Jump to content

మొహమ్మద్ ఆజమ్ అలీ

వికీపీడియా నుండి
మొహమ్మద్ ఆజమ్ అలీ 
జననం ఆగస్టు 5
నివాస ప్రాంతం  వరంగల్ జిల్లా
వృత్తివాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల(వరంగల్)లోఅసిస్టెంట్ ప్రొఫెసర్ 
ప్రసిద్ధిరచయిత, సంఘ సేవకులు
మతంఇస్లాం
భార్య / భర్తఆఫ్రీన్ సుల్తానా
పిల్లలుఖదీజా జైమ, ఇబ్రాహీం అలీ
తండ్రిఅహ్మద్ హుస్సేన్
తల్లిఖాలీదా బేగం

డాక్టర్ మొహమ్మద్ ఆజమ్ అలీ (Dr. Mohammad Azam Ali) తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ సంఘ సేవకులు, రచయిత, అసిస్టెంట్ ప్రొఫెసర్. సామాజిక సేవలో  భారత ప్రభుత్వము కేంద్ర క్రీడా యువజన మంత్రిత్వ శాఖ వారిచే ఇందిరాగాంధీ జాతీయ ఉత్తమ వాలంటీర్ అవార్డును భారత రాష్ట్రపతి చేతుల మీదుగా, జాతీయ యువజన వార్డును అందుకోవడం జరిగింది.

జననం, బాల్యం

[మార్చు]

డాక్టర్ మొహమ్మద్ ఆజమ్ అలీ తెలంగాణ రాష్ట్రం  ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చీర్లవంచ గ్రామంలో   మొహమ్మద్ అహ్మద్ హుస్సేన్ ఖాలీదా బేగం దంపతులకు 1991 ఆగస్టు 5న జన్మించాడు. ఆజమ్ అలీ ఐదవ సంతానం.  వీరి తండ్రి లారీ డ్రైవర్ , తల్లి వ్యవసాయాధారిత కూలి పని చేసేది. కొంత కాలానికి ఉపాధి రీత్యా బాల్యంలో కరీంనగర్ పట్టణానికి వలస వచ్చి, పద్మనగర్ లో స్థిరపడ్డారు.

విద్యాభ్యాసం

[మార్చు]

ఆజమ్ అలీ ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు పద్మ నగర్ లో స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ,  ఆరవ తరగతి నుండి నుంచి పదవ తరగతి వరకు పద్మనగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల  లో పూర్తి చేసాడు. ఇంటర్మీడియట్ విద్యను కరీంనగర్ లోని ప్రభుత్వ ప్రభుత్వ ఆర్ట్ & కామర్స్ జూనియర్ కళాశాలలో, డిగ్రీ విద్యను శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ, పీజీ పీ కళాశాలలో పూర్తిచేశారు.  వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ, ఎం. ఇడి పట్టాలు పొందారు. ఆంగ్ల సాహిత్యంలో 'బ్లాక్ ఉమెన్ కాన్షియస్నెస్ ఏ స్టడీ ఆఫ్ టోనీ మారిసన్ సెలెక్ట్ నావెల్స్' అనే అంశంపై డాక్టర్  మేఘన రావు పర్యవేక్షణలో పీహెచ్డీ ని పూర్తి చేసారు.

ఉద్యోగం

[మార్చు]

విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత 2014లో ప్రభుత్వ మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఆంగ్ల విభాగంలో అతిధి ఆధ్యాపకునిగా   తన వృత్తిని ప్రారంభించి మూడు సంవత్సరాల పాటు అనేకమంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం జరిగింది. ఆ తర్వాత కరీంనగర్ లోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో  రెండు సంవత్సరాలు,  వరంగల్ లోని బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో రెండు సంవత్సరాలు విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాలోని లోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో ఆంగ్ల విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు విద్యార్థులను చైతన్యం చేస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు 

సమస్యల అధిరోహణ

[మార్చు]

ఆజమ్ అలీ బాల్యంలో ఏడో తరగతి చదువుతున్నప్పుడు కుటుంబ కలహాల రిత్యా తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టిన తర్వాత కుటుంబ భారం అంతా తన తల్లిపై పడింది. ఆ సమయంలో  ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా  8వ తరగతిని మధ్యలోనే ఆపేసి , బాల కార్మికుడిగా గోడలకు పోస్టర్లు అంటిస్తూ, పెళ్లిలలో క్యాటరింగ్ చేస్తూ కొంత డబ్బును సంపాదించడం ప్రారంభించాడు. అలా గోడల మీద పోస్టర్లు అంటించే సమయంలో ఒక గోడకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్వ శిక్ష అభియాన్ అనే కార్యక్రమం యొక్క నినాదం 'అందరూ చదవాలి అందరూ ఎదగాలి' అనేది తనను బాగా ఆకర్షించింది. ఈ నినాదం తనలో ఒక ఆలోచనని రేకెత్తించింది. అందరిలాగే తను కూడా బాగా చదువుకుని గొప్ప స్థాయికి ఎదగాలని నిర్ణయించుకున్నాడు. అలా గురువుల ప్రోత్సాహంతో మళ్ళీ పాఠశాలలో చేరి తిరిగి చదువు కొనసాగించి, ఉన్నత విద్యను పూర్తి చేయడం జరిగింది. ఇప్పటివరకు అనేక ఆంగ్లభాష సాహిత్య సదస్సులలో పాల్గొని, పలు జాతీయ అంతర్జాతీయ సెమినార్లలో  పరిశోధన పత్రాలని సమర్పించడం జరిగింది.

ఆంగ్లంపై పట్టు

[మార్చు]

కరీంనగర్ లోని శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బిఎ ద్వితీయ సంవత్సరం చదివే సమయంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ గా జాతీయ సమైక్యత శిబిరానికి ఎంపికయ్యారు. అలా  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జాతీయ సమైక్యత శిబిరానికి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. 2010 లో జేఎన్టీయూ కాకినాడలో జరిగిన జాతీయ సమైక్యత శిబిరంలో పాల్గొంటున్న సమయంలో అక్కడ జాతీయ సమైక్యత పై తెలుగులో ప్రసంగిస్తూ ఉండగా తెలుగులో ప్రసంగం ఇవ్వకూడదని ఆంగ్లంలో మాత్రమే ప్రసంగం ఇవ్వాలని తెలిపి , మైక్ లాక్కొని పంపించడంతో నిరాశతో వెనుక తిరిగారు. దీనిని ఒక అవమానంగా భావించి తను కూడా అందరిలాగా ఆంగ్ల భాషని నేర్చుకుని, ఆంగ్లభాషలో అందరిలాగా అనర్గళంగా మాట్లాడాలని సంకల్పించారు. తన గురువులైన డాక్టర్ నలిమెల భాస్కర్, గందే పరశురాం రావు సలహాలతో ఆంగ్లభాష నైపుణ్యాల్ని మెరుగుపరచుకోవడం జరిగింది.       ఆంగ్లం పై మరింత పట్టును ను సాధించడానికి కోసం వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం ఏ ఆంగ్ల సాహిత్యం లో ప్రవేశం పొందడం జరిగింది. ఆంగ్ల సాహిత్యంలో చేరిన తర్వాత కొన్ని రోజులకి మొదటి నుంచి తెలుగు భాష గ్రామీణ తెలుగు మీడియం నేపథ్యం కావడంతో ఆంగ్లభాష పదాలు, ఆంగ్ల సాహిత్యం కష్టంగా అనిపించి ఎం ఏ ను  మధ్యలోనే వదిలి పెట్టి తిరిగి కరీంనగర్ కి రావడం జరిగింది. అలా ఒకరోజు కరీంనగర్లో   తనకు పదవ తరగతిలో ఆంగ్లాన్ని  బోధించిన సయ్యద్ మోయిన్ అహ్మద్ గారు  విషయం తెలుసుకొని, ప్రోత్సహించి, ప్రేరేపించడం వల్ల తిరిగి  ఎంఏ ఆంగ్ల  సాహిత్యాన్ని కొనసాగించడం జరిగింది.  ఆంగ్ల భాషలో ప్రావీణ్యత సంపాదించడం కోసం అనేక పుస్తకాలు, పత్రికలు చదవడం ప్రారంభించారు.     ఇప్పటివరకు ఆజమ్ అలీ గత 12 సంవత్సరాలుగా గా అధ్యాపక వృత్తిలో 30 వేలకు  పైగా విద్యార్థులకు ఆంగ్ల భాష నైపుణ్యం పై శిక్షణనిస్తూ అనేకమందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం జరిగింది.

సామాజిక సేవ

[మార్చు]

ఆజమ్ అలీ బాల్యం నుంచే అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. బాల్యంలో సాంఘిక శాస్త్ర పాఠాలలో నేర్చుకున్న సామాజిక సమస్యలు  తనలో సామాజిక స్పృహను, సామాజిక చైతన్యాన్ని రగిలించాయి. సామాజిక సేవ పట్ల ఆకర్షితుడై, ఇంటర్మీడియట్ లో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ లో చేరడం జరిగింది. అలా సామాజిక సేవ పై ఆసక్తితో ఎన్ఎస్ఎస్ లో చేరి వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడం, ప్లాస్టిక్ నిషేధం, రక్తదానం, హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన, కుటుంబ నియంత్రణ, పల్స్ పోలియో, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాల ఏర్పాటు, నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయడం జరిగింది. కరీంనగర్ లోని శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథక అధికారి డాక్టర్ మనోహర చారి ప్రోత్సాహంతో సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. అలాగే కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ గా  వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక జాతీయస్థాయిలో జాతీయ సమైక్యత శిక్షణ శిబిరము, అంత రాష్ట్రీయ యువజన సమ్మేళనం, జాతీయ యువ నాయకత్వ శిక్షణ శిబిరాలలో పాల్గొనడం జరిగింది. అలా ఏడేళ్లు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ గా ఉత్తమ సేవలు అందించినందుకు గాను జాతీయస్థాయిలో ఉత్తమ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ గా అవార్డుకు ఎంపిక కావడం జరిగింది.

స్వచ్ఛంద సంస్థ స్థాపన

[మార్చు]

ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులతో చదువు మధ్యలో మానేసి, తిరిగి పరిస్థితుల వల్ల విద్యాభ్యాసానికి కొనసాగించిన ఆజమ్ అలీ అసిస్టెంట్ ప్రొఫెసర్   వృత్తిని చేపట్టిన తర్వాత తనలాగా పేదరికం అనుభవిస్తూ చదువు మానేసినటువంటి బాల కార్మికుల కోసం ఏదైనా చేయాలని సంకల్పంతో,  విద్యతోనే మనిషి జీవితంలో వెలుగు వస్తుందని భావించి, పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం చమక్ ఫౌండేషన్ (విద్యతోనే వెలుగు)  అనే ఒక స్వచ్ఛంద సంస్థను 2023లో స్థాపించడం జరిగింది.   చమక్ ఫౌండేషన్ సంస్థ ద్వారా ప్రభుత్వ  పాఠశాలలు, కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలలో, ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల కోసం కెరియర్ గైడెన్స్, వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాలు, గ్రామీణ గ్రంధాలయాల స్థాపన, పోటీ పరీక్షలపై అవగాహన సదస్సులు, విద్యా సంబంధమైనటువంటి సెమినార్లు అవగాహన కార్యక్రమాల తో విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుంది.     

ఉద్యమాలలో

[మార్చు]

అభ్యుదయ భావాలు కలిగిన ఆజమ్ అలీ డిగ్రీ చదివే రోజుల్లో అన్నా హజారే, లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమాల పట్ల ఆకర్షితులై అన్నా హజారే గారి పిలుపుమేరకు అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. సుపరిపాలన కొరకు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ గారు చేపట్టిన స్వరాజ్య ఉద్యమం,  వినియోగదారుల పరిరక్షణ చట్టం, సమాచార హక్కు చట్టము, ప్రజాస్వామ్యము ఓటర్ల బలోపేతము వంటి ప్రజా చైతన్య కార్యక్రమాల్లో పాల్గొని యువతను చైతన్యం చేయడం జరిగింది.

తెలంగాణ ఉద్యమంలో

[మార్చు]

డిగ్రీ చదివే రోజుల్లో కరీంనగర్ లోని శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో డిగ్రీ చదివేటప్పుడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపుమేరకు తెలంగాణలోని విద్యార్థులు యువకులు, స్వచ్ఛందంగా కళాశాలలో బంద్ చేపట్టి రాస్తారోక, రైల్ రోకో, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, వంటావార్పు వంటి కార్యక్రమాలలో పాల్గొని బలంగా తన తెలంగాణ వాదాన్ని వినిపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి శ్రీకృష్ణ కమిటీ కరీంనగర్ జిల్లా పర్యటన కోసం వచ్చినప్పుడు జిల్లాలో ఉన్న విద్యార్థుల పక్షాన శ్రీకృష్ణ కమిటీ ని కలిసి తెలంగాణలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల మీద విశ్వవిద్యాలయ పైన శ్రీ కృష్ణ కమిటీ కమిటీకి సమస్యల్ని నివేదించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను చెప్పడం జరిగింది.

రచించిన పుస్తకాలు

[మార్చు]

● ఇండియన్ యూత్ లిటరేచర్: మ్యాపింగ్ యంగ్ మైండ్స్ ఇన్ చేంజింగ్ ఇండియా (ఆంగ్ల భాషలో)

పొందిన అవార్డులు

[మార్చు]

1)  ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ వాలంటీర్ అవార్డు 2012

2)  జాతీయ ఉత్తమ యువజన అవార్డు 2017

3)  ఆదర్శ  అధ్యాపక అవార్డు 2021

4)  మౌలానా ఆజాద్ జాతీయ అవార్డు 2018

5) రాష్ట్రీయ గౌరవ సమ్మాన్ అవార్డ్ 2018

6) మహాత్మా గాంధీ జాతీయ సద్భావన అవార్డు 2023

7) ఐక్యరాజ్య సమితి పర్యావరణ హీరో అవార్డు 2019

8) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ వాలంటీర్ అవార్డు 2012

9) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిభ పురస్కార్ 2008

ప్రముఖుల ప్రశంసలు

[మార్చు]

డాక్టర్ మొహమ్మద్ ఆజమ్ అలీ ని అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  గారు, అప్పటి ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అప్పటి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళ  సై సౌందర్య రాజన్ గారు ప్రశంసించారు.     నోబుల్ శాంతి బహుమతి గ్రహీత శ్రీ కైలాష్ సత్యార్థి గారు, అన్నా హజారే గారు, ప్రొఫెసర్ శాంతా సింహా గారు, ప్రొఫెసర్ సందీప్ పాండే గారు, డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, జె.డి. లక్ష్మీనారాయణ గారు, పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆజమ్ అలీ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు.

దస్త్రం:Ali with president.jpg

ప్రొఫైల్ పేజీలు & సోషల్ మీడియా పేజీలు

[మార్చు]

లింక్డ్ఇన్ ప్రొఫైల్

మూలాలు

[మార్చు]

| టైమ్స్ పత్రికలో కథనం

| ఏడెక్స్ లైవ్ లో కథనం

| తెలంగాణ టుడే పత్రికలలో కథనం