మొహిందర్ సింగ్ గిల్
మొహిందర్ సింగ్ గిల్ | |||||||||||||||||||||||||||||||||||||||
| Personal information | |||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Full name | మొహిందర్ సింగ్ గిల్ | ||||||||||||||||||||||||||||||||||||||
| Nationality | అమెరికన్ | ||||||||||||||||||||||||||||||||||||||
| Height | 182 సెం.మీ.[1] | ||||||||||||||||||||||||||||||||||||||
| Weight | 75 kg (165 lb) | ||||||||||||||||||||||||||||||||||||||
| Sport | |||||||||||||||||||||||||||||||||||||||
| Country | భారతదేశం | ||||||||||||||||||||||||||||||||||||||
| Sport | ట్రాక్ అండ్ ఫీల్డ్ | ||||||||||||||||||||||||||||||||||||||
| Event | ట్రిపుల్ జంప్ | ||||||||||||||||||||||||||||||||||||||
| Achievements and titles | |||||||||||||||||||||||||||||||||||||||
| Personal best | TJ – 16.79 (1971) 40 సంత్సరాలపాటు భారతీయ రికార్డ్ | ||||||||||||||||||||||||||||||||||||||
Medal record
| |||||||||||||||||||||||||||||||||||||||
మొహిందర్ సింగ్ గిల్ 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ లో పోటీ చేసిన భారతీయ ట్రిపుల్ జంపర్.
గిల్ ఉత్తర అమెరికా, ఐరోపా దేశాలలో 52 ప్రధాన అంతర్జాతీయ ఆహ్వాన పోటీలను గెలుచుకున్నాడు. ఈ ప్రక్రియలో 19 కొత్త రికార్డులను నెలకొల్పాడు. అదనంగా, ఇతడు ఐదు NCAA ఛాంపియన్షిప్లను కొత్త రికార్డులు సృష్టించి గెలుచుకున్నాడు.[2] ఆ రికార్డులలో కొన్ని 40 సంవత్సరాల వరకూ నిలిచాయి.[3]
ప్రారంభ జీవితం
[మార్చు]ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు గిల్‌ను వాలీబాల్ ఆడటానికి పంపారు. మూడు సంవత్సరాల తరువాత, ఇతడు వాలీబాల్‌ను విడిచిపెట్టి, హైజంప్ ప్రారంభించాడు. 17 సంవత్సరాల వయస్సులో ఒక ఛాంపియన్షిప్‌లో హై జంప్ లో విఫలమైనప్పుడు, ఇతడు ట్రిపుల్ జంప్ ప్రయత్నించి 41 అడుగుల 4 అంగుళాలు గెంతి గెలిచాడు. దీని తరువాత, ఇతడు కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుండి క్రీడా స్కాలర్షిప్ పొంది కాలిఫోర్నియా వెళ్లడానికి ముందు ఒక సంవత్సరం పాటు హాజరయ్యాడు.
కళాశాల జీవితం
[మార్చు]గిల్ కాలిఫోర్నియా రాష్ట్ర్రం, శాన్ లూయీస్ ఒబిస్పో కౌంటీలో ఉన్న కాలిఫోర్నియా పాలిటెక్నిక్ స్టేట్ యూనివర్సిటీ (కాల్ పాలీ)కి హాజరయ్యాడు. అక్కడ 1968 నుండి 1971 వరకు ట్రిపుల్ జంప్‌లో పోటీ పడి, మొత్తం ఐదు NCAA ఛాంపియన్‌షిప్‌లను గెలువడంతో పాటుగా ఐదు సంయుక్త NCAA రికార్డులను సృష్టించాడు. 1970 ఆగస్టులో, బిజినెస్ మేనేజ్‌మెంటులో మేజర్ చేస్తున్నప్పుడు, ఇతడు CCAA యొక్క మేల్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ ఫర్ ఆల్ స్పోర్ట్స్‌గా ఎంపికయ్యాడు.[4] మే 8,1971న, ఫ్రెస్నో వెస్ట్ కోస్ట్ రిలేస్ గిల్ 55 అడుగుల, 1.2 అంగుళాల (లేదా 16.79m) ఎత్తుకు మూడుసార్లు దూకి, ఆ సమయంలో అమెరికా గడ్డపై రెండవ-పొడవైన ట్రిపుల్ జంప్ సాధించి, మీట్ ప్రశంసలలో అత్యుత్తమ అథ్లెట్ టైటిల్ సంపాదించాడు.[5][6][7]
అంతర్జాతీయ విజయం
[మార్చు]1970లో, గిల్ కు భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డు లభించింది.[8] మ్యూనిచ్‌లో జరిగిన ప్రీ-ఒలింపిక్ పోటీలో రెండవ స్థానంలో నిలిచిన తరువాత, ఇతడు 1972లో గాయపడినప్పుడు పోటీపడి ఫైనల్‌కు చేరుకోలేకపోయాడు.[9] ఆసియా క్రీడలలో గిల్ ఒక స్వర్ణపతకం, ఒక రజత పతకాన్ని గెలుచుకున్నాడు. కామన్వెల్త్ క్రీడలలో భారతదేశం సాధించిన ఐదు పతకాలలో గిల్ రెండు పతకాలు గెలుచుకున్నాడు.ఇతడిని జాతీయ జట్టు నుండి తొలగించే ప్రయత్నాలు జరిగాయి, కాని ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జోక్యం చేసుకుని ఇతన్ని పోటీ చేయడానికి అనుమతించారు.[8]
తరువాతి సంవత్సరాలు
[మార్చు]1993లో కాల్ పాలీ ముస్టాంగ్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ఎన్నికయ్యాడు. ఈ గౌరవాన్ని పొందిన ఏకైక ఆసియావాసిగా ఇతడు నిలిచాడు.[10] ఇతడు ప్రస్తుతం సెంట్రల్ కాలిఫోర్నియాలోని టర్లాక్‌లో నివసిస్తున్నాడు.[11]
మూలాలు
[మార్చు]- ↑ Mohinder Singh Gill. sports-reference.com
- ↑ Mohinder Gill. "Mohinder Gill – Cal Poly". Gopoly.com. the original నుండి 7 జనవరి 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 November 2013.
- ↑ "2013 Cal Poly ShareSlo.com Invitational San Luis Obispo, CA Results online at". Phototiming.com. 16 March 2013. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 November 2013.

- ↑ Conner, Terry (June 4, 1971). "Gill eyes Olympics, then acting". Mustang Daily. p. 7.
- 1 2 "I'm pained by reported scams in Commonwealth Games: Gill". The Times of India. 15 August 2010.
{{cite web}}: CS1 maint: deprecated archival service (link) - ↑ "2013 Cal Poly ShareSlo.com Invitational San Luis Obispo, CA Results online at". Phototiming.com. 16 March 2013. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 November 2013.