మొహమ్మద్ నదీమ్
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పుట్టిన తేదీ | 1982 సెప్టెంబరు 4 సియాల్‌కోట్, పాకిస్తాన్ పంజాబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్‌డే (క్యాప్ 8) | 2019 ఏప్రిల్ 27 - నమీబియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్‌డే | 2025 మే 27 - USA తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి T20I (క్యాప్ 6) | 2015 జూలై 25 - ఆఫ్ఘనిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి T20I | 2025 ఫిబ్రవరి 23 - USA తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2025 మే 27 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మొహమ్మద్ నదీమ్ (జననం 4 సెప్టెంబర్ 1982) పాకిస్తాన్‌లో జన్మించిన క్రికెటర్, అతను ఒమన్ జాతీయ క్రికెట్ జట్టు తరపున ఆడుతున్నాడు. [1]
తొలినాళ్ళ జీవితం
[మార్చు]నదీమ్ 1982 సెప్టెంబర్ 4న పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో జన్మించాడు. అతను 10 సంవత్సరాల వయస్సులో సహోవాలాలోని తన పాఠశాలకు దగ్గరగా ఉన్న మైదానంలో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. [2]
కెరీర్
[మార్చు]ఒమన్ తరఫున తొలి ప్రదర్శనలు (2014–2016)
[మార్చు]నదీమ్ 2014 ACC ప్రీమియర్ లీగ్‌లో ఒమన్ తరపున తన తొలి మ్యాచ్‌లు ఆడాడు. అతని అంతర్జాతీయ రంగప్రవేశం 2014 మే 1 న సెలంగోర్ టర్ఫ్ క్లబ్‌లో నేపాల్‌పై జరిగింది. అతను నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 21 పరుగులు ఇచ్చాడు. బ్యాటింగులో 12 పరుగులు సాధించాడు. ఒమన్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.[3] అతను టోర్నమెంటులో మూడు మ్యాచ్‌లు ఆడాడు కానీ ఒక్క వికెట్ కూడా తీయలేదు.[4] ఆ తర్వాత నదీమ్ 2014 ICC వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ ఫోర్ కోసం ఒమన్ జట్టుకు ఎంపికయ్యాడు.[5] కానీ అతను టోర్నమెంటులో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు [6] తరువాత 2015 ACC ట్వంటీ20 కప్ కోసం జట్టులోకి తీసుకుని ఆ తరువాత తొలగించారు.[7]
2015 ICC వరల్డ్ ట్వంటీ20 క్వాలిఫైయర్ కోసం నదీమ్ ఒమన్ జాతీయ జట్టులోకి తిరిగి వచ్చాడు. ఈ టోర్నమెంటు సమయంలో, అతను కెనడాతో జరిగిన ట్వంటీ20 మ్యాచ్‌లో రంగప్రవేశం చేశాడు. కెనడా కెప్టెన్ రిజ్వాన్ చీమా వికెట్ తీసుకున్నాడు.[8][9] ఒమన్ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఐదవ స్థానంలో ఉన్న ప్లేఆఫ్ మ్యాచ్‌కు చేరుకుంది. ఫలితంగా వారు మొదటిసారిగా ట్వంటీ20 అంతర్జాతీయ హోదాను పొందారు. దీని అర్థం నదీమ్ 2015 జూలై 25 న తన తొలి ట్వంటీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.[10]
2015–16 క్రికెట్ సీజన్‌లో, ఒమన్ జాతీయ జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వివిధ అంతర్జాతీయ జట్లతో మ్యాచ్‌లు ఆడింది. నదీమ్ ఒమన్ జట్టులో ఉన్నాడు, కానీ చాలా మ్యాచ్‌లకు అతను దూరంగా ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన పర్యటన చివరి మ్యాచ్‌లో అతను మళ్ళీ తన రెండవ ట్వంటీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడగలిగాడు. [11] పర్యటన తర్వాత నదీమ్‌ను 2016 ఆసియా కప్, 2016 ఐసిసి వరల్డ్ ట్వంటీ20 కోసం ఒమన్ జట్లలో తీసుకున్నారు.[12] [13] అతను హోమ్ సీజన్‌లో విజయవంతంగా ఆడాడు. అస్సరైన్ జట్టు ఒమన్ T20 ప్రీమియర్ డివిజన్‌ను గెలవడంలో అతజ్ని తోడ్పాటు ఉంది. 2016 ఐసిసి వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ ఫైవ్‌లో అతను ఒమన్ తరపున ఆడే అవకాశం ఉందని భావించారు.[14] కానీ అతను ఎంపిక కాలేదు.[15]
జాతీయ జట్టులో రెగ్యులర్ సభ్యుడుగా (2016–ప్రస్తుతం)
[మార్చు]2016 అక్టోబరులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగిన వన్డే సిరీస్ కోసం నదీమ్ ఒమన్ జట్టులోకి తిరిగి వచ్చాడు. ఈ సిరీస్‌లోని రెండవ మ్యాచ్‌లో తన తొలి లిస్ట్ ఎ క్రికెట్ మ్యాచ్ ఆడాడు. అందులో 42 పరుగులు చేసి ఒక వికెట్ తీసుకున్నాడు.[16] ఆ సిరీస్ తర్వాత అతను 2016లో అమెరికాలో జరిగిన ఐసిసి వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ ఫోర్‌లో ఒమన్ తరపున ఆడాడు. ఈ సిరీస్‌లో ఏడు వికెట్లు పడగొట్టి, ఒమన్ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడుగా నిలిచాడు. ఓవర్‌కు 3.67 పరుగుల ఎకానమీ రేటుతో బౌలింగ్ చేశాడు. [17] ఈ మ్యాచ్‌లను వన్డే ఫార్మాట్‌లో ఆడిన తర్వాత, 2017 డెసర్ట్ టి20 ఛాలెంజ్‌లో ట్వంటీ20 టోర్నమెంటు కోసం నదీమ్‌ను ఒమన్ జట్టులో ఉంచారు. నెదర్లాండ్స్ చేతిలో ఓడిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 2/24 బౌలింగ్ గణాంకాలతో అతను ఒమన్ జట్టులో అత్యుత్తమ బౌలరుగా నిలిచాడు.[18][19] కానీ ఒమన్ సెమీ-ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ అతను ఆ టోర్నమెంటు తరువాతి మ్యాచ్‌లలో మరో వికెట్ మాత్రమే తీయగలిగాడు.[20]
అతను 2018 ICC వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ టూ టోర్నమెంటు, [21] 2018 ఆసియా కప్ క్వాలిఫైయర్ టోర్నమెంటు కోసం ఒమన్ జట్టులో సభ్యుడయ్యాడు.[22] 2018 అక్టోబరులో అతను 2018 ICC వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ త్రీ టోర్నమెంటు[23] 2018 డిసెంబరులో 2018 ACC ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం ఒమన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.[24]
2019 మార్చిలో నమీబియాలో జరిగిన 2019 ICC వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ టూ టోర్నమెంటు కోసం అతను ఒమన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. [25] టోర్నమెంటు సమయంలో చూడదగ్గ ఆరుగురు ఆటగాళ్లలో అతను ఒకడిగా ఎంపికయ్యాడు.[26] ఆ టోర్నమెంటులో ఒమన్, మొదటి నాలుగు స్థానాల్లో నిలిచింది. తద్వారా వన్డే ఇంటర్నేషనల్ (ODI) హోదాను పొందింది. [27] నదీమ్ 2019 ఏప్రిల్ 27 న టోర్నమెంటు ఫైనల్‌లో నమీబియాపై ఒమన్ తరపున వన్డే రంగప్రవేశం చేశాడు.[28]
2019 నవంబరులో బంగ్లాదేశ్‌లో జరిగే 2019 ACC ఎమర్జింగ్ జట్ల ఆసియా కప్ కోసం ఒమన్ జట్టులో అతను చోటు దక్కించుకున్నాడు. [29] 2021 సెప్టెంబరులో అతను 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం ఒమన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. [30] 2024 మేలో అతను 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్ టోర్నమెంటు కోసం ఒమన్ జట్టుకు ఎంపికయ్యాడు.[31]
మూలాలు
[మార్చు]- ↑ "Mohammad Nadeem". ESPNcricinfo. Retrieved 25 July 2015.
- ↑ "ٹی 20 ورلڈ کپ: دوسری ٹیموں میں چمکتے پاکستانی ستارے". Independent Urdu. 20 October 2021.
- ↑ "ٹی 20 ورلڈ کپ: دوسری ٹیموں میں چمکتے پاکستانی ستارے". Independent Urdu. 20 October 2021.
- ↑ "Cricket Records | Records | / | Asian Cricket Council Premier League, 2014 - Oman | Minor ocricket (one-day/limited overs) | Batting and bowling averages". ESPNcricinfo. Retrieved 20 January 2018.
- ↑ "Oman Squad | ICC World Cricket League Division Four, 2014 | Cricket Squads". ESPNcricinfo. Retrieved 20 January 2018.
- ↑ "Cricket Records | ICC World Cricket League Division Four, 2014 - Oman | / | Records | Batting and bowling averages". ESPNcricinfo. Retrieved 20 January 2018.
- ↑ "Oman Squad | ACC Twenty20 Cup, 2014/15 | Cricket Squads". ESPNcricinfo. Retrieved 20 January 2018.
- ↑ "ٹی 20 ورلڈ کپ: دوسری ٹیموں میں چمکتے پاکستانی ستارے". Independent Urdu. 20 October 2021.
- ↑ "ٹی 20 ورلڈ کپ: دوسری ٹیموں میں چمکتے پاکستانی ستارے". Independent Urdu. 20 October 2021.
- ↑ "ICC World Twenty20 Qualifier, 5th place play-off: Afghanistan v Oman at Dublin, Jul 25, 2015". ESPNcricinfo. Retrieved 25 July 2015.
- ↑ "ٹی 20 ورلڈ کپ: دوسری ٹیموں میں چمکتے پاکستانی ستارے". Independent Urdu. 20 October 2021.
- ↑ "ٹی 20 ورلڈ کپ: دوسری ٹیموں میں چمکتے پاکستانی ستارے". Independent Urdu. 20 October 2021.
- ↑ "Cricket Records | Records | / | Asian Cricket Council Premier League, 2014 - Oman | Minor ocricket (one-day/limited overs) | Batting and bowling averages". ESPNcricinfo. Retrieved 20 January 2018.
- ↑ "Oman Squad | ICC World Cricket League Division Four, 2014 | Cricket Squads". ESPNcricinfo. Retrieved 20 January 2018.
- ↑ "Cricket Records | ICC World Cricket League Division Four, 2014 - Oman | / | Records | Batting and bowling averages". ESPNcricinfo. Retrieved 20 January 2018.
- ↑ "Oman tour of United Arab Emirates, 2nd Match: Oman v United Arab Emirates at ICCA Dubai, Oct 15, 2016". ESPNcricinfo. Retrieved 15 October 2016.
- ↑ "ٹی 20 ورلڈ کپ: دوسری ٹیموں میں چمکتے پاکستانی ستارے". Independent Urdu. 20 October 2021.
- ↑ "ٹی 20 ورلڈ کپ: دوسری ٹیموں میں چمکتے پاکستانی ستارے". Independent Urdu. 20 October 2021.
- ↑ "Cricket Records | Records | / | Asian Cricket Council Premier League, 2014 - Oman | Minor ocricket (one-day/limited overs) | Batting and bowling averages". ESPNcricinfo. Retrieved 20 January 2018.
- ↑ "Oman Squad | ICC World Cricket League Division Four, 2014 | Cricket Squads". ESPNcricinfo. Retrieved 20 January 2018.
- ↑ "Cricket: Three debutants in Oman squad for WCL Division 2". Times of Oman. Archived from the original on 9 జనవరి 2018. Retrieved 9 January 2018.
- ↑ "Cricket: Maqsood to lead Oman at Asia Cup Qualifiers in Malaysia". Times of Oman. Retrieved 6 August 2018.
- ↑ "ٹی 20 ورلڈ کپ: دوسری ٹیموں میں چمکتے پاکستانی ستارے". Independent Urdu. 20 October 2021.
- ↑ "ٹی 20 ورلڈ کپ: دوسری ٹیموں میں چمکتے پاکستانی ستارے". Independent Urdu. 20 October 2021.
- ↑ "ٹی 20 ورلڈ کپ: دوسری ٹیموں میں چمکتے پاکستانی ستارے". Independent Urdu. 20 October 2021.
- ↑ "ٹی 20 ورلڈ کپ: دوسری ٹیموں میں چمکتے پاکستانی ستارے". Independent Urdu. 20 October 2021.
- ↑ "Cricket Records | Records | / | Asian Cricket Council Premier League, 2014 - Oman | Minor ocricket (one-day/limited overs) | Batting and bowling averages". ESPNcricinfo. Retrieved 20 January 2018.
- ↑ "Final, ICC World Cricket League Division Two at Windhoek, Apr 27 2019". ESPN Cricinfo. Retrieved 21 November 2015.