మొరిరి సరస్సు
మొరిరి సరస్సు | |
---|---|
ప్రదేశం | లడఖ్ |
అక్షాంశ,రేఖాంశాలు | 32°54′N 78°18′E / 32.900°N 78.300°E |
సరస్సులోకి ప్రవాహం | వేసవిలో మంచు కరగటం |
వెలుపలికి ప్రవాహం | లేదు[1] |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
గరిష్ట పొడవు | 19 కి.మీ. (12 మై.) |
గరిష్ట వెడల్పు | 3 కి.మీ. (1.9 మై.) |
ఉపరితల వైశాల్యం | 13,500 హె. (33,000 ఎకరం) |
గరిష్ట లోతు | 105 మీ. (344 అ.)[2] |
ఉపరితల ఎత్తు | 4,522 మీ. (14,836 అ.) |
మొరిరి సరస్సు ఉత్తర భారతదేశంలోని లడఖ్‌లో గల చాంగ్‌తాంగ్ పీఠభూమి లో ఉంది. దీనిని మౌంటెన్ లేక్ అని కూడా అంటారు. లడఖ్ ప్రాంతంలో ఈ సరస్సును అత్యంత అందమైనదిగా, అత్యంత పెద్దదిగా పరిగణిస్తారు.[3]
భౌగోళికం
[మార్చు]ఈ సరస్సు సముద్ర మట్టం నుండి 4,522 మీ (14,836 అడుగులు) ఎత్తులో ఉంది. ఇది దాదాపు 16 మైళ్ళ (26 కిమీ) పొడవు, రెండు నుండి మూడు మైళ్ళ (3 నుండి 5 కిమీ) వెడల్పు కలిగి ఉంది. ఈ సరస్సులోని నీరు రుచికి ఉప్పగా ఉంటాయి.[4]
నీటి ప్రవాహం
[మార్చు]సరస్సు ప్రక్కనే ఉన్న పర్వతాల నుండి మంచు కరగడం ద్వారా దింట్లోకి నీరు వస్తుంది. సరస్సులోకి నీరు రెండు ప్రధాన ప్రవాహాల ద్వారా ప్రవేశిస్తుంది, ఒకటి ఉత్తరం నుండి వస్తే, మరొకటి నైరుతి దిశ నుండి వస్తుంది.[5]
వర్గీకరణ
[మార్చు]హిమాలయ సరస్సులను వాటి మూలాల ఆధారంగా నాలుగు సమూహాలుగా వర్గీకరించారు.[6]
- హిమానీనదాలలో, చుట్టుపక్కల ఏర్పడే సరస్సులు
- భూ అంతర్భాగంలో కదలికల కారణంగా ఏర్పడిన నిర్మాణాత్మక సరస్సులు (ఉదా. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ సరస్సు)
- అవశేష సరస్సులు ఇవి వాస్తవానికి నిర్మాణాత్మకమైనవి (ఉదా. మొరిరి సరస్సు, కాశ్మీర్‌లోని దాల్ సరస్సు)
- సహజ ఆనకట్ట సరస్సులు ఇవి రాళ్లు లేదా శిథిలాలు పేరుకుపోవడం వల్ల నది ఒడ్డున తాత్కాలిక నీటి వనరులు గా ఏర్పడ్డాయి (ఉదా. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్‌లో గోహ్నా తాల్ )
మొరిరి సరస్సు మూడవ వర్గానికి చెందిది.
లడఖ్ నుండి ప్రయాణం
[మార్చు]లడఖ్ నుండి 240 కిలోమీటర్ల (150 మైళ్ళు) దూరంలో ఈ సరస్సు ఉంది. చాంగ్‌టాంగ్ ప్రాంతం నుండి నేరుగా మొరిరి సరస్సును చేరుకోవచ్చు. ఈ సరస్సు లడఖ్ మొత్తం ప్రాంతంలో అత్యంత అందమైనదిగా, అత్యంత పెద్దదిగా పరిగణించబడుతుంది.[7]
మూలాలు
[మార్చు]- ↑ Ladak: Physical, Statistical, and Historical with Notices of the Surrounding Countries. Alexander Cunningham. 1840. London, p. 140.
- ↑ https://www.researchgate.net/publication/269724367_Reconstructed_late_Quaternary_hydrological_changes_from_Lake_Tso_Moriri_NW_Himalaya
- ↑ "Archived copy". Archived from the original on 25 అక్టోబరు 2007. Retrieved 21 నవంబరు 2009.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) Tso Moriri - ↑ "Upper Sutlej basin area" (PDF). Archived from the original (PDF) on 7 జనవరి 2018. Retrieved 14 May 2017.
- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 10 జూన్ 2011. Retrieved 18 సెప్టెంబరు 2010.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link). The brackish water of the lake has NaC1 less than 5.85 g/L, measured in mid-summer. - ↑ http://planningcommission.nic.in/aboutus/committee/wrkgrp11/tf11_ecosys.pdf Report of the Task Force On the Mountain Ecosystems, Environment and Forest Sector, for Eleventh Five Year Plan 2007–2012 (From web archive)
- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 27 మే 2011. Retrieved 27 అక్టోబరు 2008.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)