకా 27 కేంద్రాలు ముందు ముందు సేవలను అందిస్తాయి.బ్లాక్ బెర్రీ సేవలను అభివృద్ధి చేసిన LIN టీవీ ఒక ఐఫోన్ అప్లికేషన్ని సిద్దం చేసింది.[18] అక్టోబరు కల్లా 30 కేంద్రాలు మొబైల్ డిటివి కార్యక్రమాలని ప్రసారములను ప్రారంభించాయి, ఆ సంఖ్య సంవత్సర చివరి వరకు 50కి చేరుతుంది అని అంచనా. అదే నెలలో FCC అధ్యక్షుడు జూలియస్ గేనచౌస్కి వైర్ లెస్ సేవలకు స్పెక్ట్రం సంఖ్య పెంచుతామని ప్రకటించారు.[14]

ఆగస్టులో WTVE మరియు యక్సేరా సంస్థలు సింగిల్-ఫ్రీక్వెన్సీ నెట్వర్క్ (SFN) ను బహుళ ట్రాన్స్మిటర్లతో కొత్త మొబైల్ ప్రామాణికాన్ని ఉపయోగించి పరీక్షించడం ప్రారంభించాయి. పెన్సిల్వేనియా రీడింగ్ లోని RNN ఈ పద్ధతిని 2007 నుంచి ఉపయోగిస్తుంది.[20]

కావెల్ లోని మేర్త్జ్ & అసోసియేట్స్ అధ్యక్షుడు రిచర్డ్ మేర్త్జ్ వహఫ్ మొబైల్ DTV ప్రసారాలకు పనికిరాదు అని దానికి 15 ఇంచిల యాన్టేనా కావాలి అని కానీ దీనిని వాడి ఏ సమస్యలు లేని వినియోగదారులు ఉన్నారని పేర్కొన్నారు. వృద్ధి చెందిన యాన్టేనా లేదా శక్తివంతం అయిన ప్రసార కేంద్రాలు కావలిసి ఉంటుంది, అంతే కాకుండా కొన్ని ప్రాంతాల్లో తిరిగి ప్రసారము చేసే కేంద్రాలు అవసరం ఉంటుంది.[21]

లౌగీ ఈయన సంస్థ 19 మార్కెట్ లలో పరీక్షించాలని ఆలోచిస్తుంది. నూతన పరికరాల్లో చిప్ ఆకృతుల వల్ల ప్రకటనల గురితప్పదు అని ఆయన అన్నారు.[19]

డిసెంబరు 2009 లో కాన్సెప్ట్ ఎంటర్ ప్రైజెస్ వాహనాల కోసం మొదటి మొబైల్ డిటివి ట్యూనర్ ప్రేవేశపెట్టింది. పూర్వపు పరికరములలా కాకుండా, ఈ పరికరం వేగంగా ప్రయాణించే వాహనాల్లో కూడా స్పష్టమైన చిత్రాన్ని అంతరాయం లేకుండా అందిస్తుంది ఇందులో 1 ఇంచ్ ఉండే పైకప్పు పైన ఉండే యాన్టేనా ఉంటుంది. ఏ విధమైన సభ్యత్వం అవసరంలేదు.[22]

అదే డిసెంబరులో వినియోగదారుల ఎలెక్ట్రానిక్స్ మండలి వాషింగ్టన్ డి.సి.లో ఉత్పత్తిదారులు తమ వివిధ పరికరాలని పరీక్షించుకోవడానికి వీలుగా "ప్లగ్ ఫెస్ట్" కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ దేశాలకు చెందిన 15 సంస్థలు మరియు ఇంజనీర్లు పాల్గొన్నారు, నాలుగు ప్రసార వ్యవస్థలను,12 రిసివర్ వ్యవస్థలను, మరియు నాలుగు రకముల సాఫ్ట్ వేర్ లను పరీక్షించారు.[15][23]

డిసెంబరు 1న న్యూస్ కార్ప్ అధ్యక్షుడు రుపర్ట్ మర్దాచ్ ఇలా అన్నారు "రానున్న కాలంలో మొబైల్ డిటివి పత్రిక రంగము యొక్క ఎదుగుదలకు ముఖ్య భూమిక వహిస్తుంది, అయన టివిని మరియు వీలైతే వార్తా పత్రికలని ఈ పద్ధతిలో ప్రసారం చేస్తామని పేర్కొన్నారు.[24]

మొబైల్ డిటివి ప్రసారాలకి రోజులు దగ్గరపడ్డాయి అన్న ఆలోచనని 2010 వినియోగదారుల ఎలెక్ట్రానిక్ ప్రదర్శనలో NAB అధ్యక్షుడు గోర్డన్ హెచ్.స్మిత్ వ్యతిరేకించారు మొబైల్ డిటివి ప్రసారాలకి ప్రజాదరణ కొనసాగుతూనే ఉంటుంది అని అన్నారు. ప్రజలు సెల్ ఫోనులు మరియు ఇతర పరికరాలను వీక్షించడానికి వాడతారు, ప్రసార పరిజ్ఞానం ఈ పని చేయడానికి సరియిన సాధనం. కొందరు భావించినట్టు వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ ప్రసారాలకి ప్రత్యామ్న్యాయము కాదు, అది విడియో సేవల అవసరాలకు సరిపోదు అన్నారు.[25] మొబైల్ డిటివి ప్రసారాలు పొందగలిగే మొదటి ఐఫోన్ ఐయాన్ సంస్థకు చెందిన బర్గెస్ ఆవిష్కరించారు, అదే సంస్థకు చెందిన జెంకిన్స్ LG మేజ్ మరియు వాలుప్స్ టివిట్లను ఆవిష్కరించారు.ఇవి ఐపోడ్ టచ్‌కి సిగ్నల్స్ ప్రసారం చేస్తుంది మరియు తొందర్లో గూగుల్ నెట్‌వర్క్‌తో కలిసి పని చేయబోతోంది.[26]

సింక్లైర్ ప్రసార సంస్థ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సంచాలకుడు మార్క్ ఏత్కిన్, మొబైల్ డిటివి బహుళ ప్రసార కేంద్రాల వల్ల స్పెక్ట్రం పని వత్తిడి తగ్గుతుంది. స్పెక్ట్రంను గ్రామీణ ప్రాంతాల్లో వైర్ లెస్ బ్రాడ్ బ్యాండ్ ప్రసారాలకు వాడవచ్చు కానీ పెద్ద పట్టణాల్లో వీలు పడదు. మొబైల్ డిటివి విడియోలని ప్రత్యక్షంగా సెల్ ఫోనుల్లో మరియు అటువంటి పరికరాల్లో వీక్షించడానికి ఉత్తమమైన సాధనము అని FCC కు అయన వివరించారు.[27]

OMVC యొక్క మొబైల్ డిటివి ప్రదర్శన 2010 మే 3న ప్రారంభం అయ్యి ఆ వేసవి అంతా కొనసాగింది. తొమ్మిది కేంద్రాలు స్థానిక మరియు నెట్వర్క్ కార్యక్రమాలని కలిపి 20 కార్యక్రమాలని సామ్సంగ్ మొమెంట్ ఫోనులకి ప్రసారం చెయ్యాలని అనుకున్నారు ఇందులో కేబుల్ ప్రసారాలు కూడా ఉన్నాయి. డెల్ నోట్ బుక్కులు మరియు వాలుప్స్ టివిటిలు కూడా ప్రసారాలు అందుకున్నాయి.[28]

2010 సెప్టెంబరు 23న మీడియా జనరల్ తమ మొదటి MDTV సేవలను కొలంబస్, ఓహయో లోని WCMH-TVలో ప్రసారాలు ప్రారంభించింది, అదే విధంగా తరువాతి కాలంలో టాంపా బే ప్రాంతంలోని WFLA -TV లో ప్రసారాలు మొదలు పెట్టాలని అనుకుంటుంది. అయినప్పటికీ, ప్రేక్షకులకి ఈ సేవలు వినియోగించడానికి పరిమితులు ఉన్నాయి, మరియు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి అని అవగాహన కల్పించవలసి వచ్చింది.[29]

మొబైల్ టీవీ ప్రమాణాలు[మార్చు]

భౌగోళికం
 • DVB-H (డిజిటల్ విడియో బ్రాడ్‌కాస్టింగ్-హ్యాండ్ హెల్ద్) -యూరోప్, ఆసియా
 • ATSC-M/H (ATSC మొబైల్/హ్యాండ్ హెల్ద్) - ఉత్తర అమెరికా
 • T-DMB (టెర్రేస్ట్రియల్ డిజిటల్ మల్టీ మీడియా బ్రాడ్ కాస్ట్)
 • 1సెగ్ (వన్ సెగ్మెంట్) -ISDB-Tలో మొబైల్ టీవీ వ్యవస్థ
 • మీడియా FLO -US లో ప్రారంభించబడింది మరియు UK మరియు జర్మనీలలో ట్రయల్ చేయబడింది
 • DMB-T/H - చైనా మరియు హాంగ్ కాంగ్
 • DAB-IP (డిజిటల్ ఆడియో బ్రాడ్ కాస్ట్) -UK
 • iMB (ఇంటిగ్రేటెడ్ మొబైల్ బ్రాడ్ కాస్ట్,3జిపిపి MBMS)
ఉపగ్రహం
 • DVB-H/DVB-SH (డిజిటల్ విడియో బ్రాడ్‌కాస్టింగ్- సెటలైట్ ఫర్ హ్యాండ్ హేల్డ్స్)
 • S-DMB (సెటలైట్ డిజిటల్ మల్టీ మీడియా బ్రాడ్ కాస్ట్) -దక్షిణ కొరియా
 • CMMB (చైనా మొబైల్ మల్టీ మీడియా బ్రాడ్‌కాస్టింగ్) -చైనా

యూరోపియన్ యునియన్ DVB-SH/DVB-H మరియు ఇతర నూతన పరిజ్ఞానాలని 2008లో అవలంబించడం ప్రారంభించింది.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • హ్యాండ్ హెల్ద్ ప్రొజెక్టర్
 • మల్టీ మీడియా బ్రాడ్ కాస్ట్ మల్టీ కాస్ట్ సర్విస్ (MBMS) వయా GSM మరియు UMTS సెల్యులార్ నెట్వర్క్స్
 • IP TV
 • SPB TV
 • మొబైల్ DTV అలయన్స్-వ్యాపార విభాగం
 • 3 మొబైల్ టీవీ (UK)
 • మోబిక్లిప్
 • మోబిTV
 • నునేట్

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 క్లైవ్ విజయాలు సింక్లైర్ పరిశోధన
 2. 2.0 2.1 విడియో టివి మరియు టివి పరికరాలు, Retrothing.com
 3. NYTimes.com వయా యాహూ!ఫైనాన్స్: మొబైల్ టివి యూరోప్ మరియు USలో ఎదుగుదల
 4. 3G UK:సేవలు గోల్డెన్ డైనమిక్ ఎంటర్ప్రైసేస్ లిమిటెడ్ వాయర్ పోర్టల్ ఆధారంగా 3 GPP ప్రమాణాలతో 3G-324 M.ఇటువంటి సేవలు ఫిలిపైన్స్ లో అందుబాటులో ఉన్నాయి.
 5. ZDనెట్:బిటి మొబైల్ టివి ప్రసారాల నిలిపివేత, 26 జూలై 2007
 6. బ్రాడ్ బ్యాండ్ టివి వార్త:ఎం ఎఫ్ డి జర్మన్ టి-డిఎంబి లైసెన్స్ వెనక్కి ఇచ్చింది, మే 1 2008
 7. ది రిజిస్టర్:డివిబి-హెచ్ ఇటలీలో అనూహ్య ఎదుగుదల,28 జూలై 2006
 8. Thompson, Mark (2010-06-03). "mobile tv cell phone networks:". Broadcasting & Cable. మూలం నుండి 2010-05-15 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-06-03.
 9. Dickson, Glen (2007-04-14). "NAB: Mobile DTV Hits the Strip". Broadcasting & Cable. Retrieved 2009-07-21.
 10. Dickson, Glen (2009-01-11). "CES: Broadcasters' Mobile DTV Moment". Broadcasting & Cable. Retrieved 2009-12-03.
 11. Dickson, Glen (2009-04-20). "NAB 2009: Broadcasters Set Mobile DTV Test Markets". Broadcasting & Cable. Retrieved 2009-12-17.
 12. Dickson, Glen (2009-06-29). "ION Broadcasts Mobile DTV in N.Y., D.C.: Hails Its Digital TV "Triple Play"". Broadcasting & Cable. Retrieved 2009-07-02.
 13. Dickson, Glen (2009-07-06). "ATSC-M/H voted to proposed standard status". Broadcasting & Cable. Retrieved 2009-07-08.
 14. 14.0 14.1 14.2 Dickson, Glen (2009-10-16). "Mobile DTV Standard Approved". Broadcasting & Cable. Retrieved 2009-10-16.
 15. 15.0 15.1 Dickson, Glen (2009-12-16). "ATSC Launches Certification Program For Mobile DTV". Broadcasting & Cable. Retrieved 2009-12-17.
 16. Dickson, Glen (2009-07-13). "Special Report: Mobile DTV Heats Up". Broadcasting & Cable. Retrieved 2009-07-15.
 17. Dickson, Glen (2009-07-22). "ION, OMVC Organize DTV Showcase in D.C." Broadcasting & Cable. Retrieved 2009-07-22.
 18. 18.0 18.1 Eggerton, John (2009-08-07). "LIN TV Develops Blackberry App For Mobile TV Service". Broadcasting & Cable. Retrieved 2009-08-11.
 19. 19.0 19.1 Eggerton, John (2009-10-16). "OMVC Does Mobile DTV Tour". Broadcasting & Cable. Retrieved 2009-10-23.
 20. Dickson, Glen (2009-12-18). "WTVE Tests SFN For Mobile DTV". Broadcasting & Cable. Retrieved 2010-01-13.
 21. Jessell, Harry A. (2009-09-24). "Digital VHF Needs A Power Boost". TVNewsCheck. Retrieved 2009-10-15.
 22. Gilroy, Amy (2009-11-09). "First Mobile DTV Car Tuner At $499". TWICE. మూలం నుండి 2009-11-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-11-10.
 23. Dickson, Glen (2009-12-02). "Mobile DTV Picks Up Speed". Broadcasting & Cable. Retrieved 2009-12-03.
 24. Eggerton, John (2009-12-01). "Murdoch Says Mobile TV Is Key to Future". Broadcasting & Cable. Retrieved 2009-12-03.
 25. Dickson, Glen (2010-01-07). "CES 2010: Broadcasters Tout Mobile DTV Progress". Broadcasting & Cable. Retrieved 2010-01-13.
 26. Dickson, Glen (2010-01-09). "NAB Shows Off New Spectrum Applications". Broadcasting & Cable. Retrieved 2010-01-13.
 27. Eggerton, John (2010-01-18). "FCC's Bellaria Says Broadcasters Lobbying Against Scenario That's No Longer On Table". Broadcasting & Cable. Retrieved 2010-01-26.
 28. Dickson, Glen (2010-05-03). "Mobile DTV's Real-World Test". Broadcasting & Cable.
 29. Winslow, George (2010-10-18). "Media General Expands MDTV Services". Broadcasting & Cable. Retrieved 2010-12-02.
 • స్థానిక టీవీ మొబైల్ టీవీ యొక్క అవలంబనకు అడ్డు.సినెట్ వార్తలు.cnet.com

ఆధారం:BBC

బాహ్య లింకులు[మార్చు]

మూస:Wireless video