మొహిద్దీన్ పురం

వికీపీడియా నుండి
(మొహిద్దీన్ పురం(అర్ధవీడు) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

"మొహిద్దీన్ పురం" ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం 523 336., ఎస్.టి.డి.కోడ్ = 08406.


మొహిద్దీన్ పురం
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅర్ధవీడు మండలం
మండలంఅర్ధవీడు Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata

లువా తప్పిదం: Coordinates not found on Wikidata

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల:- 165 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్న ఈ పాఠశాలలో కనీస వసతులు లేవు. సరియైన త్రాగునీటి సౌకర్యం లేదు. మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ కల్పన్నేశ్వరస్వామివారి ఆలయం:- మొహిద్దీన్ పురం గ్రామ శివారులో వెలసిన శ్రీ కల్పన్నేశ్వరస్వామివారి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు, 2 రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [1]
  2. శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం:- నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015, మే నెల-8వ తేదీ శుక్రవారంనాడు ప్రారంభమైనవి. ఆదివారం వరకు గ్రాఓత్సవంతోపాటు, అభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహించి, ఆదివారంనాడు విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించెదరు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [4]
  3. శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం, వైశాఖమాసంలో వైభవంగా నిర్వహించెదరు. ఈ సంసందర్భంగా గ్రామంలో ఎడ్ల బలప్రదర్శన నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసెదరు. [5]
  4. గ్రామశివారులో వెలసిన పురాతన పాటిమీద శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం.

ఈ గ్రామానికి చెందిన శ్రీ బెజ్జం నాయబ్ రసూల్, సైనికుడిగా బెంగుళూరులో విధులు నిర్వహించుచున్నారు. వీరు ఫిబ్రవరి/2015 లో, కేరళ రాష్ట్రంలో నిర్వహించిన, 35వ జాతీయస్థాయి 500 మీటర్లు, 2000 మీటర్ల రోయింగ్ డబుల్స్ క్రీడలలో పాల్గొని, రెండు బంగారు పతకాలు సాధించారు. వీరు త్వరలో ఇటలీ దేశంలో నిర్వహించు పోటీలలో పాల్గొనడానికి కృషి చేస్తున్నారు. [3]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2014, ఫిబ్రవరి-21; 5వపేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2014, డిసెంబరు-7; 5వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2015, మార్చి-5; 6వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2015, మే నెల-9వతేదీ; 4వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2015, మే నెల-22వతేదీ; 5వపేజీ.